Vir Das
-
కమెడియన్ అరుదైన ఘనత.. తొలి భారతీయ నటుడిగా రికార్డ్!
బాలీవుడ్ నటుడు వీర్ దాస్ అరుదైన ఘనత సాధించారు. ఇండస్ట్రీలో స్టాండ్-అప్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీర్ దాస్ ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్స్‌కు హోస్ట్‌గా ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్- 2024 ఎమ్మీ అవార్డ్స్ హోస్ట్‌గా ఆయనను ప్రకటించింది.గతంలో 2021లో కామెడీ విభాగంలో ఎమ్మీ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యారు. అయితే 2023లో నెట్‌ఫ్లిక్స్ కామెడీ వెబ్ సిరీస్ ల్యాండింగ్‌కు గానూ వీర్ దాస్ అవార్డ్ గెలుచుకున్నారు. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును అందుకున్న మొదటి భారతీయ కమెడియన్‌గా వీర్‌దాస్ రికార్డ్ సృష్టించారు. ఈసారి ఏకంగా అంతర్జాతీయ ఈవెంట్‌కు హోస్ట్‌గా ఛాన్స్ కొట్టేశారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తొలి భారతీయుడిగా నిలిచారు. కాగా..ఈ అవార్డుల ప్రదానోత్సవం నవంబర్ 25న న్యూయార్క్‌లో జరగనుంది.(ఇది చదవండి: నా సినిమాకు జాతీయ అవార్డ్స్ రాకుండా అడ్డుకున్నారు: పా.రంజిత్)కాగా.. ప్రముఖ స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన వీర్‌దాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. అతను ఇటీవల ప్రైమ్ వీడియో సిరీస్ కాల్ మీ బేలో న్యూస్ యాంకర్‌గా కనిపించారు. అతను ప్రస్తుతం ఇంటర్నేషనల్ టూర్లో ఉన్న వీర్ దాస్ ఎమ్మీ అవార్డ్స్‌కు హోస్ట్‌గా ఎంపికకావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. -
అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును గెలుచుకున్న కమెడియన్ వీర్‌దాస్
స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు- 2023 గెలుచుకున్నాడు. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అయిన 'వీర్ దాస్: ల్యాండింగ్' కామెడీ సిరీస్‌కు గాను ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కోసం ఆయన ఇప్పటి వరకు రెండు సార్లు నామినేట్ అయ్యడు. కానీ ఈసారి విన్నర్‌గా నిలిచాడు. UK షో డెర్రీ గర్ల్స్ సీజన్ 3తో ఈ బహుమతిని పంచుకున్నాడు. వీర్ దాస్ గతంలో 2021లో ఫర్ ఇండియా అనే స్టాండ్-అప్ స్పెషల్ కోసం ఇదే విభాగంలో నామినేట్ అయ్యాడు. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుక న్యూయార్క్ నగరంలో జరిగింది. ఇందులో 20 దేశాల నుంచి 14 విభాగాల్లో నామినీలు ఉన్నారు. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ షేర్ చేసిన ఒక ప్రకటనలో, వీర్ దాస్ ఇలా అన్నాడు, 'ఈ క్షణం నిజంగా నమ్మసక్యంగా లేదు.. ఇది ఒక కలలా భావించే ఒక అద్భుతమైన గౌరవం. 'కామెడీ కేటగిరీ'లో 'వీర్ దాస్: ల్యాండింగ్'కి ఎమ్మీ అవార్డు దక్కడం నాకు ఒక మైలురాయి మాత్రమే కాదు.. దేశానికి గర్వకారణంగా భావిస్తున్న. 'వీర్ దాస్: ల్యాండింగ్'తో ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు ప్రతిధ్వనించడం సంతోషంగా ఉంది. నెట్‌ఫ్లిక్స్, ఆకాష్ శర్మ, రెగ్ టైగర్మాన్లకు ధన్యవాదాలు, స్థానిక కథలను రూపొందించడం నుంచి ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం వరకు నా ప్రయాణం రెండూ సవాలుగా ఉన్నాయి. నోయిడా నుంచి అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు వరకు నేను చేరుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.' అని వీర్‌దాస్ అన్నాడు. ఈ అవార్డు గెలుచుకున్న మొదటి ఇండియన్ కెమెడియన్గా ఆయన రికార్డ్ క్రియేట్ చేశాడు. For India 🇮🇳 For Indian Comedy. Every breath, every word. Thank you to the @iemmys for this incredible honour. pic.twitter.com/Jb1744aZiy — Vir Das (@thevirdas) November 21, 2023 -
హైదరాబాద్‌లో వీర్‌దాస్ స్టాండప్ కామెడీ షో.. ఎప్పుడంటే..
సాక్షి, హైదరాబాద్: నగరానికి మరో స్టాండప్ కమెడియన్ రాక ఖాయమైంది. డెహ్రాడూన్‌కి చెందిన వీర్‌దాస్ గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా స్టాండప్ కామెడీ షోలకు ప్రసిద్ధి చెందారు. అయితే చాలా మంది కమెడియన్లకు భిన్నంగా ఆయన అటు కమెడియన్‌గా ఇటు నటుడిగా కూడా రాణిస్తున్నారు. గతంలో ఒకటీ అరా ఉన్నప్పటికీ ఇటీవల వరుసగా కొన్ని షోస్‌లో ఆయన హాస్యంపై సంప్రదాయవాదులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హిందూ జనజాగృతి సమితి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 10న బెంగళూరులో ఆయన ప్రదర్శన రద్దయింది. అనంతరం తమ నగరంలో ప్రదర్శన ఇవ్వాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆయనకు ఆహ్వానం పలికారు.. వీటన్నింటి నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న వాంటెడ్ టూర్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20న నగరానికి వచ్చి మాదాపూర్ శిల్పకళావేదికలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆ ప్రదర్శనకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. (క్లిక్: ఊహల్లో కోటీశ్వరుడిని చేసి ఉన్నదంతా ఊడ్చేశారు!) -
ప్రముఖ కమెడియన్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?
బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వీర్ దాస్, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యంపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేశారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అశ్విన్ గిద్వానీ. దీంతో కేసు నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. స్టాండ్-అప్ కమెడియన్ వీర్ దాస్, మరో ఇద్దరు వ్యక్తులతో పాటు ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ను ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. అసలు కారణం ఏమిటంటే?: బాలీవుడ్ నిర్మాత అశ్విన్ గిద్వానీతో అక్టోబర్ 2010లో ఒక షోను నిర్మించేందుకు వీర్ దాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే జనవరి 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో వీర్ దాస్ కొత్త షో ప్రోమోను గిద్వానీ చూశారు. అందులోని కంటెంట్‌లో తన షో నుంచి కొన్ని మార్పులు చేసి కాపీ కొట్టారని నిర్మాత గిద్వానీ అరోపిస్తున్నారు. కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులను ఆశ్రయించారు. దీనిపై నవంబర్ 4న కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని..కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని, భారతదేశాన్ని ప్రపంచానికి చెడుగా చూపుతుందని ఆరోపిస్తూ వీర్ దాస్ ప్రదర్శనను రద్దు చేయాలని కోరుతూ 'హిందూ జనజాగృతి సమితి' సైతం సోమవారం బెంగళూరులోని పోలీసులను ఆశ్రయించింది. గతేడాది కూడా దాస్ వీడియోలపై కొందరు పోలీసు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత హాస్యనటుడు తన వ్యాఖ్యలు దేశాన్ని అవమానించేలా లేవని ఒక ప్రకటన విడుదల చేశాడు. -
లాక్డౌన్ ఉల్లంఘన.. నటుడిపై తుమ్మిన వ్యక్తి!
