ప్రతిష్టాత్మక 76వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్స్‌లో నటి అన్నా సవాయ్ చరిత్ర సృష్టించారు, ఉత్తమ నాటక నటిగా ఎమ్మీ అవార్డ్ గెల్చుకున్న తొలి ఆసియా సంతతి నటిగా చరిత్రకెక్కారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ప్రతిష్టాత్మక అవార్డును తీసుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అందరికీ ఆదర్శంగా ఉండే మహిళలందరికీ తన అవార్డు అంకితమని పేర్కొనడం అక్కడున్న వారినందర్నీ ఆకర్షించింది.
పాపులర్ సిరీస్ షోగన్ మొత్తం 18 ఎమ్మీలను గెలుచుకోగా ఈ ఏడాది అత్యధిక నామినేషన్లు (25) అందుకున్న సిరీస్ కూడా 'షోగన్' కావడం విశేషం.షోగన్‌లో తన పాత్రకు అన్నా సవాయ్ నాటకంలో ఉత్తమ నటిగా ఎమ్మీని గెలుచుకుంది. భాగంగా షోగన్‌లో లేడీ మారికో పాత్రకు ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని దక్కించుకుంది. దీనిపై అన్నా సంతోషంగా వ్యక్తం చేసింది. షోగన్ బృందానికి ప్రతి ఒక్క సిబ్బందికి నటీనటులకు ధన్యవాదాలు చెప్పింది. ముఖ్యంగా సహనటుడు హిరోయుకి సనదాకు కృతజ్ఞతలు తెలిపింది. తన తల్లికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది.
కాగా న్యూజిలాండ్‌లో జన్మించిన అన్నా 10వ ఏట తన కుటుంబంతో కలిసి జపాన్‌కు వెళ్లింది. 2004లో నిప్పాన్ టీవీ ప్రొడక్షన్ అన్నీలో టైటిల్ క్యారెక్టర్‌గా 11 ఏళ్ల వయసులో బుల్లితెరపై నట జీవితాన్ని ప్రారంభించింది.ఈ తర్వాత జేమ్స్ మెక్‌టీగ్ 2009 మార్షల్ ఆర్ట్స్ చిత్రం నింజా అస్సాస్సిన్‌లో కిరికోగా తన సినీ రంగ ప్రవేశం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment