Cachar district
-
అస్సాంలో ఎన్కౌంటర్
అస్సాం: రాష్ట్రంలోని కాచర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్పీ నుమాల్ మహట్టా తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాపూర్ రోడ్డు ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులకు సమాచారం అందింది. మంగళవారం కాచర్‌లోని ధలై గంగా నగర్లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ఏకే రైఫిళ్లను, ఒక సాధారణ రైఫిల్, ఒక పిస్టల్‌ను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పట్టుబడిన ముగ్గురూ హ్మార్ తీవ్రవాద సంస్థలో శిక్షణ పొందిన క్యాడర్‌గా ప్రాథమిక విచారణలో తేలింది. భుబన్ హిల్స్‌లోని సమీపంలోని అడవిలో మరికొందరున్నట్టు, అసోం–మణిపూర్ సరిహద్దుల్లో విధ్వంసాలకు సిద్ధమవుతున్నట్లు పట్టుబడిన ముగ్గురు వెల్లడించారు. దీంతో బుధవారం తెల్లవారుజామున అదనపు ఎస్పీ నేతృత్వంలోని బృందం అరెస్టయిన ఉగ్రవాదులతో పాటు భుబన్ హిల్స్‌లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సమయంలో భుబన్హిల్స్లో ఉన్న కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. గంటపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఇద్దరు కాచర్‌కు చెందినవారు కాగా ఒకరు మణిపూర్‌కు చెందినవారు. మరో ఆరు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు తప్పించుకున్నారు. వారికోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. -
మైనర్‌పై అత్యాచారం చేసి బ్యాగులో బంధించిన నిందితుడు
గువాహటి: అస్సాం కాఛార్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. 26 ఏళ్ల యువకుడు మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెకు గాయాలు చేసి బ్యాగులో బంధించాడు. ఆ తర్వాత తీసుకెళ్లి అడవిలో వదిలేసి వచ్చాడు. అయితే అదృష్టవశాత్తు బాలిక ఎలాగోలా బ్యాగు నుంచి బయటపడింది. చాకచక్యంగా తప్పించుకుని తిరిగి ఇంటికి చేరుకుంది. గాయాలపాలైన ఆమెను తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటోంది. అయితే బాధితురాలు తన ప్రేయసి అని నిందితుడు చెప్పాడని పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 3న దుర్గా పూజ పండల్‌కు మరొకరితో ఆమె వెళ్లిందని, ఇది తెలిసి ఆగ్రహంతో నిందితుడు ఆమెను అపహరించి అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు వివరించారు. అక్టోబర్ 3న ఇంటి నుంచి వెళ్లిన తమ బిడ్డ తిరిగి రాకపోవడంతో తల్లిదంద్రులు 4న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే అదే రోజు బాలిక గాయాలతో ఇంటికి తిరిగివచ్చి జరిగిన విషయం చెప్పింది. నిందితుడు తమ బిడ్డను గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిందితుడ్ని అక్టోబర్ 6న అరెస్టు చేశారు. చదవండి: Bus Accident: ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం -
13 కోతులు మృతి: విషం పెట్టి చంపారా?
దిస్పూర్: మానవ మృగాల చేతిలో వన్యప్రాణులు ప్రాణాలు విడుస్తున్నాయి. కేరళలో గర్భిణీ ఏనుగు హత్యోదంతం మరువకముందే అస్సాంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కచార్ జిల్లాలోని ఓ గ్రామంలో తాగునీటిని సరఫరా చేసే రిజర్వాయర్‌లో సోమవారం 13 కోతుల మృతదేహాలు వెలుగు చూశాయి. తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ప్లాంటులో ఎవరో దుండగులు కావాలనే ఈ పని చేసినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. నీటిలో విషం కలిపి వాటిని చంపివేసి ఉండొచ్చని భావిస్తున్నారు. (వైరల్: చిరుతను చంపి ఊరేగించారు) మరోవైపు కోతుల మృత దేహాలను అటవీశాఖ అధికారులు పోస్టుమార్టమ్‌కు తరలించారు. దాని ఫలితాలు వచ్చాకే కోతుల మృతిపై పూర్తి స్పష్టత రానుంది. ఈ ఘటనపై పశువైద్య అధికారి రుబెల్ దాస్ మాట్లాడుతూ.. "తాగునీటి ప్లాంట్‌లో 13 కోతులు విగతజీవులుగా తేలాయి. వాటి శరీరంలో విషపు అవశేషాలున్నట్లు తెలుస్తోంది" అని పేర్కొన్నారు. ఇక తాగునీటి కోసం జలాశయంపై ఆధారపడ్డ స్థానికులు ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. (వన్యప్రాణులు గజ గజ!) -
అసోంలో ఉద్రిక్తత: 30 మందికి గాయాలు
చాచర్ జిల్లాలో రంగ్‌పూర్ ప్రాంతంలో గత అర్థరాత్రి అల్లర్లకు పాల్పడుతున్న ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 30 మంది గాయపడ్డారని అసోం రాష్ట్ర ఉన్నతాధికారులు సోమవారం ఇక్కడ తెలిపారు. గాయపడిన వారిలో ఎస్పీతోపాటు ఏడుగురు పోలీసులు ఉన్నారని తెలిపారు. వారిని హుటాహుటిన సిల్చర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించామని చెప్పారు.వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారని వెల్లడించారు. రంగ్‌పూర్ పరిసర ప్రాంతంలో గతరాత్రి మతపరమైన పుకార్లు వ్యాపించాయి. దీంతో కొంత మంది అకతాయిలు నడివిధుల్లో ఆందోళనకు దిగారు. అందులోభాగంగా వాహనాలను ధ్వంసం చేయడం, పలువురిపై రాళ్ల దాడికి దిగారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి అకతాయిలను కట్టడి చేసేందుకు గాలిలోకి కాల్పులు జరిపామని, అలాగే భాష్పవాయివు ప్రయోగించామని చెప్పారు. అయిన ఫలితం లేకపోవడంతో ఆందోళనకారులపై కాల్పులు జరపక తప్పలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం స్థానికంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న బారీ బలగాలను మోహరించామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ఉన్నాతాధికారులు చెప్పారు.