
టెల్‌అవీవ్:గాజా కాల్పుల విరమణలో భాగంగా ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను హమాస్ శనివారం(ఫిబ్రవరి22) విడిచిపెట్టారు. ఏడాదిన్నర తర్వాత వీరు హమాస్ చెర నుంచి బయటపడ్డారు.అయితే విడుదల సందర్భంగా ఒమర్ షెమ్‌టోవ్ అనే బందీ హమాస్ ఉగ్రవాదులను ముద్దు పెట్టకుని అందరినీ ఆశ్చర్య పరిచాడు.
అయితే గాజా నుంచి రెడ్‌క్రాస్ వాహనంలో ఎక్కి ఇజ్రాయెల్ చేరుకున్న తర్వాత షెమ్‌టోవ్ అసలు విషయం చెప్పాడు.హమాస్ ఉగ్రవాదులే తమను అలా ముద్దు పెట్టుకోవాల్సిందిగా బలవంతం చేశారని చెప్పాడు.‘నన్ను అలా చేయాల్సిందిగా వాళ్లు ఒత్తిడి చేశారు.మీరు కావాలంటే వీడియోలో చూడొచ్చు.. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఏం చేయాలో చెప్తున్నాడు’అని వివరించాడు.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోని నెగెవ్ జిల్లాపై హమాస్ ఉగ్రవాదులు దాడి జరిపి 1200 మందిని చంపడమే కాకుండా 250 మందిని తమ వెంట గాజాకు బందీలుగా తీసుకెళ్లారు. వీరిలో షెమ్‌టోవ్ ఒకరు. నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఉండగా షెమ్‌టోవ్ హమాస్ ఉగ్రవాదులకు చిక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment