70th National Film Awards
-
అట్టహాసంగా 70వ జాతీయ సినీ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
70వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం.. తెలుగు నుంచి ఒక్కటే
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 70వ నేషనల్ సినీ అవార్డ్స్ ప్రదానోత్సవం.. న్యూ ఢిల్లీలోని విజయ్ భవన్లో జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. విజేతలకు అవార్డులని ప్రకటించారు. ఈ వేడుకకు దాదాపు అన్ని సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు.తెలుగు నుంచి 'కార్తికేయ 2'కి ఉత్తమ ప్రాంతీయ చిత్ర కేటగిరీలో పురస్కారం దక్కింది. దర్శకుడు చందు మొండేటి దీన్ని అందుకున్నారు. 'తిరు' చిత్రానికి ఉత్తమ నటిగా నిత్యా మీనన్, 'కాంతార' మూవీకి గానూ ఉత్తమ నటుడిగా రిషభ్ శెట్టి అవార్డులు అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రదానం చేశారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి అవార్డ్ ఇవ్వాలి. కానీ లైంగిక ఆరోపణల కేసు కారణంగా దీన్ని రద్దు చేశారు.ఎవరెవరికి ఏ విభాగాల్లో అవార్డులు? ఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం) ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార) ఉత్తమ నటి: నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్ 1ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి - హిందీ) బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్ ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి) ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మస్త్ర -హిందీ)ఉత్తమ సంగీతం (నేపథ్యం): ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ - 1 తమిళం)ఉత్తమసినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 తమిళం) ఉత్తమ సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి (పొన్నియిన్ సెల్వన్ - 1) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మాలికాపురం - మలయాళం)ఉత్తమ స్క్రీన్‌ప్లే: ఆనంద్ ఏకార్షి (ఆట్టం- మలయాళం)ఉత్తమ ఎడిటింగ్: మహేష్ భువనేండ్ (ఆట్టం) ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీఎఫ్- 2)ఉత్తమ మేకప్: సోమనాథ్ కుందు (అపరాజితో- బెంగాళీ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నిక్కి జోషి (కచ్ ఎక్స్‌ప్రెస్- గుజరాతీ) ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల (గుల్మోహర్)ఉత్తమ ప్రాంతీయ సినిమాలుఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ -2 (తెలుగు)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కేజీఎఫ్ 2 (కన్నడ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : గుల్మొహర్ (హిందీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్ (బెంగాళీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ (మరాఠీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్ (ఒడియా)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ)జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ సినిమాలుఉత్తమ షార్ట్ ఫిల్మ్: ఉన్యుత (వాయిడ్) - అస్సామీఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ (మరాఠీ)ఉత్తమ యానిమేషన్ సినిమా: ఏ కోకోనట్ ట్రీ (సైలెంట్)ఉత్తమ దర్శకులు: మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : బస్తి దినేశ్ షెనోయ్ (ఇంటర్మిషన్ - కన్నడ)ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: విశాల్ భరద్వాజ్ (ఫుర్సత్- లీజర్/ హిందీ)ఉత్తమ క్రిటిక్: దీపక్ దుహా (హిందీ) ఉత్తమ బుక్ ఆన్ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్ ధార్ కిషోర్ కుమార్ (ది అల్టిమేట్ బయోగ్రఫీ - ఇంగ్లిష్) ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్ దివాన్ -మోనో నో అవేర్ (హిందీ - ఇంగ్లీష్) -
నా సినిమాకు జాతీయ అవార్డ్స్ రాకుండా అడ్డుకున్నారు: పా.రంజిత్
కోలివుడ్ దర్శకుడు పా.రంజిత్‌ది చిత్రపరిశ్రమలో ప్రత్యేక బాణి. అయితే, తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన సినిమాకు అవార్డు రాకుండా అడ్డకున్నారని ఆయన ఆరోపించారు. పా.రంజిత్ చిత్రాల్లో రాజకీయాలు కచ్చితంగా ఉంటాయి. అవి సామాజిక సమస్యలను ప్రశ్నించేవిగా ఉంటాయి. సినిమాల ద్వారా రాజకీయాలను మాట్లాడతానని పా.రంజిత్ ఇటీవల స్ఫష్టంగానే చెప్పారు. ఈయన తాజాగా విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కించిన తంగలాన్ చిత్రం విశేష ఆదరణతో ప్రదర్శింపబడుతోంది. కాగా పా.రంజిత్ ఇంతకు ముందు ఆర్య హీరోగా రూపొందించిన చిత్రం సార్పట్ట పరంపర. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్ కూడా చేస్తానని దర్శకుడు ప్రకటించారు. కాగా ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులపై స్పందించిన దర్శకుడు పా.రంజిత్ సార్పట్ట పరంపర చిత్రానికి అవార్డు రాకుండా అడ్డుకున్నారనే ఆరోపించారు. దీని గురించి ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజకీయాల కారణంగానే తనను తన పనిచేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సార్పట్ట పరంపర చాలా పెద్ద విజయాన్ని సాధించిందన్నారు. ఈ చిత్ర రెండో భాగం గురించి పలు విమర్శలు వచ్చాయన్నారు. అయితే, అవార్డులకు సార్పట్ట పరంపర చిత్రం బహిరంగంగానే నిరాకరణకు గురైందన్నారు. పలు క్రిటిక్స్ అవార్డులను ఈ చిత్రం పొందిందన్నారు. అలా క్రిటిక్స్ అవార్డులను పొందిన చిత్రాలకు కచ్చితంగా జాతీయ అవార్డులు అందిస్తారన్నారు. అయితే సార్పట్ట పరంపర చిత్రాన్ని జాతీయ అవార్డుల దరిదాపుల్లోకే వెళ్లలేకపోయిందని అన్నారు. ఆ అవార్డులకు సార్పట్ట పరంపర చిత్రానికి అర్హత లేదా అని ప్రశ్నించారు. తన భావాలను ప్రామాణికంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిరాకరించారనే ఆరోపణను చేశారు. కావాలనే తన పనిని గుర్తించకూడదని కొందరు పనికట్టుకుని చేస్తున్నారని అన్నారు. ఈ రాజకీయ ద్వేషాన్ని తాను అర్థం చేసుకోగలనని దర్శకుడు పా.రంజిత్ పేర్కొన్నారు. -
ఆ అవార్డుకు రిషబ్ శెట్టి అర్హుడు: అల్లు అర్జున్
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికైన రిషబ్ శెట్టి, ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన నిత్యామీనన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు‘నేషనల్ అవార్డు విన్నర్స్ అందరికి నా హృదయ పూర్వక అభినందనలు. రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు అవార్డుకు అర్హుడు. అలాగే నా చిరకాల స్నేహితురాలు నిత్యా మేనన్ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. జాతీయ అవార్డులు గెలుపొందిన అందరికీ నా శుభాకాంక్షలు. నిఖిల్, చందు మొండేటిలకు ప్రత్యేక అభినందనలు. ‘కార్తికేయ2’ విజయం సాధించినందుకు ఆ టీమ్ అందరికీ శుభాకాంక్షలు’ అని అల్లు అర్జున్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.అవార్డు బాధ్యత పెంచింది : చందూ మెండేటి‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సంగతి తెలిసిందే. -
70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన భావోద్వేగానికి పట్టం
70వ జాతీయ అవార్డులకు గాను దేశవ్యాప్తంగా 28 భాషలకు చెందిన 300 చిత్రాల వరకూ పోటీ పడ్డాయి. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయిన చిత్రాలకు పోటీలో అవకాశం ఉంటుంది. అవార్డుల కోసం వివిధ విభాగాలకు సంబంధించిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి విజేతలను వెల్లడించింది. ఈసారి భావోద్వేగానికి పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధాన అవార్డులను పరిశీలిస్తే... ఎమోషనల్‌గా సాగే కథాంశాలకు, భావోద్వేగమైన నటనకు అవార్డులు దక్కినట్లుగా అనిపిస్తోంది. ఆ వివరాలు...ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడి కడియం కలియుగంలో అంతు చిక్కని సమ్యలకు ఎలా పరిష్కారం చూపించింది? అనే అంశంతో రూపొందిన డివోషనల్, ఎమోషనల్ తెలుగు మూవీ ‘కార్తికేయ 2’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. ఈ చిత్రంలో కనబర్చిన పవర్ఫుల్, ఎమోషనల్ నటనకుగాను రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించగా, సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగానూ అవార్డు దక్కించుకుంది. ప్రేమ, ప్రేమలో విఫలం, కుటుంబ బంధాల నేపథ్యంలో మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘తిరుచిత్రాంబళమ్’లో కనబరిచిన గాఢమైన భావోద్వేగ నటనకు గాను నిత్యామీనన్‌ను జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది.భర్త అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్నాక ఓ భార్య ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రెస్’లో భార్య పాత్రలో కనబర్చిన భావోద్వేగానికి గాను ఉత్తమ నటిగా మానసీ పరేఖ్ అవార్డు అందుకోనున్నారు. ఓ నాటక రంగానికి సంబంధించిన ట్రూప్ నేపథ్యంలో ఆనంద్ ఇకర్షి దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘ఆట్టమ్’కి ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ప్లే విభాగాల్లో రెండు అవార్డులు దక్కాయి. చనిపోయిన ఓ స్నేహితుడి చివరి కోరికను నెరవేర్చడానికి ముగ్గురు వృద్ధ స్నేహితులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి ట్రెక్కి వెళ్లే కథాంశంతో తెరకెక్కిన హిందీ చిత్రం ‘ఊంచాయి’. ఈ ఎమోషనల్ రైడ్‌ని అద్భుతంగా ఆవిష్కరించిన సూరజ్ బర్జాత్యా జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు సాధించారు. ఉత్తమ సంగీత దర్శకత్వం (పాటలు) అవార్డును హిందీ ‘బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ’కి సంగీత దర్శకుడు ప్రీతమ్, ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును తమిళ ‘΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్–1’కు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దక్కించు కున్నారు.ఇక గత ఏడాది పది అవార్డులు దక్కించుకున్న తెలుగు పరిశ్రమ ఈసారి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో సరిపెట్టుకుంది. ఇంకా పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు.జాతీయ అవార్డులోని కొన్ని విభాగాలు.... ⇒ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార – కన్నడ) ⇒నటీమణులు: నిత్యా మీనన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ – గుజరాతీ) ⇒చిత్రం: ఆట్టమ్ (మలయాళం)⇒దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఊంచాయి – హిందీ) ⇒దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్ (ఫౌజా –హరియాన్వీ) సంగీత దర్శకత్వం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర: శివ– హిందీ)⇒సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): ఏఆర్ రెహమాన్ (΄పొన్నియిన్ సెల్వన్ – 1, తమిళ్) నేపథ్య గాయకుడు: అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర– పార్ట్ 1: శివ – హిందీ) ⇒నేపథ్య గాయని: బాంబే జయశ్రీ (సౌదీ వెల్లక్క సీసీ 225/2009 – మలయాళం) ⇒సహాయ నటి: నీనా గు΄్తా (ఊంచాయి– హిందీ) ⇒సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి) ⇒బాల నటుడు: శ్రీపత్ (మాలికాపురమ్ – మలయాళం) ⇒సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్ – 1) ⇒కొరియోగ్రఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్) ⇒యాక్షన్ డైరెక్షన్: అన్బు–అరివు (కేజీఎఫ్ 2 – కన్నడ) ⇒విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ (హిందీ) ⇒మాటల రచయిత : అర్పితా ముఖర్జీ, రాహుల్ వి. చిట్టెల (గుల్మోహర్ – హిందీ) ⇒సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి – ΄పొన్నియిన్ సెల్వన్ – 1 (తమిళం) ⇒స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): ఆనంద్ ఏకార్షి (ఆట్టమ్ – మలయాళం) ⇒జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ్రపోత్సహించే చిత్రం: కచ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ) ⇒సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కాంతార (కన్నడ).ప్రాంతీయ ఉత్తమ చిత్రాలు⇒తెలుగు: కార్తికేయ–2 ⇒కన్నడ: కేజీఎఫ్ చాప్టర్–2 ⇒తమిళ్: ΄పొన్నియిన్ సెల్వన్ – 1 ⇒మలయాళం: సౌది వెళ్లక్క సీసీ 225/2009 ⇒హిందీ: గుల్మోహర్అవార్డు బాధ్యత పెంచింది – చందు మొండేటి‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సందర్భంగా చిత్రబృందం సమావేశం నిర్వహించింది. టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ నేషనల్ అవార్డు మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఓ మైల్స్టోన్ మూమెంట్. మా బ్యానర్‌కి తొలి జాతీయ అవార్డు ఇది’’ అన్నారు. ‘‘కృష్ణుడు నిజం అని ఈరోజు మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ అవార్డు కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాను’’ అని అభిషేక్ అగర్వాల్ చె΄్పారు.నిఖిల్ మాట్లాడుతూ – ‘‘కార్తికేయ 2’ విజయం సాధించడానికి, అవార్డు రావడానికి కారణం మా టీమ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ చూసిన సినిమా ఇది. దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజై, అద్భుతమైన విజయం సాధించింది. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, అవార్డు ప్రకటించిన జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు.కార్తికేయ కథేమిటంటే... ద్వాపర యుగంలో తనువు చాలించే ముందు శ్రీకృష్ణుడు తన కాలి కడియాన్ని ఉద్ధవునికి ఇచ్చి, ‘కలియుగంలో వచ్చే ఎన్నో అంతు చిక్కని సమస్యలకు ఈ కడియం పరిష్కారం చూపుతుంది’ అని చెబుతాడు. కలియుగంలో నాస్తికుడైన డాక్టర్ కార్తికేయ (నిఖిల్) తన తల్లి ఒత్తిడి మేరకు ఓ మొక్కు తీర్చుకోవడానికి ద్వారక నగరానికి వెళతాడు. అప్పటికే కడియానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించినప్రోఫెసర్ రంగనాథ రావ్‌ను హతమార్చడానికి ట్రై చేస్తుంటాడు సైంటిస్ట్ శాంతను. అతని మనుషుల చేతిలో హతమవ్వడానికి ముందు రంగనాథ రావ్ అనుకోకుండా కార్తికేయను చివరిసారి కలుస్తాడు. దాంతో శాంతను మనుషులతో పాటు శ్రీకృష్ణ భక్తులైన అధీరుల తెగకు చెందిన వ్యక్తులకు సైతం కార్తికేయ టార్గెట్ అవుతాడు. అయితే రంగనాథ రావ్ మనవరాలు ముగ్ధ (అనుపమ) సాయంతో వారందరి నుంచి డాక్టర్ కార్తికేయ ఎలా తప్పించుకున్నాడు? చంద్రశిల శిఖరంలోని శ్రీకృష్ణుడి కడియాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? అన్నదే కథ.ఆనంద్ ఇకర్షి దర్శకత్వం వహించిన ‘ఆట్టమ్’ కథేంటంటే.. ఓ నాటక బృందంలో 12 మంది నటులు, ఒక నటీమణి ఉంటారు. నటులుగా వినయ్ పాత్రలో వినయ్ ఫోర్ట్, అంజలిగా జరీన్ షిబాబ్, కళాభవన్ షాజాన్ హరి కీలక పాత్రలు పోషించారు. వీళ్ల నాటక ప్రదర్శన ఓ విదేశీ జంటకి నచ్చడంతో తమ రిసార్ట్‌లో వాళ్లకి ఆతిథ్యమిస్తారు. పార్టీ అనంతరం ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి నిద్రపోతారు. అయితే తన గదిలో కిటికీ పక్కన నిద్రపోతున్న అంజలితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి నాటక బృందంలోని 12 మందిలో ఒకరా? లేకుంటే బయటి వ్యక్తా? అనే విషయాన్ని అంజలి ఎలా బయటపెట్టింది? అన్నది ‘ఆట్టమ్’ కథ. హాలీవుడ్ మూవీ ‘12 యాంగ్రీమెన్’ (1954) ఆధారంగా ‘ఆట్టమ్’ రూపొందింది.కెరాడి టు పాన్ ఇండియాకర్ణాటకలోని కెరాడి అనే గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు రిషబ్ శెట్టి. చిత్ర పరిశ్రమలోకి రాకముందు పలు ఉద్యోగాలు చేశారు రిషబ్. డిగ్రీ చదివేటప్పుడు సినిమాలు చూసేందుకు డబ్బుల కోసం కూలి పనులు చేశారు. 2004 నుంచి 2014 వరకు (తొలి సారి డైరెక్షన్ చేసేవరకు) వాటర్ క్యా¯Œ లు అమ్మారు. రియల్ ఎస్టేట్ సంస్థలో, హోటల్స్‌లో పని చేశారు. క్లాప్ బాయ్‌గా ఇండస్ట్రీలో జర్నీ ్రపారంభించిన రిషబ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశారు.‘తుగ్లక్’ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రికీ’ (2016). ఆ తర్వాతి సినిమా ‘కిరిక్ పార్టీ’తో దర్శకుడిగా రిషబ్ పేరు కన్నడనాట మార్మోగింది. హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’తో రిషబ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. -
జాతీయ సినిమా అవార్డ్‌తో పాటు ఏమేం ఇస్తారు?
జాతీయ అవార్డులనీ ప్రకటించారు. తెలుగు నుంచి 'కార్తికేయ 2' ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. మరోవైపు తమిళ, మలయాళ సినిమాలు ఈసారి మంచి దూకుడు చూపించాయి. అయితే అవార్డ్ విజేతలు ఎవరనేది తెలిసిపోయింది. మరి వాళ్లకు పురస్కారంతో పాటు ఏమేం ఇస్తారో తెలుసా?(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)జాతీయ సినీ అవార్డు విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదు బహుమతి ఇస్తారు. అలానే గుర్తింపుగా ప్రశంస పత్రాలను బహుకరిస్తారు. జ్యూరీ అభినందనల అందుకున్న సినిమాలకు మాత్రం సర్టిఫికేట్ మాత్రమే దక్కుతుంది. జ్యూరీ స్పెషల్ విజేతలకు ప్రశంస పత్రంతో పాటు నగదు బహుమతి లభిస్తుంది.తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డ్ విన్నర్స్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ పాపులర్ చిత్రం, ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ విభాగాలకు మాత్రం రూ.3 లక్షల డబ్బు.. మిగిలిన అందరూ విజేతలకు మాత్రం రూ.2 లక్షల నగదు లభిస్తుంది. (ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
అభిమానితో ప్రేమ.. రిషబ్ శెట్టి విజయంలో కీలక పాత్ర ఆమెదే
నేషనల్ అవార్డ్ విన్నర్ స్థాయికి చేరుకున్న కన్నడ హీరో విజయం వెనక ఎవరున్నారా..? అని అందరిలో మెదిలే ప్రశ్న. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందని చెబుతూ ఉంటారు కదా.. అలా రిషబ్ విజయంలో క్రెడిట్ అంతా తన భార్య ప్రగతికే దక్కుతుందని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఈ విధంగా రిషబ్ ప్రేమను భార్యపై చాటారు. రిషబ్‌కు ప్రధాన బలం తన భార్య, ఇద్దరు పిల్లలే అంటూ ఉంటారు. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా రిషబ్‌కు ఆమె తోడుగా ఉంటుంది. వారిద్దరి ప్రేమ ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం.అభిమానితో ప్రేమసాధారణంగా హీరోలు తమ ఇండస్ట్రీలోని పరిచయమున్న వారితో ప్రేమలో పడట సహజం. కానీ అభిమానితో ప్రేమలో పడటం అంటే చాలా అరుదు. కానీ రిషబ్ శెట్టి జీవితంలో అదే జరిగింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయితో ఆయన ప్రేమలో పడ్డారు. రక్షిత్‌శెట్టి హీరోగా ‘రిక్కీ’ అనే సినిమాను రిషబ్ శెట్టి తెరకెక్కించారు. ఆ చిత్ర విజయోత్సవ కార్యక్రమంలో అందరూ హీరోతో సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. అయితే, ఆ సమయంలో ఆ అందమైన అమ్మాయి మాత్రం ఆ చిత్ర దర్శకుడు రిషబ్ శెట్టిని చూస్తూ అలానే ఉండిపోయింది. దానిని గమనించిన రిషబ్.. తనను ఎక్కడో చూశానే అనుకుంటూ పలకరించాడు. ఆ అమ్మాయి తన గ్రామం కెరాడికి చెందిన అమ్మాయేనని గుర్తించాడు. అప్పటికే వారిద్దరికీ ఫేస్బుక్లో పరిచయం ఉంది. అలా ప్రగతితో ప్రేమలో పడిపోయిన రిషబ్ 2017లో పెళ్లి చేసుకున్నాడు. ప్రగతి ఇంట్లో వీరి పెళ్లికి మొదదట ఒప్పుకోలేదు. రిషబ్ జీవితంలో ఇంకా స్థిరపడలేదని వద్దని చెప్పారు. కానీ ప్రగతి పట్టుబట్టి మరీ కుటుంబ సభ్యులను ఒప్పించింది. ఐటీ నేపథ్యమున్న ప్రగతి బెంగళూరులోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ’లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. పెళ్లయ్యాక పూర్తిగా సినిమా రంగంపైనే తన దృష్టిపెట్టింది. చిత్ర పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె ‘కాంతార’ సినిమాకు కూడా పనిచేసింది. ‘కాంతార’లో ప్రారంభ సన్నివేశంలో రాణి పాత్రలో ప్రగతి నటించింది. ప్రస్తుతం రిషబ్ పలు సినిమాలు నిర్మించడంతో పాటు డైరెక్షన్ చేసే స్థాయికి చేరుకున్నాడు. ప్రగతి కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా చిత్రపరిశ్రమలో రాణిస్తుంది. తన భర్త విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రిషబ్‌కు అవార్డ్ దక్కడంలో ప్రగతి పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు. -
నేషనల్ అవార్డ్.. మా బాధ్యత పెంచింది: కార్తికేయ 2 నిర్మాత
70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. రెండవసారి(గతేడాది కశ్మీర్ ఫైల్స్ ఉత్తమ చిత్రంగా నిలిచింది)నేషనల్ అవార్డు రావడం తమ బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. అవార్డు ప్రకటన వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరుసగా రెండు సార్లు నేషనల్ అవార్డులు రావడం గర్వగా ఉందన్నారు. కార్తీకేయ 2లో నటించిన నటీనటులతో పాటు పాటు టెక్నీషియన్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, అందరి కష్టానికి ప్రతిఫలమే ఈ అవార్డు’అని అన్నారు.(చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)సంతోషంగా ఉంది: నిఖిల్కార్తికేయ 2కి నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉందని అన్నారు హీరో నిఖిల్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ‘మన ‘కార్తికేయ 2’ జాతీయ అవార్డుకు ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలనిపించింది. ఈ సినిమా విజయాన్ని అందుకోవడానికి, జాతీయ పురస్కారానికి ఎంపికవ్వడానికి కారణం చిత్ర బృందం. నిర్మాతలు, దర్శకుడు చందూ, హీరోయిన్ అనుపమ, డీవోపీ కార్తిక్ ఘట్టమనేని.. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని నిఖిల్ అన్నారు. తమ చిత్రానికి జాతీయ పురస్కారం రావడం పట్ల కార్తికేయ2 చిత్ర బృందం ఆనందాన్ని వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో కార్తికేయ మంచి వసూళ్లు సాధించడమే కాకుండా అవార్డులు కూడా రావడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. హైదరాబాద్ లోని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కార్యాలయం వద్ద దర్శకుడు చందు మొండేటి, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్ , టీజీ విశ్వప్రసాద్ లు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. కార్తికేయ2 తాము ఆశించిన దానికంటే ఎక్కువే ఇచ్చిందని... జాతీయ పురస్కారానికి తమ చిత్రాన్ని ఎంపిక చేసిన ప్రధాని నరేంద్రమోదీ, నేషనల్ అవార్డు జ్యూరీ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్తికేయ3పై ప్రాథమిక ప్రకటన చేసిన దర్శకుడు చందు... స్క్రిప్ట్ వరకు తుది దశకు చేరిందన్నారు. -
జాతీయ అవార్డుల విజేతలు వీరే (ఫోటోలు)
-
క్లాప్ బాయ్ నుంచి నేషనల్ అవార్డ్ విన్నర్‌గా.. 'రిషబ్ శెట్టి' ప్రయాణం
కాంతార సినిమాతో రిషబ్ శెట్టి పేరు పాపులర్ అయింది. కాంతార మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాందించుకున్నారు రిషబ్ శెట్టి. కన్నడలో విడుదలైన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్‌తో అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్‌ను శాసించింది. కాంతార అద్భుతమైన విజయంలో రిషబ్ శెట్టి పాత్ర చాలా కీలకం. 2010లో సినీరంగంలోకి అడుగుపెట్టి సైడ్ క్యారెక్టర్లు చేస్తూ 2016లో రికి, కిరీక్ పార్టీ సినిమాలకు దర్శకతం వహించాడు. సాధారణ కుటుంబంలో జన్మించిన రిషబ్ శెట్టి తాజాగ విడుదలైన 70వ జాతీయ ఉత్తమ నటుడిగా (కాంతార) అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. అసలు రిషబ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? సినిమాల్లోకి రాకముందు ఆయన ఏం చేశారు? అనే విషయాలు తెలుసుకుందాం.కర్ణాటకలోని కెరాడి అనే మారుమూల గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో రిషబ్ జన్మించారు. తన తండ్రి భాస్కర శెట్టి జ్యోతిష్కుడు కాగా అమ్మ రత్నావతి. కుటుంబంలో అందరికంటే చిన్నవాడు రిషబ్. ఆయనకు అక్క, అన్నయ్య ఉన్నారు. సినిమాల్లో అరంగేట్రానికి ముందు అనేక ఉద్యోగాలు రిషబ్ శెట్టి చేశారు. తన అవసరాల కోసం నాన్నను ఎప్పుడూ డబ్బు అడగలేదని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.ఇండస్ట్రీలో మొదట క్లాప్ బాయ్‌గా తన జర్నీని ప్రారంభించిన రిషబ్ ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.ఇండస్ట్రీలో పరిచయాలు లేకుండానే..తన సినీ ప్రస్థానం గరించి రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. 'నేను నటుడిని కావాలనుకున్నా. కానీ పరిశ్రమలో నాకు ఎటువంటి పరిచయాలు లేవు. ఎలా అప్రోచ్ అవ్వాలనేది నా ఆలోచన. అందుకే నేను ఒక కన్నడ నటుడి కథను చదివా. అతను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి.. హీరోగా ఎలా మారాడనే దాని గురించి చదివాను. నా చదువు తర్వాత ఫిల్మ్ మేకింగ్‌పై షార్ట్‌టర్మ్ కోర్సు చేశా. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి.. ఏడేళ్ల తర్వాత నటన వైపు మొగ్గు చూపా.' అని అన్నారు.(చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)కూలీ పనులకు కూడా వెళ్లేవాడురిషబ్ శెట్టి నటుడిగా అరంగేట్రానికి ముందు చాలా పనులు చేశాడు. చిన్నతనంలో బాగా అల్లరి చేస్తున్న రిషబ్ పై చదువుల కోసం తన గ్రామం నుంచి బెంగుళూరుకు మకాం మార్చాడు. డిగ్రీ చదివేటప్పుడు సినిమా చూసేందుకు నాన్నను డబ్బులు అడగలేక.. కూలీ పనులకు వెళ్లేవాడు. 2004 నుంచి 2014 వరకు తన మొదటి డైరెక్షన్ చేసేవరకు 10 ఏళ్లపాటు వాటర్ క్యాన్లు అమ్మడం, రియల్ ఎస్టేట్, హోటల్స్‌లో పనిచేశారు. అలా తన గమ్యాన్ని చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డారు.సినీ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి ప్రయాణంచదువుకునే సమయంలోనే రిషబ్‌కు సినిమాలు అంటే పిచ్చి. ఆ సమయంలోనే అవకాశాల కోసం ప్రయత్నించారు. కానీ అక్కడ పరిచయాలు లేకపోవడంతో సినీ పరిశ్రమలో క్లాప్ బాయ్, స్పాట్ బాయ్‌గా పనిలో చేరారు. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తుగ్లక్ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. 2016లో రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ తొలి దర్శకత్వం వహించిన చిత్రం రికీ విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకుంది. ఆపై అదే ఏడాది దర్శకత్వ వహించిన మరో చిత్రం కిరిక్ పార్టీ మూవీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది.‘కాంతార’ ప్రభంజనంచిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం ‘కాంతార’. 2022 సెప్టెంబర్ 30న కేవలం కన్నడలో విడుదలైన ఈ చిత్రం ఆక్కడ ప్రభంజనం సృష్టించింది. అక్కడ కేజీయఫ్ రికార్డులను బద్దలు కొట్టింది. శాండిల్ వుడ్లో కేజీయఫ్2 తర్వాత ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన చిత్రం ‘కాంతారా’నే. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 400 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులో సుమారు రూ. 75 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. కాంతార చిత్రంలో రిషబ్ ప్రధాన కథానాయకుడిగా నటించిడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు. ఇప్పుడు 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రిషబ్ శెట్టి సత్తా చాటారు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కించుకున్నారు. 2018లో రిషబ్ దర్శకత్వం వహించిన సర్కారీ హిరియ ప్రాథమిక షాలే, కాసరగోడు (Sarkari Hi. Pra. Shaale, Kasaragodu) సినిమాకుగాను జాతీయ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ బాలల చిత్రంగా 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఎంపికైంది. -
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను వెళ్లడించింది. ఈసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కన్నడ హీరో రిషబ్ శెట్టి (కాంతార) అందుకోనున్నాడు. అయితే, ఉత్తమ నటిగా నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి) ఇద్దరికి సంయుక్తంగా దక్కింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ఆట్టమ్ (మలయాళం) నిలిచింది. ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2' నిలిచింది. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్-2 అవార్డు దక్కించుకుంది. ఉత్తమ హిందీ చిత్రంగా గుల్మొహర్ నిలిచింది.