దిస్‌పూర్: మానవ మృగాల చేతిలో వన్యప్రాణులు ప్రాణాలు విడుస్తున్నాయి. కేరళలో గర్భిణీ ఏనుగు హత్యోదంతం మరువకముందే అస్సాంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కచార్ జిల్లాలోని ఓ గ్రామంలో తాగునీటిని సరఫరా చేసే రిజర్వాయర్‌లో సోమవారం 13 కోతుల మృతదేహాలు వెలుగు చూశాయి. తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ప్లాంటులో ఎవరో దుండగులు కావాలనే ఈ పని చేసినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. నీటిలో విషం కలిపి వాటిని చంపివేసి ఉండొచ్చని భావిస్తున్నారు. (వైరల్: చిరుతను చంపి ఊరేగించారు)
మరోవైపు కోతుల మృత దేహాలను అటవీశాఖ అధికారులు పోస్టుమార్టమ్‌కు తరలించారు. దాని ఫలితాలు వచ్చాకే కోతుల మృతిపై పూర్తి స్పష్టత రానుంది. ఈ ఘటనపై పశువైద్య అధికారి రుబెల్ దాస్ మాట్లాడుతూ.. "తాగునీటి ప్లాంట్‌లో 13 కోతులు విగతజీవులుగా తేలాయి. వాటి శరీరంలో విషపు అవశేషాలున్నట్లు తెలుస్తోంది" అని పేర్కొన్నారు. ఇక తాగునీటి కోసం జలాశయంపై ఆధారపడ్డ స్థానికులు ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. (వన్యప్రాణులు గజ గజ!)
Comments
Please login to add a commentAdd a comment