సాక్షి, లండన్: ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి యువనేతలతో సమావేశం కానున్నారు. లండన్‌లోని హౌన్‌స్లో, లాంగ్‌ఫోర్డ్‌లోని రివర్‌సైడ్ హాలులో ఆదివారం ఈ భేటీ నిర్వహించనున్నారు.
లండన్‌లో జగన్‌తో మీట్ అండ్ గ్రీట్
Published Sun, Sep 17 2017 9:49 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
సాక్షి, లండన్: ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి యువనేతలతో సమావేశం కానున్నారు. లండన్‌లోని హౌన్‌స్లో, లాంగ్‌ఫోర్డ్‌లోని రివర్‌సైడ్ హాలులో ఆదివారం ఈ భేటీ నిర్వహించనున్నారు.
ఈ మేరకు లండన్‌లోని వైఎస్సార్‌సీపీ యువ నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ ను కలిసి తమ అభిప్రాయాలను పంచుకోవాలనుకునే వాళ్లు కింది నంబర్లకు సంప్రదించాలని వారు ప్రకటనలో కోరారు.
శివ-07745366516, వాసు:07843587459, అమర్:07948611677 నంబర్లను మరిన్ని వివరాల కోసం సంప్రదించవచ్చు.
Advertisement
Advertisement