ప్రముఖ హిందీ కమెడియన్ వీర్ దాస్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వీర్ దాస్‌పై ఓ సామాన్యుడు తుమ్మాడు అంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ వార్తలను వీర్ దాస్ ఖండించాడు. కాకపోతే సదరు వ్యక్తి తనను వేధించాడని.. బెదిరింపులకు దిగాడని తెలిపాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు వీర్ దాస్. ఈ వీడియోలో ఓ పెద్ద వయసు వ్యక్తి వీర్‌ను తిడుతూ.. బెదిరిస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో అతడి మీద తుమ్మడానికి కూడా ప్రయత్నిస్తాడు. తర్వాత కనీసం ఆరు అడుగుల సామాజిక దూరాన్ని పాటించమని వీర్ దాస్‌ను కోరడం వీడియోలో చూడవచ్చు.(‘ఆ విషయంలో దీపిక చాలా క్రూరం’) Lockdown Neighbour. I was giving my friend Kavi who lives three houses down from me some dinner. We were waiting for it to get cooked 15 feet away from each-other. Me on my doorstep, him out. This happened. 🤦🏻♀️ pic.twitter.com/YKgErSxqBC — Vir Das (@thevirdas) May 24, 2020 అనంతరం వీర్‌దాస్ దీని గురించి మాట్లాడుతూ.. ‘తాజాగా మా అపార్ట్మెంట్లో ఓ రోజు సాయంత్రం చిన్న సిటప్ ఏర్పాటు చేశాం. అందరికి అక్కడే భోజనం ఏర్పాట్లు చేశాం. ప్రతి ఒక్కరం 15 అడుగుల దూరంలో కూర్చున్నాం. అందరం సామాజిక దూరం పాటించాము. నేను సిగరెట్ తాగడానికి కిందకు వచ్చాను. ఆ తర్వాత 5 నిమిషాలకు వీడియోలో ఉన్న సంఘటన చోటు చేసుకుంది. వీడియోలో ఉన్న వ్యక్తి నేను ఉంటున్న అపార్ట్మెంట్లోనే మొదటి అంతస్తులో ఉంటున్నాడు. అతను ఆ ఇంటి యజమాని కాదు. మా యజమాని నేను ఉంటున్న ఇంటిని వారసత్వంగా పొందాడు. నేను కూర్చున్న స్థలం, నా ఇల్లు ఏది అతని సొంతం కాదు. అన్నింటికి మించి ఓ వృద్ధుడు నా మీద తుమ్ముతాడని నేను అనుకోవడం లేదు’ అన్నాడు. (బాలీవుడ్‌ను వదలని కరోనా..) వీర్‌దాస్ మాట్లాడుతూ.. ‘కానీ మీడియాలో వస్తున్న వార్తలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మొదట్లో వీటిని నేను పట్టించుకోలేదు. కానీ పరిస్థితి చేయి దాటుతుండటంతో దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. మీ లాక్డౌన్ ఎలా ఉంది’ అంటూ వీర్ ట్వీట్ చేశారు. దీనిపై పలువురు సెలబ్రిటీలు కామెంట్ చేశారు. జాగ్రత్తగా ఉండమంటూ వీర్‌కు సలహా ఇచ్చారు. -
ఓ నిజమైన కథ!
భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ డైనమిక్ లేడీ అనిపించుకున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంగ రక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ జరిపిన కాల్పుల్లో ఆమె మరణించిన విషయాన్ని కూడా ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. ఇందిరా గాంధీ చనిపోయి ఇప్పటికి 32 ఏళ్లవు తోంది. ఆమె చనిపోయిన అనంతరం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అనే కథాంశంతో ‘థర్టీ ఫస్ట్ అక్టోబర్’ పేరుతో శివాజీ లోథన్ పాటిల్ దర్శకత్వంలో హ్యారీ సచ్దేవ్ సినిమా నిర్మించారు. ‘ఎ ట్రూ స్టోరి’ అనేది ఉపశీర్షిక. వీర్ దాస్, సోహా అలీఖాన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం సెన్సార్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంది. పలు సన్నివేశాలకు కట్ చెప్పడంతో రివైజింగ్ కమిటీకి కూడా పంపించారు. అక్కడ పలు కత్తెర్లు సూచించగా, వాటిని తీసేసి మళ్లీ పంపించడం, ఆ తర్వాత ఇంకొన్ని మార్పులు చెప్పడం, అవి చేసి మళ్లీ సెన్సార్ బోర్డ్ కమిటీకి పంపించడం.. మొత్తం మీద దర్శక-నిర్మాతలు చాలానే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాగైతేనేం సెన్సార్ బోర్డ్ నుంచి ఈ సినిమా విడుదలకు ఆమోదం పొందారు. ‘‘తొమ్మిది కట్స్ చెప్పారు. ‘సాలా’ అనే డైలాగ్‌ని, మరికొన్ని డైలాగ్స్‌నీ తీసేయమన్నారు. ఆ డైలాగ్స్ వచ్చే చోట మ్యూట్ చేశాం. కొన్ని సీన్స్ తీసేస్తే, కథకు న్యాయం జరగదని చెప్పడంతో కన్విన్స్ అయ్యారు. వచ్చే నెల విడుదల చేస్తాం’’ అని దర్శక-నిర్మాతలు చెప్పారు. 1984లో ఇందిరా గాంధీ చనిపోయిన తర్వాత జరిగిన మత కల్లోలాలను ధైర్యంగా ఎదుర్కొన్న తేజీందర్ కౌర్ పాత్రను సోహా చేశారు. ఆమె భర్త దేవేందర్ సింగ్ పాత్రను వీర్ దాస్ చేశారు.