best acctress
-
అవార్డు వస్తుందా?
‘ది వెడ్డింగ్ గెస్ట్, లిబర్టీ: ఎ కాల్ టు స్పై’ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో నటించి అంతర్జాతీయ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు రాధికా ఆప్టే. ఆ ప్రయత్నానికి ఓ అద్భుత అవకాశం రాధిక తలుపు తట్టింది. అమెరికన్ ‘ఎమ్మీ’ అవార్డ్స్ ఉత్తమ నటి విభాగంలో రాధికా ఆప్టే నామినేషన్ దక్కించుకున్నారు. ‘లస్ట్ స్టోరీస్’ఫస్ట్ సిరీస్‌లో రాధిక అద్భుత నటన ఈ ఎమ్మీ అవార్డ్స్‌లో ఆమెకు నామినేషన్ దక్కేలా చేసింది. అవార్డు కూడా వస్తే రాధిక కెరీర్‌కు మరింత బూస్ట్ వచ్చినట్లవుతుంది. ఈ ఏడాది ఎమ్మీ అవార్డ్స్‌కు ఇండియా తరఫున మొత్తం నాలుగు నామినేషన్స్ నమోదయ్యాయని బాలీవుడ్ సమాచారం. బెస్ట్ డ్రామా కేటగిరీలో ‘సాక్రెడ్ గేమ్స్’, నాన్ స్క్రిప్టెడ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరిలో ‘ది రీమిక్స్’ నామినేషన్స్ దక్కించుకున్నాయట. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌కి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందనడానికి ఈ నామినేషన్స్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. -
ముగ్గురు రాణులు..
మనసును హత్తుకున్న మహిళా ప్రధాన చిత్రాలు.. కీలక సమస్యల్ని చర్చించిన సినిమాలకు పెద్దపీట వేస్తూ మంగళవారం కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ సినీ అవార్డులను ప్రకటించింది. ఫీచర్, నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగాలు కలిపి మొత్తం 60కి పైగా కేటగిరీల్లో పలువురికి ఉత్తమ అవార్డులు దక్కాయి. జాతీయ ఉత్తమ చిత్రంగా మరాఠీ చిత్రం కోర్ట్ నిలిచింది. 'క్వీన్' సినిమాలో అధ్బుతన నటనను ప్రదర్శించిన కంగనా రనౌత్ ఉత్తమ నటిగా ఎంపికవ్వగా, ప్రియాంకా చోప్రా నటించిన 'మేరీకోమ్' బెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచింది. టాలీవుడ్ నటి మంచులక్ష్మి నటించిన' చందమామ కథలు' ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా అవార్డు పొందింది. 'నాన్ అవనాల్ అవలు' చిత్రానికిగానూ కన్నడ నటుడు విజయ్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నాడు. మే 3న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తారు. అవార్డుల వివరాలు జాతీయ ఉత్తమ చిత్రం- కోర్ట్ (మరాఠి) జాతీయ ఉత్తమ నటి- కంగనా రనౌత్ (క్వీన్) జాతీయ ఉత్తమ నటుడు- విజయ్ (కన్నడ) ఉత్తమ దర్శకుడు- శ్రీజిత్ ముఖర్జీ (బెంగాలీ చిత్రం- ఛొటుష్కొనే) ఉత్తమ సహాయ నటి- బల్జిందర్ కౌర్ (హర్యాన్వీ చిత్రం పగ్డీకి గాను) ఉత్తమ సహాయ నటుడు- బాబీ సింహా (తమిళ చిత్రం జిగర్తండా) జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- మేరీకోమ్ ఉత్తమ సంగీత దర్శకుడు- విశాల్ భరద్వాజ్ (హైదర్) ఉత్తమ నేపథ్య గాయని- ఉత్తరా ఉన్నికృష్ణన్ (తమిళ చిత్రం- శైవం) ఉత్తమ గాయకుడు- సుఖ్వీందర్ సింగ్ (హిందీ చిత్రం హైదర్) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్- డోలీ అహ్లువాలియా (హైదర్) ఉత్తమ పర్యావరణహిత చిత్రం- ఒత్తాళ్ (మళయాళం) ఇందిరా గాంధీ అవార్డ్ ఫర్ డెబ్యూ ఫిల్మ్ ఆఫ్ డైరెక్టర్- ఆశా జావోర్ మఝే (బెంగాలీ) ఉత్తమ పరిశోథనాత్మక చిత్రం- ఫుమ్ షంగ్ ఉత్తమ యానిమేషన్ చిత్రం- సౌండ్ ఆఫ్ జాయ్ ఉత్తమ సినీ రచన- సైలెంట్ సినిమా:1895-1930 (రచయిత- పసుపులేటి పూర్ణచందర్ రావు) ఉత్తమ సినీ విమర్శకుడు- తనుల్ ఠాకూర్ ప్రత్యేక విభాగంలో అవార్డు సాధించిన సినిమాలు భూత్నాథ్ రిటర్న్స్ ( హిందీ) అయిన్ (మళయాలం) నచోమ్ ఐఏ కుంపసర్ (కొంకణి) ఖిల్లా- (మరాఠి) ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రాలు చందమామ కథలు (తెలుగు) నిర్భాషితో (బెంగాలి) ఒథెల్లో (అస్సామీ) నచోమ్ ఐఏ కుమపసర్ (కొంకణి) ఆదిమ్ విచార్ (ఒడియా) ఖిల్లా (మరాఠి) ఆయిన్ (మళయాలి) కుత్రం కడిత్తల్ (తమిళ్) పంజాబ్ 1984 (పంజాబీ) పగ్డీ (హర్యాన్వీ)