హీరోయిన్ తాప్సీ పన్ను ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. చాలా ఏళ్లపాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ పన్ను తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన పెళ్లి గతేడాదిలోనే అయిపోయిందంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. గతేడాది డిసెంబర్‌లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని తెలిపింది. ఉదయ్‌పూర్‌లో కేవలం వివాహా వేడుక మాత్రమే నిర్వహించామని తాప్సీ అసలు విషయాన్ని రివీల్ చేసింది. వ్యక్తిగత విషయాలను మేము పెద్దగా బయటకు చెప్పడం తనకు ఇష్టం లేదని.. అందుకే బయటపెట్టలేదని పేర్కొంది. పర్సనల్ విషయాలు బయటపెడితే వర్క్ లైఫ్ దెబ్బతింటుందని చెప్పుకొచ్చింది.
కాగా.. ఈ ఏడాది మార్చిలో ఉదయ్ పూర్‌లోని ఓ కోటలో జరిగింది. ఈ పెళ్లి వేడుకలో ఆమె సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ఆ తర్వాత వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తెలుగులో పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది తాప్సీ.
Comments
Please login to add a commentAdd a comment