టీనేజీ నీట్ కోచింగ్ విద్యార్థినిపై టీచర్ల అమానుషం
కాన్పూర్(యూపీ): విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కామపిశాచులుగా మారి టీనేజ్ విద్యార్థినితో అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. 2022 డిసెంబర్ చివర్లో జరిగిన ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైద్యవిద్యా కోర్సులో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న 17 ఏళ్ల బాలికను ఇద్దరు టీచర్లు బంధించి ఆరునెలలకుపైగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు యూపీలో చర్చనీయాంశమైంది. కేసు వివరాలను కళ్యాణ్‌పూర్ అసిస్టెంట్ కమిషనర్ అభిõÙక్ పాండే శనివారం మీడియాకు వెల్లడించారు.
ఫతేపూర్ పట్టణానికి చెందిన ఈ టీనేజీ అమ్మాయి నీట్ కోచింగ్ కోసం కాన్పూర్‌కు వచ్చి హాస్టల్‌లో ఉంటోంది. ఆమె నీట్ కోచింగ్ తీసుకుంటున్న చోటే సాహిల్ సిద్ధిఖీ జీవశాస్త్రం, వికాస్ పూర్వాల్ రసాయనశాస్త్రం బోధించేవారు. 2023 ఏడాది కొత్త ఏడాది వేడుకలు జరుగుతున్నాయి, విద్యార్థులంతా వస్తున్నారని చెప్పి ఈ టీనేజర్‌ను ఆమె ఫ్రెండ్ ఫ్లాట్‌కు టీచర్లు సాహిల్, వికాస్ రప్పించారు. మక్డీఖేరాలోని ప్లాట్‌కు వచ్చిన అమ్మాయికి టీచర్లుతప్ప విద్యార్థులెవరూ కనిపించలేదు. మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగడంతో స్పృహకోల్పోయిన టీనేజర్‌ను సాహిల్ తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి ఆరునెలలకుపైగా బంధించాడు. పలుమార్లు రేప్‌చేశాడు. తర్వాత వికాస్ సైతం అదే దారుణానికి పాల్పడ్డాడు.
ఆరునెలల తర్వాత కాన్పూర్‌కు వచ్చిన తల్లి ఆ టీనేజర్‌ను తీసుకెళ్లింది. అయితే అత్యాచారాన్ని వీడియోలు తీసి బెదిరించడంతో కుటుంబపరువు పోతుందన్న భయంతో టీనేజర్ తనకు జరిగిన దారుణాన్ని బయటకు చెప్పలేదు. అయితే రెండు నెలల క్రితం మరో విద్యారి్థని పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో టీచర్ సాహిల్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇటీవల అతను బెయిల్‌పై బయటికొచ్చాడు. అయితే ఆ మరో విద్యారి్థనిని సాహిల్ లైంగికంగా వేధించిన వీడియో తాజాగా బయటకురావడంతో ధైర్యం తెచ్చుకున్న టీనేజర్ ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోక్సోసహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేసి సాహిల్, వికాస్‌లను అరెస్ట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment