బాలీవుడ్ నటుడు వీర్ దాస్ అరుదైన ఘనత సాధించారు. ఇండస్ట్రీలో స్టాండ్-అప్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీర్ దాస్ ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్స్‌కు హోస్ట్‌గా ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్- 2024 ఎమ్మీ అవార్డ్స్ హోస్ట్‌గా ఆయనను ప్రకటించింది.
గతంలో 2021లో కామెడీ విభాగంలో ఎమ్మీ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యారు. అయితే 2023లో నెట్‌ఫ్లిక్స్ కామెడీ వెబ్ సిరీస్ ల్యాండింగ్‌కు గానూ వీర్ దాస్ అవార్డ్ గెలుచుకున్నారు. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును అందుకున్న మొదటి భారతీయ కమెడియన్‌గా వీర్‌దాస్ రికార్డ్ సృష్టించారు. ఈసారి ఏకంగా అంతర్జాతీయ ఈవెంట్‌కు హోస్ట్‌గా ఛాన్స్ కొట్టేశారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తొలి భారతీయుడిగా నిలిచారు. కాగా..ఈ అవార్డుల ప్రదానోత్సవం నవంబర్ 25న న్యూయార్క్‌లో జరగనుంది.
(ఇది చదవండి: నా సినిమాకు జాతీయ అవార్డ్స్ రాకుండా అడ్డుకున్నారు: పా.రంజిత్)
కాగా.. ప్రముఖ స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన వీర్‌దాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. అతను ఇటీవల ప్రైమ్ వీడియో సిరీస్ కాల్ మీ బేలో న్యూస్ యాంకర్‌గా కనిపించారు. అతను ప్రస్తుతం ఇంటర్నేషనల్ టూర్‌లో ఉన్న వీర్ దాస్ ఎమ్మీ అవార్డ్స్‌కు హోస్ట్‌గా ఎంపికకావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment