సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డ్స్ వేడుక న్యూయార్క్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ బరిలో ఉన్న ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్ చివరి వరకు రేసులో ఉండి నిరాశ పరిచింది. ఉత్తమ వెబ్ సిరీస్‌గా ఫ్రెంచ్ చిత్రానికి దక్కింది. ఈసారి ఈ వేడుకలో బాలీవుడ్ హాస్యనటుడు వీర్ దాస్ హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకను నిర్వహించిన మొదటి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.
భారత్ నుంచి ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్ పోటీలో ఉండగా అవార్డు దక్కలేదు. ఫ్రెంచ్ డ్రామా 'లెస్ గౌట్స్ డి డైయు'(Les Gouttes De Dieu ) సిరీస్‌తో పోటీ పడి అవార్డ్ కోల్పోయింది. ‘ది నైట్ మేనేజర్’ చిత్రంలో అనిల్ కపూర్ , ఆదిత్యరాయ్ కపూర్ , శోభిత ధూళిపాళ్ల వంటి స్టార్స్ నటించారు. డ్రామా సిరీస్ విభాగంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్‌కు చెందిన పలు చిత్రాలతో పోటీ పడిన ‘ది నైట్ మేనేజర్’ చివరి వరకు గట్టిపోటి ఇచ్చింది.
- ఉత్తమ డ్రామా సిరీస్- లెస్ గౌట్స్ డి డైయు
- ఉత్తమ నటుడు- తిమోతి స్పాల్
- ఉత్తమ కామెడీ సిరీస్- డివిజన్ పలెర్మో
- ఉత్తమ యానిమేషన్- టాబీ మెక్‌టాట్
- ఉత్తమ కిడ్స్ లైవ్ యాక్షన్ సిరీస్- ఎన్ అఫ్ డ్రెంగెన్
- ఉత్తమ షార్ట్ ఫామ్ సిరీస్- పాయింట్ ఆఫ్ నో రిటర్న్
Comments
Please login to add a commentAdd a comment