
షూటింగ్ పూర్తయినా రిలీజ్‌కు నోచుకోని సినిమాలు కొన్నుంటాయి. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన 'నామ్' మూవీ కూడా పై జాబితాలోకే వస్తుంది. ఈ సినిమా ఇప్పటిది కాదు.. ఏకంగా దశాబ్ధం క్రితం నాటిది! అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రూంగ్ట ఎంటర్‌టైన్‌మెంట్, స్నిగ్ధ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై అనిల్ రూంగ్ట నిర్మించాడు.
దశాబ్దం తర్వాత రిలీజ్
భూమిక చావ్లా, సమీరా రెడ్డి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. నవంబర్ 22న విడుదల కానున్నట్లు వెల్లడించారు. అజయ్-అజ్మీర్ డైరెక్షన్‌లో ఇది నాలుగో సినిమా.. గతంలో వీరి కాంబినేషన్‌లో హల్‌చల్, ప్యార్ తో హోనా హై, దీవాంగె (2002) సినిమాలు వచ్చాయి.

ఇద్దరివి మూడు సినిమాలు!
నామ్ మూవీ షూటింగ్ 2014లోనే పూర్తయింది. కానీ నిర్మాతల్లో ఒకరు మరణించడంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు దొరకలేదు. ఇన్నాళ్లకు చిక్కుముడులన్నీ విడిపోవడంతో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నామ్ చిత్రయూనిట్ పేర్కొంది. ఇకపోతే అజయ్ 'సింగం అగైన్', బజ్మీ 'భూల్ భులయ్యా 3' సినిమాలు నవంబర్ 1న రిలీజ్ కానుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment