కన్నడ చిత్రం ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. భాషతో సంబంధం లేకుండా థియేటర్లను ఊపేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 30న కన్నడలో విడుదలైన ‘కాంతార’ అతి తక్కువ సమయంలోనే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కేవలం మౌత్ టాక్‌తోనే పాన్ ఇండియా స్థాయిలో ‘కాంతార’ అదరగొట్టింది.
(చదవండి: ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి నటించిన తెలుగు మూవీ తెలుసా?)
రిషబ్‌శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడమే అసలు కారణం. ఇప్పటికే ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందే. మొదట నవంబర్ 4న ఓటీటీకి వస్తోందని వార్తలొచ్చాయి. కానీ అభిమానులకు నిరాశ తప్పలేదు. దీంతో అందరి నోటా కాంతార ఓటీటీకి ఎప్పుడు వస్తోందని చర్చించుకుంటున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారిక ప్రకటన చేస్తారా? అని ఆశిస్తున్నారు.
(చదవండి: ‘కాంతార’కు కాసుల పంట.. ఒక్క తెలుగులోనే రూ.50 కోట్లు వసూళ్లు)
అసలు కారణం ఇదే: అక్టోబరు 15న టాలీవుడ్‌లో ‘కాంతార’ విడుదలై దాదాపు నెల రోజులు కావొస్తున్న థియేటర్లు మంచి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. హిందీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. క్లైమాక్స్, రిషబ్‌శెట్టి నటనను చూసేందుకు చాలా మంది రెండోసారి సినిమా చూసేందుకు వస్తున్నారు. కలెక్షన్ల పరంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘కాంతార మూవీని ప్రస్తుతం ఓటీటీలో విడుదల చేసే ఆలోచన చిత్రబృందానికి లేనట్లు తెలుస్తోంది. పైగా రాబోయే రోజుల్లో ‘హోంబలే ఫిల్మ్స్’ నుంచి మరిన్నీ క్రేజీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. దీంతో అమెజాన్ ప్రైమ్ కూడా కాంతారను ఓటీటీకి తెచ్చే విషయంలో తొందరపడటం లేదని సమాచారం. అన్నీ కుదిరితే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన తర్వాతే ఓటీటీకి తీసుకొస్తారని టాక్ నడుస్తోంది. మరీ అప్పటి దాకా ఫ్యాన్స్ వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment