
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో ఆరోపణలెదుర్కొంటున్న స్వామి నిత్యానంద పాస్‌పోర్టును భారత ప్రభుత్వం రద్దు చేసింది. అదేవిధంగా ఆయనకు ఈక్వెడార్ దేశం ఆశ్రయం కల్పించిందన్న వార్తల్ని ఆ దేశ ప్రభుత్వం ఖండించింది. నిత్యానందను పట్టుకోవాలని విదేశాల్లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలు, అధికారులను స్థానిక ప్రభుత్వాన్ని భారత్ అప్రమత్తం చేసింది. అత్యాచార కేసులో ఆరోపణలతోపాటుగా అపహరణ వంటి అనేక కేసులు నిత్యానందపై ఉన్నాయని వెల్లడించింది.