minor raped
-
బంధించి, 6 నెలలకుపైగా రేప్
కాన్పూర్(యూపీ): విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కామపిశాచులుగా మారి టీనేజ్ విద్యార్థినితో అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. 2022 డిసెంబర్ చివర్లో జరిగిన ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైద్యవిద్యా కోర్సులో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న 17 ఏళ్ల బాలికను ఇద్దరు టీచర్లు బంధించి ఆరునెలలకుపైగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు యూపీలో చర్చనీయాంశమైంది. కేసు వివరాలను కళ్యాణ్పూర్ అసిస్టెంట్ కమిషనర్ అభిõÙక్ పాండే శనివారం మీడియాకు వెల్లడించారు. ఫతేపూర్ పట్టణానికి చెందిన ఈ టీనేజీ అమ్మాయి నీట్ కోచింగ్ కోసం కాన్పూర్‌కు వచ్చి హాస్టల్లో ఉంటోంది. ఆమె నీట్ కోచింగ్ తీసుకుంటున్న చోటే సాహిల్ సిద్ధిఖీ జీవశాస్త్రం, వికాస్ పూర్వాల్ రసాయనశాస్త్రం బోధించేవారు. 2023 ఏడాది కొత్త ఏడాది వేడుకలు జరుగుతున్నాయి, విద్యార్థులంతా వస్తున్నారని చెప్పి ఈ టీనేజర్‌ను ఆమె ఫ్రెండ్ ఫ్లాట్‌కు టీచర్లు సాహిల్, వికాస్ రప్పించారు. మక్డీఖేరాలోని ప్లాట్‌కు వచ్చిన అమ్మాయికి టీచర్లుతప్ప విద్యార్థులెవరూ కనిపించలేదు. మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగడంతో స్పృహకోల్పోయిన టీనేజర్‌ను సాహిల్ తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి ఆరునెలలకుపైగా బంధించాడు. పలుమార్లు రేప్‌చేశాడు. తర్వాత వికాస్ సైతం అదే దారుణానికి పాల్పడ్డాడు. ఆరునెలల తర్వాత కాన్పూర్‌కు వచ్చిన తల్లి ఆ టీనేజర్‌ను తీసుకెళ్లింది. అయితే అత్యాచారాన్ని వీడియోలు తీసి బెదిరించడంతో కుటుంబపరువు పోతుందన్న భయంతో టీనేజర్ తనకు జరిగిన దారుణాన్ని బయటకు చెప్పలేదు. అయితే రెండు నెలల క్రితం మరో విద్యారి్థని పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో టీచర్ సాహిల్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇటీవల అతను బెయిల్‌పై బయటికొచ్చాడు. అయితే ఆ మరో విద్యారి్థనిని సాహిల్ లైంగికంగా వేధించిన వీడియో తాజాగా బయటకురావడంతో ధైర్యం తెచ్చుకున్న టీనేజర్ ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోక్సోసహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేసి సాహిల్, వికాస్‌లను అరెస్ట్‌చేశారు. -
మైనర్‌పై అత్యాచారం చేసి బ్యాగులో బంధించిన నిందితుడు
గువాహటి: అస్సాం కాఛార్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. 26 ఏళ్ల యువకుడు మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెకు గాయాలు చేసి బ్యాగులో బంధించాడు. ఆ తర్వాత తీసుకెళ్లి అడవిలో వదిలేసి వచ్చాడు. అయితే అదృష్టవశాత్తు బాలిక ఎలాగోలా బ్యాగు నుంచి బయటపడింది. చాకచక్యంగా తప్పించుకుని తిరిగి ఇంటికి చేరుకుంది. గాయాలపాలైన ఆమెను తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటోంది. అయితే బాధితురాలు తన ప్రేయసి అని నిందితుడు చెప్పాడని పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 3న దుర్గా పూజ పండల్‌కు మరొకరితో ఆమె వెళ్లిందని, ఇది తెలిసి ఆగ్రహంతో నిందితుడు ఆమెను అపహరించి అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు వివరించారు. అక్టోబర్ 3న ఇంటి నుంచి వెళ్లిన తమ బిడ్డ తిరిగి రాకపోవడంతో తల్లిదంద్రులు 4న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే అదే రోజు బాలిక గాయాలతో ఇంటికి తిరిగివచ్చి జరిగిన విషయం చెప్పింది. నిందితుడు తమ బిడ్డను గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిందితుడ్ని అక్టోబర్ 6న అరెస్టు చేశారు. చదవండి: Bus Accident: ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం -
దేశ రాజధానిలో దారుణం.. 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. నలుగురు కామాంధులు 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అతడ్ని కర్రలతో దారుణంగా కొట్టారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలుడ్ని అక్కడే వదిలి పారిపోయారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో అబ్బాయిలకు కూడా రక్షణ లేదు అని మండిపడ్డారు. మహిళా ప్యానెల్ ఈ ఘటనను గుర్తించి పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించిందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. दिल्ली में लड़की तो क्या लड़के भी सुरक्षित नहीं हैं। एक 12 साल के लड़के के साथ 4 लोगों ने बुरी तरह से रेप किया और डंडों से पीटकर अधमरी हालत में छोड़कर चले गए। हमारी टीम ने मामले में FIR दर्ज करवाई। 1 आरोपी गिरफ़्तार, 3 अब भी फ़रार, दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। pic.twitter.com/tXrqK7xkwm — Swati Maliwal (@SwatiJaiHind) September 25, 2022 ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఒక్క నిందితుడిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. ఘటనపై మహిళా ప్యానెల్ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది. చదవండి: వీడియో లీక్ ఘటన.. అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన ఆర్మీ జవాన్ అరెస్టు -
బాలికపై సామూహిక లైంగిక దాడి! మూడేళ్ల పిల్లాడి కళ్ల ముందే..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/భీమిని: వరసకు అన్నయ్య అయ్యే ఓ బాలుడు, అతని స్నేహితుడు కలసి మూడేళ్ల పిల్లాడి కళ్ల ముందే 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపారు. దీన్ని వీడియో కూడా తీశారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి ఫిర్యాదు ప్రకారం.. నెన్నెల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఇంట్లో వరసకు కొడుకైన ఓ బాలుడు ఆటో నడుపుతూ నాలుగు నెలలుగా ఉంటున్నాడు. మూడు నెలల క్రితం సదరు వ్యక్తి కూతురుని, మూడేళ్ల బాబును మంచినీళ్లు తీసుకొద్దామని ఆ బాలుడు ఆటోలో బోరింగ్ పంపు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడికి మరో బాలుడు వచ్చాడు. అక్కడి నుంచి నలుగురు ఆటోలో గ్రామ శివారులోని శ్మశాన వాటిక వైపు వెళ్లారు. అక్కడ మూడేళ్ల బాబు సమక్షంలోనే ఇద్దరు బాలురు ఆటో వెనక సీటులో ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం చేస్తూ సెల్ఫోన్లో వీడియోలు తీశారు. వాటిని స్నేహితులకు పంపారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను బెదిరించడంతో విషయం బయటపడలేదు. రెండు రోజుల క్రితం బాలిక.. తన అమ్మమ్మకు ఈ దారుణం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడుకులా భావించి ఇంట్లో ఉంచుకుంటే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. నిందితులు పరారీలో ఉన్నారు. చదవండి:మరో నిర్భయ.. రన్నింగ్ రైలులో మహిళపై అత్యాచారయత్నం.. ఆ తర్వాత.. -
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం..
