రాహుల్‌ గాంధీ ఎక్కడ..? | Rahul Gandhi wishes New Year before leaving for holidays | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీ ఎక్కడ..?

Published Sat, Dec 31 2016 5:23 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రాహుల్‌ గాంధీ ఎక్కడ..? - Sakshi

రాహుల్‌ గాంధీ ఎక్కడ..?

న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో జీవించాలని, విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. తాను కొన్ని రోజుల పాటు టూర్‌లో ఉంటానని రాహుల్‌ తెలిపారు. అయితే ఎక్కడకు వెళ్లారన్న విషయాన్ని వెల్లడించలేదు.

రాహుల్‌ న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోవడానికి లండన్‌ వెళ్లినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. వ్యక్తిగత పర్యటన కోసం బుధవారం బ్రిటన్‌ వెళ్లారని, అక్కడే వారం రోజులు గడపనున్నట్టు పేర్కొన్నాయి. కాగా రాహుల్‌ విదేశీ పర్యటనకు వెళ్లారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తోసిపుచ్చారు. జనవరి 1 తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లవచ్చని చెప్పారు. గతేడాది కూడా ఆయన న్యూ ఇయర్‌ వేడుకలు చేసుకోవడానికి విదేశాలకు వెళ్లారు. ప్రజలకు విషెస్‌ చెబుతూ కొన్ని రోజులు యూరప్‌ పర్యటనకు వెళ్తున్నట్టు ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది ఎక్కడకు వెళ్లారన్న విషయాన్ని రాహుల్‌ వెల్లడించలేదు. శనివారం విషెస్‌ చెబుతూ ట్వీట్‌ చేశారు. శుక్రవారం రాత్రి లండన్‌ బయల్దేరినట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement