
క్రూ 2015 సదస్సు 5న...
సిటీలోని 200కిపైగా కార్పొరేట్ సంస్థలు, 100కిపైగా కన్సల్టెన్సీలు పాల్గొనే క్రూ 2015 సదస్సు ఈ నెల 15న జరుగనుంది.
సిటీలోని 200కిపైగా కార్పొరేట్ సంస్థలు, 100కిపైగా కన్సల్టెన్సీలు పాల్గొనే క్రూ 2015 సదస్సు ఈ నెల 15న జరుగనుంది. ఈ విషయాన్ని నిర్వాహకులు సోమవారం విలేకరులకు తెలిపారు. ‘చేంజింగ్ రోల్ ఆఫ్ హెచ్‌ఆర్ అండ్ కన్సల్టెంట్స్’ అనే అంశంపై ఈ సదస్సు జరుగుతుందని, సిటీ నుంచి మాత్రమే కాక దేశవ్యాప్తంగా పలు సంస్థలు పాల్గొంటున్న ఈ సదస్సు హైటెక్ సిటీలోని రహేజా మైండ్‌స్పేస్‌లో ఉన్న వెస్టిన్ హోటల్‌లో జరుగుతుందన్నారు. సరైన టాలెంట్‌ను ఎంచుకోవడంలో కార్పొరేట్లకు, సరైన, అంతర్జాతీయ స్థాయి అవకాశాలు అందించడంలో అవరోధాలు ఎదర్కొంటున్న కన్సల్టెంట్లకు మధ్య ఒక చక్కని ఉపయుక్తమైన వారధిగా తమ క్రూ 2015 సదస్సును పేర్కొన్నారు నిర్వాహకులు.