సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/భీమిని: వరసకు అన్నయ్య అయ్యే ఓ బాలుడు, అతని స్నేహితుడు కలసి మూడేళ్ల పిల్లాడి కళ్ల ముందే 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపారు. దీన్ని వీడియో కూడా తీశారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి ఫిర్యాదు ప్రకారం.. నెన్నెల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఇంట్లో వరసకు కొడుకైన ఓ బాలుడు ఆటో నడుపుతూ నాలుగు నెలలుగా ఉంటున్నాడు.
మూడు నెలల క్రితం సదరు వ్యక్తి కూతురుని, మూడేళ్ల బాబును మంచినీళ్లు తీసుకొద్దామని ఆ బాలుడు ఆటోలో బోరింగ్ పంపు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడికి మరో బాలుడు వచ్చాడు. అక్కడి నుంచి నలుగురు ఆటోలో గ్రామ శివారులోని శ్మశాన వాటిక వైపు వెళ్లారు. అక్కడ మూడేళ్ల బాబు సమక్షంలోనే ఇద్దరు బాలురు ఆటో వెనక సీటులో ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం చేస్తూ సెల్‌ఫోన్‌లో వీడియోలు తీశారు. వాటిని స్నేహితులకు పంపారు.
ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను బెదిరించడంతో విషయం బయటపడలేదు. రెండు రోజుల క్రితం బాలిక.. తన అమ్మమ్మకు ఈ దారుణం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడుకులా భావించి ఇంట్లో ఉంచుకుంటే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. నిందితులు పరారీలో ఉన్నారు.
చదవండి:మరో నిర్భయ.. రన్నింగ్ రైలులో మహిళపై అత్యాచారయత్నం.. ఆ తర్వాత..
Comments
Please login to add a commentAdd a comment