సాక్షి, బొబ్బిలి (విజయనగరం): తెలంగాణలోని వరంగల్‌లో ఓ తొమ్మిదినెలల పసికందుపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడి ఆమె మరణానికి కారణమయ్యాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్నేహితుడికోసం ఎదురు చూస్తున్న ఓ యువతిని ఐదుగురు యువకులు కొన్నాళ్లపాటు లైంగికదాడిచేసి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేశారు. గుర్ల మండలం దేవుని కణపాకకు చెందిన పశువుల కాపరిగా ఉన్న ఓ యువతిని అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు పశువుల కాపర్లు లైంగిక దాడికి పాల్పడటమే గాకుండా... ఆ చిత్రాలను సెల్ఫోన్లో చిత్రీకరించి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటనలు మరువక ముందే తాజాగా బొబ్బిలి మండలం పెంట గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ ఆకతాయి లైంగికదాడికి పాల్పడటమే గాకుండా దీనిపై నిలదీస్తే తాను చనిపోతానంటూ బెదిరించి ఊరు విడిచి వెళ్లిపోయాడు. గ్రామ పెద్దలు ఆ చిన్నారిపై జాలి చూపకపోగా నిందితుడిపక్షాన నిలవడానికి యత్నించి ఇప్పుడు అభాసుపాలయ్యారు. బతుకు తెరువుకోసం ఊరుగాని ఊరొచ్చి... గుట్టుగా కాపురం చేసుకుంటున్న ఆ బిడ్డ తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన దంపతులు ఏడాదిన్నర క్రితం బొబ్బిలి మండలం పెంట వచ్చి స్థిరపడ్డారు. వారికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లోని బెర్రీ కంపెనీలో కుటుంబ పెద్ద పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గిరడ లక్ష్మణరావు అనే యువకుడు చిన్నారులందరినీ ఆటలాడిస్తుండేవాడు. గత మంగళవారం అలాగే ఆటలాడిస్తూ ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం జరగడంతో గుర్తించిన తల్లి, చిన్నారిని ప్రశ్నించేసరికి విషయం బయటపడింది. వెంటనే ఆమె భర్తకు విషయం తెలియజేయడంతో గ్రామపెద్దల వద్దకు విషయం వెళ్లింది. దీనిపై లక్ష్మణరావును నిలదీయగా భయపడి తాను చనిపోతానని బెదిరించి గ్రామం విడిచి పారిపోయాడు. నిందితుడు ఆత్మహత్యచేసుకుంటాడేమో... ఆ కేసు తమపైకి వస్తుందేమోనన్న భయంతో బాధితకుటుంబం మౌనం వహించింది. అమ్మమ్మ పెంపకంలోనే యువకుడు... నిందితుడు లక్ష్మణరావుకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. ఇటీవలే తండ్రి మరణించడంతో అమ్మమ్మ సావు సింహాచలం వద్ద పెరుగుతున్నాడు. లక్ష్మణరావుకు రామారావు అనే కవల సోదరుడు ఉన్నాడు. వీరిద్దరినీ సింహాచలం కూలీ చేసి పెంచుతోంది. లక్ష్మణరావు బొబ్బిలిలో ఓ ప్రైవేటు ఐటీఐలో చదువుతున్నాడు. ఘటన జరిగిన వెంటనే అందరినీ భయపెట్టి ముందుగా బాడంగి మండలం కోడూరు వెళ్లి తరువాత కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఉంటున్న వరుసకు సోదరుడి ఇంటికి పారి పోయాడు. రంగంలోకి దిగిన పెద్దలు గ్రామపెద్దలు రంగంలోకి దిగారు. గ్రామానికి చెందిన పలువురు పెద్దలు బాధితకుటుంబం తమ గ్రామానికి చెందిన వారు కాకపోవడం, నిందితుడు తమ గ్రామస్తుడు కావడంతో పక్షపాత ధోరణితో వ్యవహరించి లక్ష్మణరావు వద్ద ఏమీ లేదని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా తాము చర్యలు చేపడతామని, లక్ష్మణరావుకు ఏమైనా అయినా, ఆతను ఆత్మహత్యచేసుకున్నా బాధిత కుటుంబానికి సంబంధం లేదని అభయమిస్తూ రాతపూర్వకంగా పెద్దలు అంగీకార పత్రాన్ని రాశారు. ‘సాక్షి’కి సమాచారంతో ఘటన వెలుగులోకి... సంఘటనపై సాక్షికి ఓ వ్యక్తి సోమవారం సమాచారం ఇచ్చారు. వెంటనే పెంట గ్రామానికి వెళ్లగా అలాంటి సంఘటన జరగలేదని, అదంతా కట్టుకథ అని నమ్మించే యత్నం చేశారు. పోలీసులను అడిగినా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. నిందితుడిని కాపాడితే అందరూ ఇబ్బంది పడతారని సాక్షి హెచ్చరించడంతో విషయం బయటకు పొక్కిందనే భయంతో పెద్దలు బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చి బాధిత బాలికను సోమవారం రాత్రి బొబ్బిలి సీహెచ్‌సీలో చేర్పించాలని సలహా ఇచ్చారు. నిందితుడిని ఉయ్యూరునుంచి రావాలని సూచించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి సీహెచ్‌సీలో చేర్పించిన బాధిత బాలికకు ప్రభు త్వ వైద్యులు వైద్యపరీక్షలు చేసి జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని గజపతినగరం మండలం బూర్జవలస పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు తెలిసింది. నిందితుడిపై పోక్సో చట్టం...? పోలీసుల అదుపులో ఉన్న నిందిడుతపై పోక్సో(ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బొబ్బిలి ఏఎస్పీ గౌతమిశాలి ఈ విషయంపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు ఈ నెల 6కు మేజర్ అయినట్లు తెలుస్తోంది. నిందితుడిని బుధవారం ఉదయం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సీఐ మోహనరావు తెలిపారు. కాగా పోలీసులు గ్రామపెద్దలను విచారించారు. -
ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారం
కోల్‌కతాలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన శనివారం సాయంత్రం ఆర్మీ తూర్పు కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లోని మైనర్ బాలిక ఇంట్లో జరిగింది. బాలిక తండ్రి ఆర్మీ ఉద్యోగి కాగా, బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి ఆర్మీలో కింది స్థాయి (గ్రూప్–డీ) ఉద్యోగి. నిందితుడి నివాసం కోల్‌కతా ఫోర్ట్ విలియంలోని బాలిక ఇంటికి అతి సమీపంలోనే ఉంది. అత్యాచారం చేసిన తరువాత అతను పారిపోవడంతో పోలీసులు మంగళవారం పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లలు రక్షణ) చట్టం కింద అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరు పర్చగా, జూన్ 24 వరకు పోలీస్ కస్టడీ విధించింది. -
అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
సాక్షి, కోలారు : బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కర్ణాటకలోని కోలారు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి శనివారం తీర్పు చెప్పారు. కోలారు నగరంలోని కేజీ మోహల్లా వాసి వాజిద్‌ఖాన్ 2015 జనవరి 31న అదే ప్రాంతానికే చెందిన ఓ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో సెషన్స్ న్యాయమూర్తి బి.ఎస్.రేఖ నిందితుడికి పైవిధంగా జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. -
మైనర్‌పై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: నగర శివారులో దారుణం జరిగింది. మాయమాటలు చెప్పి మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. మన్సురాబాద్‌లోని ఆదిత్య నగర్‌కు చెందిన రాకేష్ రెడ్డి(19) ఇంటి పక్కనే ఉంటున్న ఓ మైనర్ బాలికతో చనువుగా ఉండేవాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
తుపాకితో బెదిరించి బాలికపై గ్యాంగ్‌రేప్
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు తుపాకితో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన బాఘ్పట్ సమీపంలోని బదౌత్ ప్రాంతంలో జరిగింది. బాలిక తమ పొలంలోకి వెళ్లినపుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఆ బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ఇంతవరకు ఈ విషయంలో ఎవరినీ అరెస్టు మాత్రం చేయలేదు. -
బాలికపై అత్యాచారం.. ప్రత్యక్ష ప్రసారం!
తన బోయ్‌ఫ్రెండు ఓ బాలికపై అత్యాచారం చేస్తుంటే.. దాన్ని పెరిస్కోప్ అనే యాప్ ద్వారా లైవ్‌లో ప్రపంచం మొత్తానికి చూపించిందో అమ్మాయి. మారినా అలెక్సీవ్నా లోనినా అనే అమ్మాయి, ఆమె 17 ఏళ్ల స్నేహితురాలు కలిసి రేమండ్ బోయ్డ్ గేట్స్ (29) అనే వ్యక్తితో కూర్చుని మద్యం తాగుతున్నారని, ఆ మత్తులోనే అతడు 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఆ లైంగిక దాడి మొత్తాన్ని పెరిస్కోప్ యాప్ ద్వారా లోనినా లైవ్ స్ట్రీమింగ్‌లో ప్రసారం చేసింది. ఈ యాప్‌ను తమ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నవాళ్లు ఎవరైనా ఆ సమయంలో ఆ వీడియో చూడొచ్చన్నమాట. దాంతోపాటు అత్యాచారం జరగడానికి ముందురోజు రాత్రి బాధితురాలి నగ్న ఫొటోలను కూడా ఆమె తీసినట్లు ఆరోపణలున్నాయి. లోనినా స్నేహితులలో ఒకరు పెరిస్కోప్‌లో ఆ లైవ్ వీడియో చూసి, పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. దాంతో లోనినా, గేట్స్ ఇద్దరి మీద ఒక కౌంట్ కిడ్నాప్, రెండు కౌంట్ల అత్యాచారం తదితర నేరాల కింద కేసులు పెట్టారు. నేరం రుజువైతే వారిద్దరికీ 40 ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. -
బాలికపై అత్యాచారం.. నిందితుడి హత్య
హైదరాబాద్: అభం శుభం ఎరుగని అమాయక బాలికపై అత్యాచారం చేసి.. బెయిల్ మీద జైలు నుంచి బయటికొచ్చి తిరుగుతున్న నిందితుడిని బాధితురాలి బంధువులు దాడి చేసి చంపేశారు. హయత్ నగర్ మండలం బలిజగూడలో గత ఏడాది ఏప్రిల్ నెలలో ఆరేళ్ల బాలికపై శ్రీను అనే యువకుడు అత్యాచారం చేశాడు. బాలిక జరిగిన విషయాన్నితన తల్లితండ్రులకు వెల్లడించడంతో వారు హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. కొంత కాలానికి బెయిల్ పై విడుదలైన శ్రీను.. కొన్నాళ్ల పాటు గచ్చిబౌలిలో గడిపి, తర్వాత మళ్లీ హయత్ నగర్ ప్రాంతానికి వచ్చి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న నిందితురాలి బంధువులు కోపంతో రగిలిపోయారు. ఆవేశంతో బాలిక తండ్రి, మేనమామ, ఇద్దరు చిన్నాన్నలు కలిసి సోమవారం మధ్యాహ్నం శ్రీనుపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన నిందితుడు శ్రీను.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడికి పాల్పడిన బాలిక బంధువులు వెంటనే పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. -
ట్యూషన్‌కు వెళ్లి వస్తుంటే గ్యాంగ్ రేప్
ఢిల్లీ శివార్లలో మరో ఘోరం జరిగింది. ఘజియాబాద్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. పదోతరగతి చదువుతున్న ఆ బాలిక.. ప్రైవేటుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా స్కార్పియో వాహనంలో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా ఆమెపై అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను ఆమె ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాధితురాలు ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ట్యూషన్‌కు వెళ్తుంది. బాధితురాలు నిందితులను గుర్తించిందని పోలీసులు తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిందితులు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
బాలికపై సామూహిక అత్యాచారం చేయించిన అత్త
రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. 15 ఏళ్ల బాలికపై ఆమె అత్త మూడు నెలల పాటు ముగ్గురు వ్యక్తులతో అత్యాచారం చేయించింది. దాంతో ఆమె అత్తతో పాటు.. ముగ్గురు వ్యక్తులపై ఐపీసీ, పోస్కో చట్టాల కింద మహిళా పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అందుదేవి అనే సదరు మహిళ.. ఆ బాలికను తనకు తెలిసున్న ముగ్గురు వ్యక్తుల వద్దకు తరచు తీసుకెళ్లేదని, ఇలా మూడు నెలల పాటు ఆమెపై అత్యాచారాలు చేయించిందని మహిళా పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ అనితా రాణి తెలిపారు. నిందితులను రమేష్, నరసింహరాం, రత్నారాంగా గుర్తించారు. ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. -
13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని బదయూ ప్రాంతంలో పదమూడేళ్ల అమ్మాయిని నలుగురు దుండగులు అపహరించి, ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన జరీఫ్నగర్ ప్రాంతంలో జరిగింది. నిందితులలో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. గత రాత్రి బాధితురాలు తమ ఇంట్లో మేడ మీద నిద్రపోతుండగా, దుండగులు వచ్చి ఆమెను అపహరించుకుని వెళ్లి మొత్తం నలుగురూ ఆమెపై అత్యాచారంచేసినట్లు సీనియర్ ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఘోరానికి పాల్పడిన దుండగులను అమిత్, ముక్తియార్, భోలా పండిట్, దన్నులుగా గుర్తించామన్నారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అమిత్, ముక్తియార్లను అరెస్టు చేశామని, మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. -
బెంగళూరులో మరో చిన్నారిపై అత్యాచారం
భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన బెంగళూరులో మరో ఘోరం జరిగింది. నగర శివార్లలోని తన ఇంట్లో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ముందుగా శ్రీనివాస్ అనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించామని, అనంతరం అతడిని అరెస్టు చేశామని డీసీపీ లభు రామ్ తెలిపారు. బాలిక తల్లి ఆమెను స్కూలు నుంచి తీసుకొచ్చి, శ్రీనివాస్ ఇంట్లో వదిలిపెట్టి బయటకు వెళ్లిన తర్వాత ఈ సంఘటన జరిగిందన్నారు. బాలికను ప్రభుత్వాస్పత్రిలో చేర్చి ఆమెకు వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. ఇటీవలే నగరంలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఇద్దరు జిమ్ ట్రైనర్లు అత్యాచారం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సంఘటన ఇంకా మర్చిపోకముందే ఈ దారుణం బయటపడింది. -
తుపాకితో బెదిరించి.. బాలికపై సామూహిక అత్యాచారం
దేశరాజధానిలో అత్యాచారాల పర్వం ఆగడం లేదు. పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న ఓ బాలికను ఆమెకు తెలిసున్న ఐదుగురు కలిసి తుపాకి చూపించి బెదిరించి.. సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తమ్ నగర్ ప్రాంతానికి చెందిన ఈ బాలిక వారం రోజుల క్రితం స్కూలుకు వెళ్తుండగా, దారిలో అటకాయించిన నిందితులు పశ్చిమ ఢిల్లీలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారు. నిందితులు ఐదుగురిలో ముగ్గురు మైనర్లు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తనను తుపాకితో బెదిరించినట్లు బాలిక తన ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది. అత్యాచారం సంఘటనను నిందితులు సెల్ఫోన్లో రికార్డు చేశారని కూడా బాధితురాలు చెప్పింది. అయితే, పోలీసులకు మాత్రం నిందితుల వద్ద తుపాకి ఏమీ దొరకలేదు. తనకు ఒంట్లో బాగోలేదని బాలిక వారం రోజుల తర్వాత చెప్పడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పుడు తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నామని, 20 ఏళ్ల నిందితుడిని వాళ్ల ఇంట్లోనే అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. -
అత్యాచారం చేసి.. ఉరేశారు!!
ఉత్తరప్రదేశ్ పూర్తిస్థాయిలో అత్యాచారాల రాజధానిగా మారిపోయింది. 15 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసి, ఆమెను చెట్టుకు ఉరేశారు. తన కూతురిపై అఘాయిత్యం చేశారని, తర్వాత ఉరేశారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీతాపూర్ జిల్లాలోని మిష్రిఖ్ గ్రామ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బేణీపూర్ మజ్రా సర్సాయ్ వద్ద గల పొలాల్లోకి వెళ్లిన ఆ బాలిక ఇంటికి తిరిగి రాలేదు. తర్వాత ఇంటికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఆమె మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి ఆమెను తరచు వేధించేవాడని, దాని గురించి ఇంట్లో చెబుతానంటే బెదిరించాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు ఫిర్యాదు అందిందని, కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం చేయిస్తామని అన్నారు. బడౌన్ ప్రాంతంలో ఇద్దరు అక్కచెల్లెళ్లపై అత్యాచారం చేసి వారిని హతమార్చిన సంఘటన జరిగి వారం రోజులు కూడా కాకుండానే యూపీలో అనేక అత్యాచారాలు బయటపడుతున్నాయి. -
పేటలో బాలికపై యువకుడు అత్యాచారం
చిలకలూరిపేటలో వడ్డెర కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మైనర్‌పై ఓ యువకుడు అత్యాచారం చేసి పరారైయ్యాడు. దాంతో బాధితురాలు తల్లితండ్రులను ఆశ్రయించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం చేసిన యువకుడి వివరాలను పోలీసులు బాలికను నుంచి సేకరించారు. అనంతరం యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ప్రేమించలేదని బాలికపై గ్యాంగ్ రేప్!
హైదరాబాద్: పాతబస్తీలో 14ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్ జరిగింది. బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన మహబూబ్ అనే యువకుడు హఫీజ్‌బాబానగర్‌లోని తన ఇంట్లో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్నేహితులైన షకీల్, ఇక్బాల్, బషీర్‌లతో కలిసి వారంరోజులపాటు అత్యాచారం చేసి బాలికను శారీరకంగా హింసించారు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. అనంతరం బాలికను బాలానగర్‌లోని ఆమె బంధువుల ఇంటి దగ్గర వదిలి పరారయ్యారు. బాలిక ఇంట్లోకి వెళ్లకముందే షాద్‌నగర్‌కు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యం చేశారు. కూతురు ఆచూకీ తెలియక కంగారుపడిన తల్లిదండ్రులు.. విషయం తెలుసుకుని చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వైద్యచికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. -
ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్టు
ఆరేళ్ల బాలికపై ఆమె ఇంట్లోనే అత్యాచారం చేసిన కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 31 రాత్రి అందరూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఈ దారుణం జరిగింది. వలీ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ముగ్గరు పిల్లలు తమ ఇంట్లో పడుకుని ఉండగా చూశాడు. ఆ ఇంట్లో అప్పటికి పెద్దవాళ్లు ఎవరూ లేరు. దీంతో ఇంట్లోకి వెళ్లి ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సంఘటన జరిగే సమయానికి బాలిక తల్లిదండ్రులు ఆలయానికి వెళ్లారని ఆయన చెప్పారు. ఈ సంఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తెలిపిన పోలికల ఆధారంగా పోలీసులు వలీని అరెస్టు చేశారు. నిర్భయ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. -
బాలికపై అత్యాచారం: పోలీసు అధికారి అరెస్టు
కంచే చేను మేసింది. కనురెప్పే కాటేసింది. త్రిపురలో ఓ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ ఓ బాలికపై అత్యాచారం చేసి అరెస్టయ్యాడు. ఈ సంఘటన దక్షిణ త్రిపురలో జరిగింది. గోమతి జిల్లాలోని పిత్రా పట్టణంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న మంగళ్ దేవ్ వర్మ 11వ తరగతి చదువుతున్న అమ్మాయిపై అత్యాచారం చేసినందుకు ఆయనను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జ్ఞాన తిరు సంబంధన్ తెలిపారు. దేవ్ వర్మను మంగళవారం నాడు కోర్టులో హాజరు పరిచారు.అతడిని సర్వీసు నుంచి సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు. శనివారం రాత్రి ఇటుక బట్టీల వద్ద జరిగిన ఈ సంఘటనను తొక్కిపెట్టేందుకు కొందరు పోలీసు అధికారులు ప్రయత్నించారన్న ఆరోపణలపై కూడా దర్యాప్తు జరిపిస్తున్నామని ఎస్పీ తెలిపారు. అమ్మాయి కుటుంబం దేవ్ వర్మకు ముందునుంచి తెలుసు. దాంతో ఆమెను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని, ఇటుకబట్టీల వద్దకు తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారం చేశాడు. అటువైపు వేరేవాళ్లు వెళ్తుండగా అమ్మాయి అరవడంతో వాళ్లు వచ్చి రక్షించారు. దేవ్ వర్మ అక్కడినుంచి వెంటనే పారిపోయాడు. ఈ కేసు నమోదుచేసుకోడానికి మొదట్లో రాధా కిషోర్‌పూర్ పోలీసులు నిరాకరించారు. కానీ, మహిళా పోలీసు స్టేషన్ అధికారులు జోక్యం చేసుకోవడంతో కేసు నమోదైంది.