Emmy Awards
-
ఎమ్మీ అవార్డ్స్‌లో 'ది నైట్ మేనేజర్'కు నిరాశ
సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డ్స్ వేడుక న్యూయార్క్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ బరిలో ఉన్న ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్ చివరి వరకు రేసులో ఉండి నిరాశ పరిచింది. ఉత్తమ వెబ్ సిరీస్‌గా ఫ్రెంచ్ చిత్రానికి దక్కింది. ఈసారి ఈ వేడుకలో బాలీవుడ్ హాస్యనటుడు వీర్ దాస్ హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకను నిర్వహించిన మొదటి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.భారత్ నుంచి ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్ పోటీలో ఉండగా అవార్డు దక్కలేదు. ఫ్రెంచ్ డ్రామా 'లెస్ గౌట్స్ డి డైయు'(Les Gouttes De Dieu ) సిరీస్‌తో పోటీ పడి అవార్డ్ కోల్పోయింది. ‘ది నైట్ మేనేజర్’ చిత్రంలో అనిల్ కపూర్ , ఆదిత్యరాయ్ కపూర్ , శోభిత ధూళిపాళ్ల వంటి స్టార్స్ నటించారు. డ్రామా సిరీస్ విభాగంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్‌కు చెందిన పలు చిత్రాలతో పోటీ పడిన ‘ది నైట్ మేనేజర్’ చివరి వరకు గట్టిపోటి ఇచ్చింది.ఉత్తమ డ్రామా సిరీస్- లెస్ గౌట్స్ డి డైయుఉత్తమ నటుడు- తిమోతి స్పాల్ఉత్తమ కామెడీ సిరీస్- డివిజన్ పలెర్మోఉత్తమ యానిమేషన్- టాబీ మెక్‌టాట్ ఉత్తమ కిడ్స్ లైవ్ యాక్షన్ సిరీస్- ఎన్ అఫ్ డ్రెంగెన్ఉత్తమ షార్ట్ ఫామ్ సిరీస్- పాయింట్ ఆఫ్ నో రిటర్న్ -
ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్స్.. శోభిత ధూళిపాళ్లను వరిస్తుందా?
ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల వేడుక మరి కొద్ది గంటల్లో జరగనుంది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల ఈవెంట్ యూఎస్‌లోని న్యూయార్క్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు తొలిసారి ఇండియన్ కమెడియన్, నటుడు వీర్ దాస్ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది అవార్డులను ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అందజేయనుంది. భారత కాలమానం ప్రకారం ఈ వేడుక మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఐఎమ్మీస్.టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.కాగా.. ఈ ఏడాది 21 దేశాల నుంచి 56 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. సినిమా రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి పలు విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. దాదాపు 14 విభాగాల్లో ఎంపిక చేసి అవార్డులు ప్రకటిస్తారు. ఈ ఏడాది అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభితా ధూళిపాళ్ల నటించిన వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్ ఉత్తమ డ్రామా సిరీస్ విభాగం- 2024 అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులకు నామినేషన్స్‌లో నిలిచింది.శోభిత ధూళిపాళ్ల నటించిన ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్.. లెస్ గౌట్టెస్ డి డైయు (డ్రాప్స్ ఆఫ్ గాడ్) (ఫ్రాన్స్), ది న్యూస్ రీడర్ - సీజన్ 2 (ఆస్ట్రేలియా), ఐయోసి ఎల్ ఎస్పియా అర్రెపెంటిడో - సీజన్ 2 (అర్జెంటీనా)తో అవార్డు కోసం పోటీపడునుంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
తొలి ఆసియానటిగా చరిత్ర సృష్టించిన అన్నా: భావోద్వేగం
ప్రతిష్టాత్మక 76వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్స్‌లో నటి అన్నా సవాయ్ చరిత్ర సృష్టించారు, ఉత్తమ నాటక నటిగా ఎమ్మీ అవార్డ్ గెల్చుకున్న తొలి ఆసియా సంతతి నటిగా చరిత్రకెక్కారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ప్రతిష్టాత్మక అవార్డును తీసుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అందరికీ ఆదర్శంగా ఉండే మహిళలందరికీ తన అవార్డు అంకితమని పేర్కొనడం అక్కడున్న వారినందర్నీ ఆకర్షించింది.పాపులర్ సిరీస్ షోగన్ మొత్తం 18 ఎమ్మీలను గెలుచుకోగా ఈ ఏడాది అత్యధిక నామినేషన్లు (25) అందుకున్న సిరీస్ కూడా 'షోగన్' కావడం విశేషం.షోగన్‌లో తన పాత్రకు అన్నా సవాయ్ నాటకంలో ఉత్తమ నటిగా ఎమ్మీని గెలుచుకుంది. భాగంగా షోగన్‌లో లేడీ మారికో పాత్రకు ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని దక్కించుకుంది. దీనిపై అన్నా సంతోషంగా వ్యక్తం చేసింది. షోగన్ బృందానికి ప్రతి ఒక్క సిబ్బందికి నటీనటులకు ధన్యవాదాలు చెప్పింది. ముఖ్యంగా సహనటుడు హిరోయుకి సనదాకు కృతజ్ఞతలు తెలిపింది. తన తల్లికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. View this post on Instagram A post shared by Emmys / Television Academy (@televisionacad) కాగా న్యూజిలాండ్‌లో జన్మించిన అన్నా 10వ ఏట తన కుటుంబంతో కలిసి జపాన్‌కు వెళ్లింది. 2004లో నిప్పాన్ టీవీ ప్రొడక్షన్ అన్నీలో టైటిల్ క్యారెక్టర్‌గా 11 ఏళ్ల వయసులో బుల్లితెరపై నట జీవితాన్ని ప్రారంభించింది.ఈ తర్వాత జేమ్స్ మెక్టీగ్ 2009 మార్షల్ ఆర్ట్స్ చిత్రం నింజా అస్సాస్సిన్లో కిరికోగా తన సినీ రంగ ప్రవేశం చేసింది. -
కమెడియన్ అరుదైన ఘనత.. తొలి భారతీయ నటుడిగా రికార్డ్!
బాలీవుడ్ నటుడు వీర్ దాస్ అరుదైన ఘనత సాధించారు. ఇండస్ట్రీలో స్టాండ్-అప్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీర్ దాస్ ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్స్‌కు హోస్ట్‌గా ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్- 2024 ఎమ్మీ అవార్డ్స్ హోస్ట్‌గా ఆయనను ప్రకటించింది.గతంలో 2021లో కామెడీ విభాగంలో ఎమ్మీ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యారు. అయితే 2023లో నెట్‌ఫ్లిక్స్ కామెడీ వెబ్ సిరీస్ ల్యాండింగ్‌కు గానూ వీర్ దాస్ అవార్డ్ గెలుచుకున్నారు. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును అందుకున్న మొదటి భారతీయ కమెడియన్‌గా వీర్‌దాస్ రికార్డ్ సృష్టించారు. ఈసారి ఏకంగా అంతర్జాతీయ ఈవెంట్‌కు హోస్ట్‌గా ఛాన్స్ కొట్టేశారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తొలి భారతీయుడిగా నిలిచారు. కాగా..ఈ అవార్డుల ప్రదానోత్సవం నవంబర్ 25న న్యూయార్క్‌లో జరగనుంది.(ఇది చదవండి: నా సినిమాకు జాతీయ అవార్డ్స్ రాకుండా అడ్డుకున్నారు: పా.రంజిత్)కాగా.. ప్రముఖ స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన వీర్‌దాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. అతను ఇటీవల ప్రైమ్ వీడియో సిరీస్ కాల్ మీ బేలో న్యూస్ యాంకర్‌గా కనిపించారు. అతను ప్రస్తుతం ఇంటర్నేషనల్ టూర్లో ఉన్న వీర్ దాస్ ఎమ్మీ అవార్డ్స్‌కు హోస్ట్‌గా ఎంపికకావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. -
చరిత్ర సృష్టించిన ఏక్తా కపూర్!..ఆ అవార్డును అందుకున్న తొలి భారతీయురాలు!
భారతీయ టెలివిజన్ రంగాన్ని మహారాణిలా ఏలుతున్నఏక్తా కపూర్ చరిత్ర సృష్టించింది. అమెరికా వెలుపల వివిధ దేశాల్లోని టెలివిజన్ కంటెంట్ నుంచి ఎంచి ఇచ్చే ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్సులో ఆమెను ‘డైరెక్టరేట్ అవార్డ్’ వరించింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలు ఏక్తా. మంగళవారం తెల్లవారుజామున (అమెరికాలో సోమవారం రాత్రి) న్యూయార్క్‌లో ఈ అవార్డు బహూకరించారు. ఏక్తా కపూర్ (48)కు ముందు అభినందనలు చెప్పాలి. టెలివిజన్ రంగంలో సుదీర్ఘకాలం నిలిచినందుకు, ఢక్కామొక్కీలు తిని విజయం సాధించినందుకు, వేల మందికి ఉపాధి కల్పించినందుకు, టెలివిజన్ చానల్స్ ప్రైమ్‌టైమ్‌ను ఏదో ఒక కాలక్షేపంతో నింపినందుకు, ఇంకా కొనసాగుతున్నందుకు. ఇప్పటివరకూ ఆమె 17,000 గంటల టెలివిజన్ కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేసిందంటే దాని వెనుక శ్రమను, ప్యాషన్‌ను, వ్యాపార శ్రద్ధను అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు... 45 సినిమాలను కూడా ఆమె ప్రొడ్యూస్ చేసింది. వ్యాపార ఎత్తుగడల్లో భాగంగా నాసిరకం/సరసమైన కంటెంట్‌ను తయారు చేసి విమర్శలు ఎదుర్కొన్నా అన్ని రకాల జానర్స్‌లో కంటెంట్ తయారు చేస్తాను... దేనికి తగ్గ ప్రేక్షకులు దానికి ఉంటారు అనే ధోరణిలో ముందుకు దూసుకుపోతోందామె. అందుకే ఆమె కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ గుర్తింపు అమెరికాలోని ‘ఇంటర్నేషనల్ అకాడెమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ ప్రతి సంవత్సరం అమెరికా బయటి దేశాలలో టెలివిజన్ రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు’లను బహూకరిస్తుంది. ఇవి టెలివిజన్ ఆస్కార్స్లాంటివి. ఈ అవార్డులు భారతీయులకు వరించడం తక్కువ. వివిధ కేటగిరీల్లో ఇచ్చే ఈ అవార్డుల్లో విశిష్టమైన ‘డైరెక్టరేట్ అవార్డు’ను ఈ సంవత్సరానికి ఏక్తా కపూర్‌కు ప్రకటించారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఏక్తా. అకాడెమీ సీఈవో బ్రూస్ ప్రైస్నర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘భారతీయ మాస్ ప్రేక్షకులను, సౌత్ ఏసియా ప్రేక్షకులను ఏక్తా కపూర్ తన సీరియళ్ల ద్వారా చేరగలిగింది. టెలివిజన్ రంగంలో మార్కెట్ లీడర్‌గా ఉంది’ అని కొనియాడారు. న్యూయార్క్‌లో అవార్డు అందుకున్న ఏక్తా ‘ఈ అవార్డు నా మాతృదేశం కోసం’ అంటూ భావోద్వేగానికి గురైంది. విభిన్న వ్యక్తిత్వం ఏక్తా కపూర్ టెలివిజన్ రంగంలో (1995) అడుగు పెట్టే సమయానికి అదంతా పురుష ప్రపంచం. తండ్రి జితేంద్ర (నటుడు) దగ్గర 50 లక్షలు తీసుకొని ‘బాలాజీ టెలి ఫిల్మ్స్’ కింద కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ తీస్తే అన్నీ రిజెక్ట్ అయ్యాయి. దాంతో 50 లక్షలూ వృథా అయ్యాయి. ఆ తర్వాత ఆమె ‘మానో యా మానో’, ‘హమ్ పాంచ్’ సీరియల్స్‌తో హిట్స్ మొదలుపెట్టింది. 2000 సంవత్సరంలో ‘కె’ అక్షరం సెంటిమెంట్‌తో మొదలెట్టిన ‘క్యూంకి సాస్‌భీ కభీ బహూ థీ’ టెలివిజన్ చరిత్రను తిరగరాసింది. ఇది పొందినంత టిఆర్పి మరే సీరియల్ పొందలేదు. ‘కహానీ ఘర్ ఘర్ కీ’, ‘పవిత్ర రిష్టా’, ‘కుంకుమ్ భాగ్య’ లాంటి 134 సీరియల్స్ ఇప్పటి వరకూ తీసింది. పెద్ద పెద్ద సెట్లు, మహిళా పాత్రధారులకు ఖరీదైన చీరలు, ఆభరణాలు, కుటుంబ రాజకీయాలు ఇవన్నీ ఏక్తా మొదలుపెట్టి మొత్తం దేశంలో అదే ట్రెండ్ ఫాలో అయ్యేలా చేసింది. సరోగసి ద్వారా ఏక్తా వివాహం చేసుకోలేదు. కాని 2019లో సరోగసి ద్వారా కుమారుడికి జన్మనిచ్చింది. కొడుక్కి తండ్రి పేరు ‘రవి కపూర్’ అని పెట్టుకుంది. అవార్డు వేదిక మీద ఏక్తా మాట్లాడుతూ ‘మా నాన్నకు, నేనిక్కడ ఉంటే నా కొడుకు కోసం బేబీ సిట్టింగ్ చేస్తున్న మా అన్నయ్య తుషార్కపూర్కు కృతజ్ఞతలు’ అంది. ప్రస్తుతం సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీ కోసం ఏక్తా ఎక్కువగా కంటెంట్‌ను తయారు చేస్తోంది. (చదవండి: చీరకట్టులో కత్తి పాఠాలు! ఆమె కర్ర పట్టిందంటే.. మైమరచిపోవాల్సిందే) -
తొలి ట్రాన్స్ బార్బీ!
అబ్బాయిల లక్షణాలతో పుట్టిన ఆ చిన్నారికి బార్బీ బొమ్మతో ఆడుకోవాలని చాలా ఆశగా ఉండేది. కానీ అమ్మాయిలు ఎక్కువగా ఆడుకునే బొమ్మను చిన్నారికి ఇవ్వడం బాగోదని ఆమె తల్లి బార్బీ బొమ్మను కొనివ్వడానికి ఎప్పుడూ నిరాకరించేవారు. చిన్నారి పెరిగి పెద్దదవుతున్నప్పటికీ ఆమె బార్బీతో ఆడుకోవాలన్న ఆశ మరింత పెరుగుతూనే వచ్చింది. అప్పుడప్పుడు మనసుని తీవ్రంగా కలిచి వేస్తుండేది. నాడు బార్బీకోసం తల్లడిల్లిన ఆ చిన్నారి.. తాజాగా యాభై ఏళ్ల వయసులో తనే ‘బార్బీడాల్’గా మారింది. ఆమె మరెవరో కాదు ఎమ్మీ అవార్డు గెలుచుకున్న నిర్మాత, నటి, ఎల్జీబీటీక్యూ కమ్యునిటి హక్కుల న్యాయవాది అయిన ‘లావెర్న్ కాక్స్’. మే 29న 50వ పుట్టినరోజు సందర్భంగా మ్యాటెల్ సంస్థ కాక్స్రూపురేఖలతో బార్బీడాల్ను విడుదల చేసింది. దీంతో ‘తొలి ట్రాన్స్ జెండర్ బార్బీ’గా నిలిచి చరిత్ర సృష్టించింది లావెర్న్ కాక్స్. అమెరికాకు చెందిన లావెర్న్ కాక్స్ నటనలో నిష్ణాతురాలు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘ఆరెంజ్ ఈజ్ ద న్యూ బ్లాక్’ వెబ్ సిరీస్‌లో సోఫియా బరెస్ట్ పాత్రలో నటించి మంచిగుర్తిపు తెచ్చుకుంది. నాలుగు సార్లు ఎమ్మీ అవార్డులకు నామినేట్ అవ్వడమేగాక, నిర్మాత ఎమ్మీ అవార్డును గెలుచుకుంది. టెలివిజన్ షో నిర్వహించి తొలి ట్రాన్స్ జెండర్‌గా కూడా నిలిచింది. చుట్టుపక్కల సమాజంలో అనేక వివక్షలను తట్టుకుని ఈ స్థాయికి ఎదిగిన లావెర్న్ బార్బీడాల్గా అరుదైన గౌరవం లభించింది. సిల్వర్ మెటాలిక్ బాడీ సూట్పైన ముదురు ఎరుపు రంగు గౌను, స్టైలిష్ హెయిర్ స్టైల్, మేకప్‌లో లావెర్న్ బార్బీడాల్గా మెరిసిపోతోంది. పెద్దపెద్ద కలలతో.. చిన్నప్పటి నుంచి బార్బీతో ఆడుకోలేదని బాధపడుతోన్న లావెర్న్ తన రూపంలో ఉన్నæ బార్బీని చూసి తెగ మురిసిపోతూ...‘‘ బార్బీ డ్రెస్ చాలా బావుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ జెండర్స్ నా బొమ్మ కొంటారేమో అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎన్ని చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ ఇప్పటికి ట్రాన్స్ చిన్నారులు దాడులకు గురవుతున్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు ఈ దాడులు అడ్డంకిగా మారాయి. ఇప్పుడు ఈ బార్బీ డాల్ చూసిన చిన్నారులంతా పెద్దపెద్ద కలలతో బంగారు భవిష్యత్తుని నిర్మించుకుంటారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు అబ్బాయిలు, అమ్మాయిలు ఆడుకునే బొమ్మలను వేరుగా చూడకుండా వారి ఆసక్తి ప్రకారం ఆడుకోనిస్తారని ఆశిస్తున్నాను’’ అని లావెర్న్ చెప్పింది. ఇప్పటికీ ట్రాన్స్‌జెండర్స్‌ని విభిన్నంగా చూసే ఈ సమాజంలో ఈ బార్బీడాల్ కనువిప్పు కలిగించి వాళ్లు కూడా మనలో ఒకరుగా భావించాలని ఆశిద్దాం. 2021 వరకు అందమైన రూపానికి బార్బీ ప్రతీకగా నిలుస్తుండేది. గతేడాది నుంచి సరికొత్త ఇన్నోవేషన్స్‌తో దూసుకుపోతున్న మహిళల గుర్తింపుగా బార్బీ సంస్థ ‘బార్బీ ట్రైబ్యూట్ సిరీస్’ను ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న మహిళల రూపాలతో బార్బీ సంస్థ బొమ్మలను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంటర్టైన్మెంట్ ఐకాన్ లూసిల్ బాల్, క్వీన్ ఎలిజిబెత్–2, ఇంకా యువతులను సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమ్యాటిక్స్(స్టెమ్)ను చదివేలా ప్రోత్సహించేందుకు నాసాతో కలసి బార్బీని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం, ఆస్ట్రోనాట్ రూపం, మహిళా శాస్త్రవేతల రూపాల్లో సందడి చేస్తున్నాయి. ‘‘లావెర్న్ రూపాన్నీ బార్బీగా తీసుకు వచ్చినందుకు మేమెంతో గర్వపడుతున్నాము’’ అని సంస్థ తెలిపింది. -
నిర్భయపై వెబ్ సిరీస్‌కు అంతర్జాతీయ అవార్డ్
‘ఢిల్లీ క్రైమ్’... ఇప్పుడు మీడియా అంతా పలవరిస్తున్న వెబ్ సిరీస్. సాక్షాత్తూ హీరో మహేశ్‌బాబు సహా పలువురు సినీ తారలు అభినందిస్తున్న వెబ్ సిరీస్. కారణం... తాజాగా 48వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల్లో బెస్ట్ డ్రామా సిరీస్‌గా ‘ఢిల్లీ క్రైమ్’కు దక్కిన అపూర్వ గౌరవం. ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్ ఇండియా’ నిర్మించిన ఒరిజినల్ సిరీస్ ఇది. ఈ క్రైమ్ డ్రామా యాంథాలజీకి భారతీయ – కెనడియన్ అయిన రిచీ మెహతా రచన, దర్శకత్వ బాధ్యతలు వహించారు. సరిగ్గా ఏణ్ణర్ధం క్రితం గత ఏడాది మార్చి ద్వితీయార్ధంలో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ విడుదలైంది. ఏడు ఎపిసోడ్ల తొలి సీజన్ రిలీజ్ సమయంలోనే పలువురి దృష్టిని ఆకర్షించింది. తాజాగా దక్కిన అవార్డుతో మరోసారి మళ్ళీ అందరూ ‘ఢిల్లీ క్రైమ్’ గురించి మాట్లాడుకుంటున్నారు. అమెరికా బయట నిర్మాణమై, ప్రసారమైన ఉత్తమ టీవీ కార్యక్రమాలకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ అకాడెమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డులను ప్రకటిస్తుంది. 1973లో మొదలైన ఈ అవార్డుల ప్రదానోత్సవం ఏటా నవంబర్‌లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరుగుతుంది. కరోనా దెబ్బతో ఈసారి ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆన్ లైన్లో వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. ‘ఢిల్లీ క్రైమ్’ కథ ప్రాథమికంగా దేశరాజధాని ఢిల్లీ నగరంలో ఎనిమిదేళ్ళ క్రితం 2012 డిసెంబర్లో ఓ రాత్రి వేళ నడుస్తున్న బస్సులో ఓ అమ్మాయిపై జరిగిన సామూహిక అత్యాచార సంఘటన ఆధారంగా తీసిన వెబ్ సిరీస్. ప్రపంచవ్యాప్తంగా సంచలనమై, ‘నిర్భయ’ ఉదంతం పేరుతో ఆ సంఘటన కొన్ని నెలల పాటు పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. అప్పట్లో ఢిల్లీ పోలీస్ శాఖలో డి.సి.పి. అయిన ఛాయా శర్మ అనే అధికారిణి మూడు రోజుల్లోనే ఆ దారుణమైన గ్యాంగ్ రేప్ కేసును ఛేదించారు. ఆ నిజజీవిత సంఘటనలనూ, పాత్రలనూ తీసుకొని, ‘ఢిల్లీ క్రైమ్’ వెబ్ సిరీస్‌ను అల్లుకున్నారు. సినిమాలో వార్తికా చతుర్వేది అనే పేరుతో ఆ మహిళా పోలీసు అధికారిణి పాత్రను చూపించారు. నటి షెఫాలీ షా తెరపై ఆ పాత్రకు జీవం పోశారు. బాధాకరమైన నిర్భయ ఉదంతాన్ని సున్నితంగా తెరపై చూపడంతో ‘ఢిల్లీ క్రైమ్’ ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్‌లో నటించిన రసికా దుగాల్, అదిల్ హుస్సేన్, రాజేశ్ తైలాంగ్ల నటనను అందరూ అభినందించారు. సరిగ్గా మహిళలపై హింసా నిర్మూలన కోసం ఉద్దేశించిన అంతర్జాతీయ దినోత్సవానికి (నవంబర్ 25) ముందు ఢిల్లీ క్రైమ్‌కు అవార్డు దక్కడంతో రిచీ మెహతా కూడా ఉద్వేగానికి లోనవుతున్నారు. ‘‘మగవాళ్ళు తమపై జరుపుతున్న హింసను సహించడమే కాక, చివరకు ఆ సమస్యను పరిష్కరించే బృహత్ కార్యాన్ని కూడా భుజానికెత్తుకున్న మహిళలందరికీ ఈ తాజా ఎమ్మీ అవార్డు అంకితం’’ అని అవార్డు అందుకుంటూ రిచీ వ్యాఖ్యానించారు. హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ, దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, నవాజుద్దీన్ సిద్దిఖీ, సోనాలీ బేంద్రే, అదితీ రావు హైదరీ, దియా మిర్జా, కరణ్ జోహార్ సహా పలువురు ప్రముఖులు తాజా అవార్డుతో ‘ఢిల్లీ క్రైమ్’ టీమ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘నిర్భయ ఉదంతం జరిగినప్పుడు అందరం ఆగ్రహానికీ, ఆవేశానికీ గురయ్యాం. ఆ భావోద్వేగమే తరువాత ఈ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు తెరపై కనిపించింది. అదే ఇప్పుడు అందరి అభినందనలకూ, అవార్డుకూ కారణమైంది. అందుకే, మిగిలిన ప్రాజెక్టుల కన్నా మాకు ఇది ఎంతో స్పెషల్’’ అని ‘ఢిల్లీ క్రైమ్’లో మరో కీలక పాత్రధారి అయిన రాజేశ్ తైలాంగ్ అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడీ ఎమ్మీ అవార్డు కేవలం ఒక ఓటీటీకో, ఒక వెబ్ సిరీస్‌కో దక్కిన గౌరవం అనలేం. ఇండీ కంటెంట్ అందించే ప్రతి ఒక్కరికీ గర్వకారణం. పైపెచ్చు, సినిమాలకు సంబంధించి ఆస్కార్ అవార్డు ఎలాంటిదో, టీవీ సిరీస్‌లకు ఎమ్మీ అవార్డు అలాంటిది. అందుకే, ఇప్పుడు ‘ఢిల్లీ క్రైమ్’కు దక్కిన పురస్కారం అందరికీ ఆనందం కలిగిస్తోంది. -
కరోనా: కోలుకున్న 'బ్రేకింగ్ బ్యాడ్ స్టార్'
కాలిఫోర్నియా : ఎమ్మీ అవార్డు గ్రహీత 'బ్రేకింగ్ బ్యాడ్' స్టార్ బ్రయాన్ క్రాన్స్టన్ కరోనా నుంచి బయటపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇతరులకు ఉపయోగపడుతుందనే ఆశతో తన ప్లాస్మాను దానం చేశానని వెల్లడించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న బ్లడ్ అండ్ ప్లాస్మా సెంటర్లో ప్లాస్మా దానం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రాన్స్టన్ మాట్లాడుతూ.. 'కొంచెం తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో పరీక్షలు చేయిస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ సమయంలో రుచి, వాసన స్వభావాన్ని కోల్పోవడం గమనించాను. నేను చాలా అదృష్టవంతుడిని. మీ అందరి ఆశీర్వాదాల వల్ల చాలా తొందరగానే కరోనా నుంచి బయటపడ్డాను. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని కోరుతున్నాను' అన్నారు. 2008 నుంచి 2013 వరకు సాగిన టీవీ డ్రామా.. 'బ్రేకింగ్ బ్యాడ్'లో కెమిస్ట్రీ టీచర్‌గా తన అద్భుత నటనకు గానూ క్రాన్స్టన్.. ఎమ్మీ అవార్డులను అందుకున్నారు. టెలివిజన్ రంగంలో అద్భుత ప్రతిభ కలిగిన నటీనటులకు ఎమ్మీ అవార్డులతో సత్కరిస్తారు. (వైరల్ వీడియో.. నెటిజన్ల ప్రశంసలు) View this post on Instagram Hi. About now you’re probably feeling a little tied down, restricting your mobility and like me, you’re tired of this!! Well, I just want to encourage you to have a little more patience. I was pretty strict in adhering to the protocols and still... I contracted the virus. Yep. it sounds daunting now that over 150,000 Americans are dead because of it. I was one of the lucky ones. Mild symptoms. I count my blessings and urge you to keep wearing the damn mask, keep washing your hands, and stay socially distant. We can prevail - but ONLY if we follow the rules together. Be well - Stay well. BC A post shared by Bryan Cranston (@bryancranston) on Jul 30, 2020 at 9:32am PDT -
క్యాన్సర్‌తో హీరో సోదరి మృతి
ముంబై: బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సోదరి స్యామా తామ్షీ సిద్ధిఖీ(26) మృతి చెందారు. గత కొద్ది కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె శనివారం మరణించినట్లు సిద్ధిఖీ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా పద్దెమినిదేళ్ల వయస్సులోనే స్యామా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని నవాజుద్దీన్ గతేడాది సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. స్యామా 25వ పుట్టినరోజు సందర్భంగా... చిన్న వయస్సు నుంచే తన చిట్టి చెల్లెలు చావుతో ధైర్యంగా పోరాడుతోందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా దాదాపు ఏడేళ్లుగా స్యామాకు చికిత్స చేస్తున్న డాక్టర్లకు కృతఙ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఆమె మరణంతో నవాజుద్దీన్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇక స్యామా అంత్యక్రియలు సిద్ధిఖీ కుటుంబ స్వగ్రామమైన బుధానా(ఉత్తరప్రదేశ్)లో ఆదివారం నిర్వహించినట్లు సమాచారం. కాగా నవాజుద్దీన్ ఇటీవల ‘మోతీచూర్ చక్నాచూర్’ సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే సాక్రెడ్ గేమ్స్, యూకే సిరీస్ మెక్మాఫియా యూనిట్ తరఫున గత నెలలో జరిగిన ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యాడు. ప్రస్తుతం.. బంగ్లాదేశీ ఫిల్మ్‌మేకర్ సర్వార్ ఫరూఖీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నో ల్యాండ్స్ మ్యాన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికాలో షూటింగ్ జరుగుతుండగానే చెల్లెలి మృతి విషయం తెలియడంతో ఇండియాకు వచ్చినట్లు సమాచారం. My sister ws diagnosed of advanced stage #breastcancer @ 18 bt it ws her will power & courage dat made her stand agnst all d odds she turns 25 2day & still fighting M thankful 2 Dr.@koppiker & @Lalehbusheri13 fr motivating her & m rly grateful 2 @resulp Sir fr introducng me 2 dem pic.twitter.com/xHsBK8uJDP — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) October 13, 2018 -
అవార్డు వస్తుందా?
‘ది వెడ్డింగ్ గెస్ట్, లిబర్టీ: ఎ కాల్ టు స్పై’ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో నటించి అంతర్జాతీయ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు రాధికా ఆప్టే. ఆ ప్రయత్నానికి ఓ అద్భుత అవకాశం రాధిక తలుపు తట్టింది. అమెరికన్ ‘ఎమ్మీ’ అవార్డ్స్ ఉత్తమ నటి విభాగంలో రాధికా ఆప్టే నామినేషన్ దక్కించుకున్నారు. ‘లస్ట్ స్టోరీస్’ఫస్ట్ సిరీస్‌లో రాధిక అద్భుత నటన ఈ ఎమ్మీ అవార్డ్స్‌లో ఆమెకు నామినేషన్ దక్కేలా చేసింది. అవార్డు కూడా వస్తే రాధిక కెరీర్‌కు మరింత బూస్ట్ వచ్చినట్లవుతుంది. ఈ ఏడాది ఎమ్మీ అవార్డ్స్‌కు ఇండియా తరఫున మొత్తం నాలుగు నామినేషన్స్ నమోదయ్యాయని బాలీవుడ్ సమాచారం. బెస్ట్ డ్రామా కేటగిరీలో ‘సాక్రెడ్ గేమ్స్’, నాన్ స్క్రిప్టెడ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరిలో ‘ది రీమిక్స్’ నామినేషన్స్ దక్కించుకున్నాయట. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌కి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందనడానికి ఈ నామినేషన్స్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. -
32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'
లాస్ ఎంజిల్స్ : ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన టెలివిజన్ సిరీస్‌లలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఒకటి. ఈ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. తాజాగా ప్రతిష్టాత్మకమైన ఎమ్మి అవార్డ్స్‌లో ‘గేమ్ ఆఫ్ త్రోన్స్’ ఎనిమిదో సీజన్ రికార్డుస్థాయిలో 32 నామినేషన్లను సంపాదించింది. ‘ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ’లో ఇదే చివరి సిరీస్. ఇక, దీంతోపాటు న్యూక్లియర్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన 'చెర్నోబిల్ '19, 'సాటర్డే నైట్ లైవ్' 18 నామినేషన్లు సాధించాయి. కామెడీ సిరీస్ విభాగంలో అమెరికన్ పిరియాడికల్ డ్రామా 'మార్వలస్ మిసెస్ మెయిసిల్' 20 నామినేషన్లతో తన సత్తా చాటింది. వ్యక్తిగత అవార్డ్స్ విషయానికొస్తే.. ఎమ్మీ ఉత్తమ నటి విభాగంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టార్ ఎమిలియా క్లార్క్, 'కిల్లింగ్ ఈవ్' ఫేమ్ సండ్రా ఓ, 'హౌ టు గెట్ అవే విత్ మర్డర్'లో నటించిన విలోవా డేవిస్‌లు పోటీ పడుతున్నారు. 71వ ఎమ్మి అవార్డ్స్ వేడుకలు సెప్టెంబర్ 22న ఫాక్స్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. దీనికి సంబందించి ఇంతవరకు హోస్ట్‌ను మాత్రం ప్రకటించలేదు. 1994లో వచ్చిన అమెరికన్ టెలివిజన్ సిరీస్ 'ఎన్‌వైపీడీ బ్లూ' అప్పట్లోనే రికార్డుస్థాయిలో 27 నామినేషన్లు దక్కించుకుంది. తాజాగా ఆ రికార్డును గేమ్ ఆఫ్ థ్రోన్స్ చెరిపేసింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎమ్మి అవార్డ్స్‌లో తన ఆధిక్యతను నిలబెట్టుకొని వరుసగా నాలుగోసారి ట్రోఫీని సాధిస్తే గత 25 సంవత్సారాల్లో అత్యధిక ప్రజాదరణ పొందిన టెలివిజన్ డ్రామాలైన హిల్ స్ట్రీట్ బ్లూస్, ఎల్ఏ లా, ది వెస్ట్ వింగ్, మ్యాడ్‌మెన్ సరసన చోటు సంపాదించనుంది. -
స్త్రీలోక సంచారం
