
టీడీపీని గెలిపించినందుకు ప్రజలే సిగ్గుపడుతున్నారు
తిరుమల : కేంద్రంలో బీజీపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఎందుకు ఓటు వేసి గెలిపించామా అని ప్రజలే సిగ్గుపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విడగొట్టే వరకు బీజేపీ, తెలుగుదేశం నిద్రపోలేదన్నారు. హామీలు, ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీల వంటి మాయమాటలు విని ప్రజలు మోసపోయారన్నారు.
ఈ విషయాలను గుర్తిం చిన ప్రజలు బీజీపీ, తెలుగుదేశం పార్టీలకు అధికారాన్ని ఇచ్చి తప్పుచేశామని భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర విభజన కు ప్రధాన కారణం చంద్రబాబు నా యుడు, వెంకయ్య నాయుడేనన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోగా చట్టబద్ధతలేదని కుంటిసాకులు చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని ఆకలిచావులను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు చేయటం సరికాదన్నారు.