netmeds Marketplace
-
ఎస్బీఐ బంపర్ ఆఫర్..! రూ.4,999 విలువైన స్మార్ట్‌వాచ్ ఉచితం..! ఇంకా మరెన్నో ఆఫర్లు
SBI Pulse Credit Card Benefits: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సరికొత్త క్రెడిట్ కార్డుతో ముందుకొచ్చింది. ఫిట్నెస్, హెల్త్ ఔత్సాహికులను దృష్టిలో ఉంచుకొని ‘ ఎస్బీఐ కార్డ్ పల్స్ ’ను లాంచ్ చేసింది. వీసా సిగ్నేచర్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రారంభించిన ఈ పల్స్ క్రెడిట్ కార్డుపై వార్షిక సభ్యత్వ ఛార్జీ కింద రూ. 1,499ను ఎస్బీఐ వసూలు చేయనుంది. పల్స్ క్రెడిట్ కార్డును అందిస్తోన్న ఏకైక బ్యాంకింగ్ సంస్థగా ఎస్బీఐ నిలవనుంది. ఈ కార్డును తీసుకునే కస్టమర్లకు వెల్కమ్ గిఫ్ట్‌గా రూ. 4,999 విలువైన నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ స్మార్ట్‌వాచ్‌ను సొంతం చేసుకోవచ్చునని ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా కార్డు వినియోగదారు కనీసం రూ. 2 లక్షలు ఏడాదిలోపు ఖర్చు చేస్తే వార్షిక సభ్యత్వ రుసుము నుంచి మినహాయింపు కూడా వర్తిస్తోందని ఎస్బీఐ తెలిపింది. చదవండి: విప్రో దూకుడు..! అమెరికన్ కంపెనీ విప్రో కైవసం..! ఏడాదిపాటు ఫిట్‌పాస్ ప్రో సభ్యత్వం..! ఎస్బీఐ పల్స్ క్రెడిట్ కార్డును తీసుకున్న కస్టమర్లకు ఏడాది పాటు ఫిట్‌పాస్ ప్రో సభ్యత్వాన్ని కాంప్లిమెంటరీ ఎస్బీఐ అందిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా 4,000కు పైగా జిమ్స్‌ను, ఫిట్నెస్ స్టూడియోల క్యూరేటెడ్ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయవచ్చును. అంతేకాకుండా కస్టమర్లకు యోగా, డ్యాన్స్, కార్డియోతో సహా అపరిమిత ఆన్లైన్ ఫిట్నెస్ సెషన్లు కూడా లభించనున్నాయి. ఆరోగ్య-కేంద్రీకృత కార్డ్ కాబట్టి అనేక ఇతర జీవనశైలి ప్రయోజనాలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. వివిధ వైద్య ప్రయోజనాలతో పాటు, కస్టమర్లు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఇంధన ఛార్జీ మినహాయింపులను పొందవచ్చును. ప్రయాణ . బీమా ప్రయోజనాలను కూడా ఎస్బీఐ అందిస్తోంది. ఒక ఏడాది పాటు ఉచిత నెట్‌మెడ్స్ ప్లస్ సబ్స్క్రిప్షన్ రానుంది. అంతేకాకుండా మెడికల్ షాపులు, ఫార్మసీలు, సినిమాలు, డైనింగ్‌లలో షాపింగ్ చేయడంపై 5 రేట్ల రివార్డ్ పాయింట్లను కూడా పొందవచ్చును. చదవండి: వాటాలు విక్రయించనున్న ఏఐజీ హాస్పిటల్స్ ప్రమోటర్లు? -
రిలయన్స్ ‘ఫార్మా’ షాపింగ్ !
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ–ఫార్మసీ విభాగంలో మరో సంస్థను దక్కించుకుంది. నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాలు (60 శాతం) కొనుగోలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 620 కోట్లు. దీనితో వైటలిక్ హెల్త్‌లో 60 శాతం, దాని అనుబంధ సంస్థల్లో 100 శాతం (అన్నింటినీ కలిపి నెట్‌మెడ్స్‌గా వ్యవహరిస్తారు) వాటాలు ఆర్ఐఎల్కు దక్కుతాయి. డిజిటల్ విభాగం జియో ద్వారా కాకుండా రిటైల్ విభాగం ద్వారా ఆర్ఐఎల్ ఈ కొనుగోలు జరిపింది. ఈ–ఫార్మసీ విభాగానికి సంబంధించి ఆర్ఐఎల్ గతేడాదే సి–స్క్వేర్ అనే సంస్థను కొనుగోలు చేసింది. ఫార్మా రంగ డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు ఇది సాఫ్ట్వేర్ అందిస్తోంది. గడిచిన మూడేళ్లుగా ఆర్ఐఎల్ దాదాపు 3.1 బిలియన్ డాలర్ల విలువ చేసే కొనుగోళ్లు జరిపింది. ఈ డీల్స్‌లో 13 శాతం రిటైల్, 80 శాతం టెలికం.. మీడియా .. టెక్నాలజీ, మరో 6 శాతం ఇంధన రంగానికి చెందినవి ఉన్నాయి. గ్రూప్‌లో భాగమైన జియోమార్ట్ కేవలం నిత్యావసరాలకు మాత్రమే పరిమితం కాకుండా ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ తదితర ఉత్పత్తులను కూడా డెలివరీ చేయనున్నట్లు గత నెల జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆర్ఐఎల్ వెల్లడించింది. ఆ దిశగా నెట్‌మెడ్స్ కొనుగోలు కంపెనీకి ఉపయోగపడనుంది. కన్సల్టింగ్ నుంచి ఔషధాల దాకా అన్నీ ఒకే చోట.. పటిష్టమైన డిజిటల్, ఈ–కామర్స్ వ్యవస్థను రూపొందించుకోవడంపై కంపెనీ మరింతగా దృష్టి పెడుతోందనడానికి ఈ కొనుగోలు నిదర్శనమని కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ‘ప్రస్తుతం ఆర్ఐఎల్ తమ ఆన్లైన్ యాప్ జియోహెల్త్ హబ్ ద్వారా డిజిటల్ కన్సల్టేషన్, డయాగ్నొస్టిక్ టెస్టుల సర్వీసులు అందిస్తోంది. నెట్‌మెడ్స్ కొనుగోలుతో ఔషధాల డెలివరీ విభాగంలోకి కూడా దిగినట్లవుతుంది. టెలీకన్సల్టేషన్ అనంతరం, ప్రిస్క్రిప్షన్‌ను యాప్‌లో పొందుపర్చవచ్చు. ఆ తర్వాత పేషెంట్లకు అటు వైద్య పరీక్షలు ఇటు డాక్టరు సూచించిన ఔషధాలకు కలిపి కస్టమైజ్డ్ ఆఫర్లాంటివి ఇవ్వచ్చు‘ అని క్రెడిట్ సూసీ పేర్కొంది. సాధారణగా డెలివరీ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆన్లైన్ ఫార్మసీలో మార్జిన్లు తక్కువగా ఉంటాయని, కాకపోతే దేశీయంగా భారీ మార్కెట్ కావడం వల్ల వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. ఆన్లైన్ ఫార్మసీ మార్కెట్‌ను ఆర్ఐఎల్ గణనీయంగా విస్తరించే అవకాశం ఉందని వివరించింది. రిటైల్ నెట్వర్క్ ఊతం.. దేశీయంగా మొత్తం ఔషధాల మార్కెట్ ఏకంగా 18–19 బిలియన్ డాలర్ల భారీ పరిమాణంలో ఉండగా ఆన్లైన్ ఔషధ మార్కెట్ వాటా ప్రస్తుతం సుమారు 3–3.5 శాతం స్థాయికే పరిమితమైంది. ప్రస్తుతం ఉన్న సంస్థలు సత్వర డెలివరీ సేవలు ఇవ్వలేకపోతుండటం, కస్టమర్లకు ఔషధాలు చేరాలంటే కనీసం 24–48 గంటల దాకా సమయం పట్టేస్తుండటం ఈ విభాగానికి ప్రతికూలాంశంగా ఉంటోంది. అయితే, దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లు ఉండటం ఆర్ఐఎల్కు లాభించే అంశమని క్రెడిట్ సూసీ పేర్కొంది. ‘భారీ సంఖ్యలో రిటైల్ నెట్వర్క్ ఉన్నందున డెలివరీ సమయాన్ని ఆర్ఐఎల్ గణనీయంగా తగ్గించడానికి వీలుంది. కంపెనీపరంగా డెలివరీ వ్యయాలూ తక్కువగా ఉంటాయి. తద్వారా మార్కెట్‌ను పెంచుకోవచ్చు‘ అని క్రెడిట్ సూసీ పేర్కొంది. నిత్యావసరాలకు సంబంధించి కిరాణా దుకాణాలకు అగ్రిగేటర్‌గా వ్యవహరిస్తున్నట్లే మధ్యకాలికంగా చిన్నా, చితకా మెడికల్ హాల్స్‌కు కూడా ఆర్ఐఎల్ అగ్రిగేటర్‌గా వ్యవహరించే అవకాశం ఉందని తెలిపింది. 670 పట్టణాల్లో నెట్‌మెడ్స్.. నెట్‌మెడ్స్ దేశీయంగా ప్రిస్క్రిప్షన్, ఓటీసీ (ఓవర్ ది కౌంటర్), ఆరోగ్యం, వెల్నెస్ ఉత్పత్తులను ఆన్లైన్ ఫార్మసీ ద్వారా అందిస్తోంది. ఫార్మా రిటైలింగ్, తయారీలో సుదీర్ఘానుభవం ఉన్న ప్రమోటర్లు దీన్ని ఏర్పాటు చేశారు. 2018 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయాలు 1 మిలియన్ డాలర్లకు పైగా నమోదైనట్లు ఆర్ఐఎల్ తెలిపింది. నెట్‌మెడ్స్ ప్రస్తుతం 670 నగరాలు, పట్టణాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 70,000 పైచిలుకు ప్రిస్క్రిప్షన్, లైఫ్‌స్టయిల్ ఔషధాలు .. వెల్నెస్, ఆరోగ్యం, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించి వేల కొద్దీ సంఖ్యలో నాన్–ప్రిస్క్రిప్షన్ ఉత్పత్తులను అందిస్తోంది. యాప్ ద్వారా డాక్టర్ కన్సల్టేషన్ సేవలు కూడా అందిస్తోంది. -
రిలయన్స్ : "నెట్‌మెడ్స్" డీల్
సాక్షి, ముంబై: ఒప్పందాల దూకుడును ప్రదర్శిస్తున్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తాజాగా ఆన్లైన్ ఫార్మసీ సంస్థ నెట్‌మెడ్స్ తో మరో డీల్ కుదుర్చుకుంది. 620 కోట్ల రూపాయల విలువైన మేజర్ వాటాను సొంతం చేసుకుంది. తన అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్) వైటాలిక్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 60 శాతం మెజారిటీ ఈక్విటీ వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అలాగే ట్రెసారా హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్‌మెడ్స్ మార్కెట్ ప్లేస్ లిమిటెడ్ దాదా ఫార్మా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా దాని అనుబంధ సంస్థల 100 శాతం ప్రత్యక్ష ఈక్విటీ యాజమాన్యాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అయిన అమెజాన్‌కి ఇకపై రిలయన్స్ ఇండస్ట్రీస్ గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (అంబానీ సంచలన నిర్ణయం) భారతదేశం అంతటా అధిక నాణ్యత, సరసమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సేవల లభ్యతను పెంచడానికి కట్టుబడి ఉన్నామని ఆర్‌ఆర్‌విఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ వెల్లడించారు. ఇంత తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా డిజిటల్ ఫ్రాంచైజీకి నిర్మాణంలో నెట్‌మెడ్స్ కృషి తమను ఆకట్టుకుందని, దీన్ని మరింత వేగవంతం చేస్తామనే నమ్మకంతో ఉన్నామని తెలిపారు. డిజిటల్ వ్యాపారాన్ని మరింత విస్తరించగం. వినియోగదారులకు రోజువారీ కావాల్సిన వాటిని మరింత ఎక్కువగా అందించగలమని ఆమె తెలిపారు. “నెట్‌మెడ్స్” రిలయన్స్ కుటుంబంలో చేరడం, ప్రతి భారతీయుడికి నాణ్యమైన ఆరోగ్య ఉత్పత్తులను అందించే దిశలో కలిసి పనిచేయడం నిజంగా గర్వకారణమని నెట్‌మెడ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రదీప్ దాదా సంతోషం వ్యక్తం చేశారు. ప్రదీప్ దాదా స్థాపించిన నెట్‌మెడ్స్ (వైటాలిక్ అనుబంధ సంస్థలు ‘నెట్‌మెడ్స్’ అని పిలుస్తారు)ఇ-ఫార్మా పోర్టల్. వెబ్సైట్, యాప్ ద్వారా ఫార్మా ఉత్పత్తులను డెలివరీ చేస్తుంది. కాగా గత వారం అమెజాన్ ఇండియా బెంగళూరులో ఈ-ఫార్మసీ సర్వీసులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోటీలో రిలయన్స్ కూడా చేరడం విశేషం. -
రిలయన్స్ చేతికి నెట్‌మెడ్స్
దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఆన్లైన్ ఫార్మసీ సంస్థ నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. రూ. 620 కోట్లు వెచ్చించడం ద్వారా నెట్‌మెడ్స్‌లో 60 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ఆర్ఐఎల్ తాజాగా వెల్లడించింది. దీంతో డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో.. ఈకామర్స్ రంగంలో ఔషధ విభాగంలోకి సైతం ప్రవేశించేందుకు వీలు కలిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే జియోమార్ట్ పేరుతో ఆన్లైన్ గ్రాసరీ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆర్ఐఎల్ డీల్ ప్రకారం నెట్‌మెడ్స్ విలువను రూ. 1,000 కోట్లుగా విశ్లేషకులు అంచనా వేశారు. గత వారమే ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. బెంగళూరులో ఆన్లైన్ ఫార్మసీ విక్రయాలు ప్రారంభించింది. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఆర్ఐఎల్ నెట్‌మెడ్స్ కొనుగోలుతో పోటీ వేడెక్కనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా నెట్‌మెడ్స్, ఫార్మ్ఈజీ, మెడ్‌లైఫ్ తదితర పలు కంపెనీలు ఆన్లైన్ ద్వారా ఔషధ విక్రయాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. నెట్‌మెడ్స్ కథ.. ప్రదీప్ దాధా ఏర్పాటు చేసిన నెట్‌మెడ్స్ ఆన్లైన్ ద్వారా ఔషధాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను విక్రయిస్తోంది. వెబ్సైట్, యాప్‌ల ద్వారా వినియోగదారులకు పిల్లల సంరక్షణ ఉత్పత్తులతోపాటు.. డాక్టర్ల ఆపాయింట్మెంట్ సేవలను సైతం సమకూర్చుతోంది. ఏడాది కాలంగా సరైన ధర లభిస్తే వ్యాపారాన్ని విక్రయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. నెట్‌మెడ్స్‌లో ఇప్పటికే సింగపూర్ సంస్థ డాన్ పెన్ కాంబోడియా గ్రూప్, సిస్టెమా ఏషియా ఫండ్, ఆర్బిమెండ్ తదితరాలు ఇన్వెస్ట్ చేశాయి. -
రిలయన్స్ కార్ట్‌లో నెట్‌మెడ్స్!
బెంగళూరు: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార విస్తరణ ప్రణాళికలు మరింత జోరందుకున్నాయి. ఇటీవలే జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాలను ప్రీమియం రేటుకు విక్రయించిన రిలయన్స్ ఈసారి ఆన్లైన్ ఫార్మా సేవల సంస్థ నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాల కొనుగోలుపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు 150 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,150 కోట్లు) ఉండవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చివరి విడత నిధుల సమీకరణ సమయంలో నెట్‌మెడ్స్‌కి లభించిన వేల్యుయేషన్ కన్నా కాస్త ప్రీమియం రేటు చెల్లించవచ్చని పేర్కొన్నాయి. దీంతో పాటు కార్యకలాపాల విస్తరణకు మరిన్ని నిధులు కూడా సమకూర్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి. అనుబంధ సంస్థ ద్వారా రిలయన్స్ ఈ డీల్ పూర్తి చేయొచ్చని వివరించాయి. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడానికి ముందు నుంచే రిలయన్స్, నెట్‌మెడ్స్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు రిలయన్స్, నెట్‌మెడ్ వర్గాలు నిరాకరించాయి. కొత్త వ్యాపార అవకాశాల మదింపు నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, మార్కెట్ ఊహాగానాలపై వ్యాఖ్యానించలేమని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై వ్యాఖ్యానించలేమని నెట్‌మెడ్స్ వ్యవస్థాపకుడు ప్రదీప్ దాధా పేర్కొన్నారు. కస్టమర్లకు నిత్యావసరాలు మొదలైన వాటి సరఫరా కోసం మాత్రమే ప్రస్తుతం రిలయన్స్ రిటైల్‌తో జట్టు కట్టినట్లు వివరించారు. జోరుగా విస్తరణ .. ఆన్లైన్–టు–ఆఫ్‌లైన్ (ఓ2ఓ) వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నెట్‌మెడ్స్‌తో డీల్ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యాపారాల విస్తరణలో భాగంగా ఇటీవలే రిలయన్స్ రిటైల్, వాట్సాప్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. రిలయన్స్ టెలికం, డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాట్సాప్ మాతృసంస్థ ఫేస్బుక్ 9.99 శాతం వాటాలను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 5.7 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. ఇక కంపెనీల కొనుగోళ్లపైనా రిలయన్స్ భారీగానే వెచ్చిస్తోంది. కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం 2017 నుంచి ప్రధానంగా జియో, రిలయన్స్ రిటైల్ వ్యాపార విభాగాల విస్తరణకు దాదాపు 3 బిలియన్ డాలర్ల దాకా వెచ్చించింది. సావన్, ఎంబైబ్, ఫైండ్, గ్రాబ్, హ్యాప్టిక్, రెవరీ, నౌఫ్లోట్స్ వంటి సంస్థలను కొనుగోలు చేసింది. ఫార్మాలో రిలయన్స్‌కు రెండో డీల్.. నెట్‌మెడ్స్‌ను కొనుగోలు చేస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి.. ఫార్మా రంగంలో ఇది రెండో డీల్ కానుంది. గతేడాదే బెంగళూరుకు చెందిన సి–స్క్వేర్ ఇన్ఫో సొల్యూషన్స్‌లో రిలయన్స్ 82% వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 82 కోట్లు వెచ్చించింది. ఫార్మా రంగంలోని డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లు, సేల్స్ సిబ్బందికి అవసరమైన సాఫ్ట్వేర్ ను ఈ సంస్థ రూపొంది స్తుంది. అపోలో ఫార్మసీ, యాడ్‌కాక్ ఇన్‌గ్రామ్ వంటి కంపెనీలు దీనికి క్లయింట్లు. నెట్‌మెడ్స్ కథ ఇదీ.. ప్రదీప్ దాధా 2015లో నెట్‌మెడ్స్‌ను ప్రారంభించారు. ఆయన కుటుంబం.. సన్ ఫార్మాస్యూటికల్స్ ఔషధాలను తొలినాళ్లలో పంపిణీ చేసేది. ఆ తర్వాత ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని సన్ ఫార్మా కొనుగోలు చేసింది. నెట్‌మెడ్స్ ఇప్పటిదాకా మూడు విడతల్లో 100 మిలియన్ డాలర్ల దాకా నిధులు సమీకరించింది. దాధాల ఫ్యామిలీ ఆఫీస్‌తో పాటు హెల్త్‌కేర్ రంగ ఇన్వెస్టరు ఆర్బిమెడ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎంఏపీఈ అడ్వైజరీ, సిస్టెమా ఆసియా ఫండ్, సింగపూర్‌కి చెందిన దౌన్ పెన్ కంబోడియా గ్రూప్ మొదలైనవి నెట్మెడ్లో ఇన్వెస్టర్లు. కొత్తగా మరో 12 గిడ్డంగుల ఏర్పాటు ద్వారా మొత్తం వేర్‌హౌస్‌లను 26కి పెంచుకోనున్నట్లు నెట్‌మెడ్స్ గతేడాది ప్రకటించింది. కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ నివేదిక ప్రకారం ప్రస్తుతం నెట్‌మెడ్స్ .. నెలవారీ లావాదేవీల యూజర్ల సంఖ్య సుమారు ఆరు లక్షలుగా ఉంది. కంపెనీ ఆదాయాల్లో దాదాపు 90 శాతం వాటా .. ప్రిస్క్రిప్షన్ ఔషధాలు, ఓవర్ ది కౌంటర్ ఔషధాల విక్రయాలదే ఉంటోంది. ఈ రంగంలో 1ఎంజీ, మెడ్‌లైఫ్, ఫార్మ్ఈజీ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీవ్ర అనారోగ్యాలతో తరచూ ఔషధాలు తప్పనిసరిగా కొనుగోలు చేసే వర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఈ–ఫార్మా @ 6 బిలియన్ డాలర్లు కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ నివేదిక ప్రకారం ఈ–ఫార్మా పరిశ్రమ (కన్సల్టెన్సీ, డయాగ్నాస్టిక్స్ కూడా కలిపి) ప్రస్తుతం 1.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. వచ్చే అయిదేళ్లలో ఇది 16 బిలియన్ డాలర్ల దాకా చేరొచ్చని అంచనా. ఇప్పటికే దాదాపు నలభై లక్షల పైగా కుటుంబాలు ఆన్లైన్లో ఔషధాలను కొనుగోలు చేస్తున్నాయి. సాధారణంగా ఈ–ఫార్మా ప్లాట్‌ఫామ్ లపై సగటు కొనుగోలు లావాదేవీ విలువ రూ.1,400–1,700 స్థాయి లో ఉంటోంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తితో లబ్ది పొందిన అతి కొద్ది రంగాల్లో ఈ–ఫార్మా పరిశ్రమ కూడా ఒకటి. -
హైదరాబాద్‌లో నెట్‌మెడ్స్ కేంద్రం...
మరో ఏడు నగరాల్లో కూడా భారీగా విస్తరిస్తున్న కంపెనీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో ఔషధాలను విక్రయిస్తున్న నెట్‌మెడ్స్ మార్కెట్‌ప్లేస్ హైదరాబాద్‌లో గోదామును ఏర్పాటు చేస్తోంది. ఉత్పత్తులను నిల్వ చేయడంతోపాటు ప్యాకింగ్‌ను ఈ కేంద్రంలో చేపడతారు. భాగ్యనగరంతో పాటు దేశవ్యాప్తంగా మరో ఏడు నగరాల్లో ఈ సెంటర్లు రానున్నాయి. ఆన్లైన్లో ఔషధాల కొనుగోళ్లకు డిమాండ్ పెరగడంతోపాటు తక్కువ సమయంలో కస్టమర్లకు మందుల సరఫరా కోసమే ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు నెట్‌మెడ్స్ ఫౌండర్ ప్రదీప్ దాదా తెలిపారు. 2018 మార్చికల్లా 30 నగరాల్లో ఇటువంటి కేంద్రాలు రానున్నాయని అన్నారు. జీఎస్టీ అమలైతే స్థానిక వర్తకులకూ మందుల సరఫరా చేస్తామని చెప్పారు. ఇటీవలే నెట్‌మెడ్స్ సుమారు రూ.330 కోట్లను ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది. విస్తరణకు ఈ మొత్తాన్ని వెచ్చించనుంది. 20 శాతం దాకా డిస్కౌంట్.. జూలైలో కంపెనీకి 118 నగరాలు, పట్టణాల నుంచి ఆన్లైన్లో ఆర్డర్లు వచ్చాయి. సగటు బిల్లు విలువ రూ.1,650 ఉంది. ఔషధాలపై 20 శాతం దాకా డిస్కౌంట్ ఇవ్వడం కస్టమర్లను ఆకట్టుకుంటోంది.