జాతీయ అవార్డ్ విజేతలు వీరేఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం) ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార) ఉత్తమ నటి: నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్ 1ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్ ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మస్త్ర -హిందీ)ఉత్తమ సంగీతం (నేపథ్యం): ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ - 1 తమిళం)ఉత్తమసినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 తమిళం) ఉత్తమ సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి (పొన్నియిన్ సెల్వన్ - 1) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మాలికాపురం - మలయాళం)ఉత్తమ స్క్రీన్‌ప్లే: ఆనంద్ ఏకార్షి (ఆట్టం- మలయాళం)ఉత్తమ ఎడిటింగ్: మహేష్ భువనేండ్ (ఆట్టం) ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీఎఫ్- 2)ఉత్తమ మేకప్: సోమనాథ్ కుందు (అపరాజితో- బెంగాళీ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నిక్కి జోషి (కచ్ ఎక్స్‌ప్రెస్- గుజరాతీ) ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల (గుల్మోహర్) ఉత్తమ ప్రాంతీయ సినిమాలుఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ -2 (తెలుగు)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కేజీఎఫ్ 2 (కన్నడ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : గుల్మొహర్ (హిందీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్ (బెంగాళీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ (మరాఠీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్ (ఒడియా)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ)జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ సినిమాలు ఉత్తమ షార్ట్ ఫిల్మ్: ఉన్యుత (వాయిడ్) - అస్సామీఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ (మరాఠీ)ఉత్తమ యానిమేషన్ సినిమా: ఏ కోకోనట్ ట్రీ (సైలెంట్)ఉత్తమ దర్శకులు: మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : బస్తి దినేశ్ షెనోయ్ (ఇంటర్మిషన్ - కన్నడ)ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: విశాల్ భరద్వాజ్ (ఫుర్సత్- లీజర్/ హిందీ)ఉత్తమ క్రిటిక్: దీపక్ దుహా (హిందీ) ఉత్తమ బుక్ ఆన్ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్ ధార్ కిషోర్ కుమార్ (ది అల్టిమేట్ బయోగ్రఫీ - ఇంగ్లిష్)ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్ దివాన్ -మోనో నో అవేర్ (హిందీ - ఇంగ్లీష్) -
'నేషనల్ అవార్డ్స్.. రేసులో స్టార్ హీరో
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం నేడు సాయింత్రం ప్రకటించనుంది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించనుంది. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ నేడు (ఆగష్టు 16) జాతీయ అవార్డు అందుకోనున్న వారి జాబితా మాత్రం విడుదల అవుతుందని సమాచారం ఉంది.ఎంపిక విధానం2022కు సంబంధించిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి జాతీయ అవార్డ్స్‌ను అందిస్తారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం వాస్తవానికి 3 మే 2023న నిర్వహించబడుతుందని అందరూ భావించారు. కరోనా తర్వాత ఈ అవార్డులకు సంబంధించిన షెడ్యూల్స్‌లో మార్పులు వచ్చాయి. దీంతో 2022కు సంబంధించిన సినిమాలకు నేడు విన్నర్స్ జాబితా విడుదల అవుతుంది. ఇదే ఏడాది అక్టోబర్‌లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డ్స్‌ను వారు అందుకుంటారు. 1 జనవరి 2022 నుంచి 31 డిసెంబర్ 2022 మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా ధృవీకరించబడిన ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు మాత్రమే ఈ అవార్డుల పోటీకి అర్హత పొందాయి.ఉత్తమ హీరో రేసులో ఎవరున్నారు..?70వ జాతీయ అవార్డు వేడుకలో ఉత్తమ హీరోగా ఎంపిక అయింది ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే, మమ్ముట్టి, రిషబ్ శెట్టి, విక్రాంత్ మాస్సే మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ రోషాక్, నాన్ పకల్ నేరత్తు మయక్కం అనే రెండు సినిమాలతో మమ్ముట్టి టాప్‌లో ఉన్నారు. కాంతార సినిమాతో రిషబ్ శెట్టి ఉంటే... 12th ఫెయిల్ సినిమా ద్వారా విక్రాంత్ మాస్సే తర్వాతి స్థానంలో ఉన్నారు. బాలీవుడ్ నుంచి పోటీలు ఉన్న ఏకైక హీరోగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే, ఈసారి కూడా సౌత్ ఇండియా హీరోకే అవార్డ్ దక్కుతుందని తెలుస్తోంది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ హీరోగా అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే.