reservoir
-
సాగర్‌కు ‘బొల్లపల్లి’ గండి!
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద జలాలను కుడికాల్వ ద్వారా తరలించి గుంటూరు జిల్లాలో నిర్మించబోయే బొల్లపల్లి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తామని తాజాగా ఏపీ ప్రతిపాదించింది. ఇందుకోసం కుడికాల్వ(జవహర్ కాల్వ)ను 96.5 కి.మీ.ల వరకు వెడల్పు పెంచి అక్కడి నుంచి వరద జలాలను లిఫ్ట్ చేస్తామని ఏపీ చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణమే తమ వ్యతిరేకతను తెలపడంతోపాటు ఈ ప్రాజెక్టు చేపట్టే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, గోదావరి, కృష్ణా బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి లేఖలు రాయనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని గోదావరి బోర్డుకు ఇప్పటికే ప్రభుత్వం లేఖ రాసింది. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలింపు నాగార్జునసాగర్ కుడికాల్వ కింద ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11.18 లక్షల ఎకరాలు, ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 10.39 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్‌కు 9 స్లూయిస్ గేట్లు ఉండగా, గేట్లన్నింటినీ 520 అడుగుల మేర పైకి లేపితే గరిష్టంగా 33,147 క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోవచ్చు. ప్రస్తుతం కుడి కాల్వ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే ఉంది. హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంచకుండానే కుడికాల్వ సామర్థ్యాన్ని 33 వేల క్యూసెక్కులకు పెంచుకున్నా, 11 వేల క్యూసెక్కులను యథాతథంగా ఆయకట్టుకు సరఫరా చేసి మిగిలిన 22 వేల క్యూసెక్కులను బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించవచ్చని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 2019 నుంచి 2024 వరకు గడిచిన ఆరేళ్లలో ఏకంగా ఐదేళ్లు కృష్ణానదిలో మిగులు జలాల లభ్యత ఉందని, ప్రకాశం బరాజ్ నుంచి సముద్రంలోకి నీరు వృథాగా పోయిందని కేంద్రానికి తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నుంచి బొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటి తరలింపుతో పోల్చితే నాగార్జునసాగర్ నుంచి తరలిస్తేనే తక్కువ వ్యయం అవుతుందని స్పష్టం చేసింది. నీటి లభ్యత బాగా ఉన్న సమయాల్లో సాగర్ నుంచి (తమ వాటా) జలాలను తరలించి బొల్లపల్లి రిజర్వాయర్‌లో నిల్వ చేసుకుంటే వర్షాభావ సీజన్లలో క్యారీ ఓవర్ జలాలుగా వాడుకోగలమని తెలిపింది. కృష్ణా, గోదావరి పరీవాహకంలో చిట్టచివరి రాష్ట్రం కావడంతో తమకు రెండింటి మిగులు జలాలను వాడుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. రెండు నదుల మిగులు జలాలను నిల్వ చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంటుందని తెలియజేసింది. నికర జలాల తరలింపునకే ! వరదల సమయంలో నాగార్జునసాగర్ నుంచి మిగులు జలాలను బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్టు ఏపీ పేర్కొంటున్నా, నికర జలాలను సైతం తరలించుకుంటుందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భవిష్యత్‌లో సాగర్ కుడికాల్వ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాగార్జునసాగర్ నిర్వహణ తెలంగాణ పరిధిలో ఉండగా, ఏడాది కింద ఏపీ సగం ప్రాజెక్టును తన అధీనంలోకి తీసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకుంటామని కేంద్రం ప్రతిపాదించగా, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. మళ్లీ తాజాగా సాగర్‌ను బొల్లపల్లి రిజర్వాయర్‌తో అనుసంధానం చేయాలని ఏపీ ప్రతిపాదించడంతో భవిష్యత్‌లో సాగర్ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 8.1 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా, గోదావరి నుంచి ఏకకాలంలో తరలింపు గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును మూడు విభాగాల్లో (సెగ్మెంట్స్) వి భజించి ఏపీ ప్రతిపాదించింది. తొలి విభా గం కింద పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 17,500 నుంచి 38,000 క్యూసెక్కులకు, తాడిçపూడి ఎత్తిపోతల పథకం కాల్వ సామర్థ్యాన్ని 1,400 నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచనుంది. అనంతరం పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ రెండు కాల్వల ద్వారా నీటిని సమాంతరంగా తరలించి బుడమేరు డైవర్షన్ కెనాల్లోకి వేసి అక్కడి నుంచి కృష్ణా నదిలోకి విడుదల చేస్తామని ఏపీ తెలిపింది.రెండో సెగ్మెంట్ కింద కృష్ణాన ది నుంచి 28,000 క్యూసెక్కులను ఆరు దశల్లో మొత్తం 127 మీటర్లు లిప్ట్ చేసి బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించనుంది. ఇందుకోసం 150 టీఎంసీల భారీ సామర్థ్యంతో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ఏపీ ప్రతిపాదించింది. భవిష్యత్ అవసరాల ను తీర్చడానికి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 400 టీఎంసీలకు పెంచే వీలుందని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా నా గార్జునసాగర్ కుడికాల్వ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామని మరో లింక్‌ను ప్రతిపాదించింది. ఇక మూడో సెగ్మెంట్ కింద బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 3 దశల్లో లిఫ్ట్ చేసి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలిస్తామని పేర్కొంది.ప్రాజెక్టు వ్యయం రూ.80 వేల కోట్లురోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలను తరలించడానికి ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 40,500 ఎకరాల భూసేకరణ, 17,000 ఎకరాల అటవీ భూములు కావాలి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,112 కోట్లు కాగా, లిఫ్టుల నిర్వహణకు 4,125 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. -
కరువు నేలకు జల సవ్వడి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువుకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. కృష్ణమ్మ బిరబిరా తరలివచ్చి కరువు నేల దాహార్తిని తీర్చనుంది. దాదాపు 100 గ్రామాలను సస్యశ్యామలం చేయనున్న ఉదయసముద్రం (బ్రాహ్మణ వెల్లెంల) ఎత్తిపోతల ప్రాజెక్టులో కీలకమైన రిజర్వాయర్ నిర్మాణం పూర్తైంది. నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. కాల్వల తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులు పూర్తికాగానే కరువు నేలపై కృష్ణమ్మ ఉరకలెత్తనుంది. ఈ ప్రాంతానికి సాగునీటిని అందించటంతోపాటు భూగర్భ జలాలు పెరిగి ఫ్లోరైడ్ సమస్యకూ పరిష్కారం లభించనుంది.వైఎస్ చొరవతో ప్రాజెక్టు మంజూరునల్లగొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని పలు మండలాలకు జీవనాధారమైన ఈ ప్రాజెక్టును 2007లో ఎమ్యెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టుబట్టి సాధించారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి మంజూరు చేయించారు. బ్రాహ్మణ వెల్లెంల గ్రామ శివారులో 2007లో ఈ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేయగా, రూ.699 కోట్లతో 2008లో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.2009లో పనులు ప్రారంభమయ్యాయి. ఉదయసముద్రం నుంచి అప్రోచ్ చానల్, సొరంగం, పంప్‌హౌస్ నిర్మాణం, మోటార్ల ట్రయల్ రన్, 486 ఎకరాల్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి కీలక పనులు పూర్తయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఈ రిజర్వాయర్‌లోకి 0.302 టీఎంసీల నీటిని ఎత్తిపోసే పనులను ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తి స్వరూపం ఇదీ..ఏఎంఆర్‌పీలో భాగంగా నాగార్జునసాగర్ వెనుక జలాలు పానగల్‌లోని ఉదయ సముద్రం రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి. దాని పైభాగాన ఉన్న దండంపల్లి గ్రామం సమీపం నుంచి అప్రోచ్ చానల్ ప్రారంభమై 6.9 కిలోమీటర్ల దూరంలోని కట్టంగూరు మండలం పిట్టంపల్లి గ్రామం వద్దకు నీరు వస్తోంది. అక్కడి నుంచి 10.625 కిలోమీటర్ల పొడవున సొరంగం ద్వారా నీరు నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామం వద్ద ఉన్న సర్జ్పూల్కు చేరుతుంది. అక్కడి నుంచి రెండు మోటార్లతో 86 మీటర్ల ఎత్తుకు పంపింగ్ చేసి 1.12 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన రెండు డెలివరీ పైపుల ద్వారా బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రధాన కుడి, ఎడమ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పనులు కొంత వరకే అయ్యాయి. వాటికి సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపు, కాల్వల తవ్వకం, లైనింగ్ చేయాల్సి ఉంది. -
పూడికతీతకు పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: జలాశయాల్లో పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జాతీయ విధానాన్ని రాష్ట్రంలో అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఆ మేరకు చేసిన సిఫారసుల ఆధారంగా ఒక జలాశయంలో పైలట్ ప్రాజెక్టుగా పూడిక తొలగింపును చేపట్టడానికి అనుమతిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూడికతీత కోసం రాజస్థాన్, మహారాష్ట్రల తరహాలో ఆదాయ అర్జన విధానంలో భారీ యంత్రాలతో తవ్వకాలు (మెకానికల్ డ్రెడ్జింగ్) నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసింది.అంటే దీనికోసం ప్రభుత్వం ఖర్చు చేయదు..పైగా ప్రభుత్వానికే ఆదాయం రానుంది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) త్వరలో ఏదైనా ఒక జలాశయంలో పూడికతీతకు టెండర్లను ఆహా్వనించి అత్యధిక ధరను కోట్ చేసిన బిడ్డర్‌కు పూడికతీత పనులను అప్పగించే అవకాశం ఉంది. బిడ్డర్ పన్నులు, సెస్, జీఎస్టీ, రాయలీ్టని చెల్లించి తవి్వన మట్టి, ఇసుకను విక్రయించుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర జలాశయాల్లో సైతం పూడిక తొలగింపునకు ఇదే మోడల్‌ను అనుసరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తదుపరిగా అనుమతి ఇవ్వనుంది. సగానికి పైగా జలాశయాల్లో భారీగా పూడిక ⇒ రాష్ట్రంలో మొత్తం 929 టీఎంసీల సామర్థ్యం కలిగిన 159 భారీ జలాశయాలున్నాయి. సగానికి పైగా జలాశయాలు 25 ఏళ్లకు పైబడినవే కావడంతో భారీగా పూడిక పేరుకుపోయింది. ⇒ జలాశయాల్లో పూడిక పెరగడంతో క్రమంగా అవి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. తద్వారా ఆయకట్టుకు అవసరమైన సాగునీటికి, అలాగే తాగునీటి సరఫరాలో సైతం లోటు ఏర్పడుతోంది. పర్యావరణ సమస్యలూ తలెత్తుతున్నాయి. ⇒ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా 220 టీఎంసీల సామర్థ్యం కలిగిన 14 ప్రాజెక్టులపై అధ్యయనం జరపగా, పూడికతో అవి 35 టీఎంసీల (16 శాతం) నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయినట్టు తేలింది. ⇒ దేశంలో పీఎం కిసాన్ సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) మార్గదర్శకాల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన కొత్త జలాశయాన్ని నిర్మించాలంటే రూ.162 కోట్లు కావాల్సి ఉంటుంది. సిఫారసులు ఇలా.. ⇒ జలాశయాలు, డ్యామ్‌లు, ఆనకట్టలు, బరాజ్‌లు, నదులు, కాల్వల్లో పూడికతీత పనులకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కేంద్రం ఈ మేరకు మినహాయింపు ఇచి్చంది. పూడికతీత ద్వారా వాటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించాలి. ⇒ ్శనీటిపారుదల, గనుల శాఖలు సమావేశమై ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే పూడికతీత చేపట్టిన రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి. ⇒ సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూడికతీత జరగాలి. వాటి రక్షణ విషయంలో రాజీపడరాదు. ⇒ పూడికతీతలో సారవంతమైన మట్టిని వెలికి తీస్తే రైతాంగానికి ఉచితంగా సరఫరా చేయాలి. రవాణా చార్జీలు రైతులే భరించాలి. -
జలాశయాల్లో పూడికతీత
సాక్షి, హైదరాబాద్: రాజస్తాన్, మహారాష్ట్రల తరహా రాష్ట్రంలోని జలాశయాల్లో పూడిక తొలగించనున్నారు. ఇందుకోసం భారీ యంత్రాలతో తవ్వకాలు (మెకానికల్ డ్రెడ్జింగ్) జరిపే పనులను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ విధానంలో పూడికతీతకు ప్రభుత్వం ఎలాంటి ఖర్చు చేయదు. పైగా ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ఆధ్వర్యంలో టెండర్లు ఆహ్వానించి అత్యధిక ధర కోట్ చేసిన బిడ్డర్‌కు పూడికతీత పనులు అప్పగించే అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది.బిడ్డర్ పన్నులు, సెస్, జీఎస్టీ, రాయల్టీని పనులు దక్కించుకున్న వారు చెల్లించాల్సి ఉంటుంది. తవ్విన మట్టి, ఇసుకను బిడ్డర్ విక్రయించుకోవచ్చు. అయితే ఈ మోడల్ అమలుపై తుది నిర్ణయం తీసుకోలేదు. జలాశయాల్లో పూడిక తొలగింపుపై కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జాతీయ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ఉత్తమ్ నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. అనేక అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. ⇒ రాష్ట్రంలో మొత్తం 929 టీఎంసీల సామర్థ్యం కలిగిన 159 భారీ జలాశయాలున్నాయి. సగానికి పైగా జలాశయాలు 25 ఏళ్లకు పైబడినవే కావడంతో భారీగా పూడిక పేరుకుపోయింది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా 220 టీఎంసీల సామర్థ్యం కలిగిన 14 ప్రాజెక్టులపై అధ్యయనం జరపగా, పూడికతో అవి 35 టీఎంసీల (16శాతం) నిల్వ సామర్థ్యం కోల్పోయినట్టు తేలింది. ⇒ పూడికతో ఏటా ప్రపంచవ్యాప్తంగా రిజర్వాయర్లు 0–5 శాతం వరకు నిల్వ సామర్థ్యాన్ని నష్టపోతున్నాయి. ⇒ పీఎం కిసాన్ సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) మార్గదర్శకాల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన కొత్త జలాశయం నిర్మించడానికి రూ.162 కోట్లు కావాలి. ⇒ జలాశయాల్లో పూడిక పెరగడంతో నిల్వ సామర్థ్యాన్ని నష్టపోతున్నాయి. వాటి రక్షణపై ప్రభావం చూపడంతోపా టు ఆయకట్టుకు సాగునీరు, తాగునీటి సరఫరాలో లోటు ఏర్పడుతోంది. పర్యా వరణ సమస్యలూ తలెత్తుతున్నాయి. ⇒ జలాశయాలు, డ్యామ్‌లు, ఆనకట్ట లు, బరాజ్‌లు, నదులు, కాల్వల్లో పూడికతీత పనులకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరముండదు. కేంద్రం మినహాయింపు కల్పించింది. పూడికతీత ద్వారా వాటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించాలి. ⇒ నీటిపారుదల, గనుల శాఖలు సమావేశమై ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈనెల 14న సమగ్ర నివేదిక సమర్పించాలి. పూడికతీత చేపట్టిన రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి. ⇒సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూడికతీత జరగాలి. వాటి రక్షణ విషయంలో రాజీ పడరాదు. ⇒ పూడికతీతలో సారవంతమైన మట్టిని వెలికితీస్తే రైతాంగానికి ఉచితంగా సరఫరా చేయాలి. రవాణా చార్జీలు రైతులే భరించాలి. ⇒ పూడికతీతతో వెలికితీసే ఇసుకను ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి వాడాలి. మట్టిని ఎప్పటికప్పుడు ఇతర చోట్లకు తరలించాలి. -
డెడ్ స్టోరేజీతో బోసిపోతున్న మానేర్ రిజర్వాయర్
-
శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్‌లో గుర్రపు డెక్క
-
కెన్యాలో కూలిన డ్యామ్
నైరోబీ(కెన్యా): ఆఫ్రికా దేశం కెన్యాలో జలాశయం ధ్వంసమై నివాసప్రాంతాలను ముంచెత్తడంతో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 49 మంది గల్లంతయ్యారు. సుమారు 109 మంది గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. తరచూ ఆకస్మిక వరదలు సంభవించే గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో సోమవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మయి మహియులో ఇటీవలి వర్షాలకు పొంగి పొర్లుతున్న పాత కిజాబె డ్యాం ఆనకట్ట కొట్టుకుపోయింది. దీంతో వరద ఒక్కసారిగా నివాస ప్రాంతాలను ముంచెత్తిందని, ప్రధాన రహదారి కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో వరద పోటెత్తడంతో కొన్ని విమానాలను దారి మళ్లించారు. -
తెలంగాణకు 8.5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: వేసవి తాగునీటి అవసరాలకు తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయపురే నేతృత్వంలో ఈ ముగ్గు రు సభ్యుల కమిటీ శుక్రవారం జలసౌధలో ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డితో రాయపురే 2 గంటలకు పైగా చర్చించారు. తుదకు శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటి నిల్వలను వినియోగించుకోవద్దని నిర్ణ యించారు. సాగర్ రిజర్వాయర్‌లోని నీటి నిల్వలపై చర్చించారు. సాగర్ ఎండీడీఎల్ 510 ఫీట్లు కాగా, గతంలో 505 ఫీట్ల వరకు అందుబాటులో ఉన్న నీటిని లెక్కగట్టి ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. తాజా సమావేశంలో దీన్ని 500 అడుగులకు తగ్గించారు. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 510.53 అడుగులు కాగా, 132.86 టీఎంసీలు అందుబాటులో ఉన్నా యి. అందులో 500 అడుగుల ఎండీడీఎల్ మేరకు మొత్తం 17.55 టీఎంసీలు ప్రస్తుతం వినియోగానికి అందుబాటు లో ఉన్నాయి. అందులో 3.55 టీఎంసీలను భవిష్యత్ అవసరాలకు మినహాయించి మిగతా 14 టీఎంసీలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. తదుపరి అవసరాలపై మేలో సమా వేశం కావాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. రెండు రాష్ట్రాల విజ్ఞప్తితో.. మే మాసాంతం వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ గత అక్టోబర్‌లో చివరి సారిగా సమావేశమైంది. శ్రీశైలం ప్రాజెక్టు కనీస మట్టం (ఎండీడీఎల్)ను 805 ఫీట్లు, సాగర్ ఎండీడీఎల్‌ను 505 ఫీట్లకు నిర్ణయించి, వేసవి ఆవిరి నష్టాలను కూడా లెక్కగట్టి రెండు జలాశయాల్లో 92.78 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్టు నిర్ధారించింది. అయినప్పటికీ మే మాసాంతం వరకు మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 82.78 టీఎంసీలనే వినియోగించాలని అప్పట్లో కమిటీ నిర్ణయించింది. అందులో 2.78 టీఎంసీలను జూన్, జూలై తాగునీటి అవసరాల కోసమని రిజర్వ్ చేసింది. మిగిలిన 80 టీఎంసీల్లో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి కేటాయించిన విషయం విదితమే. కాగా కమిటీ నిర్ణయించిన కోటాకు మించి తెలంగాణ ఇప్పటికే 11 టీఎంసీలను వినియోగించుకుంది. ఏపీ కోటా మేరకు వినియోగించుకుంది. అయితే ఇరు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు అదనంగా జలాలను విడుదల చేయాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంది. సమావేశంలో సాగర్ సీఈ అజయ్‌కుమార్, ఈఈ విజయ్‌భాస్కర్, కృష్ణా బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సల్లా విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో మంచినీటి కొరత ఎక్కువగా ఉంది: ఈఎన్సీ త్రిసభ్య కమిటీ సమావేశంలో కేవలం తాగునీటి అంశంపైనే చర్చించామని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశానంతరం చెప్పారు. 2 రాష్టాల అంగీకారంతో నీటి వాటాల పంపిణీ జరిగిందని తెలిపారు. ఏపీలో మంచినీటి కొరత కొంత ఎక్కువగా ఉందని వివరించారు. -
ఆ గ్రామాల్లో ఎక్కడ చూసినా ఊటలే!.. నీటి ఊటతో కూలుతున్న ఇళ్లు
మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని సంగంబండ, భూత్పుర్ రిజర్వాయర్ల ముంపు బాధితులకు మరో ముప్పు వచ్చి పడింది. ఉబికి వస్తున్న నీళ్లతో కునుకు లేని రాత్రులు గడపాల్సి వస్తోంది. నీటి ఊటలతో నివాసగృహాలు ధ్వంసమై కూలిపోతున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన దుస్థితి నెలకొంది. ఇది మక్తల్ మండలం భూత్పుర్, మాగనూర్ మండలం నేరడుగాం ముంపు గ్రామాల ప్రజల దయనీయ పరిస్థితి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్యతో సతమతమవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అందని పరిహారం.. 2010 నవంబర్ 3న భూత్పుర్‌ను ముంపు గ్రామంగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. గ్రామంలో 2,400 మంది జనాభా ఉంది. భూత్పుర్ రిజర్వాయర్‌లో 530 ఇళ్లు, 2,500 ఎకరాలు మునకకు గురవుతాయని అధికారులు గుర్తించారు. ఈ మేరకు అప్పట్లో ప్రభుత్వం తరి పొలానికి రూ.80 వేలు, మెట్టభూమి ఎకరాకు రూ.50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించింది. ఇళ్లు కోల్పోతున్న బాధితులకు నేటి వరకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరగడంతో గ్రామంలోకి నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుకుసాగని పునరావాసం పనులు.. భూత్పుర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు 2015లో అధికారులు స్థలం ఎంపిక చేయగా.. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోవడం, పునరావాస కేంద్రంలో ఎలాంటి వసతులు లేకపోవడంతో ముంపు గ్రామంలోనే నివాసముంటున్నారు. కొన్ని రోజులుగా రిజర్వాయర్ నీళ్లు ఇళ్లలోకి వస్తుండటంతో నిర్వాసితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నేరడుగం నిర్వాసితుల గోస.. సంగంబండ రిజర్వాయర్‌కు కట్టకింద ఉన్న నేరడుగాం గ్రామంలో దాదాపు 2,200 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో 2,800 ఎకరాలు రిజర్వాయర్‌లో, 300 ఎకరాలు కాల్వల్లో ముంపునకు గురికాగా.. నేటి వరకు నష్టపరిహారం అందలేదు. అదేవిధంగా 746 ఇళ్లు రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించి, నంబరింగ్ ఇచ్చారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకుగాను 150 ఎకరాలు అవసరమని తేల్చారు. అయితే నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడంతో ముంపు గ్రామంలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు పదేళ్లు గడిచినా భూత్పుర్, నేరడుగాం నిర్వాసితుల సమస్య తీరడంలేదు. తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలుతున్న ఇళ్లు.. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల కారణంగా నేరడుగాం, భూత్పుర్ గ్రామాల్లో ఎక్కడ చూసినా నీటి ఊటలే కనిపిస్తున్నాయి. నీటి ఊటలతో నివాసగృహాలు కూలిపోతున్నాయి. రోజురోజుకూ నీళ్లు ఉబికి రావడం అధికం కావడంతో ముంపు బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో వారి పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆందోళనకు చెందుతున్నారు. ఉబికి వస్తున్న నీళ్లతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. నష్టపరిహారం చెల్లించాలి.. రోజురోజుకూ భూత్పుర్ గ్రామంలో నివసించే పరిస్థితి లేకుండాపోతోంది. తమకు పునరావాసం కల్పించడంతో పాటు ఇళ్లు, స్థలాలను కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించాలి. ఈ విషయంపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ సారించాలి. – కుర్వ హన్మంతు, సర్పంచ్, భూత్పుర్ ఇళ్లు కూలిపోతున్నాయి.. గ్రామంలో నీళ్లు ఉబికి వ స్తుండటంతో ఇళ్లు కూలిపోతున్నాయి. ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామాన్ని ఖాళీ చేయక తప్పని పరిస్థితి ఉంది. అధికారులు గుర్తించిన 530 ఇళ్ల కు త్వరగా నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – ఆనంధ్ శేఖర్, భూత్పుర్ ప్రభుత్వం ఆదుకోవాలి.. భూత్పుర్ నిర్వాసితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలి. గ్రామంలో నీళ్లు ఉబికి వస్తుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ప్రభుత్వం పునరావాసం కల్పించాలి. – ఖతాల్ హుస్సేన్, కోఆప్షన్ సభ్యుడు, భూత్పుర్ -
పోలవరంలో మరో కీలక ఘట్టం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. జలాశయాన్ని ఎడమ కాలువతో అనుసంధానం చేసే సొరంగం (టన్నెల్) తవ్వకం పనులు పూర్తయ్యాయి. 919 మీటర్ల పొడవుతో 18 మీటర్ల వ్యాసంతో 20 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో ఈ సొరంగం తవ్వకం పనులను పూర్తిచేశామని.. లైనింగ్ పనులను ప్రారంభించామని పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు ‘సాక్షి’కి వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఈ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసిన అప్పటి సీఎం చంద్రబాబు.. రూ.292.09 కోట్లకు కాంట్రాక్టు సంస్థకు అప్పగించి, కమీషన్లు వసూలుచేసుకున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఆ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దుచేసి.. రూ.292.09 కోట్లనే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. టీడీపీ సర్కార్ హయాంలో కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థే.. ఆ పనులను రూ.231.47 కోట్లకే చేయడానికి 2019, సెపె్టంబరు 19న ముందుకొచ్చింది. దీంతో ఖజానాకు రూ.60.62 కోట్లు ఆదా అయ్యాయి. దీనిద్వారా చంద్రబాబు కమీషన్ల బాగోతాన్ని సీఎం జగన్ రట్టుచేశారు. తక్కువ ఖర్చుతోనే సొరంగాన్ని పూర్తిచేయడం ద్వారా ప్రణాళికాబద్ధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడంలో సీఎం మరో అడుగు ముందుకేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అనుసంధానాల పనులు కొలిక్కి.. పోలవరం జలాశయం గరిష్ట నీటిమట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). కనిష్ట నీటిమట్టం 41.15 మీటర్లు (119.4 టీఎంసీలు). కుడి కాలువను 174 కిమీల పొడవున 17,633 క్యూసెక్కులు (1.52 టీఎంసీ) సామర్థ్యంతో తవ్వారు. ఈ కాలువ కింద మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఈ కాలువను జలాశయంతో అనుసంధానం చేసేలా జంట సొరంగాలు (ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో), హెడ్ రెగ్యులేటర్‌ను 2020లో సీఎం జగన్ పూర్తిచేశారు. పోలవరం (గోదావరి)–ప్రకాశం బ్యారేజ్ (కృష్ణా)–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీఆర్సీ) ద్వారా పెన్నాను అనుసంధానం చేసే పనుల్లో భాగంగా జంట సొరంగాల సామర్థ్యాన్ని 20 వేల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టారు. తాజాగా.. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం తవ్వకం పనులు పూర్తిచేశారు. ఎడమ కాలువను 181.50 కిమీల పొడవున 17,561 క్యూసెక్కుల సామర్థ్యం (1.51 టీఎంసీ)తో చేపట్టారు. ఈ పనుల్లో ఇప్పటికే 91% పూర్తయ్యాయి. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం 40.54 మీటర్ల స్థాయిలో ఉంటే ఎడమ కాలువ.. 40.23 మీటర్ల స్థాయిలో ఉంటే కుడి కాలువ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చు. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం పనులు తాజాగా పూర్తయ్యాయి. వరద తగ్గగానే హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించి పూర్తిచేయనున్నారు. ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసే దిశగా.. ఇక కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు పనులను అప్పటి సీఎం చంద్రబాబు అస్తవ్యస్తంగా మార్చితే.. సీఎం జగన్ వాటిని గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా చేపట్టి వడివడిగా పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించారు. అలాగే, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేపట్టిన పనులవల్ల గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చక్కదిద్దే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు వాటిని పూర్తిచేసి.. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టు ఫలాలను శరవేగంగా రైతులకు అందించే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. -
మంచిప్ప.. మస్తు బిజినెస్
‘మంచిప్ప’ గ్రామంలో బిజినెస్ మస్తుగా జరుగుతోంది. రోజువారీ టర్నోవర్ రూ. పది లక్షలు కాగా, అంగడి జరిగేరోజు రూ. 20 లక్షలపైనే.. చాలా చిన్న గ్రామమే అయినా ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చుట్టురా అటవీప్రాంతం... అక్కడక్కడా కొన్ని గిరిజన తండాలు. మధ్యలో ఉన్న గ్రామమే మంచిప్ప. ఇది నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల పరిధిలో ఉంది. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో చుట్టుపక్కల తండాలు, గ్రామాలకు మంచిప్పనే వ్యాపార కూడలి. రోజువారీగా ఈ గ్రామానికి ఆరు నుంచి ఏడు వేలమంది రాకపోకలు సాగిస్తారు. చుట్టు పక్కల ఉన్న 9 తండాలతో పాటు అమ్రాబాద్, ఎల్లమ్మకుంట, బైరాపూర్, కాల్పోల్ గ్రామాల ప్రజలకు ఇక్కడి మార్కెట్‌కు నిత్యం వస్తారు. ప్రతిరోజూ రూ.10 లక్షల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అంగడి జరిగే బుధవారం మాత్రం వ్యాపారం రెండింతలు ఉంటుంది. మంచిప్ప గ్రామ జనాభా 5 వేలు కాగా, చుట్టుపక్కల తండాల్లో మరో 12 వేల జనాభా ఉంది. బిర్యానీకి భలే డిమాండ్ ఇక్కడ ప్రతిరోజూ హోటళ్లు కళకళలాడుతుంటాయి. దాదాపు 12 హోటళ్లు ఉన్నాయి. బిర్యానీకి భలే డిమాండ్ ఉంటోంది. ప్రతిరోజూ సగటున 2 క్వింటాళ్ల చికెన్, అంగడిరోజు 5 క్వింటాళ్లు అమ్ముడవుతుంది. బుధవారం రోజు మటన్ అమ్మకాలు రెండు క్వింటాళ్ల వరకు ఉంటుండగా, ఆదివారం ఒక క్వింటా అమ్మకాలు ఉంటాయి. మంచిప్పకు ‘ముంపు’ భయం మంచిప్ప చెరువు, కొండెం చెరువులను కలిపి రిజర్వాయర్ నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి. మొదట్లో ప్రాణహిత–చేవెళ్ల కింద 0.8 టీఎంసీల నీటి సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని అనుకున్నారు. ప్రస్తుతం దానిస్థానంలో కాళేశ్వరం 21వ ప్యాకేజీ ద్వారా ఈ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3.5 టీఎంసీలకు పెంచారు. దీంతో 1,200 ఎకరాల సాగుభూమి, 800 ఎకరాల అటవీభూమి, అమ్రాబాద్ పంచాయతీ పరిధిలో గుండ్యానాయక్తండా, చంద్రునాయక్ తండా, కొక్యానాయక్ తండా, వెంకట్రాంనాయక్ తండా, బైరాపూర్పరిధిలో బైరాపూర్ తండా, మోతిరామ్‌నాయక్ తండా, కొక్యానాయక్ తండా, పోచమ్మ తండా, మంచిప్ప పరిధిలోని తండాలు కూడా ముంపునకు గురవుతున్నాయి. దీంతో మంచిప్పతోపాటు సమీప గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. బిజినెస్ కూడా బాగా పడిపోతుందని జలాశయానికి వ్యతిరేకంగా గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ నిధుల్లో సగభాగం ఉద్యమానికే ఖర్చు చేస్తున్నారు. ఉపాధి గల్లంతే చుట్టుపక్కల గ్రామాల రైతులకు వ్యవసాయమే ప్రధాన ఆధారం. మంచిప్పలో మాత్రం వ్యాపారంతో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తోంది. ముంపు కారణంగా ఇక్కడి వ్యాపారం పూర్తిగా పడిపోతుంది. దీంతో పని వెతుక్కుంటూ చెట్టుకొకరు, పుట్టకొకరు వెళ్లాల్సిన పరిస్థితి. – దర్బస్తు కామేశ్వర్రావు, వస్త్ర వ్యాపారి ఈ ఊరికి పిల్లనివ్వడం లేదు మంచిప్ప చుట్టుపక్కల భూములు, గ్రామాలు ముంపునకు గురయ్యే నేపథ్యంలో మా ఊరి యువకులకు పిల్లను కూడా ఇవ్వడం లేదు. దీంతో భవిష్యత్ విషయమై ప్రజల్లో ఆందోళన నెలకొంది. జలాశయ సామర్థ్యం తగ్గించి ముంపు లేకుండా చేయాలి. – బాణాపురం జగదీష్, మంచిప్ప ఉప సర్పంచ్ మంచిప్పకు రోజుకు మూడుసార్లు వస్తా మాది బైరాపూర్. వ్యవసాయం చేస్తూనే ట్రాక్టర్ కిరాయికి ఇస్తాను. ప్రస్తుతం వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజు మూడుసార్లు మంచిప్పకు రాకపోకలు సాగిస్తున్నాను. నా మాదిరిగా చుట్టుపక్కల ఊర్లకు చెందిన చాలామంది ప్రతిరోజూ మంచిప్పకు వచ్చి వెళుతుంటారు. – బాదావత్ వెంకట్రామ్, రైతు, బైరాపూర్ -
మల్కపేట రెండో పంపు వెట్‌రన్ సక్సెస్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ రెండో పంపు వెట్‌రన్ విజయవంతమైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీలో భాగంగా సిరిసిల్ల శివారులోని మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) జలాశయం బ్యాక్‌వాటర్‌ను సొరంగం ద్వారా 12.03 కిలోమీటర్ల దూరంలోని మల్కపేటకు మళ్లించారు. మల్కపేట వద్ద రూ.504 కోట్లతో మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్‌లోకి 30 మెగావాట్ల పంపుతో సర్జిపూల్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోశారు. మే 23న మొదటి పంపు వెట్‌రన్ నిర్వహించారు. తాజాగా రెండో పంపు వెట్‌రన్‌ను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.40 గంటలకు ప్రారంభించి 1.40 గంటల వరకు కొనసాగించారు. ట్రయల్‌రన్ విజయవంతమైనట్లు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ప్రకటించారు. రెండో పంపు ట్రయల్‌రన్ విజయవంతం కావడంతో మంత్రి కె.తారక రామారావు ఇంజనీర్లను అభినందించారు. దీంతో కాళేశ్వరం 9 ప్యాకేజీ తొలి దశ పూర్తయిందని అధికారు లు తెలిపారు. సిరిసిల్ల మధ్యమానేరు జలాశయం నీరు 12 కిలోమీటర్లు సొరంగం ద్వారా ప్రయాణించి ధర్మారం వద్ద నిర్మించిన సర్జిపూల్‌కు చేరాయి. ఆ నీటిని రెండో పంపు ద్వారా మల్కపేట రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. రాష్ట్ర ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, 9వ ప్యాకేజీ ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ జి.శ్రీనివాస్‌రెడ్డి, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంబోత్సవానికి ఏర్పాట్లు మల్కపేట రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోసే కాళేశ్వరం 9వ ప్యాకేజీలో రెండు పంపుల వెట్‌రన్ విజయవంతం కావడంతో ఈ పంపులను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 15 –20 రోజుల్లో కేసీఆర్ చేతుల మీదుగా 9వ ప్యాకేజీని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ఇటీవల ఎల్లారెడ్డిపేటలో ప్రకటించారు. దీంతో మధ్యమానేరు నుంచి ఏడాదిలో 120 రోజులపాటు 11.635 టీఎంసీల నీటిని రెండు మోటార్లతో ఎత్తిపోసి మల్కపేట రిజర్వాయర్‌ను నింపి.. అక్కడి నుంచి గంభీరావుపేట మండలం సింగసముద్రం మీదుగా బట్టల చెరువు, నర్మాల ఎగువమానేరు జలాశయానికి గోదావరి జలాలను చేర్చనున్నారు. ఈ క్రమంలో మధ్యలో ఉండే వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపుతారు. ఈ పథకం కింద సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 96,150 ఎకరాలకు సాగునీరు అందనుంది. వానాకాలంలో 12వేల ఎకరాలకు మల్కపేట రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాలని భావిస్తున్నారు. 9 డి్రస్టిబ్యూటరీల ద్వారా పొలాలకు సాగునీరు అందించనున్నట్టు అధికారులు తెలిపారు. -
‘మంచిప్ప’లో బాధిత రైతుల ఆందోళన... మా భూమి మాకిచ్చేయండి
మోపాల్: మంచిప్ప రిజర్వాయర్ సర్జిఫుల్ వద్ద పరికరాలు, సామగ్రి, కంపెనీ కార్యాలయం కోసం వినియోగించుకుంటున్న భూమి ఇచ్చేయాలని బాధిత రైతులు శనివారం ఆందోళన చేట్టారు. ప్రాజెక్ట్ పనులు చేపడుతున్న కంపెనీ రైతులతో 2016లో చేసుకున్న ఒప్పందం ప్రకారం కౌలు చెల్లిస్తూ వస్తోంది. ఆ ఒప్పందం గత నెలతో ముగిసింది. తిరిగి ఒప్పందం చేసుకుందామంటే రైతులు ముందుకు రావడంలేదు. భూమి ఇచ్చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈక్రమంలో రైతులు కంపెనీకి నోటీసు అందజేశారు. అప్పటి నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. రైతుల డిమాండ్ మేరకు రెండెకరాలను ఇచ్చేస్తామని చెప్పారు. మరో రెండెకరాలకు ఆరు నెలల గడువు ఇవ్వాలని కోరారు. ఉద్రిక్త పరిస్థితులు మంచిప్పలోని చింతకుంట రాములు, గూండ్ల సాయిలు, నరేందర్, యమున అనే రైతులు 2016, 2018 సంవత్సరంలో నాలుగెకరాల భూమిని పనుల కోసం ఒప్పందం మేరకు కౌలు (పరిహారం)పై ఇచ్చారు. ఒప్పందం చేసుకున్న రైతుల్లో ఇద్దరు మృతి చెందారు. రెండేళ్లుగా మంచిప్ప రిజర్వాయర్ పనులను నిర్వాసితుల కమిటీ అడుగడుగునా అడ్డుకుంటోంది. దీంతో పనులు నిలిచిపోయాయి. ఒప్పందం ప్రకారం కౌలు చెల్లిస్తున్నారు. తాజాగా ఒప్పందం ముగియడంతో మా భూమి మాకు కావాలని పట్టుబట్టారు. శనివారం బాధిత రైతులు కు టుంబసభ్యులు, గ్రామస్తులతో అక్కడికి చేరుకుని చనిపోయిన రైతులు ఫొటోలతో ఆందోళన, ధర్నా చేపట్టారు. చింతకుంట రాములు బ్యాచింగ్ ప్లాంట్ వద్ద సిమెంట్ సైలో ఎక్కి నిరసన తెలియజేశారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల సమక్షంలో చర్చలు భూమి ఇచ్చేయాలని బాధిత రైతులతో ఆందోళనకు దిగగా, పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించి చర్చలు జరిపారు. రాములు మినహా మిగతా వారి భూమి ఇచ్చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కానీ రాములుకు చెందిన 2.02 ఎకరాల భూమిని ఆరు నెలల తర్వాత ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏడాదికి రూ.1.30లక్షలు కౌలు చెల్లిస్తుండగా, అది పెంచి రూ.1.70 లక్షలు చెల్లించి ఒప్పందం గడువు పెంచుకుందామని ఆఫర్ ఇవ్వగా, ఆయన ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో ముంపు నిర్వాసితుల కమిటీ, రైతులు, కంపెనీ ప్రతినిధులు, ప్రాజెక్ట్ అధికారులు, పోలీసుల సమక్షంలో చర్చలు జరిగాయి. సుమారు రెండు గంటలకుపైగా జరిగిన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. మా భూమి మాకు కావాలని రైతులు చెప్పి వెళ్లిపోయారు. చర్చల్లో ప్రాజెక్ట్ డీఈ బాల్‌రాజ్, నవయుగ కంపెనీ ఏజీఎం కాశీ గోవింద్రావు, ఏఎస్సై రమేష్, ఉపసర్పంచ్ జగదీష్, ముంపు కమిటీ ప్రతినిధులు రాజేష్, భాస్కర్, బాధిత రైతులు పాల్గొన్నారు. -
ఇంకా నయం! ఆ ఫోన్ ఏ నదిలోనో, సముద్రంలోనో పడలేదు..!
ఇంకా నయం! ఆ ఫోన్ ఏ నదిలోనో, సముద్రంలోనో పడలేదు..! -
రూ.లక్ష ఫోన్ కోసం డ్యామ్‌లో నీటిని ఎత్తిపోశాడు.. తీరా చూస్తే..
అసలే ఎండాకాలం. నీటి ఎద్దడి సమస్యను చాలా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు. డబ్బుల లాగే నీటిని కూడా పొదుపుగా వాడాల్సిన పరిస్థితి తలెత్తింది. నీటిని కానీ ఓ అధికారి తన సెల్‌ఫోన్ కోసం ఏకంగా రిజర్వాయర్‌లోని నీటిని బయటకు ఎత్తిపోశారు. తన స్వార్థం కోసం వందల ఎకరాలకు సాగునీరు అందించే నీటిని వృథా చేశాడు. ఏం అని ప్రశ్నిస్తే.. ఆ నీరు వాడుకకు పనికిరానిదని, కలెక్టర్ నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు చెబుతున్నాడు. అసలు ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో చుద్దాం.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం కంకారా జిల్లాలోని కొల్లిబేడ ప్రాంతానికి చెందిన రాజేశ్ విశ్వాస్ ఆహార ధాన్యాల సరాఫర శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సెలవు దినాన్ని సరదాగా గడపడానికి ఖేర్కట్ట డ్యామ్‌కు వచ్చారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో తన రూ.లక్ష విలువైన స్మార్ట్‌ఫోన్ రిజర్వాయర్‌లో జారిపడింది. స్థానిక ఈతగాళ్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. డ్యామ్ దాదాపు 15 అడుగుల లోతు ఉంటుందని, నీరు 10 అడుగుల లోతు ఉన్నాయని భావించారు. దీంతో 30హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లను మూడు రోజులపాటు ఉపయోగించి 21 లక్షల లీటర్ల నీటిని నీటిని ఎత్తిపోశారు. గత సోమవారం నుంచి గురువారం వరకు నిరంతరాయంగా నీటిని తోడిపోశారు. ఈ నీటితో దాదాపు 1500 ఎకరాల సాగుకు ఈ నీరు అందించవచ్చు. చివరికి స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన నీటివనరుల శాఖ అధికారులు ఆ ప్రక్రియను నిలుపుదల చేశారు. కానీ అప్పటికే 21 లక్షల లీటర్లను తోడిపోసినట్లు అధికారులు చెప్పారు. అయితే చివరికి రాజేష్‌కు తన ఫోన్ లభించింది. కానీ అది మూడు రోజులు వాటర్‌లో ఉండటం వల్ల పనికి రాకుండా పోయింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. అనంతరం శుక్రవారం సదరు అధికారిని సస్పెండ్ చేశారు.దీనిపై స్పందించిన నెటిజన్లు ఫుడ్ ఆఫీసర్‌పై మండిపడుతున్నారు. ఒక ఫోన్ కోసం వందల ఎకరాలకు ఉపయోగపడే నీటిని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి విలువ తెలిసిన వారు ఇలా చేయరని హితవు పలుకుతున్నారు. అతనిని చట్టం ప్రకారం శిక్షించాలని సూచిస్తున్నారు. చదవండి: Video: విద్యార్థుల ముందే ఓ రేంజ్లో తన్నుకున్న ప్రిన్సిపల్, టీచర్లు దీనిపై ఫుడ్ ఆఫీసర్ రాజేష్ విశ్వాస్ మాట్లాడుతూ.. ‘నేను స్నేహితులతో డ్యామ్‌లో ఈతకొట్టడానికి వెళ్లాను. ఈ క్రమంలో ఫోన్ నీటిలో పడిపోయింది. అందులో అధికారిక సమాచారం ఉంది. ఈతగాళ్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. నాలుగు అడుగుల మేర నీటిని ఎత్తిపోస్తే ఫోన్‌ను కనిపెట్టోచ్చని అన్నారు. దీంతో స్థానిక నీటి వనరుల అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాను. నా ఫోన్ దొరికింది. ఈ నీరు సాగుకు పనికి రాదు. నా చర్య వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగలేదు.’ అని తెలిపారు. మరోవైపు రాజేశ్ విశ్వాస్ అనే అధికారికి తాము ఎలాంటి రాతపూర్వక అనుమతి ఇవ్వలేదని నీటి వనరుల అధికారులు పేర్కొన్నారు. కేవలం వర్బల్గానే అనుమతి పొందారని తెలిపారు. నాలుగు అడుగుల మేర నీటిని మాత్రమే ఎత్తిపోయడానికి అనుమతి ఇచ్చామని, అంతకంటే ఎక్కువ నీటిని ఎత్తిపోశారని అధికారులు తెలిపారు. #Chhattisgarh के अंतागढ़ में फूड इंस्पेक्टर ने अपना मोबाइल खोजने के लिए बहा दिया परलकोट जलाशय का 21 लाख लीटर पानी! फोन मिल गया फूड इंस्पेक्टर का कहना है - उन्होनें कुछ गलत नहीं किया, वहीं मंत्री @amarjeetcg कार्रवाई की बात कह रहे है।@ZeeMPCG @mohitsinha75 @RupeshGuptaReal pic.twitter.com/c0qcPpOUrd — कुलदीप नागेश्वर पवार Kuldeep Nageshwar Pawar (@kuldipnpawar) May 26, 2023 -
నవలి రిజర్వాయర్ మళ్లీ తెరపైకి..
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్‌లో పూడికవల్ల తగ్గిన నీటినిల్వ సామర్థ్యం మేరకు.. డ్యామ్‌కు ఎగువన నవలి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతివ్వాలని తుంగభద్ర బోర్డుకు మరోసారి కర్ణాటక సర్కార్ ప్రతిపాదించింది. నవలి రిజర్వాయర్‌ను నిర్మిస్తే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కర్ణాటక ప్రతిపాదనను తోసిపుచ్చాయి. కానీ, కర్ణాటక సర్కార్ మళ్లీ చేసిన ఆ రిజర్వాయర్ ప్రతిపాదనపై హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించనున్న 219వ సర్వసభ్య సమావేశంలో చర్చించాలని తుంగభద్ర బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే నిర్ణయించారు. కొత్త నీటి సంవత్సరం (2023–24)లో తుంగభద్ర డ్యామ్‌లో నీటి పంపిణీ ప్రధాన అజెండాగా తుంగభద్ర బోర్డు సమావేశమవుతోంది. రాయ్‌పురే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణల ఈఎన్సీలు సి. నారాయణరెడ్డి, మురళీధర్ పాల్గొననున్నారు. దామాషా పద్ధతిలో నీటి పంపిణీ.. అంతర్రాష్ట్ర ప్రాజెక్టు తుంగభద్ర డ్యామ్‌ను 133 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 1953లో నిర్మించారు. డ్యామ్ వద్ద 75 శాతం నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఆంధ్రప్రదేశ్‌కు 72, తెలంగాణకు 6.51 టీఎంసీలను కేటాయించింది. పూడిక పేరుకుపోవడంవల్ల డ్యామ్‌లో నీటినిల్వ 105.78 టీఎంసీలకు తగ్గింది. దాంతో నీటి లభ్యత కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో డ్యామ్‌లో నీటి లభ్యత ఆధారంగా మూడు రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో జలాలను తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తోంది. వాటా జలాలను వాడుకోవడం పేరుతో.. డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడంవల్ల మూడు రాష్ట్రాలు ఏటా సగటున 167–175 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతున్నామని కర్ణాటక సర్కార్ చెబుతోంది. పూడిక తీయడానికి రూ.12,500 కోట్లు వ్యయమవుతుందని లెక్కలువేస్తోంది. దీనికి బదులు తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన నది నుంచి వరద కాలువ తవ్వి నవలి వద్ద కొత్తగా 52 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తామని చెబుతోంది. దీంతోపాటు విఠల్‌పుర చెరువు సామర్థ్యాన్ని 4.52 టీఎంసీలకు, శివపుర చెరువు సామర్థ్యాన్ని 1.56 టీఎంసీలకు పెంచి ఎడమ కాలువ కింద ఆయకట్టును స్థిరీకరిస్తామని.. తుంగభద్ర డ్యామ్‌లో నిల్వఉన్న నీటితో మిగతా వాటా జలాలను వాడుకోవచ్చునని కర్ణాటక ప్రతిపాదిస్తోంది. ఈ రిజర్వాయర్ పనులకు రూ.9,500 కోట్ల వ్యయం అవుతుందని.. దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలు భరించాలని తుంగభద్ర బోర్డు సమావేశాల్లో కోరుతూ వస్తోంది. వ్యతిరేకిస్తున్న రెండు రాష్ట్రాలు.. నవలి రిజర్వాయర్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యతిరేకిస్తున్నాయి. అప్పర్ భద్ర, సింగటలూరు ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే కేటాయించిన నీటికంటే అధికంగా కర్ణాటక వాడుకుంటోందని.. నవలి వద్ద రిజర్వాయర్ నిర్మిస్తే తమ హక్కులకు విఘాతం కలుగుతుందని స్పష్టంచేస్తున్నాయి. తుంగభద్ర హెచ్చెల్సీ (ఎగువ కాలువ)కు సమాంతరంగా వరద కాలువ తవ్వి.. వరద రోజుల్లో వాటా (32.5 టీఎంసీలు) తరలిస్తామని.. డ్యామ్‌లో నిల్వ నీటిని మూడు రాష్ట్రాలు పంచుకోవడం ద్వారా పూర్తిస్థాయిలో వాటా జలాలను వాడుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. -
గూడు చెదిరి.. గుండె పగిలె.. ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, ఆందోళన
సాక్షి, యాదాద్రి: బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న భూములు, ఇళ్లకు పూర్తి పరిహారం ఇవ్వకుండానే అధికార యంత్రాంగం అక్కడి ప్రజలను ఖాళీ చేయిస్తోంది. దీంతో ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, ఆందోళన కారణంగా మనస్తాపం చెందిన నిర్వాసితుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఎన్ తిమ్మాపూర్ గ్రామంలో నెలకొన్న దయనీయపరిస్థితి ఇది. వ్యవసాయ భూములు, ఇళ్లు పోయి.. పరిహారం రాక భవిష్యత్తుపై భయంతో పాటు రకరకాల కారణాలతో దాదాపు ఐదేళ్లలో గ్రామంలో 50 మందికి పైగా చనిపోయారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేకపోతున్నామని తల్లిదండ్రులు.., తమకు పిల్లను ఇవ్వడంలేదని మనోవేదనతో కొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు అనారోగ్యంతో మంచంపట్టారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో గత 57 రోజులుగా బస్వాపూర్ ప్రాజెక్టు కట్టపై నిర్వాసితులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. బుధవారం కూడా ఓ నిర్వాసితుడు బెంగతో చనిపోయాడు. ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు.. కాళేశ్వరం ప్రాజెక్టులో చివరిదైన నృసింహసాగర్ రిజర్వాయర్ (బస్వాపూర్ రిజర్వాయర్)ను 11.39 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు 1,724 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. ఇందులో 700 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా బీఎన్ తిమ్మాపూర్, లక్ష్మీనాయకుని తండా, చోకల్నాయకుని తండాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ముంపు గ్రామాల వాసులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో జాప్యం అవుతోంది. బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తుల వ్యవసాయ భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు అందరికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న గ్రామంలోని 655 నివాస గృహాలను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ముంపు భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ డబ్బులను మరింత పెంచి ఇవ్వాలని గ్రామస్తులు తీర్మానం చేసి నోటీసులు తీసుకోకుండా అధికారులను తిప్పిపంపారు. 655 మందికే పరిహారం.. బీఎన్ తిమ్మాపూర్‌లో గ్రామకంఠంతోపాటు పరిసరాల్లోని 36.11 ఎకరాల భూమి మునుగుతోంది. ఇంతవరకు ఈ భూమికి సంబంధించి అవార్డు ప్రక్రియ మొదలుకాలేదు. దీంతో ఎంత పరిహారం వస్తుందో తెలియని పరిస్థితి. అలాగే భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 90 ఎకరాల్లో లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద గ్రామంలో 1,086 మంది నిర్వాసితులు తేలారు. వీరిలో 655 మందికి పరిహారం చెల్లించారు. ఒక్కొక్కరికి రూ.7.61 లక్షల చొప్పున రూ.50 కోట్లు పంపిణీ చేశారు. మిగతా వారికి రూ.34 కోట్లు రావాల్సి ఉంది. డబ్బులు ఒకేసారి ఇవ్వకపోవడంతో విడతలుగా వచ్చిన డబ్బులు వృథాగా ఖర్చవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. డబ్బులు చేతికి వచ్చిన వారిలో సగం మందికిపైగా చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా ఖర్చు అయ్యాయని చెపుతున్నారు. పరిహారం రాని వారు ఎప్పుడిస్తారో.. అని ఎదురుచూస్తున్నారు. గ్రామస్తుల ప్రధాన డిమాండ్లు.. ►2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. ►2019లో ప్రకటించిన అవార్డును రద్దు చేసి కొత్తగా భూసేకరణ అవార్డును ప్రకటించాలి. ►ప్రాజెక్టు ముంపులో కోల్పోతున్న వ్యవసాయ భూములు, ఇళ్లకు పరిహారం ఒకేసారి చెల్లించాలి. ►గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీని ప్రకటించాలి ►భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని హుస్నాబాద్ వద్ద 107 సర్వే నంబర్లో చేపట్టిన లేఅవుట్ ప్లాట్లను వెంటనే బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులకు కేటాయించాలి. ఒక్కో ఇంటినిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలి. పరిహారం డబ్బులన్నీ పప్పు పుట్నాలకే.. ప్రభుత్వం తీసుకున్న భూములకు పరిహారం డబ్బులన్నీ ఒకేసారి ఇవ్వకపోవడంతో నిర్వాసితులకు ఇంతవరకు ఇచ్చిన డబ్బులన్నీ ఇతర అవసరాలకే ఖర్చయ్యాయి. అప్పుడప్పుడు ఇచ్చిన పరిహారం డబ్బులు ఇలా ఖర్చు కావడంతో రైతుల చేతులు ఖాళీ అయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు తొలుత ఎకరానికి రూ.6 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆ తర్వాత రిజర్వాయర్ సామర్థ్యాన్ని 0.87 టీఎంసీలనుంచి 11.39 టీఎంసీలకు పెంచిన ప్రభుత్వం.. నిర్వాసితులకు 123 జీవో ప్రకారం పరస్పర అంగీకారం ద్వారా ఎకరానికి రూ.15.60 లక్షల చొప్పున 400 ఎకరాలకు పరిహారం ఇచ్చింది. కానీ, ఆ తర్వాత 2019 డిసెంబర్ 11న జారీచేసిన అవార్డు ప్రకారం దానిని సవరించి ఎకరానికి రూ.15.30 లక్షలు నిర్ణయించింది. అయితే, పరిహారం మరింత ఎక్కువగా ఇవ్వాలని రైతులు కోరుతూ వస్తుండగా.. రూ.30 వేలు తగ్గడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎక్కువ పరిహారం వస్తుందని భావించిన రైతులకు పరిహారం ఇలా తక్కువగా రావడంతో తీవ్ర మనో వేదన చెందుతున్నారు. మా భూమికి డబ్బులు రాలేదు బస్వాపురం రిజర్వాయర్‌లో మా భూమి 12 ఎకరాలు పోయింది. ఇందులో 5 గుంటల భూమి పైసలు మాత్రమే పడ్డాయి. మిగతా డబ్బులు నేటికీ ఇవ్వలేదు. పునరావాసం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు కానీ నేటికీ లేదు. రెవెన్యూ అధికారులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా గ్రామంలో ఉన్న ఇళ్లకు నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. ముంపు భూములు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ డబ్బులు మొత్తం అందరికీ ఇస్తే తప్ప నోటీసులు తీసుకోబోమని చెప్పాం. – ఎండీ సాబేర్, బీఎన్ తిమ్మాపురం అనారోగ్యం పాలవుతున్నాం ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఎదురుచూస్తూ, ఎంత వస్తుందో.. ఎప్పుడు ఇస్తా రో అని ఆలోచిస్తూ అనారోగ్యం పాలు అవుతున్నాం. గ్రామంలో ఇలా ఆలోచించి కొందరు చనిపోగా, మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. నాకున్న అర ఎకరం వ్యవసాయ భూమి బస్వాపురం రిజర్వాయర్ కట్ట కోసం పోయింది. అప్పుడు ఎకరానికి రూ.6 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఆ డబ్బులతో ఎక్కడా భూమి కొనుగోలు చేయలేకపోయాం. ఇంటి కోసం ఇచ్చే ఆర్అండ్ఆర్ ప్యాకెజీ కోసం ఎదురు చూస్తున్నాం. – జంగిటి సుగుణ, బీఎన్ తిమ్మాపూర్ రూ. 46.35 కోట్లు విడుదల బస్వాపూర్ ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాల పరిహారం, లే అవుట్ అభివృద్ధికి ప్రభుత్వం బుధవారం రూ.46.35 కోట్లను విడుదల చేసింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి బా«ధితులకు పరిహారం ఇవ్వాలని కోరడంతో వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం రూ.33.45 కోట్లు, పునరావాస లేఅవుట్ అభివృద్ధికి రూ.12.90 కోట్లు ఉన్నాయి. రెండురోజుల్లో బాధితులకు పరిహారం అందుతుంది. – ఫైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి -
Telangana: సచివాలయం కింద చెరువు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కొత్త సచివాలయం సకల హంగులతో సిద్ధమవుతోంది. భవనం భూగర్భంలో ఏకంగా ఓ మినీ రిజర్వాయర్‌ను నిర్మించారు. రెండున్నర లక్షల లీటర్ల సామర్ధ్యంతో ఈ స్టోరేజీ ట్యాంకును సిద్ధం చేశారు. మరోవైపు సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్తును సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేయబోతున్నారు. ఇందుకోసం భవనం రూఫ్ టాప్‌లో భారీ సౌర ఫలకాలను ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే సచివాలయం ప్రధాన ద్వారం ముందు వంద అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు. వేయి అడుగుల పొడవుండే ఈ రోడ్డు చివరలో రెండు వరసల్లో ఏకంగా 300 కార్లను నిలిపి ఉంచేలా పార్కింగ్ వసతి అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనం వచ్చే నెల 17న ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలుండగా, ప్రాంగణంలోనూ మరిన్ని ప్రత్యేకతలు జోడించారు. వెరసి ఇదో ప్రత్యేక నిర్మాణంగా నిలవనుంది. వాన నీటిని ఒడిసిపట్టేలా.. వాన నీటిని ఒడిసి పట్టేందుకు వీలుగా సచివాలయం కింద రిజర్వాయర్ నిర్మించారు. భవనం నలువైపుల నుంచి వాన నీటిని ఇందులోకి తరలించేందుకు ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సచివాలయంలో దాదాపు 9 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పచి్చక బయళ్లుంటాయి. భవనం ముందు వైపు రెండు వైపులా మూడెకరాల చొప్పున రెండు, మధ్య కోర్ట్‌యార్డు, ఇతర ప్రాంతాల్లో కలిపి మరో మూడెకరాల మేర లాన్లుంటాయి. వాటి నిర్వహణకు భారీగా నీటి వినియోగం అవసరమవుతుంది. భూగర్భ నీటిని పొదుపు చేసే క్రమంలో పచి్చకబయళ్లకు వాననీటిని వాడే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశారు. బయట రోడ్డు లెవల్ కంటే సచివాలయం ప్రాంగణం బేస్ ఐదడుగుల ఎత్తున ఉంటుంది. దాని మీద భవన నిర్మాణం జరిగింది. దీంతో ఎక్కడా వాననీరు నిలిచిపోయే పరిస్థితి ఉండదు. పార్కింగ్‌కు వీలుగా రోడ్డు విస్తరణ సచివాలయ ప్రధాన ద్వారం ముందున్న రోడ్డును వంద అడుగులకు విస్తరించేందుకు వీలుగా ఫుట్‌పాత్‌పై ఉన్న దాదాపు 40 చెట్లను తొలగించనున్నారు. ఈ మేరకు సంబంధిత కమిటీ అనుమతి ఇచ్చింది. ఆ చెట్లను సంజీవయ్య పార్కులో (ట్రాన్స్‌లొకేట్) తిరిగి నాటనున్నారు. కాగా సచివాలయానికి వివిధ పనులపై వచ్చే వారి వాహనాలు నిలిపేందుకు లోపల విశాలమైన పార్కింగ్ యార్డులున్నాయి. అవి సరిపోని పక్షంలో, ఈ వంద అడుగుల రోడ్డు చివరలో నిలిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక సాయంత్రం వేళ సాగర తీరానికి వచ్చే పర్యాటకులకు ప్రస్తుతం పార్కింగ్ ఇబ్బందులున్నాయి. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ కొత్త రోడ్డులో రెండు వరుసల్లో 300 కార్లు నిలిపేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. సౌర వెలుగులు పది లక్షల చదరపు అడుగుల సువిశాల భవనంలో వేల సంఖ్యలో విద్యుత్ దీపాల వినియోగం ఉంటుంది. దీంతో కరెంటు ఖర్చు ఎక్కువే అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమేర పొదుపు చేసేందుకు సౌర విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. భవనం రూఫ్‌టాప్‌లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవనాన్ని ప్రారంభించిన తర్వాత వీటి ఏర్పాటు మొదలు పెడతారు. ఇందుకోసం ఓ కన్సల్టెంటును కూడా నియమిస్తున్నారు. చదవండి: భారత జాతి విముక్తి కోసమే బీఆర్ఎస్! -
ఈతకు వెళ్లి నలుగురు యువకులు మృతి
-
శ్రీశైలంపై తెగని పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) చివరి సమావేశం సోమవారం రెండోరోజు కొనసాగగా.. తెలంగాణ అధికారుల గైర్హాజరుతో ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. గత శనివారం జలసౌధలో జరిగిన మొదటిరోజు సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరై.. ఆర్ఎంసీ ప్రతిపాదించిన ముసాయిదా నివేదికలోని పలు అంశాలపై ఏకాభిప్రాయం తెలపడంతో పాటు సమావేశాన్ని సోమవారం కూడా కొనసాగించి తుది నివేదికపై సంతకాలు చేయాలని నిర్ణయించారు. శ్రీశైలం జలాశయం రూల్‌కర్వ్ (నిర్వహణ నిబంధనలు)లో స్వల్ప మార్పులకు రెండు రాష్ట్రాలు ఓకే అన్నాయి. తాగు, సాగునీటి అవసరాలకు నష్టం కలగకుండా శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తిని నియంత్రించాలనే మరో నిబంధనకు కూడా అంగీకారం తెలిపాయి. తీరా సోమవారం నాటి సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. కృష్ణా బోర్డు సభ్యులు, ఆర్ఎంసీ కన్వీనర్ బి.రవికుమార్ పిళ్లై నేతృత్వంలో సోమవారం కమిటీ సమావేశం కాగా, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డితో పాటు ఆ రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్‌తో పాటు ఇతర అధికారుల రాకకోసం దాదాపు అర్ధగంటకు పైగా నిరీక్షించారు. ఈ విషయాన్ని పిళ్లై తెలంగాణ ఈఎన్సీకి ఎస్ఎంఎస్ ద్వారా తెలపగా, తాము రావడం లేదని ఆయన బదులిచ్చారు. దీంతో ఏపీ ఈఎన్సీ, ఏపీ జెన్కో డైరెక్టర్ (హైడల్) నుంచి తుది నివేదికపై సంతకాలను సేకరించిన ఆర్ఎంసీ కన్వీనర్ ఎలాంటి చర్చ లేకుండానే సమావేశాన్ని ముగించారు. విఫలమైన ఆర్ఎంసీ ప్రయత్నాలు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ఎంత మేరకు నిల్వలుంటే ఎంత మేర జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తాగునీరు, సాగునీరు, జలవిద్యుదుత్పత్తి అవసరాలకు వాడుకోవాలి అన్న అంశం రూల్‌కర్వ్‌లో ఉంటుంది. రెండు జలాశయాల రూల్‌కర్వ్‌తో పాటు జలవిద్యుదుత్పత్తి, మిగులు జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి నివేదికను సిఫారసు చేసేందుకు ఆర్ఎంసీ కమిటీని..కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటు చేసింది. ఆరుసార్లు సమావేశమైన ఆర్ఎంసీ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే చివరి సమావేశం రెండో రోజు భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడంతో ఆర్ఎంసీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆర్ఎంసీ తన తుది నివేదికలో చేయనున్న సాంకేతిక సిఫారసులు అమల్లోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆర్ఎంసీ తుది నివేదికపై ఏపీ తరఫున తాము సంతకాలు చేసినట్లు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. కనీస నిల్వ 830 అడుగులు చాలు శ్రీశైలంలో కనీస నిల్వ మట్టం 854 అడుగులుండాలని ప్రతిపాదించడాన్ని తాము అంగీకరించడం లేదని, 830 అడుగులుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా 34 టీఎంసీలను మాత్రమే ఏపీ తరలించుకోవాలన్న నిబంధననను రూల్‌కర్వ్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. వరదల తర్వాత శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి అదనపు జలాలను తరలించుకోవడానికి ఏపీ అంగీకరిస్తేనే మిగులు జలాల వినియోగం విషయంలో ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఏపీ, తెలంగాణ మధ్య 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక బట్వాడా జరపాలని, వాడని కోటాను వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్ చేయాలని సూచించారు. ముసాయిదా నివేదికలో తెలంగాణకి ప్రయోజనం కలిగించే అంశాలేమీ లేవని, తమకు ఆమోదయోగ్యం కాని ఈ నివేదికను నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్‌ను కోరారు. పిళ్లై తప్పుడు వార్తలు రాయించారు మా వైఖరిలో మార్పు లేదు: తెలంగాణ ఆర్ఎంసీ నివేదికకు అంగీకరిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నట్టు ఆర్ఎంసీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై మీడియాలో తప్పుడు వార్తలు రాయించారంటూ తెలంగాణ తీవ్ర ఆరోపణలు చేసింది. సరైన వాస్తవాలను మీడియాకు తెలియజేయాలని ఆయన్ను ఆదేశించాలని కృష్ణా బోర్డును కోరింది. నీటి వాటాలు, విద్యుత్ వాటాలు, క్యారీ ఓవర్ నిల్వలు, వరద జలాల లెక్కింపుపై తమ రాష్ట్ర వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆర్ఎంసీ తుది సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్.. కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. 50:50 నిష్పత్తిలో శ్రీశైలం విద్యుత్‌ను పంచుకోవాలంటూ తమకిచ్చిన ముసాయిదా నివేదికలో ఆర్ఎంసీ చేసిన సిఫారసును అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి అవసరాలకే శ్రీశైలం జలాశయం ఉందని, జల విద్యుదుత్పత్తితో 240 టీఎంసీలను విడుదల చేయడం ద్వారా నాగార్జునసాగర్ కింద తాగు, సాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంటుందని తెలిపారు. -
విషాదంలో ఎంత ఘోరం.. రీల్స్ తీస్తుండగా..
యశవంతపుర(బెంగళూరు): దావణగెరె జిల్లా హరిహర తాలూకా హరగనహళ్లి వద్ద డ్యాం అందాలను వీడియో తీస్తూ నీటమునిగి స్నేహితులిద్దరూ మునిగి ఒకరు మరణించగా, మరొకరు గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... హరిహర ఆశ్రయ లేఔట్‌కు చెందిన పవన్ (25), ప్రకాశ్ (24) మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి అప్పుడప్పుడు వీడియోలు తీసి యూట్యూబ్, ఇన్ స్టాలో పోస్ట్ చేసేవారు. గురువారం సాయంత్రం వెళ్లి.. గురువారం సాయంత్రం సమీపంలోని జలాశయం నిండడంతో బైక్ వేసుకుని వెళ్లి వీడియో తీయసాగారు. అదుపుతప్పి నీటిలో పడిన ప్రకాశ్‌ను రక్షించడానికి యత్నించిన పవన్ కూడా మునిగిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరి జాడ లేకపోవడంతో బంధుమిత్రులు డ్యాం వద్ద బైక్ ఉండడంతో రోదిస్తూ గాలించసాగారు. శనివారం ఉదయం హరిహర రాఘవేంద్రమఠం వద్ద ప్రకాశ్ మృతదేహాన్ని కనుగొన్నారు. పవన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వీరి జతలో అదే గ్రామానికి చెందిన హనుమంత కూడా వెళ్లాడు. ఇద్దరు మునిగిపోయిన విషయాన్ని భయపడి ఎవరికీ చెప్పలేదు. శవం బయట పడిన తరువాత పోలీసులు విచారించగా రీల్స్ తీస్తుండగా ఘటన జరిగిందని హనుమంత వివరించాడు. -
విహారయాత్రలో విషాదం: రిజర్వాయర్‌లోకి దిగి.. నీట మునిగి
పెద్దఅడిశర్లపల్లి: విద్యార్థుల విహారయాత్ర విషాదాంతమైంది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఏకేబీఆర్)లో శనివారం ఈతకు దిగి ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. గుడిపల్లి పోలీసు లు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామా బాద్ జిల్లాకు చెందిన దిండె ఆకాశ్ (20), సిరిసిల్ల జిల్లా వే ములవాడకు చెందిన బంటు గణేశ్ (20), వరంగల్ జిల్లా పరకాలకు చెందిన కల్లపు లోహిత్, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన చందూ, ఖమ్మం జిల్లాకు చెందిన అవినాష్, నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పుట్టంగండి గ్రామానికి చెందిన ప్రియాంక.. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ కళాశాలలో బీఫార్మసీ చదువుతున్నారు. ప్రియాంక సోదరుడు పండిట్ కృష్ణ (18) తన సోదరి స్నేహితులతో కలిసి ఇక్కడే కాళీమందిర్ వద్ద గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అందరికీ రాఖీలు కట్టి.. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రియాంక శుక్రవారం సోదరుడు కృష్ణ వద్దకు వచ్చింది. అతడితోపాటు తన స్నేహితులకు రాఖీలు కట్టింది. వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో అందరూ కలిసి నాగార్జునసాగర్ విహారయాత్రకు వెళ్దామని నిర్ణయించుకున్నారు. సాయంత్రం అందరూ కలిసి ప్రియాంక సొంతూరు పుట్టంగండికి చేరుకున్నారు. స్నేహితులందరితోపాటు ప్రియాంక తండ్రి పండిట్ జయానంద్ శనివారం ఉదయమే నాగార్జునసాగర్‌కు బయలుదేరా రు. అక్కడ గేట్ల ద్వారా కిందకు దూ కుతున్న కృష్ణమ్మ పరవళ్లను తిలకించి ఆనందంగా గడిపారు. సాయంత్రం పుట్టంగండికి బయలుదేరారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వా యర్ కట్టపై వెళ్తుండగా మెట్లు కనిపించడంతో అక్కడ స్నానాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రియాంక, ఆమె తండ్రి కట్టపై నిల్చోగా ఆకాశ్, గణేశ్, లోహిత్, చందూ, అవినాష్, పండిట్ కృష్ణ నీటిలోకి దిగి మెట్లపై కూర్చొని స్నా నాలు చేస్తున్నారు. ఆకాశ్, గణేశ్, పండిట్ కృష్ణ మెట్లు దిగి ఇంకా కిందికి వెళ్లి నీటమునిగి గల్లంతవగా.. మిగతా వారు కేకలు వేస్తూ బయటికొచ్చారు. దీంతో అటువైపు గా వెళ్తున్న స్థానికులు నీటిలోకి దూకి గణేశ్, పండిట్ కృష్ణను బయటకి తీయగా అప్పటికే మృతిచెందారు. ఆకాశ్ ఆచూకీ తెలియలేదు. గుడిపల్లి ఎస్ఐ వీరబాబు జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టగా ఆకాశ్ మృతదేహం లభ్యమైంది. విహారయాత్రకు వచ్చిన విద్యార్థులు మృతిచెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. -
అయ్యో.. గోమాతలారా..
వెలుగోడు: నంద్యాల జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిలో మునిగి వంద ఆవులు గల్లంతయ్యాయి. మేతకు వెళ్తున్న ఆవుల మందను అడవి పందులు బెదిరించడంతో రిజర్వాయర్‌లోకి దూకాయి. వెంటనే అప్రమత్తమైన వాటి యజమానులు, మత్స్యకారులు రిజర్వాయర్‌లో చిక్కుకున్న 350 గోమాతలను రక్షించగా, మరో 100 ఆవుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలుగోడుకు చెందిన శంకర్, సుంకన్న, కురుమన్న, బాలలింగం, వెంకటరమణతో పాటు మరో ఐదుగురికి చెందిన వెయ్యి ఆవులు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిధిలోని డీఎల్బీ రెగ్యులేటర్ వద్ద గట్టు వెంట శుక్రవారం ఉదయం మేతకు వెళ్లాయి. అదే సమయంలో ఎదురుపడిన అడవి పందుల గుంపు ఆవుల మందను బెదిరించాయి. దీంతో భయపడిన ఆవులు (దాదాపు 450) వెలుగోడు జలాశయంలోకి పరుగులు తీశాయి. బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి 9 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రవాహానికి ఆవులు కొట్టుకుపోయాయి. దిక్కు తోచని స్థితిలో ఆవుల కాపరులు బిగ్గరగా కేకలు వేయడంతో రిజర్వాయర్ వద్ద ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై పుట్టీల సాయంతో నీటిలో ఉన్న 350 ఆవులను రక్షించారు. గల్లంతయిన ఆవుల కోసం గాలిస్తున్నారు. ఆవులను రక్షించటానికి గ్రామస్తులు జాలరులను రంగంలోకి దింపారు. మర బుట్టలతో జాలరులు ఆవుల కోసం శుక్రవారం సాయంత్రం వరకు గాలించారు. ఘటనా స్థలానికి ఆత్మకూరు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ జగన్మోహన్, తహసీల్దార్ మహమ్మద్ రఫీ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీను, ఆర్ఐ రామాంజనేయులు, వీఆర్వోలు చేరుకొని సహాయక చర్యలను సమీక్షించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో వంద ఆవుల ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. -
ప్రాణం మీదకు తెచ్చిన సరదా..సెల్ఫీ కోసం రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి..
బెంగళూరు: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల కిరణ్ రాజ్‌పుర్ నీర్సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు వెళ్లాడు. ఇతరుల కంటే భిన్నంగా సెల్ఫీ దిగాలనే ఉత్సుకతతో నీర్సాగర్ రిజర్వాయర్ వద్ద ఎత్తైన అంచుకు వెళ్లాడు. ఆనందంలో సెల్ఫీ తీసుకునే క్రమంలో పొరపాటున కాలుజారి పడిపోయాడు. అనంతరం వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. యువకుడి కోసం అతని స్నేహితులు ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. అతని కోసం గాలింపు చేపట్టిన సహాయక బృందాలు భారీ వర్షం, వరదల కారణంగా ఆపరేషన్ నిలిపివేశాయి. ధార్వాడ్ బెగూర్‌కు చెందిన ఈ యువకుడు చాలా ఎత్తైన ప్రాంతం నుంచి పడిపోయాడని పోలీసులు తెలిపారు. వర్షాకాలంలో గజ ఈతగాల్లు కూడా అక్కడి నుంచి దూకే సాహయం చేయరని తెలిపారు. యువకుడు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కష్టమే అన్నారు. రిజర్వాయర్ దిగువన ఉండే గ్రామస్థులకు సమాచారం అందించామని, ఏమైనా ఆచూకీ లభిస్తే తెలుస్తుందని చెప్పారు. యువకుడి తల్లిదండ్రులు ఘటనా స్థలం వద్దకు వెళ్తుంటే అడ్డుకుని వెనక్కి పంపించామని వివరించారు. వానలు పడినప్పుడు నీర్సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు చాలా మంది వెళ్తుంటారు. ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లవద్దని అక్కడున్న సిబ్బంది, పోలీసులు సందర్శకులను హెచ్చరిస్తూనే ఉంటారు. కొంతమంది మాత్రం అవేమి పట్టించుకోకుండా ఫోటోలు దిగేందుకు రిజర్వాయర్ అంచు వరకు వెళ్తుంటారని పోలీసులు పేర్కొన్నారు. కొన్నిసార్లు ప్రమాదాల బారినపడుతున్నారని చెప్పారు. డ్యాంలో నీటి స్థాయి తగ్గేవరకు సందర్శకులు రాకుండా నిషేధం విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. చదవండి: హైవేపై లారీ నడిపిన మహిళ.. స్మైల్‌కు ఫిదా అవుతున్న నెటిజన్స్ -
నదిలో బయటపడ్డ రహస్యం...పెద్ద చరిత్రే ఉందంటున్న పురావస్తు శాఖ
నదుల్లోని నీటిని వినియోగించుకునేందుకు లేదా పంటలు పండించడానికో లేదా విద్యుత్ కోసం రిజర్వాయర్లు లేదా డ్యాంలను ప్రభుత్వం నిర్శిస్తుంటుంది. దీని వల్ల దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల పై ఆ కట్టడాలు బాగా ప్రభావం చూపిస్తాయి. అవి మునిగిపోవడం లేదా కనుమరుగైపోవడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నైసర్గిక భూగోళ స్వరూపాన్ని మార్చేస్తాయి. ఈ డ్యాంలను నిర్మించడానికి భూమిని చాలా లోతుగా తవ్వి నిర్మిస్తుంటారు. దీంతో చుట్టూ ఉన్న పొలాలు, ఇళ్లు, ప్రాంతాలు ఆ నది ప్రవాహానికి ధ్వంసమైపోతుంటాయి. అచ్చం అలానే ఇక్కడొక నది పై నిర్మించిన రిజర్వాయర్ కారణంగా పురాతనమైన నగరం కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఆ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గడంతో బయటపడింది. ఎక్కడ జరిగింది? ఏంటా నగరం అనే కదా!. వివరాల్లోకెళ్తే..కెమునేలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో దాదాపు మూడు వేల ఏళ్ల నాటి పురాతన ఇరాక్ నగరం బయటపడింది. వాస్తవానికి టైగ్రిస్ నది పై నిర్మించిన రిజర్వాయర్‌లో నీటి స్థాయిలు తగ్గిపోవడంతో ఈ నగరం బయటపడింది. ఐతే ఇది కాంస్య యుగానికి చెందిన ఒక పురాతన సామ్రాజ్యం అని ఆర్కియాలజీ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఆర్కియాలజీ బృందంలోని డాక్టర్ ఇవానా పుల్జిజ్ ఈ నగరం నేరుగా ట్రెగ్రిస్ నదిపై ఉన్నందున మిట్టాని సామ్రాజ్యంలోని ప్రధాన ప్రాంతాలతో అనుసంధానించి ఉందని చెబుతున్నారు. ఇరాక్ ప్రభుత్వం కూడాఈ రిజర్వాయర్ తిరిగి నిండిపోక ముందే తవ్వకాలు జరిపి ఆ నగరానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు జర్మన్‌కి చెందిన ఆర్కియాలజీ బృందానికి అనుమతిచ్చింది. ఈ మేరకు ఆర్కియాలజీ బృందం ఈ నగరానికి సంబంధించిన కొన్నిఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. క్రీస్తు పూర్వం 1550 నుంచి 1350లలో మిట్టని సామ్రాజ్యం పాలనలో ఈ పురాతన నగరం కీలక కేంద్రంగా ఉందని తెలిపింది. ఐతే ఆ రిజర్వాయర్‌లో మళ్లీ నీటి నిల్వలు పెరగడంతో ఆ పురాతన ప్రదేశానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తవ్విన భవనాలను ప్లాస్టిక్ షీటింగ్‌తో చుట్టి ఉంచారు. ప్రస్తుతం ఆ నగరం మరోసారి పూర్తిగా మునిగిపోయింది. (చదవండి: 20 ఏళ్ల యువతికి 3డీ ప్రింటెడ్ చెవి) -
కన్నీరు పెట్టిన సంగం కాలనీ.. మీడియా అత్యుత్సాహం
సంగం దళితకాలనీ కన్నీరుమున్నీరైంది. ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు చిన్నారులు కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో పడి మృత్యువాత పడ్డారు. అప్పటి వరకు కళ్లముందే ఉన్న ఆ చిన్నారులు అంతలోనే విగతజీవులు కావడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. తమ బిడ్డలను ఉన్నంతలో ఉన్నతంగా చదివించాలని తపన పడుతున్న ఆ తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చారు. సాక్షి, నెల్లూరు: ఇద్దరు చిన్నారులను కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ మింగేసింది. అప్పటి వరకు తమ కళ్లముందు తిరుగాడిన శ్రీరామ్ (8), ఈశ్వర్ (10) చిన్నారులు విగతజీవులు కావడంతో దళితవాడ గొల్లుమంది. సంగం గ్రామం దళితవాడకు చెందిన దారా వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమార్తెల తర్వాత శ్రీరామ్ (8) జన్మించాడు. వెంకటేశ్వర్లు తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శ్రీరామ్‌ను ఉన్నతంగా చదివించాలని బెంగళూరులో కాపురం ఉంటూ కూలి పనులకు వెళ్లేవాడు. పని ఉండడంతో మంగళవారం వెంకటేశ్వర్లు, తన కుమారుడు శ్రీరామ్‌తో కలిసి స్వగ్రామం సంగం వచ్చారు. సంగం దళితవాడకు చెందిన గడ్డం ఆదినారాయణమ్మ ఒకగానొక్క కుమారుడు ఈశ్వర్. అయితే బుధవారం ఉదయం 11 గంటల సమయంలో శ్రీరామ్, ఈశ్వర్, మరో చిన్నారి యక్షిత బహిర్భూమికని సమీపంలోని కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ వద్దకు వెళ్లారు. కాలకృత్యాలు తీర్చుకొని కాలువలోకి దిగిన శ్రీరామ్, ఈశ్వర్ నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలు బయటకు తీయడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. అప్పుడే అన్నంపెట్టి వచ్చా నా కుమారుడు ఈశ్వర్ బడికెళ్లి ఉంటే 11 గంటల సమయంలో వెళ్లి భోజనం పెట్టి వచ్చానని గంట వ్యవధిలోనే ఈ ఘోరం జరిగింది. ఒక్కగానొక్క మగబిడ్డను దేవుడు దూరం చేశాడంటూ కన్నీరుమున్నీరు అయింది. – ఆదినారాయణమ్మ, ఈశ్వర్ తల్లి తల్లికి ఏమని చెప్పను బెంగళూరు నుంచి నేను, నా కొడుకు మంగళవారం వచ్చాం. నా భార్య, కూతుర్లు బెంగళూరులోనే ఉన్నారు. ఈ వార్తను నా భార్యకు ఎలా చెప్పాలంటూ కన్నీరు పెట్టుకోవడంతో అందరిని కలిచివేసింది. – దారా వెంకటేశ్వర్లు, శ్రీరామ్ తండ్రి మీడియా అత్యుత్సాహం.. ఇదిలా ఉండగా కనిగిరి రిజర్వాయర్ చిన్నారుల మృతి ఘటనపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. మృతి చెందిన ఈశ్వర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లగా.. కొన ఊపిరితో ఉన్న శ్రీరాంను 108 లో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ శ్రీరాం మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీరాం మృతదేహాన్ని తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్‌ను మాట్లాడగా.. ఆలస్యం కావటంతో బాలుడి తండ్రి కొడుకు మృతదేహాన్ని బైక్‌పైనే ఇంటికి తీసుకెళ్లాడు. అయితే మరో రుయా ఘటన అంటూ కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో తప్పుగా ప్రచురించాయి. దీనిపై స్పందించిన పోలీసులు మరో రుయా అంటూ వస్తున్న కథనాల్లో నిజం లేదని స్పష్టం చేశారు. -
కొత్త డ్యామ్‌కు సమ్మతి తెలపండి
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర జలాశయానికి అనుసంధానంగా వరద కాల్వతో పాటు 52 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ‘నావలి’బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించేందుకు ఆమోదం తెలపాలని సీఎం కేసీఆర్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విజ్ఞప్తి చేశారు. పూడికతో తుంగభద్ర నిల్వ సామర్థ్యం 133 టీఎంసీల నుంచి 100.885 టీఎంసీలకు పడిపోయిన నేపథ్యంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేవలం వరదల సమయంలో జలాశయం నుంచి వరద ప్రవాహ కాల్వ ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీళ్లను మళ్లిస్తామని వివరించారు. బెంగళూరు లేదా మరోచోట ఈ ప్రతిపాదనలపై చర్చిద్దామని సూచించారు. ఈ మేరకు బొమ్మై ఇటీవల ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తుంగభద్ర కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో వరద కాల్వ, కొత్త బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తెలుగు రాష్ట్రాల సమ్మతి అవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు. నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేదు.. కర్ణాటక, ఉమ్మడి ఏపీ రాష్ట్రాల్లోని అన్ని కాల్వలకు కృష్ణా ట్రిబ్యునల్–1 ఆవిరి నష్టాలను కలుపుకొని 230 టీఎంసీలను కేటాయించింది. ఆవిరి నష్టాలు పోగా 212 టీఎంసీల నీళ్లను వాడుకోవాల్సి ఉండగా, 1976–77 నుంచి 2017–18 మధ్య కాలంలో ఏటా సగటున 164.4 టీఎంసీలను మాత్రమే వాడుకోగలిగామని బొమ్మయ్ తెలిపారు. ఏటేటా పూడిక పేరుకుపోతుండటంతో పాటు అకస్మాత్తుగా స్వల్ప కాలం వరదలు పోటెత్తడం, కేవలం జూలై, ఆగస్టు నెలల్లోనే భారీ ప్రవాహం ఉండడంతో ఈ నీళ్లను నిల్వ చేసుకునే పరిస్థితి లేకుండా పోతోందని, తద్వారా తమ రాష్ట్రంలోని ఆయకట్టుకు నీటిని సరఫరా చేయలేకపోతున్నామని వివరించారు. తుంగభద్రలో పూడిక తొలగించడం లేదా అదనపు నిల్వల కోసం కొత్త రిజర్వాయర్ నిర్మించడం ఒక్కటే పరిష్కారమని స్పష్టం చేశారు. మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రతిపాదనలపై చర్చించడానికి ముందుకు రావాలని కేసీఆర్‌ను కోరారు. గతంలోనే తిరస్కరించిన నీటిపారుదల శాఖలు.. వాస్తవానికి ఈ ప్రతిపాదన కర్ణాటక ప్రభుత్వం రెండేళ్ల కిందటే చేసింది. అప్పుడే తెలంగాణ, ఏపీ నీటి పారుదల శాఖలు ఇందుకు నిరాకరించాయి. ఎగువన కొత్త బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంతో దిగువన ఉన్న తమ రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిపాయి. అయితే ఈసారి స్వయంగా రంగంలో దిగిన కర్ణాటక సీఎం.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించాలనే నిర్ణయం తీసుకున్నారు. తుంగభద్రలో పూడికను తొలగించడానికి రూ.12,500 కోట్ల వ్యయం అవుతుందని, నావలి వద్ద 492 అడుగుల గరిష్ట నిల్వ సామర్థ్యం (ఎఫ్ఆర్ఎల్)తో 52 టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి రూ.9,500 కోట్లు, 486 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో నిర్మాణానికి రూ.6,000 కోట్ల వ్యయం అవుతుందని కర్ణాటక జలవనరుల శాఖ అంచనా వేసింది. -
ఈ రిజర్వాయర్‌తో కష్టాలకు బై బై!
-
ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునక.. మల్లెమడుగు రిజర్వాయర్
సాక్షి, తిరుపతి అర్బన్ (చిత్తూరు జిల్లా): రాయలసీమలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులకు గండ్లు పడి తీవ్రనష్టం వాటిల్లుతోంది. ఇదే సమయంలో చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో ఉన్న మల్లెమడుగు రిజర్వాయర్‌కు మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. వచ్చిన వరదను వచ్చినట్టుగా సులువుగా దిగువకు విడిచిపెట్టేశారు. అలాగే వరదకు కొట్టుకొచ్చిన పెద్ద పెద్ద వృక్షాలను సైతం అవలీలగా కిందకు పంపేశారు. దీనికి కారణం.. మల్లెమడుగు రిజర్వాయర్‌ను సైఫన్లతో నిర్మించడమే. సైఫన్ల వల్లే ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలను, దానికి తగ్గట్టే వస్తున్న వరద నీరును రిజర్వాయర్ తట్టుకుంటోంది. 61 ఏళ్లు గడిచినా చెక్కు చెదరలేదు.. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం ఎస్వీపురం, కరకంబాడి పంచాయతీల్లో 2,230 ఎకరాల విస్తీర్ణంలో మల్లెమడుగు రిజర్వాయర్‌ను ఏర్పాటు చేశారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 0.181 టీఎంసీలు. 1960లో 47 సైఫన్లు అమర్చారు. ఇవి 61 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. రాష్ట్రంలో కేవలం మల్లెమడుగు రిజర్వాయర్‌కు మాత్రమే ఈ సైఫన్లు ఉన్నాయి. మొత్తం 21 అడుగుల లోతు కలిగిన ఈ రిజర్వాయర్‌లో 14 అడుగుల్లో నీటిని నిల్వ చేస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లకు సైఫన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే వరదలతో ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. చదవండి: ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం సైఫన్లు అంటే.. సిమెంట్, కాంక్రీట్లతో తయారుచేసిన రోలర్లులాంటివి.. ఈ సైఫన్లు. మొత్తం 47 సైఫన్లు ఉన్నాయి. ఒక్కోదాన్ని 20–25 అడుగుల ఎత్తు, 5 – 7 అడుగుల వెడల్పుతో నిర్మించారు. రిజర్వాయర్‌లో 14 అడుగుల్లో నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉంది. 14 అడుగులకు మించి ఒక్క అడుగు నీరు వస్తే 28 సైఫన్లు వాటంతటవే ఓపెన్ అవుతాయి. రోలర్ మాదిరిగా తిరుగుతూ వచ్చిన నీటిని వచ్చినట్టు సైక్లింగ్ చేస్తూ దిగువకు వదిలేస్తాయి. 14 అడుగులకంటే మరో రెండు అడుగుల నీరు అధికంగా వస్తే 28 సైఫన్లతోపాటు 12 ఓపెన్ అవుతాయి. చదవండి: తక్షణ వరద సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వండి: విజయసాయిరెడ్డి 14 అడుగుల కంటే మూడు అడుగులపైన నీరు వస్తే ఇంకో 7 ఓపెన్ అవుతాయి. అధికంగా వచ్చిన నీటిని పంపేయగా యథావిధిగా 14 అడుగుల నీటిని రిజర్వాయర్‌లో నిల్వ చేస్తాయి. ఇందుకు మానవ వనరుల అవసరం ఏమీ ఉండదు. ఇవికాకుండా మరో 17 ఇనుప గేట్లు ఉన్నా వాటి అవసరం ఎప్పుడూ రాలేదు. ఈ సైఫన్ల పనితీరును చూసిన ఇంజనీర్లు అప్పటి ఇంజనీర్ల పనితీరును ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. పుణ్యజలం.. మల్లెమడుగు మల్లెమడుగు నీటిని స్థానికులు పుణ్యజలంగా భావిస్తుంటారు. తిరుమల కొండల్లోని గోగర్భం, పాపవినాశనం, కుమారధార, పసుపుధార, ఆకాశగంగ.. ఇలా పంచ జలాశయాల నుంచి వచ్చే నీరు మల్లెమడుగు రిజర్వాయర్‌లోకి చేరుతోంది. ప్రస్తుతం రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని 14 చెరువులకు ఈ రిజర్వాయర్ నీటిని పంపుతున్నారు. దీంతో 3,950 ఎకరాల భూములు సాగులోకి వచ్చాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మల్లెమడుగు రిజర్వాయర్ ద్వారా 10 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించడానికి కృషి చేస్తోంది. -
మల్లెమడుగు రిజర్వాయర్ 14 గేట్లు ఎత్తివేత
-
మళ్లీ తెరపైకి ‘మల్కాపూర్’!
సాక్షి, హైదరాబాద్: దేవాదుల ప్రాజెక్టులో మల్కాపూర్ వద్ద అదనపు రిజర్వాయర్ నిర్మిం చాలన్న ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. గోదావరి జలాల సమర్థ వినియోగం, గరిష్ట నీటిలభ్యతే దీని లక్ష్యం. మూడేళ్ల కిందటే దీనికి పరిపాలనా అనుమతులు ఇచ్చినా, టెండర్ల ప్రక్రియ పూర్తి అయినా కరోనా పరిస్థి తుల కారణంగా మూలనపడింది. ఈ రిజ ర్వాయర్ పనులను మళ్లీ మొదలు పెట్టాలని తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతిని ధులంతా కోరుతున్నారు. సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తేనే ఈ రిజర్వాయర్ పనులు కొనసాగించే అవకాశముండటంతో త్వరలోనే ఆయన్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అరవై టీఎంసీల నీటిని వినియోగించుకుం టూ 6.21 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరిచ్చేలా దేవాదుల ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో మొత్తంగా 17 రిజర్వాయర్లు ఉన్నప్పటికీ వాటి సామర్థ్యం కేవలం 8 టీఎంసీలు మాత్రమే. ఈ నేపథ్యం లో అదనపు నీటినిల్వలకుగాను వరంగల్ జిల్లా ఘనపూర్ మండలం లింగంపల్లి– మల్కాపూర్ వద్ద 10.78 టీఎంసీల సామ ర్థ్యం, రూ.3,227 కోట్ల వ్యయంతో రిజర్వా యర్ నిర్మించాలని నిర్ణయించి 2018 ఏప్రిల్ లో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. గోదావరికి వరద ఉండే 3 నెలల కాలంలో ధర్మసాగర్ నుంచి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా దీన్ని డిజైన్ చేసింది. దీని వల్ల 4,060 ఎకరాలకు ముంపు ఉంటుందని అధికారులు తేల్చారు. నీటిని ఎత్తిపోసేందుకు ఏటా రూ.67.55 కోట్ల వరకు విద్యుత్ ఖర్చు ఉంటుందని అంచనా వేశారు. రిజర్వాయర్‌ను రెండున్నరేళ్లలో పూర్తి చేసేలా ఎన్నికలకు ముందు ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి చేసింది. అయితే ఒప్పందాలు చేసుకొని పనులు మొద లుపెట్టాల్సిన సమయంలో కోవిడ్–19 వచ్చి పడింది. ద్రవ్యోల్బణం, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోవడం, నిర్మాణంలోని ఇతర ప్రాజెక్టులకే భారీ నిధుల అవసరాలుం డటంతో ఈ పనులను మొదలు పెట్టలేదు. మూడేళ్లుగా అస్పష్టతే.. మూడేళ్లుగా పనులు మొదలుకాకపో వడంతో ఈ రిజర్వాయర్‌ను పూర్తిగా పక్కన పెట్టారని భావించినా, రెండ్రో జుల కిందట జరిగిన ఉమ్మడి వరంగల్ సమావేశంలో జిల్లా మంత్రులు, ఎమ్మె ల్యేలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 ని యోజకవర్గాల తాగు, సాగు అవసరా లను తీర్చే రిజర్వాయర్ నిర్మాణం మొద లు పెట్టాలని ఈ భేటీలో మంత్రులు సహా నేతలందరూ సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు విన్నవించారు. -
111 జీవో పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశం
-
22వ శతాబ్దంలో నివేదిక ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని రిజర్వాయర్ల సంరక్షణకు సంబంధించిన జీవో 111 పరిధి పునఃపరిశీలన, అధ్యయనంలో జాప్యంపై హైకోర్టు మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ 45రోజుల్లోనే నివేదిక ఇవ్వాల్సి ఉన్నా..ఇప్పటికీ ఇవ్వకపోవడమేంటని నిలదీసింది. 22వ శతాబ్ధంలో నివేదిక ఇస్తుందా అని ప్రశ్నించింది. అయితే చివరగా మరో అవకాశం ఇవ్వాలని, నాలుగు వారాల్లోగా హైపవర్ కమిటీ నివేదిక ఇస్తుందని ఆగస్టు 13న రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో.. వచ్చే నెల 13లోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. నివేదికపై ఆ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తేల్చిచెప్పింది. వచ్చే నెల 13లోగా నివేదిక ఇవ్వకపోతే హైపవర్ కమిటీ రద్దవుతుందని, హైపవర్ కమిటీ చైర్మన్, సభ్యులపై కోర్టు ధిక్కరణ చర్యలూ ఉంటాయని హెచ్చరించింది. ఇక క్యాచ్మెంట్ ఏరియా వెలుపల ఉన్న సర్వే నంబర్లను జీవో 111 పరిధి నుంచి తొలగించాలంటూ.. ‘ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ)’2006లో ఇచ్చి న నివేదికపైనా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. జీవో 111 పరిధి అధ్యయనం, నివేదిక విషయాల్లో తీసుకోబోయే చర్యలను వివరిస్తూ.. హైపవర్ కమిటీ చైర్మన్, ప్రభుత్వ సీఎస్ వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక, దానిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ.. అక్టోబరు 3 లోగా స్థాయీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణను అక్టోబరు 4కు వాయిదా వేసింది. రహస్య ఎజెండా ఏమైనా ఉందా? జీవో 111 పరిధికి సంబంధించిన ప్రభుత్వానికి రహస్య ఎజెండా ఏమైనా ఉందా అని విచారణ సందర్భంగా ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. ‘‘జీవో 111 పరిధిపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2006లో ఈపీటీఆర్ఐని కోరింది. అధ్యయనం చేసిన ఈపీటీఆర్ఐ కొన్ని సర్వే నంబర్లు క్యాచ్మెంట్ వెలుపల ఉన్నాయని, వాటిని జీవో 111 పరిధి నుంచి తొలగించాలని నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. 2010లో ఆ సర్వే నంబర్లను తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. మళ్లీ 2016లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. నాలుగేళ్లు గడిచినా కమిటీ నివేదిక ఇవ్వలేదు. 2018లో ఓ కేసు విచారణ సందర్భంగా 6 నెలల్లో నివేదిక ఇచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఆ గడువు కూడా 2019 ఆగస్టు నాటికి ముగిసింది. అయినా కమిటీ నివేదిక ఇవ్వలేదు’’అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు కాస్త గడువు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. ‘‘2019లో మరో కమిటీని ఏర్పాటు చేసినా కరోనా నేపథ్యంలో నివేదిక ఇవ్వలేకపోయింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన నివేదిక ఇవ్వాలని హైపవర్ కమిటీకి విజ్ఞప్తి చేస్తాం. ఇందుకు ఎనిమిది వారాల గడువు ఇవ్వండి’’అని నివేదించారు. కాగా.. పలు సర్వే నంబర్లను జీవో 111 పరిధి నుంచి తొలగించాలంటూ 2006లో ఈపీటీఆర్ఐ ఇచ్చిన నివేదికను మున్సిపల్ శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. -
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
సాక్షి, కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 5,00,647 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 5,17,502 క్యూసెక్కులు ఉంది. కుడి, ఎడమ గట్ల విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుతం 883.40 అడుగులు కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 206.9734 టీఎంసీలకి చేరింది. శ్రీశైలం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి సాగర్‌కు నీరు విడుదల చేశారు. వరదముంపుపై కలెక్టర్ సమీక్ష గుంటూరు: కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వరదముంపుపై కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆదివారం సమీక్షించారు. లోతట్టు గ్రామాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలపై కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరిలో వరద తగ్గుముఖం.. తూర్పుగోదావరి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. సముద్రంలోకి లక్షా 22 వేల క్యూసెక్కులు, డెల్టా కాల్వకు 10,300 క్యూసెక్కులు నీటిని అధికారులు విడుదల చేశారు. -
మూసి రిజర్వాయర్ గేట్లను ఎత్తిన అధికారులు
-
అహోబిలం రిజర్వాయర్‌కు ‘జియోమెంబ్రేన్’ చికిత్స
సాక్షి, అమరావతి: నిర్మాణ లోపాల కారణంగా పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) స్పిల్‌వే నుంచి భారీగా నీరు లీకవుతోంది. సీపేజీ, లీకేజీల వల్ల ఆ రిజర్వాయర్ భద్రతకే ముప్పు పొంచి ఉండటంతో అందులో సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడం లేదు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 11.1 టీఎంసీలు కాగా.. గరిష్టంగా 4.11 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచడం లేదు. దీంతో అటు ఆయకట్టుకు సాగునీరు.. ఇటు తాగునీటి అవసరాలను తీర్చలేని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్పిల్‌వే, మట్టి కట్టలలో చిల్లులను ‘జియోమెంబ్రేన్ షీట్ల’తో పూడ్చటం ద్వారా 11.1 టీఎంసీలు నిల్వ చేసి అనంతపురం జిల్లాకు మరింత జలభద్రత చేకూర్చాలని నిర్ణయించింది. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ)లో అంతర్భాగంగా పెన్నా నదిపై అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడు వద్ద 11.10 టీఎంసీల సామర్థ్యంతో పీఏబీఆర్‌ను నిర్మించారు. కాలువ ద్వారా 50 వేలు, యాడికి కెనాల్ వ్యవస్థ ద్వారా మరో 50 వేలు కలిపి మొత్తం లక్ష ఎకరాలకు నీళ్లందించేలా ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు. స్పిల్‌వే నిండా చిల్లులే.. పీఏబీఆర్ స్పిల్‌వే పొడవు 101.44 మీటర్లు. మట్టికట్ట పొడవు 1,920 మీటర్లు. రిజర్వాయర్ వద్ద పెన్నా నది గర్భం 400 మీటర్లు. రిజర్వాయర్ స్పిల్‌వే ఎత్తు 446 మీటర్లు. ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని లోపాల పుట్టగా నీటి పారుదల నిపుణులు, జల వనరుల శాఖ అధికారులు అభివరి్ణస్తున్నారు. స్పిల్‌వే నిండా చిల్లులే ఉండటంతో రిజర్వాయర్‌లో ఏనాడూ గరిష్టంగా> నీటిని నిల్వ చేయలేని దుస్థితి. కోట్లాది రూపాయలు వెచి్చంచి గ్రౌటింగ్ (స్పిల్ వే ఎగువన బోర్లు వేసి అధిక ఒత్తిడితో సిమెంట్, కాంక్రీట్ మిశ్రమాన్ని పంపి.. చిల్లులను పూడ్చటం) చేసినా చిల్లులు పూడలేదు. లీకేజీలు, సీపేజీ తగ్గలేదు. దాంతో రిజర్వాయర్ భద్రత దృష్ట్యా గరిష్టంగా 4.11 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. దీనివల్ల ఆయకట్టుకు నీళ్లందటం లేదు. అనంతపురం నగరంతోపాటు జిల్లాలో అధిక శాతం పట్టణాలు, గ్రామాలకు తాగునీటిని అందించే పథకాలు ఈ రిజర్వాయర్‌పైనే ఆధారపడ్డాయి. సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయకపోవడం వల్ల తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడింది. రిజర్వాయర్‌కు పునరుజ్జీవం తమిళనాడులో కడంపరై డ్యామ్, కర్ణాటకలో కృష్ణ రాజసాగర్ డ్యామ్‌లలో సీపేజీ, లీకేజీలను జియోమెంబ్రేన్ షీట్లు వేయడం ద్వారా తగ్గించారు. ఈ నేపథ్యంలో పీఏబీఆర్‌కు జియోమెంబ్రేన్ షీట్లను వేసి, లీకేజీలను అరికట్టాలన్న జల వనరుల శాఖ ప్రతిపాదనకు సర్కార్ ఆమోద ముద్ర వేసింది. అత్యంత పటిష్టమైన జియోమెంబ్రేన్ షీట్లను అధిక ఒత్తిడితో స్పిల్‌వే, మట్టి కట్టలకు ఎగువన భూమిలోకి దించుతారు. వాటి పునాది స్థాయి కంటే దిగువకు దించుతారు. ఈ షీట్లతో స్పిల్‌వేకు తొడుగు వేస్తారు. దాంతో లీకేజీలు, సీపేజీలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది. అప్పుడు పీఏబీఆర్‌లో పూర్తి స్థాయిలో 11.1 టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం అవుతుంది. చదవండి: ‘ఎంత కృతజ్ఙత లేని వాడివి నీవు.. చంద్రం’ ఏం జరిగిందో ఏమో.. యువతి అనుమానాస్పద మృతి -
13 కోతులు మృతి: విషం పెట్టి చంపారా?
దిస్పూర్: మానవ మృగాల చేతిలో వన్యప్రాణులు ప్రాణాలు విడుస్తున్నాయి. కేరళలో గర్భిణీ ఏనుగు హత్యోదంతం మరువకముందే అస్సాంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కచార్ జిల్లాలోని ఓ గ్రామంలో తాగునీటిని సరఫరా చేసే రిజర్వాయర్‌లో సోమవారం 13 కోతుల మృతదేహాలు వెలుగు చూశాయి. తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ప్లాంటులో ఎవరో దుండగులు కావాలనే ఈ పని చేసినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. నీటిలో విషం కలిపి వాటిని చంపివేసి ఉండొచ్చని భావిస్తున్నారు. (వైరల్: చిరుతను చంపి ఊరేగించారు) మరోవైపు కోతుల మృత దేహాలను అటవీశాఖ అధికారులు పోస్టుమార్టమ్‌కు తరలించారు. దాని ఫలితాలు వచ్చాకే కోతుల మృతిపై పూర్తి స్పష్టత రానుంది. ఈ ఘటనపై పశువైద్య అధికారి రుబెల్ దాస్ మాట్లాడుతూ.. "తాగునీటి ప్లాంట్‌లో 13 కోతులు విగతజీవులుగా తేలాయి. వాటి శరీరంలో విషపు అవశేషాలున్నట్లు తెలుస్తోంది" అని పేర్కొన్నారు. ఇక తాగునీటి కోసం జలాశయంపై ఆధారపడ్డ స్థానికులు ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. (వన్యప్రాణులు గజ గజ!) -
‘కొండపోచమ్మ’ ప్రారంభానికి ప్రజలు రావొద్దు
సాక్షి, గజ్వేల్: కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి పరిమిత సంఖ్యలో ప్రజాప్రతినిధులకు మాత్రమే ఆహ్వానం అందించామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గజ్వేల్ ప్రజాప్రతినిధులను మాత్రమే ఆహ్వానిస్తున్నామని చెప్పారు. శుక్రవారం కొండపోచమ్మ దేవాలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. ‘ఇది మనమందరం జరుపుకోవాల్సిన జలపండుగ. కానీ కరోనా నేపథ్యంలో ఇది సాధ్యం కాదు. శుక్రవారం ముఖ్యమంత్రి కేవలం ప్రారంభిస్తారు. తరువాత ప్రజలు ఎవరైనా వచ్చి సామాజిక దూరాన్ని పాటిస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్‌ను సందర్శించవచ్చు’ అని తెలిపారు. ప్రజలు ఎవరూ ప్రారంభోత్సవానికి రావొద్దు అని విజ్ఞప్తి చేశారు. (నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు) -
భూ నిర్వాసితుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
సాక్షి, రాజన్న సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సిరిసిల్ల జిల్లా అనంతగిరి రిజర్వాయర్ ప్రాజెక్టు భూ నిర్వాసితుల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. అనంతగిరి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా నీటిని విడుదల చేసారని పిటిషనర్ రచనారెడ్డి కోర్టుకు వివరించారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమలు సమయంలో అనంతగిరికి నీళ్లు విడుదల చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం అనంతగిరి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పరిహారానికి సంబంధించిన పూర్తి వివరాలు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. -
రిజర్వాయర్‌లో యువతి మృతదేహం
సాక్షి, కాజీపేట: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి రిజర్వాయర్‌లో గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మంగళవారం నీటిపై యువతి మృతదేహం తేలియాడుతోందని స్థానికులు అందించిన సమాచారం మేరకు ఏసీపీ రవీంద్రకుమార్, సిబ్బంది చేరుకుని బయటకు తీయిం చారు. బూడిద రంగు టాప్, తెలుపు రంగు ప్యాంటు ధరించిన ఆమె కుడి చేతికి ఎరుపు దారం, చెవికి కమ్మల బుట్టలు, ముత్యంతో కూడిన ముక్కు పుల్ల ధరించి ఉందని తెలిపారు. చెప్పులు రిజర్వాయర్ కట్టపై ఉండటంతో ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేసి వేశారా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి వివరాలు తెలిసిన వారు 94910 89128, 94407 95212, 94407 00506 నంబర్లకు ఫోన్ చేయాలని ఏసీపీ కోరారు. -
కళ్యాణలోవని కాపాడుకుందాం
భవన నిర్మాణాన్ని సౌందర్యవంతం చేయటానికి వాడే గ్రానైట్ ప్రజల జీవనాధారాలను, అవసరాలను, సంస్కృతిని, పర్యావరణాన్ని కొల్ల గొట్టే విధ్వంసంలో ఉంటోందని కల్యాణలోవ రిజర్వాయర్ పరీవాహక ప్రాంతాల పర్యటన మొహంమీద చరిచి మరీ చెప్పింది. విశాఖపట్నానికి 68 కిలోమీటర్ల దూరంలో దేముని కొండ సోమాలమ్మకొండకు మధ్య 1975లో కల్యాణలోవ రిజర్వాయర్ నిర్మించారు. ఒకవైపు ఆ రిజర్యాయర్‌కు ఎగువన సౌందర్యభరితంగా కనిపించే పరీవాహక ప్రాంతపు ప్రజాజీవనం, మరొకవైపు దిగువన 5 వేల ఎకరాల ఆయకట్టు ప్రాంత సన్నకారు సాగుదార్ల జీవనం, నాలుగైదేళ్లుగా క్వారీల ప్రవేశంతో కల్లోలకడలిగా మారిపోయింది. అక్కడి ప్రజల పోరాటస్వరాలని సమన్వయం చేస్తున్న పి.ఎస్. అజయ్ కుమార్ పిలుపు మేరకు సామాజిక సాహిత్య కార్యకర్తలం అక్టోబర్ 18, 19 తేదీల్లో రిజర్వాయర్ పరిసరాలు, కొత్తకోట, జెడ్. జోగిం పేట, రొచ్చుపణుకు, అజయ్ పురం గ్రామాలు చూసి, ప్రజల అభిప్రాయాలు విన్న తరువాత సమస్య తీవ్రత, విస్తృతి తెలుసుకున్నాం. మూడు గ్రానైట్ మైనింగ్ కంపెనీలు కల్యాణలోవ రిజర్వాయర్ పరీవాహక గ్రామాలలో తవ్వకాలు చేపట్టాయి. రెవెన్యూ అధికారులతో వచ్చి ఇంటికి ఒక ఉద్యోగం, భూములకు పట్టాలు, రోడ్లు, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ హాల్ నిర్మాణమనే ఆశలు చూపించి, బెదిరించి, అంగీ కార పత్రాలు రాయించుకొని ఏదీ నెరవేర్చకుం డానే వాటిపని అవి చేసుకుపోతున్నాయి. జెడ్.జోగింపేటకు కిలోమీటర్ లోపలే ఉన్న సోమాలమ్మకొండ మీద 2016 నుండి, పొట్టిమెట్ట కొండ మీద 2018 నుండి గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ రెంటి మధ్య అజయ్ పురం వుంది. ఆ ఊళ్లో ఇళ్లు బ్లాస్టింగ్‌కు అదిరి బీటలు వారాయి. బాంబుల శబ్దాలకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఊటలు, గెడ్డలు బ్లాస్టింగ్ వ్యర్ధాలతో మూసుకుపోయి, మైళ్ళదూరం కొండలు, లోయలు ఎక్కిదిగి నీళ్లు మోసుకు రావలసి వస్తున్నదని ఏ వూళ్లోనైనా ఆడవాళ్లు ఏకకంఠంతో చెప్పినమాట. చల్లకొండకు 100 మీటర్ల దూరంలోని గ్రామం రొచ్చుపణుకు. అక్కడ ఒకటి నుండి అయిదు తరగతుల వరకు చదివే 35మంది పిల్లలతో వున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 2016లో మూతబడిపోయింది. బ్లాస్టింగ్ ధ్వనులకు, భారీవాహనాల రాకపోకలకు, ఎగసిపడే రాయిపిండికి జడిసి ఆదివాసీలు పిల్లలను బడికి పంపటం మానేశారు. పిల్లలు లేరన్న కారణంగా రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం ఆ బడిని రద్దుచేసింది. పచ్చటికొండల మధ్య, పసిపిల్లల లేత నవ్వులను, జిలిబిలి మాటలను ప్రతిధ్వనించిన ఒకనాటి పాఠశాల ఈనాడొక శిథిల శూన్యగృహం. అమాయకపు పిల్లల భవిష్యత్తు, మైనింగ్ వ్యర్థాల కింద అణగిపోయిన సహజ నీటి ఊటగెడ్డల వలే ఆవిరైపోవలసినదేనా? ఆదివాసీల నీటివాడకం హక్కులకు, విద్యాహక్కులకు, ప్రశాంతంగా జీవించే హక్కులకు భంగం కలిగించటమే కాక వాళ్ళ లౌకిక జీవిత సంస్కృతిని హైందవీకరించే దుర్మార్గానికి దిగుతున్నాయి ఈ కంపెనీలు. కల్యాణలోవ రిజర్వాయర్ రక్షణకు బాధ్యత వహించవలసిన ఇరిగేషన్ విభాగం ప్రమేయమే లేకుండా ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, పరీవాహక ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించి ఆదివాసీల సహజ హక్కులను, జాతి సంపద అయిన కల్యాణలోవ రిజర్వాయర్ని కాపాడాలని అక్కడి ప్రజలిప్పుడు నినదిస్తున్నారు. కాత్యాయనీ విద్మహే వ్యాసకర్త కార్యదర్శి , ప్రరవే తెలంగాణ katyayani.vidmahe@gmail.com -
ముందుకు సాగని ‘ముచ్చోనిపల్లె’ పనులు
గట్టు (గద్వాల): ముచ్చోనిపల్లె రిజర్వాయర్ నీటి తరలింపు పనులు ముందుకుసాగలేదు. ఈ వ్యవహారంపై రెండోరోజు సోమవారం కూడా రిజర్వాయర్ దగ్గర కాలువ పనులను ఆయా గ్రామాల రైతులు అడ్డుకున్నారు. సాగు నీటి శాఖ అధికారులు, పోలీసులు రైతులకు ఎంతగా నచ్చ చెప్పినా రైతులు మాత్రం నీటి తరలింపునకు అంగీకరించే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. ఉదయం నెట్టెంపాడు డీఈ కిరణ్, గట్టు ఎస్ఐ మంజునాథ్‌రెడ్డి ముచ్చోనిపల్లె రిజర్వాయర్ దగ్గరకు వెళ్లారు. ముచ్చోనిపల్లె, మిట్టదొడ్డి, చాగదొన, తుమ్మలపల్లి గ్రామాలకు చెందిన రైతులు కూడా రిజర్వాయర్ కట్ట దగ్గరకు చేరుకున్నారు. అయిజ మండలలోని శేషమ్మ చెరువు, ఎక్లాస్పూర్ చెరువుతో పాటుగా చిన్న కుంటలకు నీటిని వదిలేందుకు ఇంజనీరింగ్ అధికారులు ముచ్చోనిపల్లె గ్రామం వైపు ఉన్న తూం దగ్గర నుంచి రిజర్వాయర్ కట్ట పొడవునా వాగు వరకు కాల్వను తవ్వే పనులను చేపట్టారు. నీటి వృథాను ఒప్పుకునే ప్రసక్తే లేదు.. అయితే కాల్వ తవ్వకంలో రాళ్లను పగుల కొట్టేందుకు బ్లాస్టింగ్ చేయడానికి లారీని రిజర్వాయర్ కట్ట దగ్గరకు తీసుకు రావడంతో రైతులు అడ్డుకున్నారు. రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపకుండా ఉన్న కొద్ది పాటు నీటిని వృథాగా వాగుల వెంట వదలడానికి తాము అంగీకరించే ప్రసక్తే లేదని రైతులు తెలిపారు. రిజర్వాయర్ నీటిని కిందకు వదిలితే మా పంటల పరిస్థితి ఎంటని రైతులు ప్రశ్నించారు. డీఈ కిరణ్ ఆయా గ్రామాల రైతులకు నీటి తరలింపు విషయంపై ఎంతగా నచ్చ చెప్పినా, రైతులు వినలేదు. పనులు జరుగనిచ్చే సమస్యే లేదంటూ ఆయా గ్రామాల రైతులు తేల్చి చెప్పడంతో చేసేదేమి లేక అధికారులు వెనుతిరిగారు. విషయాన్ని ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు డీఈ కిరణ్ తెలిపారు. అయిజ మండలంలోని చెరువులను నింపేందుకు రెండు అవకాశాలు ఉన్నట్లు డీఈ కిరణ్ తెలిపారు. ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి వచ్చే కాల్వ డీ6 నుంచి 7ఎల్ ఆఫ్ 3ఎల్ నుంచి కేవలం కిలోమిటర్ మేర కాల్వ తవ్వితే చెరువులోకి నీరు వస్తాయని, ముచ్చోనిపల్లె రిజర్వాయర్ ద్వారా అయిజ వాగు నుంచి కూడా నీటిని తరలించేందుకు అవకాశం ఉందని తెలిపారు. చెరువులను నింపేందుకు ఓటి మంజూరైనట్లు డీఈ తెలిపారు. రైతులు అభ్యంతరం తెలపడంతో పనులు నిలిపివేసినట్లు డీఈ తెలిపారు. -
‘సింగిత’ స్వరాలు
నిజాంసాగర్: జిల్లాలో పలుచోట్ల మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో నిజాంసాగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్‌కు వరదనీరు పోటెత్తింది. రిజర్వాయర్ ఎగువన ఉన్న సింగితం, హన్మాజీపేట, కోనాపూర్, మొండిసడక్, గౌరారం, సర్వాపూర్, ముదెల్లి, బడాపహాడ్, లక్ష్మాపూర్, జలాల్పూర్ గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో వాగుల ద్వారా సింగితం రిజర్వాయర్‌లోకి వరదనీరు వస్తోంది. దీంతో రిజర్వాయర్ మూడు వరదగేట్లను ఎత్తి 1,292 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రధాన కాలువకు మళ్లించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో రిజర్వాయర్ కుడి, ఎడమ అలుగులపై నుంచి కూడా నీరు పొంగి పొర్లుతోంది. వాగులు, వంకలు పారుతుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 416.55 మీటర్లకుగాను పూర్తిస్థాయి నీరుంది. -
ఇచ్చంపల్లికే మొగ్గు !
