పుష్ప-2 చూద్దామని థియేటర్‌కు వెళ్లారు.. తీరా పోస్టర్‌ చూస్తే! | Pushpa 2 The Rule Fans Fire On Theatre For Show Of Another Movie | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule: ఆన్‌లైన్‌లో పుష్ప-2 టికెట్స్‌.. థియేటర్‌కు వెళ్తే షాక్!

Published Wed, Dec 25 2024 7:08 PM | Last Updated on Wed, Dec 25 2024 8:01 PM

Pushpa 2 The Rule Fans Fire On Theatre For Show Of Another Movie

అల్లు అర్జున్‌ పుష్ప-2 సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే హిందీలో ఇండియన్ సినీ చరిత్రలో లేని రికార్డులు క్రియేట్ చేసింది. హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 నిలిచింది.

సినిమా రిలీజైన రోజు నుంచి నార్త్‌లో పుష్ప-2 ఓ రేంజ్‌ వసూళ్లు రాబడుతోంది. దక్షిణాది కంటే హిందీలోనే భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో పుష్పరాజ్‌ హవా ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో ముందుగానే పుష్ప-2 ప్రదర్శించే థియేటర్లలో టికెట్స్‌ ముందుగానే బుక్ అవుతున్నాయి.

పుష్ప-2కు బదులు బేబీ జాన్..

తాజాగా పుష్ప-2 మూవీ చూడాలని టికెట్ బుక్ చేసుకున్న ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. షో టైమ్‌కు థియేటర్‌కు వెళ్తే అక్కడా పుష్ప-2 బదులుగా బాలీవుడ్ మూవీ బేబీ జాన్‌ ప్రదర్శించారు. దీంతో థియేటర్‌ యాజమాన్యంపై బన్నీ ఫ్యాన్స్‌ ఆగ్రహం చేశారు. థియేటర్ ముందే తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ (కేఆర్‌కే) తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ  వైరలవుతోంది.

కాగా.. వరుణ్ ధావన్ నటించిన బాలీవుడ్‌ మూవీ బేబీ జాన్ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి అట్లీ కథను అందించగా.. కలీస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని విజయ్ సినిమా తేరీ రీమేక్‌గా తెరకెక్కించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement