నా సినిమాకు జాతీయ అవార్డ్స్‌ రాకుండా అడ్డుకున్నారు: పా.రంజిత్‌ | Pa Ranjith Comments On Govt Politics In 70th National Film Awards About Rejecting Sarpatta Parambarai | Sakshi
Sakshi News home page

Pa Ranjith On National Awards: నా సినిమాకు జాతీయ అవార్డ్స్‌ రాకుండా అడ్డుకున్నారు

Published Sat, Aug 24 2024 5:54 PM | Last Updated on Sat, Aug 24 2024 6:40 PM

Pa Ranjith Comment On National Awards

కోలివుడ్‌ దర్శకుడు పా.రంజిత్‌ది చిత్రపరిశ్రమలో ప్రత్యేక బాణి. అయితే, తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన సినిమాకు అవార్డు రాకుండా అడ్డకున్నారని ఆయన ఆరోపించారు. పా.రంజిత్‌ చిత్రాల్లో రాజకీయాలు కచ్చితంగా ఉంటాయి. అవి సామాజిక సమస్యలను ప్రశ్నించేవిగా ఉంటాయి. సినిమాల ద్వారా రాజకీయాలను మాట్లాడతానని పా.రంజిత్‌ ఇటీవల స్ఫష్టంగానే చెప్పారు. ఈయన తాజాగా విక్రమ్‌ కథానాయకుడిగా తెరకెక్కించిన తంగలాన్‌ చిత్రం విశేష ఆదరణతో ప్రదర్శింపబడుతోంది. 

కాగా పా.రంజిత్‌ ఇంతకు ముందు ఆర్య హీరోగా రూపొందించిన చిత్రం సార్పట్ట పరంపర. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్‌ కూడా చేస్తానని దర్శకుడు ప్రకటించారు. కాగా ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులపై స్పందించిన దర్శకుడు పా.రంజిత్‌ సార్పట్ట పరంపర చిత్రానికి అవార్డు రాకుండా అడ్డుకున్నారనే ఆరోపించారు. దీని గురించి ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజకీయాల కారణంగానే తనను తన పనిచేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సార్పట్ట పరంపర చాలా పెద్ద విజయాన్ని సాధించిందన్నారు. ఈ చిత్ర రెండో భాగం గురించి పలు విమర్శలు వచ్చాయన్నారు. 

అయితే, అవార్డులకు సార్పట్ట పరంపర చిత్రం బహిరంగంగానే నిరాకరణకు గురైందన్నారు. పలు క్రిటిక్స్‌ అవార్డులను ఈ చిత్రం పొందిందన్నారు. అలా క్రిటిక్స్‌ అవార్డులను పొందిన చిత్రాలకు కచ్చితంగా జాతీయ అవార్డులు అందిస్తారన్నారు. అయితే సార్పట్ట పరంపర చిత్రాన్ని జాతీయ అవార్డుల దరిదాపుల్లోకే వెళ్లలేకపోయిందని అన్నారు. ఆ అవార్డులకు సార్పట్ట పరంపర చిత్రానికి అర్హత లేదా అని ప్రశ్నించారు. తన భావాలను ప్రామాణికంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిరాకరించారనే ఆరోపణను చేశారు. కావాలనే తన పనిని గుర్తించకూడదని కొందరు పనికట్టుకుని చేస్తున్నారని అన్నారు. ఈ రాజకీయ ద్వేషాన్ని తాను అర్థం చేసుకోగలనని దర్శకుడు పా.రంజిత్‌ పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement