హైదరాబాద్లో నెట్మెడ్స్ కేంద్రం...
మరో ఏడు నగరాల్లో కూడా భారీగా విస్తరిస్తున్న కంపెనీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్‌లో ఔషధాలను విక్రయిస్తున్న నెట్‌మెడ్స్ మార్కెట్‌ప్లేస్ హైదరాబాద్‌లో గోదామును ఏర్పాటు చేస్తోంది. ఉత్పత్తులను నిల్వ చేయడంతోపాటు ప్యాకింగ్‌ను ఈ కేంద్రంలో చేపడతారు. భాగ్యనగరంతో పాటు దేశవ్యాప్తంగా మరో ఏడు నగరాల్లో ఈ సెంటర్లు రానున్నాయి.
ఆన్‌లైన్‌లో ఔషధాల కొనుగోళ్లకు డిమాండ్ పెరగడంతోపాటు తక్కువ సమయంలో కస్టమర్లకు మందుల సరఫరా కోసమే ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు నెట్‌మెడ్స్ ఫౌండర్ ప్రదీప్ దాదా తెలిపారు. 2018 మార్చికల్లా 30 నగరాల్లో ఇటువంటి కేంద్రాలు రానున్నాయని అన్నారు. జీఎస్‌టీ అమలైతే స్థానిక వర్తకులకూ మందుల సరఫరా చేస్తామని చెప్పారు. ఇటీవలే నెట్‌మెడ్స్ సుమారు రూ.330 కోట్లను ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది. విస్తరణకు ఈ మొత్తాన్ని వెచ్చించనుంది.
20 శాతం దాకా డిస్కౌంట్..
జూలైలో కంపెనీకి 118 నగరాలు, పట్టణాల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు వచ్చాయి. సగటు బిల్లు విలువ రూ.1,650 ఉంది. ఔషధాలపై 20 శాతం దాకా డిస్కౌంట్ ఇవ్వడం కస్టమర్లను ఆకట్టుకుంటోంది.