అవార్డు వస్తుందా? | Radhika Apte nominated for Best Actress | Sakshi
Sakshi News home page

అవార్డు వస్తుందా?

Published Sun, Sep 22 2019 2:47 AM | Last Updated on Sun, Sep 22 2019 2:47 AM

 Radhika Apte nominated for Best Actress - Sakshi

రాధికా ఆప్టే

‘ది వెడ్డింగ్‌ గెస్ట్, లిబర్టీ: ఎ కాల్‌ టు స్పై’ వంటి హాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌లో నటించి అంతర్జాతీయ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు రాధికా ఆప్టే. ఆ ప్రయత్నానికి ఓ అద్భుత అవకాశం రాధిక తలుపు తట్టింది. అమెరికన్‌ ‘ఎమ్మీ’ అవార్డ్స్‌ ఉత్తమ నటి విభాగంలో రాధికా ఆప్టే నామినేషన్‌ దక్కించుకున్నారు. ‘లస్ట్‌ స్టోరీస్‌’ఫస్ట్‌ సిరీస్‌లో రాధిక అద్భుత నటన ఈ ఎమ్మీ అవార్డ్స్‌లో ఆమెకు నామినేషన్‌ దక్కేలా చేసింది.

అవార్డు కూడా వస్తే రాధిక కెరీర్‌కు మరింత బూస్ట్‌ వచ్చినట్లవుతుంది. ఈ ఏడాది ఎమ్మీ అవార్డ్స్‌కు ఇండియా తరఫున మొత్తం నాలుగు నామినేషన్స్‌ నమోదయ్యాయని బాలీవుడ్‌ సమాచారం. బెస్ట్‌ డ్రామా కేటగిరీలో ‘సాక్రెడ్‌ గేమ్స్‌’, నాన్‌ స్క్రిప్టెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కేటగిరిలో ‘ది రీమిక్స్‌’ నామినేషన్స్‌ దక్కించుకున్నాయట. ఇండియన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌కి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందనడానికి ఈ నామినేషన్స్‌ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement