రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం ఉదయం బ్రిటన్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.
హైదరాబాద్ : రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం ఉదయం బ్రిటన్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అక్కడి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వెళుతున్న ఆయన 10వ తేదీ వరకు అక్కడ పర్యటిస్తారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథరెడ్డిని బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రధాని డేవిడ్ కామెరాన్ సన్మానించనున్నారు. పర్యటన నేపథ్యంలో అక్కడ స్థిరపడిన భారతీయులు, ముఖ్యంగా తెలుగు పారిశ్రామికవేత్తలు, నిపుణులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంతో పాటు అనంతపురం జిల్లాలో ఐటీ పరిశ్రమలను రప్పించేందుకు పల్లె రఘునాథరెడ్డి కృషి చేయనున్నారు.