
RRR Movie Trailer Spoof Video By Odisha State People: సినిమా అంటే ఒకరకమైన పిచ్చి. అదో మైకం. సినిమాపై తమకున్న అభిమానాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా చూపిస్తారు. రోజుకు ఒక్క సినిమా అయిన చూడకుండా ఉండలేరు కొందరు. సినిమాల్లోని డైలాగ్‌లను నిజ జీవితంలో వాడుతూ కనిపిస్తారు మరికొందరు. ఇక సోషల్ మీడియాల్లో రీల్స్, స్పూఫ్స్ చూస్తూనే ఉంటాం. ఇటీవల కాలంలో అయితే సినిమా పాటలు, యాక్షన్ సీన్స్, డ్యాన్స్‌లను స్పూఫ్ చేయడం, రీక్రియేట్ చేయడం, అవి తెగ వైరల్ కావడం కూడా జరిగింది. ఈ తరహాలోనే ఒడిశాకు చెందిన కొందరు యువకులు సినిమాపై తమకున్న అభిమానాన్ని 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ ట్రైలర్ స్పూఫ్ ద్వారా తెలియజేశారు. అది చూసిన సగటు జనం వావ్ అనకుండా, నవ్వకుండా ఉండలేరు.
టాలీవుడ్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానోఎదురుచూస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. దర్శక ధీరుడు రాజమౌళి టేకింగ్ , మరో వైపు టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సినిమాలో యాక్షన్ సీన్స్, లొకేషన్లు, నటీనటుల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ఈ ట్రైలర్ స్పూఫ్‌ను తమదైన శైలిలో చిత్రీకరించి ఆకట్టుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్ర యూనిట్ వారిని ప్రశంసించింది. ఈ వీడియోకు తామెంటో కష్టపడ్డారో వీడియో చివర్లో చూపించారు. ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు వారు ఇదివరకు పుష్ప, అంతిమ్, 3 ఇడియట్స్, స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ట్రైలర్‌లను కూడా రీక్రియేట్ చేసి వావ్ అనిపించారు.
ఇదీ చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్'కు అమెజాన్ భారీ ఆఫర్.. కానీ