David Warner Imitates Allu Arjun: ఫేస్ యాప్ ద్వారా ప్రముఖ తెలుగు హీరోల వీడియోలను మార్ఫింగ్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా..’ అనే పాపులర్ పాటకు స్పూఫ్ చేశాడు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ 'క్యాప్షన్ దిస్' అంటూ కామెంట్ పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తూ.. తెలుగు క్రికెట్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది.
ఈ పోస్ట్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. 'ఆర్ యూ ఓకే' అంటూ కామెంట్ పెట్టాడు. ఇందుకు వార్నర్ 'గొంతు పట్టేసినట్టుంది..’ అంటూ సరదాగా బదులిచ్చాడు. కాగా, డేవిడ్ భాయ్ గతంలో కూడా అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేసి నెట్టింట నవ్వులు పూయించాడు. బన్నీ నటించిన 'అల వైకుంఠపురంలో' సినిమాలోని బుట్టబొమ్మ పాటకు వార్నర్ కుటుంబంతో కలిసి డ్యాన్స్ చేశాడు.
ఇదిలా ఉంటే, యాజమాన్యంతో విభేదాల కారణంగా డేవిడ్ భాయ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవలే ముగిసిన రిటెన్షన్ పాలసీలో కూడా ఎస్‌ఆర్‌హెచ్ వార్నర్ పేరు చేర్చలేదు. దీంతో త్వరలో జరగబోయే ఐపీఎల్ మెగా వేలంలో అతడు పాల్గొనే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వార్నర్ యాషెస్ సిరీస్‌లో ఆడుతున్నాడు. ఇందులో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగులు చేసిన వార్నర్.. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
చదవండి: Ashes 1st Test: ఆసీస్ బౌలర్ ఖాతాలో పలు అరుదైన రికార్డులు
Comments
Please login to add a commentAdd a comment