లండన్‌లో చదువుతున్న కుమార్తెను చూడటానికి వెళితే..! | Netizen Counter To Chandrababu Comments Ys jagan londor Tour | Sakshi
Sakshi News home page

దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే!

Published Sat, Feb 23 2019 9:06 PM | Last Updated on Sun, Feb 24 2019 5:39 AM

Netizen Counter To Chandrababu Comments Ys jagan londor Tour - Sakshi

సాక్షి, అమరావతి‌: ప్రతిదీ రాజకీయ దృష్టితో చూడటం.. రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారి ఆరోపణలు చేయడంలో చంద్రబాబునాయుడిని మించినోళ్లు లేరని అంటారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవమని, అన్నింటిలో తానే సీనియర్‌ అని డబ్బా కొట్టుకునే చంద్రబాబు.. రాజకీయాల్లో కనీస మర్యాద, విలువలు పాటించకుండా ఎడాపెడా విమర్శలు చేసేస్తుంటారు. తాజాగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లండన్‌లో చదువుతున్న తన కుమార్తెను కలిసేందుకు వెళితే.. ఆ విషయంలోనూ రాజకీయ దుర్బుద్ధితో బాబు విమర్శలు చేశారు. హవాలా డబ్బు కోసమే వైఎస్‌ జగన్‌ లండన్‌కు వెళ్లారంటూ దుర్మార్గమైన ఆరోపణలకు దిగారు. పిల్లనిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు కుటుంబ విలువలు, మానవీయ సంబంధాలు తెలియవని, అందుకే ఏ విషయంలోనైనా అలవోకగా ఆరోపణలు చేస్తుంటారని సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

‘లండన్‌లో చదువుతున్న కూతురు వర్షను చూడటానికి జగన్ వెళితే ..
ఇంటర్ మీడియట్‌లో 99 % మార్కులు వస్తేనే కానీ ప్రఖ్యాత London School of Economics లో సీట్ రాదు. (Varsha succeeded in securing a seat for herself in the prestigious London school of Economics. Recently, Varsha has cleared her Class XII with Economics as main subject with flying colours. To get admission in the college, students must secure 99 per cent in the class XII examination-Indian Express) అటువంటి యూనివర్సిటీలో మెరిట్‌ సీట్ తెచ్చుకొని చదువుతున్న తన పెద్ద కూతురు వర్షారెడ్డిని చూడటానికి జగన్ లండన్ వెళితే.. తెలుగు డ్రామా పార్టీ వాళ్ళు పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారు. జగన్ కూతుర్లు బంగీ జంప్ చేయాలని ఇష్టపడితే.. తన కూతుర్ల క్షేమం కోసమని ముందు జగన్ స్వయంగా బంగీ జంప్ చేసి ప్రమాదమేమీ ఉండదని నిర్ధారించుకున్నారు. అంత ప్రేమ కూతుర్లు అంటే..!

1994లో ఎన్టీఆర్ మద్యనిషేధం విధించినప్పుడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా  బాబుకు డబ్బులు ఇచ్చి  ఎన్టీఆర్‌ ప్రభుత్వం పడిపోవడంలో కీలకపాత్ర పోషించాడని సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు చెప్పారు.

అసలు విజయ్ మాల్యా లండన్ పారిపోయింది ఎప్పుడు?
టీడీపీకి చెందిన కేంద్ర విమానాయానమంత్రి అశోక్ గజాపతిరాజు  ఉండగానే కదా.. అసలు విజయ్ మాల్యాను తప్పించింది బాబే అని ఢిల్లీ వర్గాల్లో టాక్. అందుకే అప్పటినుంచి బాబు మీద మోదీ కోపంగా ఉన్నారని అంటారు. అయినా బ్యాంకులకు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి రూ. 6 వేలకోట్లు ఎగొట్టాడని కోర్టులో కేసు వేశారు బ్యాంకుల వాళ్ళు.  అటువంటి సుజనాకు  పట్టుపట్టి మోదీని బతిమాలుకొని కేంద్ర మంత్రి పదవి ఇప్పించింది బాబు కదా! దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే !!!

- సీవీ రెడ్డి
(సోషల్‌ మీడియలో సీవీ రెడ్డి చేసిన పోస్టు ఇది)

చదవండి: కూతురి దగ్గరికెళ్లినా రాజకీయమేనా?

చంద్రబాబు మాటలు నీచాతినీచం: వైవీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement