hostage
-
‘ఇక్కడ రోజుకు వెయ్యిసార్లు చస్తున్నాం.. మమ్మల్ని కాపాడండి’
టెల్అవీవ్: ఇజ్రాయెల్,హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొలిక్కిరావడం ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెల్ యువకుడు ఎడాన్ అలెగ్జాండర్ వీడియోను హమాస్ తాజాగా విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తమ విడుదలకు ప్రయత్నించాలని బందీగా ఉన్న యువకుడు వీడియోలో ఏడుస్తూ మొర పెట్టుకున్నారు. తామంతా ఇక్కడ రోజుకు వెయ్యిసార్లు చస్తున్నామని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా,ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకే హమాస్ మిలిటరీ విభాగం అల్ కస్సామ్ బ్రిగేడ్ ఈ వీడియోను విడుదల చేసినట్లు సమాచారం. Well, atleast he looks healthy an clean. Idan Alexander, held hostage because of Netanyahu #Israel pic.twitter.com/J42O2yGsRg— Steven Markussen (@DALAX) November 30, 2024ఈ వీడియోపై ఎడాన్ తల్లి యేల్ స్పందించారు. తన కుమారుడి వీడియో తనను కలవరపరిచిందని, హమాస్ వద్ద ఉన్న బందీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇది తెలియజేస్తోందన్నారు. ఈ వీడియోపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు కార్యాలయం స్పందించింది. ఇలాంటి హమాస్ వ్యూహాలు ఇజ్రాయెల్ లక్ష్యాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. హమాస్ వద్ద ఉన్న బందీలను కచ్చితంగా తిరిగి తీసుకొస్తామని తెలిపింది. గత ఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని తమతోపాటు పాలస్తీనాలోని గాజాకు తీసుకెళ్లింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 43వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. -
Manipur: కుకీల అరాచకం!.. ఆరుగురి మృతదేహాలు లభ్యం
ఇంఫాల్: కల్లోల మణిపూర్‌లో పరిస్థితి మళ్లీ అదుపు తప్పుతోంది. జాతుల ఘర్షణతో గతేడాది అట్టుడికిపోయిన ఆ రాష్ట్రంలో మరోసారి హింస పెచ్చరిల్లుతోంది. ఈ క్రమంలో జిరిబామ్‌లో సోమవారం కుకీ ఉగ్రవాదులు మైతీ వర్గానికి ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన విషయం విదితమే. కిడ్నాప్‌కు గురైన ఆరుగురి మృతదేహాలను పోలీసులు తాజాగా గుర్తించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. బందీలుగా చేసిన అయిదు రోజులకు మృతదేహాలను గుర్తించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం సిల్చార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.ముందుగా శుక్రవారం సాయంత్రం అస్సాం-మణిపూర్ సరిహద్దులోని జిరి నదిలో తేలుతూ ముగ్గురు మహిళల మృతుదేహాలు లభ్యమవ్వగా.. నేడు మరో ముగ్గురి మృతదేహాలు దొరికాయి. మృతదేహాలు కొంత కుళ్లిపోవడంతో ఉబ్బిపోయాయని, అందరూ మైతీ వర్గానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు.కాగా జిరిబామ్ జిల్లాలోని బోకోబెరాలో కుకీ ఉగ్రవాదులు సోమవారం (నవంబర్ 11న) భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బోకోబెరా పోలీస్ స్టేషన్, దానికి దగ్గరలోని సిఆర్పిఎఫ్ పోస్ట్‌పై సాయుధ కుకీలు హింసాత్మక దాడికి పాల్పడ్డారు. ఈ ఎన్కౌంటర్లో అనుమానిత కుకీ ఉగ్రవాదుల్లో పది మందిని పోలీసులు కాల్చిచంపారు. ఆ దాడి తర్వాత ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదు. వీరిని కుకీలు కిడ్నాప్ చేశారు. -
బంధించి, 6 నెలలకుపైగా రేప్
కాన్పూర్(యూపీ): విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కామపిశాచులుగా మారి టీనేజ్ విద్యార్థినితో అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. 2022 డిసెంబర్ చివర్లో జరిగిన ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైద్యవిద్యా కోర్సులో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న 17 ఏళ్ల బాలికను ఇద్దరు టీచర్లు బంధించి ఆరునెలలకుపైగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు యూపీలో చర్చనీయాంశమైంది. కేసు వివరాలను కళ్యాణ్పూర్ అసిస్టెంట్ కమిషనర్ అభిõÙక్ పాండే శనివారం మీడియాకు వెల్లడించారు. ఫతేపూర్ పట్టణానికి చెందిన ఈ టీనేజీ అమ్మాయి నీట్ కోచింగ్ కోసం కాన్పూర్‌కు వచ్చి హాస్టల్లో ఉంటోంది. ఆమె నీట్ కోచింగ్ తీసుకుంటున్న చోటే సాహిల్ సిద్ధిఖీ జీవశాస్త్రం, వికాస్ పూర్వాల్ రసాయనశాస్త్రం బోధించేవారు. 2023 ఏడాది కొత్త ఏడాది వేడుకలు జరుగుతున్నాయి, విద్యార్థులంతా వస్తున్నారని చెప్పి ఈ టీనేజర్‌ను ఆమె ఫ్రెండ్ ఫ్లాట్‌కు టీచర్లు సాహిల్, వికాస్ రప్పించారు. మక్డీఖేరాలోని ప్లాట్‌కు వచ్చిన అమ్మాయికి టీచర్లుతప్ప విద్యార్థులెవరూ కనిపించలేదు. మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగడంతో స్పృహకోల్పోయిన టీనేజర్‌ను సాహిల్ తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి ఆరునెలలకుపైగా బంధించాడు. పలుమార్లు రేప్‌చేశాడు. తర్వాత వికాస్ సైతం అదే దారుణానికి పాల్పడ్డాడు. ఆరునెలల తర్వాత కాన్పూర్‌కు వచ్చిన తల్లి ఆ టీనేజర్‌ను తీసుకెళ్లింది. అయితే అత్యాచారాన్ని వీడియోలు తీసి బెదిరించడంతో కుటుంబపరువు పోతుందన్న భయంతో టీనేజర్ తనకు జరిగిన దారుణాన్ని బయటకు చెప్పలేదు. అయితే రెండు నెలల క్రితం మరో విద్యారి్థని పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో టీచర్ సాహిల్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇటీవల అతను బెయిల్‌పై బయటికొచ్చాడు. అయితే ఆ మరో విద్యారి్థనిని సాహిల్ లైంగికంగా వేధించిన వీడియో తాజాగా బయటకురావడంతో ధైర్యం తెచ్చుకున్న టీనేజర్ ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోక్సోసహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేసి సాహిల్, వికాస్‌లను అరెస్ట్‌చేశారు. -
న్యూజిలాండ్ పైలట్‌కు 19 నెలల తర్వాత విముక్తి
జకార్తా: న్యూజిలాండ్ పైలట్‌ను ఏడాదిన్నర క్రితం నిర్బంధంలోకి తీసుకున్న ఇండోనేసియాలోని పపువా ప్రాంత వేర్పాటువాద గ్రూపు శనివారం విడిచిపెట్టింది. క్రైస్ట్‌చర్చ్ వాసి ఫిలిప్ మార్క్ మెహర్టెన్స్(38) ఇండోనేసియాకు చెందిన సుశి ఎయిర్ విమానయాన సంస్థలో పైలట్‌గా ఉన్నారు. మారుమూల పపువా ప్రాంతంలోని విమానాశ్రయంలో ఉన్న ఫిలిప్‌ను రెబల్స్ 2023 ఫిబ్రవరి 7వ తేదీన నిర్బంధంలోకి తీసుకున్నారు. 2023 ఏప్రిల్‌లో మెహర్టెన్స్ను విడిపించేందుకు ప్రయతి్నంచిన ఇండోనేసియా సైనికులు ఆరుగురిని రెబల్స్ చంపేశారు. దీంతో, అప్పటి నుంచి చర్చి మధ్యవర్తిత్వంతో ఇండోనేసియా ప్రభుత్వం, ఇతర విభాగాలు రెబల్స్‌తో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఎట్టకేలకు చర్చలు సఫలమై మెహర్టెన్స్ బయటకు రాగలిగారు. ఇది చాలా క్లిష్టమైన వ్యవహారమంటూ ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సైతం వ్యాఖ్యానించడం గమనార్హం. మెహర్టెన్స్ విడుదలకు సంబంధించిన వివరాలను ఎవరూ బహిర్గతం చేయలేదు. రెబల్స్ చెర నుంచి విముక్తి లభించిన అనంతరం మెహర్టెన్స్ పపువాలోని తిమికా నుంచి జకార్తాకు చేరుకున్నారు. అతడి కుటుంబం బాలిలో ఉంటోంది. ఇండోనేసియా సంస్కృతి, జాతిపరంగా పపువా ప్రజలు విభిన్నంగా ఉంటారు. న్యూ గినియాలోని పశ్చిమ భాగమైన పపువా గతంలో డచ్ పాలకుల చేతుల్లో ఉండేది. 1969లో ఐరాస సారథ్యంలో పపువాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ఇండోనేసియా కలిపేసుకుంది. ఇదంతా బూటకమంటున్న వేర్పాటువాదులు స్వతంత్రం కోసం సాయుధ పోరాటం సాగిస్తున్నారు. గతేడాది నుంచి ఈ పోరాటం తీవ్రరూపం దాలి్చంది. -
రష్యా జైలులో ‘ఐసిస్’ కలకలం
మాస్కో: రష్యాలోని ఓ డిటెన్షన్ సెంటర్లో కొంతమంది విచారణ ఖైదీలు సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం సంచలనం రేపింది. ఈ షాకింగ్ ఘటనతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జైలు సిబ్బందిని నిర్బంధించిన ఖైదీల్లో కొందరిని అంతమొందించారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రోస్తోవ్-ఆన్-డాన్ నగరంలో ఉన్న ప్రీ-ట్రయల్ డిటెన్షన్ సెంటర్లో ఆరుగురు ఖైదీలు ఇద్దరు జైలు గార్డులను బందీలుగా పట్టుకున్నారు. ఆ ఖైదీలకు ఉగ్రవాదసంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు(ఐసిస్)తో సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. వారి వద్ద మారణాయుధాలున్నట్లు అధికారులు తెలిపారు.ఖైదీల బారి నుంచి ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, వారికి ఎలాంటి గాయాలు కాలేదని రష్యా మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఎంతమంది ఖైదీలు మృతి చెందారనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఈ ఏడాది మార్చిలో మాస్కోలోని ఓ మ్యూజిక్ కన్సర్ట్ హాల్‌పై ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. -
హమాస్ చెరలో బందీలుగా.. నలుగురిని కాపాడిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ -హమాస్ ఒప్పందం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హమాస్ చెరలో బందీలుగా ఉన్న నలుగురు పౌరులను ఇజ్రాయెల్ సైన్యం సురక్షితంగా కాపాడింది. నుసిరత్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి..వారిని రక్షించినట్లు తెలిపింది.గత ఏడాది అక్టోబరులో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే దాదాపు 250 మందిని కిడ్నాప్ చేసి గాజాకు తరలించారు. నవంబర్‌లో కాల్పుల విరమణ సమయంలో దాదాపు సగం మంది విడుదలయ్యారు. ఇంకా 130 మందికిపైగా బందీలుగా ఉన్నారని తెలుస్తోంది.తాజాగా ఇజ్రాయెల్ సైన్యం హమాస్ చెరలో బంధీలుగా ఉన్న నోవా అర్గమణి, అల్మోగ్ మీర్ జాన్, ఆండ్రీ కోజ్లోవ్, ష్లోమి జివ్‌లను రక్షించింది. గతేడాది అక్టోబరు 7న హమాస్ దాడి కారణంగా గాజాలో ఎనిమిది నెలల పాటు జరిగిన విధ్వంసకర యుద్ధం తర్వాత, హమాస్ ఉగ్రవాదులు అపహరించిన దాదాపు 250 మంది బందీలలో 116 మంది పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లో మిగిలిపోయారు. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం వీరిలో కనీసం 40 మంది మరణించినట్లు సమాచారం. -
ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
అల్జీర్స్: టీనేజీ వయసులో పాఠశాలకు వెళ్తుండగా మార్గమధ్యంలో అపహరణకు గురై ఏకంగా 26 సంవత్సరాలపాటు బందీగా ఉండిపోయిన అల్జీరియన్ వ్యక్తి వేదన ఇది. అల్జీరియా దేశంలోని డిజేఫ్లా రాష్ట్రంలో ఇటీవల కిడ్నాపర్ చెర నుంచి విముక్తుడైన 45 ఏళ్ల ఒమర్ బిన్ ఒమ్రాన్ గాథను స్థానిక అల్జీరియన్ ఎల్ఖబర్ వార్తాసంస్థ వెలుగులోకి తెచి్చంది. గడ్డితో నిండిన సెల్లార్లో ఏళ్ల తరబడి.. ఒమర్‌కు 19 ఏళ్ల వయసు ఉన్నపుడు అంటే 1998 సంవత్సరంలో ఒకరోజు ఉదయం వృత్తివిద్యా పాఠశాలకు ఒమర్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంతదూరం వెళ్లగానే కిడ్నాప్‌కు గురయ్యాడు. కిడ్నాప్‌చేసిన వ్యక్తి ఒమర్‌ను ఒక గడ్డితో కప్పిన నేలమాళిగలో దాచిపెట్టాడు. ఎందుకు కిడ్నాప్ చేశాడో, ఎందుకు ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంచాడో ఎవరికీ తెలీదు. తోబుట్టువు పోస్ట్‌తో వెలుగులోకి కిడ్నాపర్‌కు ఒక తోబుట్టువు ఉన్నారు. ఆ వ్యక్తి ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఒక విషయం రాసుకొచ్చారు. ఊరిలో ఒక‡ కిడ్నాప్ ఉదంతంలో తన పాత్ర కూడా ఉందని ఒక పోస్ట్‌చేశారు. ఈ పోస్ట్‌ను ఒమర్ కుటుంబం గమనించి వెంటనే దర్యాప్తు సంస్థకు సమాచారం ఇచ్చారు. దీంతో నేషనల్ జెండర్మెరీన్( దేశ దర్యాప్తు సంస్థ) పాత కేసును తిరగతోడింది. పోస్ట్ పెట్టిన వ్యక్తిని విచారించి కిడ్నాపర్ ఇంటిని కనిపెట్టారు. అధికారులు ఆదివారం కిడ్నాపర్ ఇంటిపై మెరుపుదాడి చేసి ఇళ్లంతా వెతికారు. చివరకు గడ్డితో ఉన్న రహస్య సెల్లార్లో ఒమర్‌ను కనుగొన్నారు. 61 ఏళ్ల కిడ్నాపర్ పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాపర్ ఇల్లు.. ఒమర్ సొంత ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ సెల్లార్ ఒక గొర్రెల కొట్టం కింద ఉన్నట్లు తెలుస్తోంది. కిటికీలోంచి చూసేవాడిని: ఒమర్ ‘‘కిడ్నాప్‌కు గురయ్యాక ఈ సెల్లార్లోనే ఉండిపోయా. నా కుటుంబసభ్యులు అటుగా వెళ్లేటపుడు సెల్లార్ కిటికీ నుంచి చూసేవాడిని. అరిచి పిలుద్దామని వందలసార్లు అనుకున్నా. కానీ పక్కనే కిడ్నాపర్ ఉండేవాడు. భయంతో నోరు మెదపలేదు’’ అని విడుదలయ్యాక ఒమర్ చెప్పారు. -
మానవ అక్రమ రవాణా ముఠా అరెస్ట్.. 11 మంది భారతీయులకు విముక్తి!
నేపాల్ పోలీసులు మానవ అక్రమ రవాణా రాకెట్‌ను ఛేదించారు. ఈ ఉదంతంలో 11 మంది భారతీయులను రక్షించడంతో పాటు ఎనిమిది మంది భారతీయ మాఫియా ముఠా సభ్యులను, వారి నేపాలీ సహచరులను అరెస్టు చేశారు. ఈ ముఠా 11 మంది భారతీయ పౌరులను అమెరికాకు పంపుతామని చెబుతూ, రెండు వారాలకు పైగా బందీలుగా ఉంచినట్లు సమాచారం. ఈ ఉదంతం బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ‘డాంకీ’ చిత్రాన్ని పోలివుండడంతో నేపాల్ పోలీసులు దీనికి 'ఆపరేషన్ డాంకీ' అనే పేరు పెట్టారు. మాఫియా నుంచి రక్షణ పొందినవారు, ఇటు వారిని ఉచ్చులో బిగించినవారు భారత్‌లోని పంజాబ్, హరియాణాలకు చెందినవారు. ఖాట్మండు జిల్లా పోలీసు రేంజ్ బృందం ఫిబ్రవరి 14 రాత్రి నుండి ఈ ఆపరేషన్ ప్రారంభించింది. తెల్లవారుజాము వరకు దాడులు కొనసాగించింది. పక్కా సమాచారం మేరకు రాటోపుల్లోని ధోబిఖోలా కారిడార్‌లోని ఒక నేపాలీ పౌరుని నివాసంపై దాడి చేసి, 11 మంది భారతీయ పౌరులను రక్షించారు. వీరిని మెక్సికో మీదుగా అమెరికాకు పంపుతామని నమ్మించి బందీలను చేశారు. ఈ మానవ అక్రమ రావాణా ముఠా ముఖ్యంగా విద్యార్థులను అమెరికాకు పంపుతామని తప్పుడు హామీలిచ్చిందని జిల్లా పోలీసు చీఫ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భూపేంద్ర బహదూర్ ఖత్రి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ముఠా సభ్యులు తాము వల వేసినవారిని ఖాట్మండుకు తీసుకు వచ్చినప్పుడు వీసా రుసుముగా ఒక్కొక్కరి నుండి రూ.45 లక్షలతో పాటు అదనంగా మరో మూడు వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. నిందితులపై నేపాలీ చట్టం ప్రకారం కిడ్నాప్, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితుల్లో ఒకరు మాట్లాడుతూ.. ఆ ఏజెంట్లు తమను బందీలను చేసి, రెండు వారాలకు పైగా అద్దె ఇంట్లో ఉంచినట్లు తెలిపారు. తమను మానసికంగా, శారీరకంగా హింసించి బెదిరించారన్నారు. వారు తమకు ఇచ్చిన వీసాలు, బోర్డింగ్ పాస్‌లతో సహా అన్ని పత్రాలు నకిలీవేనని పేర్కొన్నారు. కాగా నిందితుల నుంచి పోలీసులు నకిలీ రబ్బరు స్టాంపులు, ఇతర నకిలీ పత్రాలతో పాటు బాధితుల పాస్‌పోర్ట్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. -
బందీల కాల్చివేత.. సమర్థించుకున్న ఇజ్రాయెల్ ఆర్మీ
టెల్ అవీవ్: బందీల కాల్చివేత ఘటనలో సైనికులు తమ అవగాహన మేరకు సరైన పనిచేశారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ కాల్పుల్లో ఎలాంటి దురద్దేశం లేదని స్పష్టం చేసింది. కాల్పుల్లో సైనిక విధానాలకు కట్టుబడి ఉండటం తప్పనిసరని అన్నారు. ముప్పు లేని సందర్భాల్లో శత్రువుపై సందిగ్దత నెలకొన్నప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరమని ఆర్మీ చీఫ్ జనరల్ హెర్జి హలేవి తెలిపారు. బందీల కాల్పుల ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం నివేదికను వెల్లడించింది. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను ఉగ్రవాదులుగా భావించి డిసెంబర్ 15న ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) కాల్చి చంపింది. షజయాలో జరుగుతున్న దాడుల్లో పొరపాటున ముగ్గురు బందీలు సహాయం కోసం అరిచారు. కానీ అది హమాస్ కుట్రగా భావించిన ఇజ్రాయెల్ సేనలు వారిపై కాల్పులు జరిపారు. దీంతో బందీలు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. మరోమారు ఈ తప్పిదం జరగకుండా జాగ్రత్త పడతామని తెలిపింది. బందీలను రక్షించడంలో విఫలమయ్యామని పేర్కొంది. అటు.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా విచారం వ్యక్తం చేశారు. బందీల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. దాదాపు 240 మంది ఇజ్రాయెల్‌కు చెందిన వ్యక్తులను హమాస్ బందించింది. నాటి నుంచి ఇరువైపుల నుంచి యుద్ధం భీకరంగా నడుస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో నష్టం జరిగింది. హమాస్‌ను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1200 మంది బలయ్యారు. అటు.. హమాస్ వైపు 20,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: Donald Trump: ప్చ్.. మరో బ్రేక్: ట్రంప్‌కి మూసుకుపోతున్న దారులు -
హమాస్ చెరలో తొమ్మిది నెలల చిన్నారి.. విడుదలయ్యేనా?
బోసినవ్వులు ఒలకబోస్తూ, ఎర్రటి జుట్టుతో ఇట్టే ఆకట్టుకుంటున్న ఒక బాలుని ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బాలుడు తన తల్లిదండ్రులు, నాలుగేళ్ల సోదరునితో కలసి దక్షిణ ఇజ్రాయెల్‌లోని కిబ్బత్జ్‌లో ఉండేవాడు. అక్టోబర్ 7న ఈ బాలునితో పాటు అతని సోదరుడు, తల్లి షిరి, తండ్రి యార్డెన్లను హమాస్ కిడ్నాప్ చేసి, తమతో పాటు తీసుకెళ్లడంతో వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. గాజాలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న సుమారు 240 మంది ఇజ్రాయెల్ పౌరుల్లో 32 మంది చిన్నారులు కూడా ఉన్నారు. వారిలో, తొమ్మిది నెలల కేఫిర్ అతిచిన్నవాడు. నెల రోజులుగా ఈ కుటుంబం ఆచూకీపై ఎలాంటి సమాచారం లేదు. ఇంతలో కేఫీర్ను విడుదల చేసే అవకాశం ఉందని ఆ బాలుని తాత ఆశాభావం వ్యక్తం చేశారు. బాలుని తాత 66 ఏళ్ల ఎలీ బిబాస్ తజాపిట్ ప్రెస్ సర్వీస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుమారుడు, కోడలు, ఇద్దరు మనవళ్లను హమాస్ కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. కాగా ఎలీ తన కుమారుని ఇంటికి సమీపంలోనే ఉంటున్నారు. గాజాలో వైమానిక దాడులు ప్రారంభమైనప్పుడు తన కుమారుడు సురక్షితంగా ఉన్నట్లు తనకు సందేశం పంపాడని ఎలీ తెలిపారు. ఆ తరువాత హమాస్ ఉగ్రవాదులు తన కొడుకు కుటుంబాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఎలీ పేర్కొన్నారు. అయితే ఆ తరువాత నుంచి తన కుమారుని కుటుంబం ఎలా ఉందో తెలియడం లేదని ఎలీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: పాలస్తీనియన్లకు ఫ్రాన్స్ న్యాయవాది భరోసా! This beautiful baby boy Kfir Bibas was just nine months old when he was ripped from his home and kidnapped by Hamas terrorists. He is now 10 months old and still being held hostage in Gaza. Pray for the return of Kfir, his big brother Ariel, his mother Shiri and father… pic.twitter.com/lyqehDslOG — Israel ישראל 🇮🇱 (@Israel) November 12, 2023 -
బంధించారు.. కర్రలతో కొట్టారు.. నరకం కనిపించింది!
టెల్ అవీవ్: 17 రోజులుగా తమ చెరలో ఉన్న యోచెవ్డ్ లిఫ్షిట్జ్(85), నురిట్ కూపర్(79) అనే ఇద్దరు మహిళలను హమాస్ మిలిటెంట్లు సోమవారం విడుదల చేశారు. మానవతా దృక్పథంతోపాటు వృద్ధాప్యంలో ఉన్న వారిద్దరి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విడుదల చేసినట్లు తెలిపారు. స్నేహితులైన వారిద్దరూ ఇజ్రాయెల్–గాజా సరిహద్దు లోని కిబుట్జ్ నిర్ ఓజ్ నివాసితులు. మంగళవారం టెల్ అవీవ్‌కు చేరుకున్నారు. మిలిటెంట్ల అధీనంలో తనకు ఎదురైన అనుభవాలను యోచెవెడ్ లిఫ్షిట్జ్ మీడియాతో పంచుకున్నారు. ‘ఈ నెల 7న మిలిటెంట్లు నన్ను బంధించారు. మోటార్‌బైక్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. ప్రతిఘటించినందుకు కర్రలతో కొట్టారు. రోదించినా పట్టించుకోలేదు. గాజాకు బలవంతంగా తరలించారు. ఒక సొరంగంలోకి తీసుకెళ్లారు. భూగర్భంలో సాలెగూళ్లలాంటి సొరంగాలు ఉన్నాయి. మేము వెళ్లేసరికి డాక్టర్లు, వైద్య సిబ్బంది అక్కడున్నారు. తాము ఖురాన్‌ను విశ్వసిస్తామని, ఎలాంటి హాని కలిగించబోమంటూ మిలిటెంట్లు మాతో చెప్పారు. డాక్టర్లు మాకు వైద్య సేవలు అందించారు. కావాల్సిన ఔషధాలు ఇచ్చారు. సొరంగాలు తడిగా, తేమగా ఉన్నాయి. అక్కడ పారిశుధ్య సౌకర్యాలు ఫరవాలేదు. మాకు ఎలాంటి అస్వస్థత కలగలేదు. పరుపులపై నిద్రించాం. మిలిటెంట్లు మొదట్లో గాజాకు తీసుకెళ్లేటప్పుడు హింసించినా అక్కడికి వెళ్లిన తర్వాత మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఇజ్రాయెల్–గాజా సరిహద్దులో నిర్మించిన రక్షణ కంచె గురించి చెప్పాలి. లక్షల డాలర్లు ఖర్చుచేసి ఇజ్రాయెల్ సైన్యం ఈ నిర్మించిన ఈ కంచెతో ఉపయోగం శూన్యం. దేశానికి అది ఏమాత్రం రక్షణ క ల్పించడం లేదు. అత్యంత ఖరీదైన ఈ ఫెన్సింగ్‌ను మిలిటెంట్లు సులభంగా ధ్వంసం చేసి వచ్చి, మమ్మల్ని అపహరించారు. హమాస్ నుంచి ఎదురవుతున్న ముప్పును ఇజ్రాయెల్ సీరియస్‌గా తీసుకోవడం లేదు’ అని లిఫ్షిట్జ్ఆక్షేపించారు. లిఫ్షిట్జ్, నురిట్ కూపర్ భర్తలు ఇంకా హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు. -
హమాస్ చెర నుంచి మరో ఇద్దరు బందీల విడుదల!
ఇజ్రాయెల్: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మరో ఇద్దరు బందీలను విడుదల చేసింది. వారిద్దరూ ఇజ్రాయెల్‌కు చెందిన వృద్ధ మహిళలు. ఈజిప్ట్-ఖతార్ మధ్యవర్తిత్వం తర్వాత మానవతా దృష్టితో ఆ ఇద్దరు బందీలను విడుదల చేసినట్లు ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అంతకుముందు శుక్రవారం హమాస్ ఇద్దరు అమెరికన్ బందీలను విడుదల చేసింది. వారు తల్లీకూతుళ్లు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి, వందలాది మందిని బందీలుగా పట్టుకుంది. ప్రస్తుతం హమాస్ అదుపులో 222 మంది బందీలుగా ఉన్నారని సమాచారం. గత కొన్ని రోజులుగా గాజా స్ట్రిప్‌ను సీజ్ చేస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గ్రౌండ్ యాక్షన్ విరమించడం లేదు. కాగా హమాస్ చెర నుండి బందీలను విడిపించేందుకు, వారితో చర్చలు జరిపేందుకు గ్రౌండ్ యాక్షన్ కొంతకాలం విరమించాలని అమెరికా సూచించింది. ఈ చర్య గాజాకు మానవతా సహాయం అందించే అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొంది. అలాగే బాధితులకు తక్షణ వైద్య సహాయం అందేలా చూసేందుకు ఇజ్రాయెల్‌తో మాట్లాడుతున్నట్లు అమెరికా తెలిపింది. హమాస్ ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు ఇజ్రాయెల్‌ను బలోపేతం చేయడమే అమెరికా ప్రథమ ప్రాధాన్యత అని వైట్‌హౌస్ అధికారి జాన్ కిర్బీ తెలిపారు. గాజా ప్రజలకు మానవతా సహాయం అందేలా చూడటం కూడా దీని లక్ష్యమన్నారు. గాజాను విడిచి వెళ్లాలనుకునే అమెరికన్ పౌరులతో సహా గాజా నుండి అమాయక ప్రజలను సురక్షితంగా తరలించాలనుకుంటున్నామని ఆయన అన్నారు. హమాస్- ఇరాన్ మధ్య సంబంధాల గురించి జాన్ కిర్బీ మాట్లాడుతూ ఈ దాడుల్లో ఇరాన్ భాగస్వామి అని తమకు తెలుసని, ఇరాన్ కొన్ని దశాబ్దాలుగా హమాస్‌కు మద్దతు ఇస్తోందని, ఇరాన్ లేకుండా హమాస్‌కు ఉనికి లేదని ఆరోపించారు. కాగా ఖతార్‌తో సహా ఇతర మధ్యవర్తుల సాయంతో బందీలను విడుదల చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఖతార్ ప్రయత్నాల కారణంగా హమాస్ ఇటీవల ఇద్దరు అమెరికన్ బందీలను విడుదల చేసింది. ప్రస్తుతం హమాస్ కస్టడీలో 222 మంది పౌరులు బందీలుగా ఉన్నారు. వీరిలో అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇది కూడా చదవండి: ఇరాన్లో మహిళా జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు -
'ఇక్కడి నుంచి తీసుకెళ్లండి..' హమాస్ బందీలో యువతి ఆవేదన
గాజా: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు నడుస్తోంది. పండగవేళ ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన హమాస్ దళాలు 199 మంది ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకున్నారు. అకస్మాత్తుగా హమాస్ దళాలు జరిపిన తీరుకు విస్తుపోయిన ఇజ్రాయెల్.. తేరుకుని ధీటుగా బదులిచ్చింది. హమాస్‌ను తుదముట్టించేంతవరకు విశ్రమించబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే దాడుల్లో గాయపడి తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెలీ యువతికి సంబంధించిన ఓ వీడియోను హమాస్ విడుదల చేసింది. భుజం గాయంతో బాధపడుతున్న ఆ యువతి శస్త్రచికిత్స తీసుకుంటున్న వీడియోను హమాస్ టెలిగ్రామ్‌లో బహిర్గతం చేసింది. బందీగా ఉన్న షోహమ్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల మియా షెమ్ వీడియోలో మాట్లాడుతోంది. ఆమె హమాస్ సంరక్షణలోనే ఉన్నట్లు హామీ ఇచ్చింది. దాడుల్లో విరిగిన చేతికి గాజాలో శస్త్రచికిత్స చేయించుకున్నానని వెల్లడించిన మియా.. వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. 'హాయ్, నేను మియా షేమ్. నాకు 21 ఏళ్ల వయస్సు. ప్రస్తుతం నేను గాజాలో ఉన్నాను. దాడి జరిగే క్రమంలో నేను పార్టీలో ఉన్నాను. నా చేతికి తీవ్ర గాయమైంది. గాజాలోని ఓ ఆసుపత్రిలో నా చేతికి 3 గంటలపాటు శస్త్రచికిత్స జరిగింది. ఇక్కడ నుంచి వీలైనంత త్వరగా నన్ను తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను' అని మియా షెమ్ పేర్కొంది. అక్టోబర్ 7న మ్యూజికల్ ఫెస్టివల్లో హమాస్ దళాల దాడులు దిగ్భ్రాంతిని గురిచేశాయి. రాకెట్ దాడులతో విరుచుకుపడిన హమాస్.. ఇజ్రాయెల్‌లో పండవేళ మారణహోమాన్ని సృష్టించింది. 199 మందిని బందీలుగా పట్టుకుని గాజాలో బందించింది. ఇజ్రాయెల్‌లో 75 ఏళ్ల చరిత్రలో ఇంతటి స్థాయిలో ఒకేరోజు మరణాలు సంభవించింది ఇదే ప్రథమం. ఇదీ చదవండి: మోహరించిన ఇజ్రాయెల్ సేనలు -
Video: హమాస్ పైశాచికం.. ఇజ్రాయెల్ కుటుంబాన్ని బంధించి, బెదిరింపులు..
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అయిదు రోజులుగా కొనసాగుతోంది. గాజాస్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌లోకి చొరబడి మెరుపు దాడి ప్రారంభించిన హమాస్ వెనువెంటనే 5 వేల రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్ సైతం హమాస్‌పై యుద్దం ప్రకటించి వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది హమాస్ ఆక్రమించిన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటూ మెల్లమెల్లగా గాజాపై పైచేయి సాధిస్తోంది. గాజాలో ఉగ్రవాదుల ఏరివేతకు ఇజ్రాయెల్ సైన్యం కదంతొక్కుతుంది. ఇరుపక్షల ఆధిపత్యపోరులో రెండు దేశాల్లో ఇప్పటివరకు 3 వేల మందికిపైగా మరణించారు. ఈ మారణహోమంలో పాలస్థీనా కంటే ఇజ్రాయెల్‌లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య జరుగుతున్న భీకర పోరులో పలు కంటతడి పెట్టించే వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, దాడులు చేయడం, రాకెట్ల ప్రయోగం వంటి వీడియో ఇప్పటికై వైరల్‌గామారిన విషయం తెలిసిందే. తాజాగా మరో హృదయ విదాకర వీడియో బయటకు వచ్చింది. ఓ ఇంట్లోకి చోరబడి ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా పట్టుకున్న హమాస్ సైన్యం వారితో అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. మహిళలు, చిన్నారులను అడ్డుపెట్టుకొని ఫేస్బుక్ లైవ్ ద్వారా మహాస్ ఉగ్రవాదులు బెదిరింపులకు పాల్పడ్డారు. వీడియోలో.. ఓ వ్యక్తి, అతని పక్కన భార్య, ఆమె ఒడిలో ఓ చిన్నారి ఉన్నారు. వీరితోపాటు పక్కన మరికొంతమంది చిన్నారులు గుక్కపెట్టి ఏడుస్తూ నోరు పట్టుకొని ఉండటం కనిపిస్తోంది. చదవండి: భారత్-కెనడా వివాదం: అమెరికాలో విదేశాంగ మంత్రుల రహస్య భేటీ! వ్యక్తి కాలు వెంట రాక్తం కారుతున్నప్పటికీ.. ఓ ముష్కరుడు ఆ కుటుంబాన్ని మాట్లాడమంటూ ఆదేశించాడు. ‘మీ దేశంతో మాట్లాడండి. మేము ఇక్కడ ఉన్నామని వారికి చెప్పండి’ అంటూ హమాస్ ఉగ్రవాది వారితో అనడం వినిపిస్తోంది. అతను గాజాకు దగ్గరగా ఉన్న నహాల్ ఓజ్ కిబ్బత్జ్‌లో ఉన్న ఇంట్లోకి ప్రవేశపెట్టినట్లు హమాస్ మిలిటెంట్ చెప్పాడు. ఆ వ్యక్తి కాలిలోకి బుల్లెట్లు దించినట్లు కెమెరాను చూస్తూ చెప్పాడు. దంపతుల కుమారిడిపై తుపాకీ గురిపెట్టి.. పక్కన ఉన్న వ్యక్తులను ఇంటి నుంచి బయటకు వెళ్లాలని బెదిరించాడు. దీనికి సంబంధఙంచిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి మారణహోమం సృష్టించిన హమాజ్ మిలిటెంట్ సంస్థ.. చిన్నారులు, మహిళలు సహా 150 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకుంది. ఎలాంటి హెచ్చరిక లేకుండా గాజా స్ట్రిప్‌లోని పౌరుల నివాసాలపై ఇజ్రాయెల్ బాంబును వేసిన ప్రతిసారీ ఒక బందీని చంపేస్తానని బెదిరించింది. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌ను ముట్టడించాలని ఆదేశించి.. ఆ ప్రాంతానికి విద్యుత్, ఆహారం, ఇంధనం, నీటిని నిలిపివేసిన తరువాత హమాస్ నుంచి ఈ హెచ్చరికలు చేసింది. Hamas broke into a Kibbutz and killed over 100 innocent people... They even decapitated children.... But the first thing Sinn Fein supporters and Gerry Carroll do, is wave their Palestinian flegs... When people show you their morals the first time, remember to believe them... pic.twitter.com/KCF3r2coLJ — The Wee Doggie (@The_Wee_Doggie) October 11, 2023 ఈ బెదిరింపుల కారణంగా గాజాపై పూర్తిస్థాయి యుద్ధానికి దిగేందుకు ఇజ్రాయెల్ సైన్యం వెనకాడుతోంది. అయితే బందీల అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా హమాస్‌పై భీకర స్థాయిలో విరుచుకుపడాలని ఇజ్రాయెల్ ప్రభుత్వంపై స్వదేశంలోనే ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బందీలను చంపే ప్రమాదం ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌పై తన భారీ సైనిక దాడిని సడలించే సంకేతాలను చూపించడం లేదు. దీనికితోడు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్‌ను ఐసీస్‌తో పోల్చుతూ.. గాజా ఉగ్రవాదులు పిల్లలను బంధించి, కాల్చివేసి, ఉరితీశారని అన్నారు. -
ఖతర్ మధ్యవర్తిత్వం
దోహా: ఇజ్రాయెల్, హమాస్ మధ్య బందీల మారి్పడికి, వీలైతే పోరుకు తెర దించేందుకు ఖతర్ రంగంలోకి దిగింది. హమాస్ చెరపట్టిన మహిళలు, పిల్లలను విడిపించేందుకు ముందుకొచి్చంది. బదులుగా ఇజ్రాయెలీ జైళ్లలో బందీలుగా ఉన్న 36 మంది మహిళలు, పిల్లలను విడుదల చేయాలని ప్రతిపాదించింది. దీనిపై ఇప్పటికే హమాస్ తో మాట్లాడుతున్నట్టు ఖతర్ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ విషయంలో అమెరికా సాయం కూడా తీసుకుంటున్నట్టు చెప్పింది. ‘‘చర్చల్లో పురోగతి ఉంది. పోరుకు తెర పడి శాంతి నెలకొనాలని, బందీలు విడుదల కావాలని మా ప్రయత్నం’’ అని వివరించింది. ఇజ్రాయెల్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి సంప్రదింపులూ జరగడం లేదని పేర్కొంది. -
రుణం కోసం కుమారుడి తాకట్టు
టీ.నగర్: తీసుకున్న రుణం కోసం కుమారుడిని తండ్రి తాకట్టు పెట్టినట్లు భార్య ఫిర్యాదు చేసింది. రామనాథపురం జిల్లా, పరమకుడి జ్యువెలరీ బజారు వీధికి చెందిన దంపతులు రమేష్, శరణ్య. వీరికి 13 ఏళ్ల కుమారుడు, 11 ఏళ్ల కుమార్తె ఉన్నారు. వివాహ సమయంలో శరణ్యకు 90 సవర్ల బంగారు నగలను వరకట్నంగా ఇచ్చారు. రమేష్ తండ్రితోపాటు నగల దుకాణం నడుపుతున్నాడు. వ్యాపారంలో రెండేళ్లుగా నష్టం రావడంతో శరణ్య నగలు విక్రయించినట్లు సమాచారం. బయట రుణాలు తీసుకుని వ్యాపారం సాగించారు. నగదు తిరిగి ఇవ్వకపోవడంతో రుణదాతలు రమేష్‌ను వేధించడం మొదలుపెట్టారు. రుణాల బాధతో శరణ్య గత డిసెంబరులో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో కుమారుడ్ని రుణదాతలకు అప్పగించి, నగదు చెల్లించగానే అతన్ని ఇంటికి తీసుకురావడం పరిపాటిగా మారినట్లు భార్య శరణ్య ఆరోపించారు. ఇలావుండగా, రమేష్ ఇంట్లో నుంచి శరణ్యను గెంటివేశాడు. దీంతో ఆమె తన కుమారుడు, సోదరుడితో కలిసి పరమకుడి ముత్తాలమ్మన్ ఆలయ ప్రాంగణంలో ఆందోళన జరిపింది. భర్త రమేష్‌పైన, రుణాలిచ్చిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
జ్యువెలరీ షాపులో బంగారు నగలు పక్కదారి
మహబూబ్‌నగర్ క్రైం: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ జ్యువెలరీ దుకాణంలో భారీస్థాయిలో బంగారు ఆభరణాలు పక్కదారి పట్టాయి. దుకాణ నిర్వాహకులకు ఏమాత్రం తెలియకుండా అక్కడ పని చేసే కొందరు సిబ్బంది గ్రూప్‌గా ఏర్పడి విలువైన బంగారు ఆభరణాలు తీసుకొని రుణాలిచ్చే ఫైనాన్స్ కేంద్రంలో తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.80లక్షల వరకు ఉంటుందని సమాచారం. తాకట్టు పెట్టిన తర్వాత వచ్చిన సొమ్మును సిబ్బంది ఒక్కొక్కరు రూ.ఐదు నుంచి రూ.ఏడు లక్షల వరకు పంచుకున్నట్లు తెలుస్తోంది. దుకాణంలో రోజుకు రోజుకు తగ్గుతున్న ఆభరణాలను కొంత ఆలస్యంగా గుర్తించిన జ్యువెలరీ దుకాణ యాజమాని ఏం జరిగిందని ఆరా తీస్తే అక్కడ పనిచేసే కొందరు దుకాణంలోంచి ఆభరణాలు తీసుకుపోయి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్న వ్యవహారం బయటపడింది. దీంతో షోరూం యాజమాని హైదరాబాద్‌లోని పోలీస్ ఉన్నతాధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయం సమాచారం. మూడు రోజుల కిందట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై వన్‌టౌన్ సీఐ రాజేశ్వర్‌గౌడును సాక్షి వివరణ కోరగా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని కొన్ని ఆభరణాలు రీకవరీ కావాల్సి ఉందని, రెండురోజుల్లో ఈ విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
అప్పుడు ఎన్కౌంటర్, ఇపుడు బిడ్డ దత్తత
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోనిఫరూకాబాద్‌లో పోలీసు అధికారి మానవత్వానికి పరిమళాన్ని అద్దారు. తండ్రి చేసిన నేరానికి అనాథగా మిగిలిన ఆడబిడ్డను ఆదుకునేందుకు చొరవ చూపారు. తన కూతురు పుట్టిన రోజంటూ ఇంటికి పిలిచి 23 మంది చిన్నారులను బంధించిన ఉన్మాది సుభాష్ బాథమ్ కుమార్తె గౌరి (1)ని దత్తత తీసుకునేందుకు కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ ముందుకొచ్చారు. చట్టపరమైన అన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత కాన్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్ అధికారికంగా గౌరిని దత్తత తీసుకోనున్నారు. అంతేకాదు ఆ పాప బాగా చదువుకొని ఐపీఎస్ స్థాయికి రావాలని ఆకాంక్షిస్తున్నారు. గౌరీ స్వతంత్రంగా మారే వరకు విద్య, ఇతర ఖర్చులను తామే భరిస్తామని, ఆమె ఎదిగి ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కోరుకుంటున్నానని మోహిత్ అగర్వాల్ తెలిపారు.. ఆమెను తన స్వంత పర్యవేక్షణలో జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇచ్చారు. గౌరీ ప్రస్తుతం పోలీసులు పర్యవేక్షణలో ఫరూఖాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలోని ముహమ్మదాబాద్ పట్టణంలోని కార్తియా గ్రామానికి చెందిన సుభాష్ బాథమ్..హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తూ..ఇటీవల బెయిల్‌మీద విడుదలయ్యాడు. ఇతనిపై ఇతర క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. అయితే తనను జైలుకు పంపించారన్న ఆగ్రహంతో ఊరిమీద పగ తీర్చుకోవాలనుకున్నాడో ఏమో కానీ మారిపోయానంటూ ఊరివారినందరినీ నమ్మించాడు. జనవరి 30 న తమ కుమార్తె బర్త్‌డే వేడుకలకు రమ్మని స్థానికుల పిల్లలను తన ఇంటికి పిలిచాడు. అలా వచ్చిన మొత్తం 23మంది చిన్నారులను ఇంటి నేలమాళిగలో బంధించడంతో పాటు కాల్చిపారేస్తానని బెదరించారు. దీంతో తమ పిల్లల్ని కాపాడాలంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు తొమ్మిది గంటల ఆపరేషన్ అనంతరం ఎట్టకేలకు సుభాష్‌ను ఎన్కౌంటర్ చేసి పిల్లలను విడిపించారు. ఈ క్రమంలో పారిపోతున్న సుభాష్ భార్య రూబీపై గ్రామస్తులు రాళ్లఎఒ దాడి చేయడంతో హాస్పిటల్ లో చికిత్సపొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో సుభాష్, రుబీల కుమార్తె అనాథగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. చదవండి : ఫోన్లో చూసి, ఖైదీల సాయంతో పోలీసుల చేతిలో భర్త.. గ్రామస్తుల దాడిలో భార్య! దుర్మార్గుడి నుంచి పిల్లల్ని సురక్షితంగా కాపాడిన ఎన్ఎస్జీ -
ఇంటి కింద బాంబులు, కోటి చొప్పున డిమాండ్
సాక్షి, ఫరూఖాబాద్ (యూపీ): పుట్టిన రోజు నెపంతో ఓ పాత నేరస్థుడు 23 మంది పిల్లలను బందీ చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇది పక్కా ప్లాన్‌తో చేశారని, దీనికోసం వారు పలు కేసులను జల్లెడ పట్టారని పోలీసులు వెల్లడించారు. ఫరూఖాబాద్‌లోని కసారియా గ్రామానికి చెందిన సుభాష్ బథం గురువారం తన కూతురి పుట్టినరోజని చెప్పి పిల్లలను ఇంటికి రప్పించుకోగా వారందరినీ ఇంట్లో బంధించిన సంగతి తెలిసిందే. పిల్లలను సరక్షితంగా తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో సుభాష్ మరణించాడు. అనంతరం అతని మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రష్యా కేసు ప్రేరణగా తీసుకుని ఈ ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా దీనికోసం నెల ముందు నుంచే వ్యూహరచన చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు గతంలో ఇలాంటి కేసుల గురించి ఆన్లైన్లో వెతికి, ఆ సమాచారాన్ని డౌన్‌లౌడ్ చేసుకున్నాడు. బాంబు తయారీలో మెళకువలను సైతం నేర్చుకున్నాడు. ఇక 2004లో రష్యాలో పిల్లలను నిర్భందించిన ఘటనను ఉదాహరణగా తీసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతోపాటు మరిన్ని కేసులను అధ్యయనం చేశాకే పకడ్బందీగా నేరానికి ఒడిగట్టారు. కాగా ఇప్పటికే ఓ కేసులో నాలుగు నెలల జైలు శిక్ష అనుభవించిన సుభాష్ ఈ నేరానికి తోటి ఖైదీల సహాయం తీసుకున్నాడు. వారి తోడ్పాటుతో ఆయుధాలు, పేలుడు పదార్థాలను సేకరించాడు. ఇంటి కింద బాంబ్ ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చాక ముందస్తు ప్రణాళిక మేరకు పిల్లలను బందీ చేసే ఇంటి కింద భాగంలో బాంబ్లను పెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేరంలో అతని భార్య కూడా పాలుపంచుకుంది. నిర్భందించిన పిల్లలను విడుదల చేయడానికి స్థానికుల దగ్గర నుంచి ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున డబ్బులు డిమాండ్ చేసిందని పోలీసులు తెలిపారు. అయితే ఘటన అనంతరం స్థానికులు ఆమెను రాళ్లతో కొట్టి చంపిన సంగతి తెలిసిందే. నిందితుని ఇంటి నుంచి తుపాకీ, తూటాలు, కాట్రిడ్జ్‌లు, నాటు బాంబులు, హానికర రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: పోలీసుల చేతిలో భర్త.. గ్రామస్తుల దాడిలో భార్య! దుర్మార్గుడి నుంచి పిల్లల్ని సురక్షితంగా కాపాడిన ఎన్ఎస్జీ -
పోలీసుల చేతిలో భర్త.. గ్రామస్తుల దాడిలో భార్య!
ఫరూఖాబాద్(యూపీ): పుట్టినరోజు అంటూ 23 మంది చిన్నారులను పిలిచి బంధించిన వ్యక్తిని పోలీసులు గురువారం అర్ధరాత్రి హతమార్చగా, తప్పించుకునేందుకు ప్రయత్నించిన అతని భార్య.. గ్రామస్తుల చేతిలో చనిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా కసారియా గ్రామంలో జరిగిందీ ఘటన. చిన్నారులను బందీగా చేపట్టి, వారిని చంపేస్తామని బెదిరిస్తూ.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన సంచలన ఘటన చివరకు సుఖాంతమైంది. సుభాష్ బాథమ్(40)పై గతంలో హత్య కేసు ఉంది. బెయిల్‌పై బయటకు వచ్చాడు. కూతురి పుట్టిన రోజు వేడుకులకు రావాలంటూ గురువారం గ్రామంలోని చిన్నారులను తన ఇంటికి పిలవగా 23 మంది పిల్లలొచ్చారు. అందర్నీ ఇంటి బేస్మెంట్లో బంధించాడు. హత్య కేసును వెనక్కి తీసుకుంటామని, ప్రభుత్వ ఇల్లు ఇస్తామని నచ్చజెప్పేందుకు యత్నించినా సుభాష్ వినలేదని డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు. సుభాష్ జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులకు, ఒక గ్రామస్తుడికి గాయాలయ్యాయన్నారు. ఇంటి వెనుకవైపు నుంచి తలుపు బద్ధలు కొట్టి పోలీసులు లోపలికి వెళ్లారు. వారిపై సుభాష్ కాల్పులు జరపగా ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. తర్వాత పిల్లలందరినీ పోలీసులు రక్షించారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన సుభాష్ భార్య రూబీను గ్రామస్తులు తీవ్రంగా కొట్టారు. గాయాలతో ఆమె ఆసుపత్రిలో మరణించింది. సుభాష్ ఇంటి నుంచి పోలీసులు తుపాకిని, రైఫిల్‌ను, రెండు డజన్ల కాట్రిడ్జ్‌లను, 25 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే పిల్లలను బందీలుగా ఉంచుకునే ఆలోచనలో ఆ దంపతులు ఉన్నట్లు అర్థమవుతుందని పోలీసులు చెప్పారు. -
మద్యం టెండర్ల కోసం బంగారం తాకట్టు
సాక్షి, జనగామ : మద్యం టెండర్ల దరఖాస్తుకు గడువు రేపటితో ముగుస్తుండడంతో దరఖాస్తులు డబ్బులు కోసం బంగారం తాకట్టు పెడుతున్నారు. క్యాష్ కోసం పరేషాన్ అవుతున్నారు. ప్రైవేట్ చిట్ఫండ్లు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మద్యం షాపుల టెండర్ల అప్లికేషన్లకు ఈనెల 16వ తేదీతో గడువు ముగిసిపోనుంది. దీంతో ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి డీడీలు, చలాన్ ఇచ్చే పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా 42 మద్యం షాపులకు ఈ నెల తొమ్మిదో తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీన అప్లికేషన్ల దాఖలుకు చివరి గడువు కాగా 18వ తేదీన డ్రా తీయడానికి ఎక్సైజ్ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. డబ్బు కోసం ముమ్మర ప్రయత్నాలు.. ప్రభుత్వం ఈ ఏడాది నూతన మద్యం పాలసీని ప్రకటించింది. రెండేళ్ల కాలపరిమితి ఉన్న షాపుల కేటాయింపు కోసం టెండర్ ప్రక్రియను నిర్వహిస్తోంది. టెండర్లో పాల్గొనడం కోసం అప్లికేషన్ దరఖాస్తు ఫీజును రూ.రెండు లక్షలకు పెంచింది. ఒక్కొక్క దరఖాస్తుకు రూ.రెండు లక్షలు చెల్లించి టెండర్లో పాల్గొనడం కోసం అప్లికేషన్ సమర్పించాల్సి ఉంది. అప్లికేషన్ ఫీజు రూ.రెండు లక్షలు పెంచడంతో దరఖాస్తుదారులు డబ్బులు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో గోల్డ్ లోన్, ఇతర ప్రైవేట్ చిట్‌ఫండ్ కంపెనీలు, వడ్డీ వ్యాపారులు నుంచి డబ్బుల కోసం చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం పంటలు చేతికి రాకపోవడంతో రైతుల వద్ద సైతం డబ్బులు లేవు. దీంతో చివరి ప్రయత్నంగా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, బంధువుల వద్ద సంప్రదింపులు చేస్తున్నారు. రూ.లక్షకు రూ.రెండు నుంచి నాలుగు రూపాయల వడ్డీతో తీసుకుంటున్నారు. గ్రూపులు గ్రూపులుగా.. మద్యం టెండర్ల అప్లికేషన్ల కోసం దరఖాస్తు చేయడానికి కొంతమంది గ్రూపులు గ్రూపులుగా జత కడుతున్నారు. ఐదు నుంచి పది మంది సభ్యులు కలిసి సమష్టిగా డబ్బులను సమకూర్చుకొని దరఖాస్తులు సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. మద్యం వ్యాపారంలో ఆరితేరిన పెద్ద వ్యాపారులు అయితే కుటుంబ సభ్యుల పేర్లతోనే కాకుండా బినామీ పేర్లతో దరఖాస్తులు సమర్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. పెరుగుతున్న టెండర్ ఫీజుతో పరేషాన్.. మద్యం లైసెన్స్ కోసం టెండర్ల ఫీజు పెరుగుతుండడంతో వ్యాపారులు డబ్బుల కోసం పరేషాన్ అవుతున్నారు. 2012కు ముందు సీక్రెట్ పద్ధతిలో టెండర్లు నిర్వహించే వారు. ఎవరు ఎక్కువ టెండర్ వేస్తే వారికే ఆ షాపు దక్కేది. 2012 నుంచి డ్రా పద్ధతితో మద్యం షాపులను అప్పగిçస్తున్నారు. 2012–14 రెండేళ్ల కోసం నిర్వహించిన టెండర్ల కోసం కేవలం రూ.25వేలు మాత్రమే ఫీజుగా ఉండేది. ఆ తరువాత 2014–15లో టెండర్ అప్లికేషన్ ఫీజు రూ.50 వేలుగా ఉండేది. 2015–17, 2017–19లో టెండర్ అప్లికేషన్ ఫీజు రూ. లక్షగా నిర్ణయించారు. ప్రస్తుతం టెండర్ అప్లికేషన్ ఫీజు మాత్రం అమాంతం రూ.రెండు లక్షలకు పెంచడంతో డబ్బులు కోసం నానా పాట్లు పడుతున్నారు. 2017–19 సంవత్సరంలో 41 షాపులకు 1280 దరఖాస్తులు వచ్చాయి. కానీ పెంచిన ఫీజు కారణంగా గతంతో పోల్చితే దరఖాస్తులు తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. చివరి రోజు బుధవారం మంచి ముహుర్తం ఉండడంతో అధికంగా దరఖాస్తులు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. -
విడుదలైన ఆ ఇద్దరూ తెలుగువారే!
ముంబై: ఇథియోపియాలో నిర్బంధానికి గురై విడుదలైన ఇద్దరూ తెలుగువారేనని సమాచారం. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనుబంధ ఐటీఎన్‌ఎల్ కంపెనీ ఇథియోపియాలో చేపట్టిన రోడ్డు పనుల్లో పాల్గొన్న స్థానికులు వేతనాలు అందకపోవడంతో గత నెల 25వ తేదీ నుంచి ఏడుగురు భారతీయ ఉద్యోగులను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో భారత దౌత్య కార్యాలయం, విదేశాంగ శాఖ అధికారుల జోక్యంతో భాస్కర్‌రెడ్డి, హరీష్ బండి అనే ఇద్దరిని స్థానికులు రెండు రోజుల క్రితం విడుదల చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వీరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించి రాజధాని ఆడిస్అబాబాకు తరలించినట్లు భారత దౌత్య కార్యాలయం తెలిపింది. మిగతా వారికి కూడా విముక్తి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. అక్కడ పనిచేస్తున్న భారత ఉద్యోగులకు జూలై నుంచి, స్థానికులకు రెండు నెలలుగా వేతనాలు అందడం లేదని సమాచారం. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థను గట్టెక్కించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. -
సైకో లవర్ని చెప్పులతో కొట్టారు!
భోపాల : పెళ్లి చేసుకోవాలని ఓ మోడల్‌ను నిర్భంధించి వేధించిన యువకుడికి పోలీసులు తగిన బుద్ది చెప్పారు. దాదాపు 12 గంటల తర్వాత ఆ సైకోలవర్ చెర నుంచి యువతిని రక్షించారు. భోపాల్‌లోని మిస్ రోడ్ ప్రాంతంలోని ఓ భవనంలో రోహిత్ సింగ్ (30) అనే యువకుడు మోడల్‌ను నిర్బంధించి దారుణంగా హింసించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పోలీసులతో వీడియో కాల్లో మాట్లాడి తన డిమాండ్లు వెల్లడించాడు. అతడి బారి నుంచి యువతిని పోలీసులు చాకచక్యంగా విడిపించారు. అనంతరం భోపాల్ వీధుల్లో రోహిత్ సింగ్‌ను నడిపించి మహిళలతో చెప్పులతో కొట్టించారు. నిందితుడిని కోర్టు ముందు హాజరు పరిచామని, ఒకరోజు కస్టడీకి తీసుకున్నామని పోలీస్ అధికారి సంజీవ్ చౌసీ తెలిపారు. అతడిపై హత్యాయత్నం తదితర కేసులు కూడా నమోదుచేసినట్టు వెల్లడించారు. అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టరైన రోహిత్‌తో బాధితురాలికి చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. ఉరిశిక్ష విధించాలి: బాధితురాలు నిందితుడికి ఉరిశిక్ష విధించాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ముంబైలో పరిచయమైన అతడు తొలుత తనను ఇబ్బంది పెట్టలేదని, గత నవంబరు నుంచి పెళ్లి చేసుకోవాలని వేధించడం మొదలుపెట్టాడని చెప్పుకొచ్చింది. బాండ్ పేపర్‌పై లిఖితపూర్వకంగా రాసివ్వాలని బలవంతం చేసినట్టు కూడా ఆమె ఆరోపించింది. రోహిత్‌ను వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదని, అతడ్ని జైలు పంపి ఉరిశిక్ష విధించాలని, లేకపోతే తనను చంపేస్తాడని వాపోయింది. ఆమెపై నిందితుడు కత్తితో దాడి చేయడంతో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. తనను వివాహం చేసుకోపోతే కాల్చి చంపి, తర్వాత నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని రోహిత్ బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి తుపాకి, రెండు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను విడిచిపెడితే ఎలాంటి హాని తలపెట్టబోమని పోలీసులు సర్దిచెప్పడంతో యువతిని వదలడానికి అంగీకరించాడు. -
సైకోలవర్ చెర నుంచి యువతిని రక్షించిన పోలీసులు
-
ఎట్టకేలకు పెళ్లికి ఒప్పుకున్న మోడల్
భోపాల్ : దాదాపు 12 గంటలకు పైగా గృహనిర్బంధంలో ఉన్న మోడల్ ఎట్టకేలకు వివాహానికి అంగీకరించారు. దీంతో కథ సుఖాంతమైంది. అయితే ఆమెను అపార్ట్మెంట్లో కొన్ని గంటలపాటు బంధించడంతో పాటు నాటు తుపాకీని కలిగి ఉన్నాడన్న కారణాలతో పోలీసులు ఆ మోడల్ ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది. అసలేమైందంటే.. భోపాల్‌కు చెందిన 30 ఏళ్ల మోడల్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రోహిత్ గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ముంబైలో రోహిత్ సైతం మోడలింగ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రేమ విషయం తెలుసుకున్న మోడల్ తల్లిదండ్రులు రోహిత్‌తో కూతురి పెళ్లికి నిరాకరించారు. దీంతో చేసేదేంలేక రోహిత్‌తో పెళ్లికి వెనకడుగు వేశారు. ఈ విషయంలో రోహిత్‌పై మోదల్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అతడు కొంతకాలం జైలుశిక్ష అనుభవించి బయటకొచ్చాడు. ఈ క్రమంలో మరోసారి తనను పెళ్లి చేసుకోవాలని అడిగేందుకు భోపాల్‌లోని మిస్రాడ్ ఏరియాలోని మోడల్ అపార్ట్‌మెంట్‌కు శుక్రవారం ఉదయం 6గంటల ప్రాంతంలో వెళ్లాడు రోహిత్. ఐదో అంతస్తులో నివాసం ఉంటున్న మోడల్ ఇంట్లోకి ప్రవేశించి డోర్ లాక్ చేశాడు. చుట్టుపక్కలవారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మోడల్‌ను కాపాడాలని భావించారు. అయితే మోడల్, తాను ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పోలీసులకు వీడియో కాల్ ద్వారా తెలిపారు రోహిత్. ఈ క్రమంలో 12 గంటలు గడిచిపోయాయి. పెళ్లి గురించి మరోసారి ఆరాతీయగా వివాహం చేసుకుంటానని ఆమె చెప్పారు. పెళ్లికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్టాంప్ పేపర్ మీద సంతకాలు సేకరించాడు. ఇంట్లో నుంచి బయటకురాగానే రోహిత్‌తో పాటు మోడల్‌ను అదుపులోకి తీసుకుని హాస్పిటల్‌కు తరలించినట్లు ఎస్పీ రాహుల్ లోధా తెలిపారు. ఇద్దరికీ పోలీసుల కౌన్సెలింగ్ మోడల్(30), ఆమె ప్రియుడు రోహిత్(30)కి కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరూ మేజర్లనీ ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవచ్చునని సూచించాం. అవసరమైతే చట్టపరంగా వారికి సహకారం అందిస్తామని చెప్పినట్లు వివరించారు. అయితే ఆ సమయంలో నాటు తుపాకీతో ఆమెను ఏమైనా బెదిరించాడా అనే కోణంలోనూ రోహిత్‌పై విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.