గువాహటి: అస్సాం కాఛార్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. 26 ఏళ్ల యువకుడు మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెకు గాయాలు చేసి బ్యాగులో బంధించాడు. ఆ తర్వాత తీసుకెళ్లి అడవిలో వదిలేసి వచ్చాడు. అయితే అదృష్టవశాత్తు బాలిక ఎలాగోలా బ్యాగు నుంచి బయటపడింది. చాకచక్యంగా తప్పించుకుని తిరిగి ఇంటికి చేరుకుంది. గాయాలపాలైన ఆమెను తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటోంది.
అయితే బాధితురాలు తన ప్రేయసి అని నిందితుడు చెప్పాడని పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 3న దుర్గా పూజ పండల్‌కు మరొకరితో ఆమె వెళ్లిందని, ఇది తెలిసి ఆగ్రహంతో నిందితుడు ఆమెను అపహరించి అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు వివరించారు. అక్టోబర్ 3న ఇంటి నుంచి వెళ్లిన తమ బిడ్డ తిరిగి రాకపోవడంతో తల్లిదంద్రులు 4న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే అదే రోజు బాలిక గాయాలతో ఇంటికి తిరిగివచ్చి జరిగిన విషయం చెప్పింది. నిందితుడు తమ బిడ్డను గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిందితుడ్ని అక్టోబర్ 6న అరెస్టు చేశారు.
చదవండి: Bus Accident: ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం
Comments
Please login to add a commentAdd a comment