డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్నాడు. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్ల వసూళ్లతో సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఈ ఊపు చూస్తుంటే ఐదు రోజుల్లోనే రూ.1000 కోట్లు సాధించేలా కనిపిస్తోంది. మరోవైపు నార్త్‌లోనూ పుష్ప-2 హవా కొనసాగుతోంది. తొలి రోజు నుంచే హిందీలో వరుస రికార్డులతో దూసుకెళ్తోంది పుష్ప-2. కేవలం హిందీలోనే నాలుగు రోజుల్లో రూ.339 నెట్ వసూళ్లు సాధించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్స్ సృష్టిస్తోంది.
అయితే తాజాగా ఈ మూవీ దర్శకధరుడు ఎస్ఎస్ రాజమౌళి వీక్షించారు. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లిన సినిమా నుంచి బయటికి వస్తోన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూస్తే బాలనగర్‌లోని విమల్ థియేటర్‌లో పుష్ప-2 వీక్షించినట్లు తెలుస్తోంది.
కాగా.. రాజమౌళి ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. అమెజాన్ అడవులో నేపథ్యంలో అడ్వంచర్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ సిద్ధ కాగా.. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఈ మూవీ కోసం ఇప్పటికే లోకేషన్స్ వేటలో ఉన్నారు టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి.
Director rajamouli sir watched #Pushpa2 🔥@alluarjun #Pushpa2TheRule pic.twitter.com/qlzzp8IEHn
— AlluBabloo Mithun (@allubabloo18) December 9, 2024
Comments
Please login to add a commentAdd a comment