నటాషా దలాల్, వరుణ్ ధావన్
‘సూయి ధాగా, కళంక్’ సినిమాలతో ప్రొఫెషనల్ లైఫ్‌లో కొన్ని రోజులుగా ఫుల్ బిజీగా ఉన్నారు హీరో వరుణ్ ధావన్. ఇప్పుడు పర్సనల్ లైఫ్‌కు టైమ్ కేటాయించారు. నటాషా దలాల్‌తో కలిసి వరుణ్ లండన్ వెళ్లారు. ఇంతకీ ఈ నటాషా ఎవరు? అంటే వరుణ్ ధావన్ గాళ్‌ఫ్రెండ్ అని బీటౌన్‌లో చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరూ పబ్లిక్‌గా ప్రేమను ఒప్పుకోవడం లేదు కానీ వీలైనప్పుడల్లా పార్టీలకు, పబ్‌లకు, డిన్నర్‌లకు కలిసే వెళ్తున్నారని చెవులు కొరక్కుంటున్నారు బాలీవుడ్ సినీవాసులు. అంతేకాదు.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్నది కొందరి ఔత్సాహికరాయుళ్ల ఊహ. ఆ ఊహ ఎంతవరకు నిజమవుతుందనేది కాలమే చెప్పాలి. నెక్ట్స్ థియేటర్స్‌లోకి రానున్న వరుణ్ మూవీ ‘సూయి ధాగా’. శరత్ కటారియా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుష్కా శర్మ కథానాయిక. సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment