‘అవేంజర్స్ ఎండ్‌గేమ్’ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దీనికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. టికెట్ల కోసం జనాలు క్యూ కడుతున్నారు. బుధవారం ఈ సినిమా టికెట్లకు ఓపెనింగ్ మొదలు కావడంతో నగరంలోని ఐమ్యాక్స్ థియేటర్ వద్ద ఉదయం 7 గంటల నుంచే కి.మీ మేర యువత బారులు తీరారు. మార్వెల్ సిరీస్‌లో అవేంజర్ సినిమాలో ఇది చివరిది. దీంతో ఈ చిత్రానికి హైప్ క్రియేట్ అయింది. కొంత మంది తల్లులు తమ పిల్లల కోసం కూడా క్యూలో నిల్చోవడం విశేషం.
‘అంతమయ్యే ఆట’కు.. అంతులేని జనాలు
Published Thu, Apr 25 2019 7:22 AM | Last Updated on Thu, Apr 25 2019 2:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment