చాచర్ జిల్లాలో రంగ్పూర్ ప్రాంతంలో గత అర్థరాత్రి అల్లర్లకు పాల్పడుతున్న ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 30 మంది గాయపడ్డారని అసోం రాష్ట్ర ఉన్నతాధికారులు సోమవారం ఇక్కడ తెలిపారు. గాయపడిన వారిలో ఎస్పీతోపాటు ఏడుగురు పోలీసులు ఉన్నారని తెలిపారు. వారిని హుటాహుటిన సిల్చర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించామని చెప్పారు.వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారని వెల్లడించారు.
రంగ్పూర్ పరిసర ప్రాంతంలో గతరాత్రి మతపరమైన పుకార్లు వ్యాపించాయి. దీంతో కొంత మంది అకతాయిలు నడివిధుల్లో ఆందోళనకు దిగారు. అందులోభాగంగా వాహనాలను ధ్వంసం చేయడం, పలువురిపై రాళ్ల దాడికి దిగారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి అకతాయిలను కట్టడి చేసేందుకు గాలిలోకి కాల్పులు జరిపామని, అలాగే భాష్పవాయివు ప్రయోగించామని చెప్పారు.
అయిన ఫలితం లేకపోవడంతో ఆందోళనకారులపై కాల్పులు జరపక తప్పలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం స్థానికంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న బారీ బలగాలను మోహరించామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ఉన్నాతాధికారులు చెప్పారు.