ప్రియాంకా చోప్రా క్షణం తీరిగ్గా ఉండడం లేదు! ఎమ్మీ అవార్డ్స్ ప్రదానోత్సవంలో తనే. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ తొలి వరుసలో తనే. బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనాస్ బర్త్‌డేలో ఎలాగూ తనే. బాలీవుడ్లో ఒక మూవీలో నటిస్తోంది.. అక్కడా తనే. ఫారిన్‌కి, ఇండియాకు మధ్య ఇష్టంగా సతమతమౌతున్నారు ప్రియాంక. ఇప్పుడిక ఒక డేటింగ్ కంపెనీలో డబ్బులు పెట్టి, ఆ పనీపాటా చూసుకోబోతున్నారు. ‘బంబుల్’ అనే ఆ సోషల్‌మీడియా డేటింగ్ యాప్‌లో ప్రియాంక కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారని వార్త! ఈ బంబుల్ (‘అయోమయం’ అని అర్థం) వ్యవస్థాపకురాలు విట్నీ ఉల్ఫ్ హెర్డ్ అనే అమెరికన్ మహిళ. ఆమెకు చేదోడుగా ప్రియాంక ఇందులో పెట్టుబడి పెట్టారు. దీనికన్నా ముందు ఒక కోడింగ్ ఎడ్యుకేషన్ ఫర్మ్‌లో డబ్బులు పెట్టేందుకు శాన్ఫ్రాన్సిస్కో వెళ్లి, అక్కడి హాల్బెర్టన్ స్కూల్ అంతా కలియదిరిగి, ముచ్చటపడి, మనసు పారేసుకుని, వాళ్లక్కొంత డబ్బు ఇచ్చి, సేమ్ అలాంటి స్టార్టప్ కంపెనీనే తను కూడా ప్రారంభించాలని ప్రియాంక ఆశపడుతున్నారు. కోడింగ్ ఎడ్యుకేషన్ అంటే టెక్నాలజీ బేస్డ్. టెక్నాలజీ అంటే ప్రియాంకకు మహా ఇష్టం. టెక్ ఇన్వెస్టర్‌గా మిస్ అంజుల అచారియా (సౌత్ ఏషియన్)కు మించి పేరును తెచ్చుకోవాలని ప్రియాంక ప్రయత్నమట. మోడల్ జెస్సికా లాల్‌ను మను శర్మ అనే వ్యక్తి హత్య చేశాడు. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థిని ప్రియదర్శినీ మట్టూను సంతోష్ సింగ్ అనే అతడు రేప్ చేసి, చంపేశాడు. సుశీల్ శర్మ అనే మనిషి తన భార్యను చంపేసి, ఆమె మృతదేహాన్ని తండూరి పొయ్యిలో పడేశాడు. ఇవన్నీ ఏళ్ల క్రితం జరిగిన హత్యలు. ఈ ముగ్గురూ ప్రస్తుతం తీహార్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. వీళ్లు, వీళ్లతో పాటు మరో 86 మంది.. ఇంతకాలం శిక్ష అనుభవించాం కనుక తమను విడుదల చేయాలని పెట్టుకున్న దరఖాస్తులలో 22 మంది అభ్యర్థనను మన్నించిన ‘సెంటెన్స్ రివ్యూ బోర్డు’ (ఎస్.ఆర్.బి.) ఈ ముగ్గురినీ విడుదల చేయకూడదని నిర్ణయించింది. మనుశర్మ, సుశీల్‌శర్మల విడుదలకు గత జూలైలో వారినుంచి విజ్ఞాపన అందినప్పుడు కూడా బోర్డులోని అధికశాతం సభ్యులు వ్యతిరేకించడంతో వారికి విముక్తి లభించలేదు. 1996లో ప్రియదర్శిని మట్టూపై అత్యాచారం జరిపి, ఆమెను హత్య చేసినందుకు సంతోశ్ సింగ్‌కు 2006లో మరణశిక్ష పడగా, ఆ శిక్షను 2010లో సుప్రీంకోర్టు యావజ్జీవంగా మార్చింది. జస్సికాలాల్ను మనుశర్మ 1999లో హత్య చేయగా అతడికి 2006లో యావజ్జీవం పడింది. నైనా సహానీని అతడి భర్త సుశీల్ శర్మ 1995లో హత్య చేయగా అతడికీ 2006లోనే యావజ్జీవ శిక్ష విధించారు. జపాన్‌లోని ఒసాకా నగరం.. యు.ఎస్.లోని శాన్‌ఫ్రాన్సిస్కోతో గత 60 ఏళ్లుగా తనకున్న ‘సిస్టర్ సిటీ’ అనుబంధాన్ని తెంచేసుకుంది. యుద్ధకాలంలో మహిళలను జపాన్‌కు లైంగిక బానిసలుగా çపంపిన సందర్భాన్ని సంకేతపరుస్తూ గత ఏడాది శాన్ఫ్రాన్సిస్కోలో స్థానిక కొరియన్లు, చైనీయులు, ఫిలిప్పీన్లు కలిసి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న ఒకాసా మేయర్ హిరోఫ్యూమి యొషిమురా.. గతవారం శాన్ఫ్రాన్సిస్కోకు ఒక లేఖ రాస్తూ.. ‘మన అనుబంధం నుంచి మేము వైదొలగుతున్నాం’ అని స్పష్టం చేశారు. యుద్ధకాలంలో ఆసియాలోని వేలాది మంది మహిళల్ని జపాన్ సైనికుల దేహ అవసరాల కోసం బలవంతంగా సెక్స్ బానిసలుగా మార్చారన్నదాంట్లో నిజం లేదని, అది తమపై ఒక అపవాదు మాత్రమేని మేయర్ వ్యాఖ్యానించారు. -
ఎమ్మీ అవార్డుల ప్రెజెంటర్‌గా ప్రియాంక