comedian vir das
-
అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును గెలుచుకున్న కమెడియన్ వీర్‌దాస్
స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు- 2023 గెలుచుకున్నాడు. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అయిన 'వీర్ దాస్: ల్యాండింగ్' కామెడీ సిరీస్‌కు గాను ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కోసం ఆయన ఇప్పటి వరకు రెండు సార్లు నామినేట్ అయ్యడు. కానీ ఈసారి విన్నర్‌గా నిలిచాడు. UK షో డెర్రీ గర్ల్స్ సీజన్ 3తో ఈ బహుమతిని పంచుకున్నాడు. వీర్ దాస్ గతంలో 2021లో ఫర్ ఇండియా అనే స్టాండ్-అప్ స్పెషల్ కోసం ఇదే విభాగంలో నామినేట్ అయ్యాడు. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుక న్యూయార్క్ నగరంలో జరిగింది. ఇందులో 20 దేశాల నుంచి 14 విభాగాల్లో నామినీలు ఉన్నారు. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ షేర్ చేసిన ఒక ప్రకటనలో, వీర్ దాస్ ఇలా అన్నాడు, 'ఈ క్షణం నిజంగా నమ్మసక్యంగా లేదు.. ఇది ఒక కలలా భావించే ఒక అద్భుతమైన గౌరవం. 'కామెడీ కేటగిరీ'లో 'వీర్ దాస్: ల్యాండింగ్'కి ఎమ్మీ అవార్డు దక్కడం నాకు ఒక మైలురాయి మాత్రమే కాదు.. దేశానికి గర్వకారణంగా భావిస్తున్న. 'వీర్ దాస్: ల్యాండింగ్'తో ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు ప్రతిధ్వనించడం సంతోషంగా ఉంది. నెట్‌ఫ్లిక్స్, ఆకాష్ శర్మ, రెగ్ టైగర్మాన్లకు ధన్యవాదాలు, స్థానిక కథలను రూపొందించడం నుంచి ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం వరకు నా ప్రయాణం రెండూ సవాలుగా ఉన్నాయి. నోయిడా నుంచి అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు వరకు నేను చేరుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.' అని వీర్‌దాస్ అన్నాడు. ఈ అవార్డు గెలుచుకున్న మొదటి ఇండియన్ కెమెడియన్గా ఆయన రికార్డ్ క్రియేట్ చేశాడు. For India 🇮🇳 For Indian Comedy. Every breath, every word. Thank you to the @iemmys for this incredible honour. pic.twitter.com/Jb1744aZiy — Vir Das (@thevirdas) November 21, 2023 -
ప్రముఖ కమెడియన్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?
బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వీర్ దాస్, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యంపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేశారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అశ్విన్ గిద్వానీ. దీంతో కేసు నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. స్టాండ్-అప్ కమెడియన్ వీర్ దాస్, మరో ఇద్దరు వ్యక్తులతో పాటు ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ను ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. అసలు కారణం ఏమిటంటే?: బాలీవుడ్ నిర్మాత అశ్విన్ గిద్వానీతో అక్టోబర్ 2010లో ఒక షోను నిర్మించేందుకు వీర్ దాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే జనవరి 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో వీర్ దాస్ కొత్త షో ప్రోమోను గిద్వానీ చూశారు. అందులోని కంటెంట్‌లో తన షో నుంచి కొన్ని మార్పులు చేసి కాపీ కొట్టారని నిర్మాత గిద్వానీ అరోపిస్తున్నారు. కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులను ఆశ్రయించారు. దీనిపై నవంబర్ 4న కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని..కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని, భారతదేశాన్ని ప్రపంచానికి చెడుగా చూపుతుందని ఆరోపిస్తూ వీర్ దాస్ ప్రదర్శనను రద్దు చేయాలని కోరుతూ 'హిందూ జనజాగృతి సమితి' సైతం సోమవారం బెంగళూరులోని పోలీసులను ఆశ్రయించింది. గతేడాది కూడా దాస్ వీడియోలపై కొందరు పోలీసు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత హాస్యనటుడు తన వ్యాఖ్యలు దేశాన్ని అవమానించేలా లేవని ఒక ప్రకటన విడుదల చేశాడు. -
వీర్‌దాస్ షో...
ప్రసిద్ధ భారతీయ స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ నగరంలో తన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ‘అన్బిలీవబులిష్-ట్రూ వర్డ్స్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ఎ లయర్’ పేరుతో నిర్వహించే ఈ ప్రదర్శన ఆదివారం రాత్రి 8 గంటలకు శిల్పకళావేదిక లో ఉంటుంది.