రేపు హైదరాబాద్‌కు వైఎస్ జగన్ రాక
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని గురువారం (21వ తేదీ) హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. ఆయన గురువారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తన పెద్ద కుమార్తె హర్షను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేర్చడానికి ఈ నెల 11వ తేదీన ఆయన ఇంగ్లాండ్‌కు వెళ్లిన విషయం విదితమే.