నేషనల్ అవార్డ్ విన్నర్ స్థాయికి చేరుకున్న కన్నడ హీరో విజయం వెనక ఎవరున్నారా..? అని అందరిలో మెదిలే ప్రశ్న. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందని చెబుతూ ఉంటారు కదా.. అలా రిషబ్ విజయంలో క్రెడిట్ అంతా తన భార్య ప్రగతికే దక్కుతుందని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఈ విధంగా రిషబ్ ప్రేమను భార్యపై చాటారు. రిషబ్‌కు ప్రధాన బలం తన భార్య, ఇద్దరు పిల్లలే అంటూ ఉంటారు. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా రిషబ్‌కు ఆమె తోడుగా ఉంటుంది. వారిద్దరి ప్రేమ ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం.
అభిమానితో ప్రేమ
సాధారణంగా హీరోలు తమ ఇండస్ట్రీలోని పరిచయమున్న వారితో ప్రేమలో పడట సహజం. కానీ అభిమానితో ప్రేమలో పడటం అంటే చాలా అరుదు. కానీ రిషబ్ శెట్టి జీవితంలో అదే జరిగింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయితో ఆయన ప్రేమలో పడ్డారు. రక్షిత్‌శెట్టి హీరోగా ‘రిక్కీ’ అనే సినిమాను రిషబ్ శెట్టి తెరకెక్కించారు. ఆ చిత్ర విజయోత్సవ కార్యక్రమంలో అందరూ హీరోతో సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. అయితే, ఆ సమయంలో ఆ అందమైన అమ్మాయి మాత్రం ఆ చిత్ర దర్శకుడు రిషబ్ శెట్టిని చూస్తూ అలానే ఉండిపోయింది. దానిని గమనించిన రిషబ్.. తనను ఎక్కడో చూశానే అనుకుంటూ పలకరించాడు. ఆ అమ్మాయి తన గ్రామం కెరాడికి చెందిన అమ్మాయేనని గుర్తించాడు.
అప్పటికే వారిద్దరికీ ఫేస్‌బుక్‌లో పరిచయం ఉంది. అలా ప్రగతితో ప్రేమలో పడిపోయిన రిషబ్ 2017లో పెళ్లి చేసుకున్నాడు. ప్రగతి ఇంట్లో వీరి పెళ్లికి మొదదట ఒప్పుకోలేదు. రిషబ్ జీవితంలో ఇంకా స్థిరపడలేదని వద్దని చెప్పారు. కానీ ప్రగతి పట్టుబట్టి మరీ కుటుంబ సభ్యులను ఒప్పించింది. ఐటీ నేపథ్యమున్న ప్రగతి బెంగళూరులోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ’లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. పెళ్లయ్యాక పూర్తిగా సినిమా రంగంపైనే తన దృష్టిపెట్టింది.
చిత్ర పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె ‘కాంతార’ సినిమాకు కూడా పనిచేసింది. ‘కాంతార’లో ప్రారంభ సన్నివేశంలో రాణి పాత్రలో ప్రగతి నటించింది. ప్రస్తుతం రిషబ్ పలు సినిమాలు నిర్మించడంతో పాటు డైరెక్షన్ చేసే స్థాయికి చేరుకున్నాడు. ప్రగతి కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా చిత్రపరిశ్రమలో రాణిస్తుంది. తన భర్త విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రిషబ్‌కు అవార్డ్ దక్కడంలో ప్రగతి పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment