swami nityananda
-
నిత్యానంద పాస్‌పోర్టు రద్దు
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో ఆరోపణలెదుర్కొంటున్న స్వామి నిత్యానంద పాస్‌పోర్టును భారత ప్రభుత్వం రద్దు చేసింది. అదేవిధంగా ఆయనకు ఈక్వెడార్ దేశం ఆశ్రయం కల్పించిందన్న వార్తల్ని ఆ దేశ ప్రభుత్వం ఖండించింది. నిత్యానందను పట్టుకోవాలని విదేశాల్లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలు, అధికారులను స్థానిక ప్రభుత్వాన్ని భారత్ అప్రమత్తం చేసింది. అత్యాచార కేసులో ఆరోపణలతోపాటుగా అపహరణ వంటి అనేక కేసులు నిత్యానందపై ఉన్నాయని వెల్లడించింది. -
నిత్యానందపై కేసు నమోదు
అహ్మదాబాద్ : వివాదాస్పద ఆథ్యాత్మికవేత్త స్వామి నిత్యానందపై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అహ్మదాబాద్‌లోని తమ ఆశ్రమంలో నలుగురు చిన్నారులను విరాళాల సేకరణకు ఉపయోగించుకుంటూ ఆశ్రమంలో దిగ్బంధించారనే ఆరోపణలపై నిత్యానందపై కేసు నమోదు చేశారు. మరోవైపు నిత్యానంద శిష్యులు సాధ్వి ప్రణ్‌ప్రియానంద, సాధ్వి ప్రియతత్వ రిధి కిరణ్‌లను చిన్నారులను కిడ్నాప్ చేసి, బాల కార్మికులుగా వారితో పనిచేయిస్తున్నారనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. నలుగురు చిన్నారులను ఆశ్రమంలోని ఫ్లాట్ నుంచి రక్షించిన పోలీసులు వారి స్టేట్మెంట్ ఆధారంగా నిత్యానందపై కేసు నమోదు చేశారు. ఈ ఆశ్రమాన్ని నిత్యానంద తరపున సాధ్వి ప్రణ్‌ప్రియానంద, సాధ్వి ప్రియతత్వ రిధి కిరణ్‌లు నిర్వహిస్తున్నారని, చిన్నారులను అక్రమంగా నిర్బంధించి వారిచే ఆశ్రమాన్ని నడిపేందుకు విరాళాలను వసూలు చేయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. చిన్నారుల తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులకు ఆశ్రమంలో సాగుతున్న వ్యవహారం రట్టయింది. మరోవైపు ఆశ్రమంలో నిర్బంధించిన తమ కుమార్తెలను విడిపించాలని జనార్ధనశర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెలను కలిసేందుకు ఆశ్రమ నిర్వాహకులు అనుమతించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నకిలీ పాస్‌పోర్ట్‌పై నిత్యానంద నేపాల్‌లో తలదాచుకున్నాడు. -
అవెంజర్స్ : థానోస్‌గా స్వామి నిత్యానంద..!
మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హీరో సీరిస్‌లో చివరి సినిమా అవడంతో అవెంజర్స్ ; ఎండ్‌గేమ్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. హాలీవుడ్‌తో పాటు చైనా, భారత్‌లాంటి ఆసియా దేశాల్లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇక సూపర్ హీరోస్ అందరూ కలిసి విలన్ థానోస్‌ను ఎలా అంతమొందించారనేదే అవెంజర్స్ ; ఎండ్‌గేమ్ కథ. అయితే, ఇండియాలో మాత్రం మరో థానోస్ పుట్టుకొచ్చాడు. ఓ కథానాయికతో శంగారకేళీలు సాగిస్తూ దొరికిపోయిన స్వామి నిత్యానందే థానోస్. తనను తాను దేవుని బిడ్డను అని చెప్పుకునే నిత్యానందను విలన్‌గా చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. (చదవండి : బాహుబలిని దాటలేకపోయిన ‘అవెంజర్స్’) అవెంజర్స్ ; ఇన్ఫినిటీ వార్ సినిమాలో కథానాయకుడు డాక్టర్ స్ట్రేంజ్, విలన్ థానోస్ మధ్య జరిగే ఫైట్ సీన్‌కు స్పూఫ్గా వచ్చిన ఈ వీడియోలో నిత్యానందను అతీతమైన శక్తులుగల వాడిగా చూపించారు. ఇక థానోస్ ఆటలు కట్టించేందుకు లక్షలాది మార్గల్లో యత్నించే డాక్టర్ స్ట్రేంజ్‌ను నిత్యానంద అలవోకగా ఓడిస్తాడు. మంత్ర శక్తితో మట్టికరిపిస్తాడు. కొంతకాలం క్రితం తనకు మూడో కన్ను ఉందని, దైవ రహస్యాలు తెలుసునని నిత్యానంద చెప్పిన విషయం తెలిసిందే. పశువులకు తమిళ, సంస్కృత భాషలు కూడా నేర్పిస్తానని చెప్పుకొచ్చాడు. ‘అవెజంర్స్ రీలోడెడ్ ; 2020 సినిమా ట్రైలర్‌ను అప్పుడే విడుదల చేశారా’ అంటూ ఒకరు, అసలైన ఎండ్‌గేమ్ ఇదేనంటూ మరొకరు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. The asli Avengers Endgame. pic.twitter.com/h1ZrjdYWTa — Kaveri (@ikaveri) 29 April 2019 -
ఆవుతో మాట్లాడిస్తా..
-
తిరుమలలో నిత్యానంద, రంజిత ప్రత్యక్షం
తిరుమల : గత కొద్ది కాలంగా అజ్ఞాతంలో ఉంటున్న వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు స్వామి నిత్యానంద, ఆయన సహాయకరాలు రంజిత బుధవారం తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో నిత్యానంద తన శిష్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కాషాయ వేషధారణలో ఉన్న రంజిత...నిత్యానందతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు నిత్యానంద నిరాకరించారు. కాగా రంజిత ఇటీవలే బెంగళూరులోని బిడిది ధ్యానపీఠంలో సన్యాసం స్వీకరించిన విషయం తెలిసిందే. ఆమె తన పేరును మా ఆనందమయి గా మార్చుకుంది.