ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ కంపెనీలకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ కంపెనీలకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. జపాన్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రజల ముందు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన శనివారం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో విలేకరులతో మాట్లాడారు. కార్పోరేట్ కంపెనీలతో ఒప్పందాలు.. బ్రిటీష్ పాలన మాదిరిగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.