అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును గెలుచుకున్న కమెడియన్‌ వీర్‌దాస్‌ | Vir Das Wins International Emmy Awards 2023 For Comedy, He Says It Feels Like A Dream - Sakshi
Sakshi News home page

Vir Das: అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును గెలుచుకున్న కమెడియన్‌ వీర్‌దాస్‌

Published Tue, Nov 21 2023 9:58 AM | Last Updated on Tue, Nov 21 2023 12:13 PM

Vir Das Wins International Emmy Awards 2023 - Sakshi

స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు- 2023 గెలుచుకున్నాడు.  నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌ అయిన 'వీర్ దాస్: ల్యాండింగ్'  కామెడీ సిరీస్‌కు గాను  ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కోసం ఆయన ఇప్పటి  వరకు రెండు సార్లు నామినేట్‌ అయ్యడు. కానీ ఈసారి విన్నర్‌గా నిలిచాడు. UK షో డెర్రీ గర్ల్స్ సీజన్ 3తో ఈ బహుమతిని పంచుకున్నాడు. వీర్ దాస్ గతంలో 2021లో ఫర్ ఇండియా అనే స్టాండ్-అప్ స్పెషల్ కోసం ఇదే విభాగంలో నామినేట్ అయ్యాడు.  అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుక న్యూయార్క్ నగరంలో జరిగింది. ఇందులో 20 దేశాల నుంచి 14 విభాగాల్లో నామినీలు ఉన్నారు.

ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌ షేర్ చేసిన ఒక ప్రకటనలో, వీర్ దాస్ ఇలా అన్నాడు, 'ఈ క్షణం నిజంగా నమ్మసక్యంగా లేదు.. ఇది ఒక కలలా భావించే ఒక అద్భుతమైన గౌరవం. 'కామెడీ కేటగిరీ'లో 'వీర్ దాస్: ల్యాండింగ్'కి ఎమ్మీ అవార్డు దక్కడం నాకు ఒక మైలురాయి మాత్రమే కాదు..  దేశానికి గర్వకారణంగా భావిస్తున్న. 'వీర్ దాస్: ల్యాండింగ్'తో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ పేరు ప్రతిధ్వనించడం సంతోషంగా ఉంది.

నెట్‌ఫ్లిక్స్, ఆకాష్ శర్మ, రెగ్ టైగర్‌మాన్‌లకు ధన్యవాదాలు, స్థానిక కథలను రూపొందించడం నుంచి ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం వరకు నా ప్రయాణం రెండూ సవాలుగా ఉన్నాయి. నోయిడా నుంచి అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు వరకు నేను చేరుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.' అని వీర్‌దాస్‌ అన్నాడు. ఈ అవార్డు గెలుచుకున్న మొదటి ఇండియన్‌ కెమెడియన్‌గా ఆయన రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement