70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం నేడు సాయింత్రం ప్రకటించనుంది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించనుంది. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ నేడు (ఆగష్టు 16) జాతీయ అవార్డు అందుకోనున్న వారి జాబితా మాత్రం విడుదల అవుతుందని సమాచారం ఉంది.
ఎంపిక విధానం
2022కు సంబంధించిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి జాతీయ అవార్డ్స్‌ను అందిస్తారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం వాస్తవానికి 3 మే 2023న నిర్వహించబడుతుందని అందరూ భావించారు. కరోనా తర్వాత ఈ అవార్డులకు సంబంధించిన షెడ్యూల్స్‌లో మార్పులు వచ్చాయి. దీంతో 2022కు సంబంధించిన సినిమాలకు నేడు విన్నర్స్ జాబితా విడుదల అవుతుంది. ఇదే ఏడాది అక్టోబర్‌లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డ్స్‌ను వారు అందుకుంటారు. 1 జనవరి 2022 నుంచి 31 డిసెంబర్ 2022 మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా ధృవీకరించబడిన ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు మాత్రమే ఈ అవార్డుల పోటీకి అర్హత పొందాయి.
ఉత్తమ హీరో రేసులో ఎవరున్నారు..?
70వ జాతీయ అవార్డు వేడుకలో ఉత్తమ హీరోగా ఎంపిక అయింది ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే, మమ్ముట్టి, రిషబ్ శెట్టి, విక్రాంత్ మాస్సే మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ రోషాక్, నాన్ పకల్ నేరత్తు మయక్కం అనే రెండు సినిమాలతో మమ్ముట్టి టాప్‌లో ఉన్నారు. కాంతార సినిమాతో రిషబ్ శెట్టి ఉంటే... 12th ఫెయిల్ సినిమా ద్వారా విక్రాంత్ మాస్సే తర్వాతి స్థానంలో ఉన్నారు.
బాలీవుడ్ నుంచి పోటీలు ఉన్న ఏకైక హీరోగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే, ఈసారి కూడా సౌత్ ఇండియా హీరోకే అవార్డ్ దక్కుతుందని తెలుస్తోంది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ హీరోగా అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment