పాట్నా: దేశం ఆర్థిక మందగమనాన్ని ఏమీ ఎదుర్కోవడం లేదన్నారు బీహార్ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్‌కుమార్ మోదీ. తయారీ పడిపోతుందని చూపిస్తూ పన్నులు తగ్గించాలంటూ ప్రభుత్వంపై కంపెనీలు ఒత్తిడి తీసుకొచ్చేందుకు అనసరిస్తున్న ఎత్తుగడలుగా దీన్ని అభివర్ణించారు. తన వాదనకు మద్దతుగా బీహార్‌లో పార్లే జీ బిస్కట్ల డిమాండ్ పెరగడాన్ని ఆయన ప్రస్తావించారు. బిహార్ ఆర్థిక మంత్రిత్వ బాధ్యతలను సుశీల్‌మోదీయే చూస్తున్నారు.
అయినా కంపెనీ బిస్కట్ల డిమాండ్ తగ్గిందని తయారీదారులు చెబుతున్నారంటే... అభివృద్ధి చెందిన రాష్ట్రాలు చౌకగా లభించే పార్లే జీ వంటి అధిక పన్ను రేటున్న వాటికి బదులు ఖరీదైన ప్యాస్ట్రీని ఎంచుకుంటున్నట్టు ఆయన సందేహం వ్యక్తం చేశారు. రాంచిలో ఓ వార్తా చానల్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సుశీల్‌మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ పరిధిలో అధిక పన్నులు చెల్లించాల్సి రావడం వల్ల ధరలు పెరిగాయని, దీంతో డిమాండ్ భారీగా పడిపోయిందంటూ, ఇలా అయితే ఉద్యోగులను ఎద్ద ఎత్తున తొలగించాల్సి రావచ్చని పార్లే ఇటీవలే ప్రకటన చేసింది. ఆటోమొబైల్స్, ఇతర రంగాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని మీడియాలో వస్తున్నదంతా కార్పొరేట్ ప్రపంచం చేస్తున్న లాబీయింగ్‌లో భాగమేనన్నారు మోదీ. ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెంచి పన్ను రేట్లను తగ్గించుకునేందుకునేనని అభివర్ణించారు.
చదవండి : టీవీ ధరలు దిగొస్తాయ్!
Comments
Please login to add a commentAdd a comment