బాలీవుడ్కు బ్రహ్మానందం
బ్రహ్మానందం పేరు వినగానే యధాలాపంగా నవ్వు వచ్చేస్తుంది. తెర ఆయన కనిపించగానే ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు.సమకాలిన తెలుగు సినిమాల్లో హాస్యానికి చిరునామా ఆయన. 850పైగా సినిమాల్లో నటించి గిన్నీస్ రికార్డు కెక్కిన హాస్యనటుడాయన. తెలుగు తెరపై తానెంటో నిరూపించుకున్న ఈ నవ్వుల బ్రహ్మ త్వరలో ఓ హిందీ సినిమాలో నటించనున్నారు. బాలీవుడ్లో 2007లో విడుదల ఘన విజయం సాధించిన వెల్కమ్ చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న చిత్రంలో నటించేందుకు బ్రహ్మానందం అంగీకరించారు.
దర్శకుడు అనీజ్ బాజ్మి తన కోసం ప్రత్యేక పాత్ర తయారు చేశారని, ఇందులో నటించేందుకు తాను ఒప్పుకున్నానని బ్రహ్మానందం వెల్లడించారు. డిసెంబర్ 15 నుంచి షూటింగ్లో పాల్గొనే అవకాశముందని చెప్పారు. అనిల్ కపూర్, నానా పటేకర్, జాన్ అబ్రహంతో కలిసి ఆయన నటించనున్నారు. అయితే బ్రహ్మానందం ఇంతకుముందు హిందీలో అమితాబ్ బచ్చన్తో నటించారు. 1999లో వచ్చిన 'సూర్యవంశ్' చిత్రం ద్వారా ఆయన బాలీవుడ్లో అడుగుపెట్టారు. మలి ప్రయత్నంలో ఆయనెంతవరకు మెప్పిస్తారో చూడాలి.