న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కార్పొరేట్ల కష్టాలను సాధ్యమైనంత వేగంగా, సమర్థవంతమైన రీతిలో పరిష్కరించడం లక్ష్యంగా దివాలా కోడ్ (ఐబీసీ)కు అవసరమైన మరిన్ని సవరణలు తీసుకువస్తున్నట్టు బడ్జెట్ సూచించింది. ముఖ్యంగా విదేశాలకు సంబంధించి కార్పొరేట్ వ్యవహారాల దివాలా పక్రియను సులభతరం లక్ష్యంగా ఈ సవరణలు తీసుకువస్తున్నట్లు బడ్జెట్ పత్రాలు వెల్లడించాయి. ప్రస్తుతం విదేశీ రుణదాతలు భారతదేశంలోని దేశీయ కంపెనీకి వ్యతిరేకంగా దావా వేయవచ్చు.
అయితే, ఇతర దేశాలలో ఏదైనా దివాలా ప్రక్రియను ఐబీసీ ఆటోమేటిక్‌గా తనకుతానుగా గుర్తించదు. విదేశాల్లో రుణ సంక్షోభంలో కంపెనీల ఆస్తులు, అప్పులను క్లెయిమ్ చేయడానికి, డబ్బును తిరిగి పొందేందుకు రుణ దాతలకు వీలు కల్పిస్తూ ఒక ప్రామాణిక ఫ్రేమ్‌వర్క్ అవసరమని సోమవారం నాడు ఆవిష్కరించిన ఆర్థిక సర్వే సూచించిన సంగతి తెలిసిందే. స్వచ్ఛంద లిక్విడేషన్ ప్రక్రియను సరళీకృతం చేయడంతోపాటు ఈ ప్రక్రియ కోసం ఒకే విండోను ఆవిష్కరించాలని కూడా సర్వే సూచించింది.
కంపెనీల దరఖాస్తు నుంచి అన్ని శాఖల ప్రాసెసింగ్ వరకూ లిక్విడేషన్ ప్రక్రియలో అన్ని దశలూ త్వరితగతిన వేగంగా పూర్తయ్యేలా ఒక పోర్టల్‌ను ఆవిష్కరించాలని, దివాలా పక్రియ మరింత వేగవంతానికి ఈ చర్య దోహదపడుతుందని సర్వే సూచించింది. కంపెనీల రుణాలకు సంబంధించి 98 శాతం వరకూ రాయితీలు ఇస్తూ, కంపెనీ ఆఫ్ క్రెడిటార్స్ రిజల్యూషన్ ప్రణాళికల ఆమోదంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా వీడియోకాన్ గ్రూప్‌కు వేదాంతా గ్రూప్ సంస్థ ట్విన్ స్టార్ వేసిన బిడ్డింగ్‌ను కొన్ని వార్గాలు ప్రస్తావిస్తున్నాయి.
(చదవండి: టాటా నెక్సన్ ఈవీకి పోటీగా అదరగొడుతున్న మహీంద్రా ఎలక్ట్రిక్ కారు..!)
Comments
Please login to add a commentAdd a comment