సాక్షి, హైదరాబాద్ : నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా గోదావరి నుంచి కృష్ణా జలాలను కావేరీకి తరలించే క్రమంలో ఇచ్చంపల్లి నుంచే నీటి తరలింపునకు కేంద్రం మొగ్గుచూపుతోంది. ఇప్పటికే కేంద్ర జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన అకినేపల్లి ప్రతిపాదనను, జనంపేట నుంచి పైప్‌లైన్ ద్వారా నీటి తరలింపు ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించడంతో ఇచ్చంపల్లి నుంచి నీటిని నాగార్జునసాగర్‌కు తరలించే ప్రతిపాదనకు పదును పెడుతోంది. అనుసంధాన ప్రక్రియపై ఈ నెల 21న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇచ్చంపల్లి నుంచి నీటి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చిన ఎన్‌డబ్ల్యూడీఏ.. దీనిపై తెలంగాణ అభిప్రాయాలు కోరింది. నిజానికి ఎన్‌డబ్ల్యూడీఏ మొదట 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరీకి తరలించాలని మొదట ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలపడంతో జనంపేట ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూసేకరణ తగ్గించేలా పైప్‌లైన్ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. అయితే పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తే వ్యయం ఏకంగా రూ.90 వేల కోట్ల మేర ఉంటోంది. కాల్వల ద్వారా అయితే రూ.60 వేల కోట్ల వరకే వ్యయం ఉంటోంది. అయినా ఈ ప్రతిపాదనతో పెద్దగా ఉపయోగం లేకపోవడంతో తెలంగాణ తిరస్కరించింది. దీంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇచ్చంపల్లి (గోదావరి)– నాగార్జునసాగర్ (కృష్ణా) ప్రాజెక్టులను అనుసంధానించాలని, దీనికి మూసీ రిజర్వాయర్‌ను వినియోగించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి తెలంగాణ సానుకూలంగా ఉంది. ఈ అనుసంధానం ద్వారా ఎస్సారెస్పీ–2లోని కాకతీయ కాల్వల ఆయకట్టు, ఎస్ఎల్బీసీ ఆయకట్టు, డిండి ఆయకట్టుకు కలిపి మొత్తం 9 లక్షల హెక్టార్లు (25 లక్షల ఎకరాలు) ఆయకట్టుకు నీరు అందించొచ్చని కేంద్రం చెబుతోంది. దీనికి రూ.73 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. దీనిపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణను కోరింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి నీటిని కృష్ణాకు తరలించే అంశమై చర్చలు జరుగుతున్న దృష్ట్యా, దీనిపై ఓ స్పష్టత వచ్చాక కేంద్రం చేస్తున్న ప్రతిపాదనపై స్పష్టత ఇస్తామని తెలంగాణ తెలిపింది. -
ఈసారి భారీ వర్షాలు ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ‘సెంట్రల్ వాటర్ కమిషన్’ ఆగస్టు ఒకటవ తేదీన విడుదల చేసిన బులెటిన్ ప్రకారం దేశంలోని రిజర్వాయర్లన్నీ సాధారణ స్థాయి నీటి మట్టానికి 80 శాతం నీటితో నిండాయి. ఆ తర్వాత రెండు వారాల్లోనే అంటే ఆగస్టు 14వ తేదీన విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రిజర్వాయర్లన్నీ సాధారణ స్థాయిని దాటి 125 శాతానికి చేరుకున్నాయి. అంటే సాధారణ స్థాయికన్నా 25 శాతం ఎక్కువ. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల రిజర్వాయర్లలోకి నీళ్లు ఎక్కువగా వచ్చి చేరాయి. సాధారణంగా మంచి వర్షాలు కురుస్తున్నప్పుడు సెప్టెంబర్ నెలలో ఇలా దేశంలోని రిజర్వాయర్లన్నింటిలో జలకళ కనిపిస్తోంది. అందుకు విరుద్ధంగా ఆగస్టు నెలలోనే ఇప్పుడు ఆ జలకళ ఆవిష్కతమయింది. ఈ నీటిని సద్వినియోగంగా వాడితే వచ్చే ఏడాది వర్షాలు లేకపోయినా నీటి అవసరాలు తీరిపోతాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు రావడం వల్ల దేశంలోని రిజర్వాయర్లు ఎక్కువగా నిండాయి. గోదావరి నదిపైనున్న జయక్వాడి రిజర్వాయర్ 92 శాతం నిండింది. అంతగా జలకళ కనిపించని తాపీ నదిపైనున్న ఉకాయ్ రిజర్వాయర్ కూడా ఈసారి 78 శాతం నిండాయి. ఎగువ కురిసిన వర్షాల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాషం బ్యారేజీలన్నీ నిండాయి. దాంతో కొంత నీటిని సముద్రంలోకి వదలక తప్ప లేదు. కేరళలో అధిక వర్షాల వల్ల వరదలు వచ్చి ఈసారి కూడా 496 మంది మరణించడం విషాదకరం. 2018లో సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన కేరళ తేరుకోక ముందే మళ్లీ వర్షాలు, వరదలు ముంచెత్తడం దురదష్టకరం. గతేడాది సంభవించిన వరదల్లో కేరళలో ఒక లక్ష హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా, ఆరున్నర లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు రెండువేల మంది మరణించారు. వర్షాలు, వరదలు కారణంగా కేరళకు 5,597 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు నిపుణుల లెక్కలు తెలియజేస్తున్నాయి. ఈసారి కూడా ఆ రాష్ట్రంలో నష్టం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలా అనూహ్యంగా వర్షాలు, వరదలు పెరగడానికి కారణాలు ఏమిటీ ? భూతాపోన్నతి అంటే భూమిని ఆవహించిన వాతావరణం వేడెక్కడం వల్ల వర్షాలు పెరిగాయి. 1901 నుంచి 1910 మధ్య ఉన్న భూ వాతావరణంతో పోలిస్తే 2011 నుంచి 2018 సంవత్సరాల మధ్య భూ వాతావరణంలో ఉష్ణోగ్రత 0.65 శాతం డిగ్రీలు పెరిగింది. చల్లటి గాలిలోకన్నా వేడి గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. వేడిగాలి తేమ వల్ల వాతావరణంలో అల్పపీడన ద్రోణి ఏర్పడి వర్షాలు కురుస్తాయి. తేలిగ్గా ఉండే వేడిగాలి పైకి దూసుకుపోవడం వల్ల పై వాతావరణంలో ఒత్తిడి పెరగడమే కాకుండా వేడిగాలి చోట శూన్యం ఏర్పడి, ఆ శూన్యంలోని పరిసర ప్రాంతాల తేమతో కూడిన గాలులు దూసుక రావడం వల్ల అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురుస్తాయి. ఈ అల్పపీడనం ‘సైక్లోన్ సర్కులేషన్’గా మారితే భారీ వర్షాలు కురుస్తాయి. భూమి తిరుగుతున్న వైపే తుపాన్ ప్రయాణించడాన్ని సైక్లోన్ సర్కులేషన్గా వ్యవహరిస్తారు. మొత్తంగా భూ వాతావరణం వేడిక్కడం వల్ల ఈ సారి వర్షాలు ఎక్కువగా కురిశాయని, భూతాపోన్నతి వల్ల కొన్ని సార్లు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
కాసుల వర్షం
సాక్షి, సిద్దిపేటజోన్: మూడేళ్లుగా అటవీశాఖలో కాసుల వర్షం కురుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా 3,517 ఎకరాల అటవీ భూమిని అధికారులు సేకరించారు. దీనికి బదులుగా జిల్లాలోని 760 ఎకరాల రెవెన్యూ భూమి అటవీశాఖకు అప్పగించారు. ప్రాజెక్ట్‌కు సేకరించిన భూమికి పరిహారం కింద జిల్లా అటవీశాఖకు రూ.149 కోట్లు డిపాజిట్ చేశారు. దీనిలో క్యాంపా(కంపెన్షనరీ అప్రిసియేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) కింద విడతల వారీగా రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో అటవీ సంరక్షణ, విస్తరణ చేయనున్నారు. అలాగే జిల్లాలో 3.50 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 23 మండలాల పరిధిలో ఆటవీశాఖ రికార్డుల ప్రకారం 27,604 హెక్టార్ల అటవీ విస్తరించి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు కాలువల కోసం జిల్లాకు చెందిన పలు ప్రాంతాల్లో అటవీశాఖకు చెందిన భూమిని సైతం సేకరించారు. దీంతో కేంద్ర అటవీ శాఖ నిబంధనల ప్రకారం ప్రాజెక్టులు, రైల్వేలైన్లు, జాతీయ రహదారులతో పాటు ప్రజా ప్రయోజనాల నిమిత్తం అటవీ భూమిని తీసుకోవడం వల్ల కోల్పోయిన భూమికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ భూమిని కాని, అది లేని పక్షంలో ఆ భూమికి సంబంధించిన విలువ మేరకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. క్యాంపా పథకం కింద అటవీ శాఖకు రెండు మార్గాల్లో నిధులు సమకూరుతున్నాయి. వాటిలో ఒకటి నెట్ ప్రజెంట్ వాల్యూ(ఎన్పీవీ) ద్వారా, ఆటవీ భూభాగంలో కోల్పోయిన అటవీ స్థలం విలువతో పాటు అడవుల్లోని చెట్లకు కూడా విలువ కట్టి పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. క్యాంపాలో రెండో విభాగంలో కంపెన్షనరీ అప్రియేషన్ (సీఏ) కింద జిల్లాలో నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టుల కోసం అటవీభూమిని స్వీకరిస్తే పరిహారంగా ఎకరానికి ఎకరం చొప్పున రెవిన్యూ భూమిని గాని, లేని పక్షంలో పరిహారంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అటవీశాఖకు చెందిన 3,517 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు నిమిత్తం సేకరించారు. దీనికి ప్రత్యమ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 760 ఎకరాల రెవెన్యూ భూమిని అటవీ విస్తరణ కోసం కేటాయించింది. మిగతా భూమికి విలువ కట్టి మూడేళ్లుగా దశల వారీగా ప్రభుత్వం అటవీశాఖకు క్యాంపా పద్దు కింద నిధులను కేటాయించింది. ఈ లెక్కన 2016–17 సంవత్సరంలో రూ. 6.35 కోట్ల ప్రతిపాదనలకు గాను ప్రభుత్వం రూ. 4.19 కోట్లను మంజూరి చేసింది. రెండో విడత 2017–18 సంవత్సరానికి సంబంధించి రూ. 5కోట్ల పరిహార ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం రూ. 3కోట్లు మంజూరి చేసింది. అలాగే 2018–19 సంవత్సరానికి సంబంధించి క్యాంపా పద్దు కింద రూ.13.29 కోట్ల ప్రతిపాదనలకు గాను ప్రభుత్వం రూ.9.38 కోట్లను మంజూరి చేసింది. ఈ ఏడాది 2019–20 సంవత్సరానికి సంబంధించి అటవీశాఖ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆటవీ భూమిని కోల్పోయిన పరిహారం కోసం రూ. 20 కోట్లతో పరిహారం కోసం ప్రతిపాదనలు పంపగా రూ. 2.50 కోట్లను విడుదల చేయడం విశేషం. రెవెన్యూ భూమి అప్పగింత క్యాంపా నిధులను అటవీ విస్తీర్ణం, సంరక్షణ, అభివృద్ధి కోసం కేటాయిస్తారు. అటవీ భూమిని కోల్పోయిన జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారంగా 706 ఎకరాల రెవెన్యూ భూమిని అప్పగించింది. ఈ భూమిలో అటవీశాఖ గతేడాది 200 ఎకరాల్లో పెద్ద ఎత్తున ప్లానిటేషన్ ప్రక్రియను చేపట్టి కోల్పోయిన అటవీ విస్తీర్ణాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టింది. మరోవైపు సుమారు 6,700 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాకు మంజూరైన క్యాంపా నిధులతో ప్లానిటేషన్, కందకాల తవ్వకం, దట్టమైన అటవీ ప్రాంతం కలిగిన శనిగరం, చికోడు మల్లన్నగుట్టలు, అల్లీపూర్ గుట్టలు, గజ్వేల్, హుస్నాబాద్, ములుగుతో పాటు మర్పడగ ప్రాంతాల్లో అడవిలోని జీవాల కోసం నీటి తోట్లు(సాసర్పీట్లు) నిర్మాణం చేపట్టింది. నర్సంపల్లి అటవీ ప్రాంతం చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణానికి నిధులను వినియోగించారు. శనిగరం, గండిపల్లి, కేశావపూర్, మీర్జాపూర్, గిరాయిపల్లి, శనిగరం లాంటి ప్రాంతాల్లో మరింత అటవి విస్తీర్ణం కోసం ప్లానిటేషన్ ప్రక్రియను పెద్ద ఎత్తున క్యాంపా నిధుల ద్వారా చేపడుతున్నారు. అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో రిజర్వాయర్ల కోసం 3,517 ఎకరాల అటవీ భూమిని ఇవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో 706 ఎకరాల రెవెన్యూ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖకు అప్పగించింది. మిగిలిన భూమికి పరిహారంగా క్యాంపా పథకం కింద నిధులు దశల వారిగా వస్తున్నాయి. ఈ క్యాంపా నిధులతో జిల్లాలో కోల్పోయిన అటవీ ని తిరిగి విస్తరించేందుకు ప్రణాళికలు రూ పొందించాం. ఇప్పటికే పలు చోట్ల ప్రభుత్వం ఇచ్చిన రెవెన్యూ భూమిలో 3.5 కోట్ల మొక్కలను ప్లానిటేషన్కింద అభివృద్ధి చేస్తున్నాం. –శ్రీధర్‌రావు, జిల్లా ఆటవీశాఖ అధికారి -
వనపర్తిలో సప్త సముద్రాలు..
సాక్షి, వనపర్తి(మహబూబ్‌నగర్) : సంస్థానాల కాలం నుంచే.. వనపర్తి వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. వనపర్తి సంస్థానాన్ని సుమారు నాలుగు వందల ఏళ్లు పాలించిన రెడ్డిరాజులు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ప్రస్తుత పెబ్బేరు మండలంలోని సూగూరు కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేసుకుని రాయలసీమకు చెందిన వీరకృష్ణారెడ్డి క్రీ.శ.1510లో పరిపాలన ప్రారంభించినట్లు చరిత్రకాలు వెల్లడిస్తున్నారు. కాలానుగుణంగా శ్రీరంగాపురం, వనపర్తి ప్రాంతాలకు రాజధానిని మార్చి పాలన చేశారు. మొదటి రాజారామేశ్వర్‌రావు తదనంతరం 18వ శతాబ్దంలో ఎక్కువ కాలం రాణిశంకరమ్మ వనపర్తి రాజధానిగా సంస్థానాన్ని పరిపాలించారు. సంస్థానానికి వచ్చిన ఆదాయంలో సగభాగం నిజాం ప్రభుత్వానికి కప్పం కడుతూ.. రాజ్యపాలన చేసేవారు. రాణి శంకరమ్మ అదే పద్ధతిని అనుసరించి పాలన చేశారు. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో ఉన్న రాజమహల్, రాణిమహల్ భవనాలు రాణి శంకరమ్మ హయాంలో నిర్మాణం చేసినవిగా ప్రచారంలో ఉంది. రాణిశంకరమ్మ హయాంలో బీజం వనపర్తి సంస్థానాన్ని ఎక్కువకాలం పాలించిన రాణిగా శంకరమ్మకు చరిత్రలో పదిలమైన స్థానం ఉంది. 18వ శతాబ్దంలో రాణి శంకరమ్మ రాజ్యంలో కరువుఛాయలు కనిపించకుండా.. కురిసిన ప్రతి వర్షం చుక్కను ఒడిసి పట్టి నిల్వ చేసేందుకు ప్రణాళిక రచించారు. పురాణాల్లో ఉన్న సప్తసముద్రాల మాదిరిగా.. తన సంస్థానంలో ఏడు పెద్ద చెరువులను నిర్మించి వాటికి సప్త సముద్రాలుగా ఏడు వేర్వేరు పేర్లను పెట్టి భవిష్యత్ తరాలకు తరగని సంపదగా ఇవ్వాలని బృహత్తరమైన కార్యానికి పూనుకుని తన హయాంలోనే.. నాటి వనపర్తి సంస్థానంలో రెండు తాలుకాలు కొత్తకోట, పెబ్బేరుల పరిధిలో ఏడు చెరువులను నిర్మించారు. ఈ చెరువులకు వర్షం నాటి పాటుతో పాటు ఆయా ప్రాంతాల్లోని చెరువులు అలుగు బారినప్పుడు సప్త సముద్రాల్లోకి చేరేలా.. గొలుసుకట్టు విధానానికి రూపకల్పన చేశారు. సుమారు రెండు వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఏడు చెరువులు (సప్త సముద్రాలు) జిల్లా ప్రజలకు ఇప్పటికీ కల్పతరువులుగానే.. ఉపయోగపడుతున్నాయి. ఇక్కడే గొలుసుకట్టు చెరువులు వనపర్తి సంస్థానాధీశుల కాలంలోనే సప్త సముద్రాల పేరిట చెరువుల నిర్మాణంతోపాటు అన్ని చెరువులు, కుంటలకు వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని వ్యవసాయానికి ఉపయోగించే విధంగా అన్ని చెరువులకు గుట్టల ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాల నుంచి వర్షం వరద నీరు చెరువుల్లోకి చేరేలా పాటు కాల్వల నిర్మాణం చేశారు. చెరువులు నిండిన తర్వాత అలుగు పారే నీటిని మరో చెరువులోకి వెళ్లేలా వాగులను నిర్మించారు. చెరువులన్నీ నిండిన తర్వాత చివరగా సప్త సముద్రాల చెరువుల్లోకి వర్షం నీరు చేలా పాటు కాల్వలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో అప్పట్లో వ్యవసాయం పండగలా విరాజిల్లినట్లు ప్రచారంలో ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి జిల్లాలో పండించే వేరుశనగ పంటల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి చెన్నై, కోల్కత్తా, ముంబయి ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి పల్లిని కొనుగోలు చేసి అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నారు. పల్లి ధరల విషయానికి వస్తే.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ల కంటే వనపర్తిలో మార్కెట్లో ఏటా వేరుశనగ పంట ఉత్పత్తులకు ఎక్కువ ధరలు పలుకుతాయి. ఎక్కువగా జిల్లా రైతులు వేరుశనగను యాసంగి పంటగా సాగు చేస్తారు. వేరుశనగ పంట ఉత్పత్తులు వచ్చే సమయంలో జిల్లాకేంద్రంలోని మార్కెట్ పల్లి రాశులతో కళకళలాడుతుంది. కాలు మోపెందుకు స్థలం లేనంతగా వేరుశనగ రాశులతో నిండిపోతోంది. 2 లక్షల ఎకరాల్లో సాగు.. సంస్థానాధీశుల కాలం నుంచే వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు సంతరించుకున్నది వనపర్తి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇక్కడి పాలకుల కృషి ఫలితంగా కొత్త రిజర్వాయర్లు, ప్రాజెక్టుల నిర్మాణం, పంట కాల్వల నిర్మాణాలను చేపట్టడంతో ప్రస్తుతం జిల్లాలో ఏటా ఖరీఫ్‌లో మెట్ట, తరి పొలాల్లో సుమారు 2 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా వరిసాగు చేస్తారు. ప్రతి ఖరీఫ్‌లో సుమారు 70 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తూ రాష్ట్రంలోనే.. అత్యధికంగా వరిధాన్యం పండిస్తూ రికార్డు స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు లక్ష్యంకు మించి ధాన్యం విక్రయిస్తున్నారు. మా తాతముత్తాల నుంచే.. సప్తసముద్రాల్లో ఒకటైన శంకరసముద్రం మా గ్రామ సమీపంలో ఉండటం సంతోషంగా ఉంది. మా తాత, ముత్తాల కాలం నుంచి ఈ శంకరసముద్రం కింద మేం వ్యవసాయం చేస్తున్నాం. వందలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం ఈ చెరువు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి 2007లో పనులు ప్రారంభించారు. శంకరసముద్రంలో మా గ్రామం ముంపునకు గురైంది. ఏళ్లు గడుస్తున్న నేటికీ పనులు పూర్తి కాకపోవడంతో గ్రామస్తులందరం నిరాశతో ఉన్నాం. – బాలయ్య, రైతు, కానాయపల్లి సాగు, తాగునీరు అందిస్తోంది పెబ్బేరు శివారులో ఉన్న మహాభూపాల్ చెరువును రాజుల కాలంలో నిర్మించారు. ప్రతి సంవత్సరం ఈ చెరువు వర్షాలతోనే నిండదంలో పశువులకు, గ్రామ ప్రజలకు తాగునీరు, అవసరాలకు వాడుకోవడంతోపాటు చెరువు కింద రైతులు 2 వేల ఎకరాల్లో వరిసాగు చేసి నీళ్లను వాడుకుంటున్నారు. ఆ రోజుల్లో చెరువు చూడాల్సిన వారు రైతు కమిటీ సభ్యులను నీరేంటులుగా నియమించడంతో నీటి వృథా చేయకుండా వాడుకునేవారు. ప్రస్తుతం జూరాల కాల్వ చెరువు పక్కల ఆనుకొని పోవడంతో పుష్కలంగా నీళ్లు వచ్చాయి. దీంతో చెరువులను చూసుకునే దిక్కులేకుండా పోయింది. – బాల్‌రాం, రైతు, పెబ్బేరు -
రూ.2,200 కోట్లతో ‘గట్టు’ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: కృష్ణాజలాలను వినియోగించుకుంటూ గద్వాల జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పథకాన్ని విస్తరించే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. జూరాల నుంచి రోజుకు అర టీఎంసీ నీటిని తీసుకుంటూ 30 రోజుల్లో కనీసంగా 15 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా దీన్ని రూపొందిస్తున్నారు. గతంలో ప్రతిపాదించిన 4 టీఎంసీల రిజర్వాయర్‌కు బదులుగా 10 నుంచి 15 టీఎంసీల సామర్థ్యంతో పెంచికలపాడు రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. దీనికి రూ.2,500 కోట్లు వ్యయం అవుతుందని లెక్కగట్టారు. గద్వాల జిల్లాలోని గట్టు, ధారూర్ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టుకు గత ఏడాది జూన్‌లో సీఎం కేసీఆర్ ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో గట్టుకు అవసరమయ్యే 4 టీఎంసీల నీటిని రేలంపాడ్ రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని భావించారు. అక్కడి నుంచి నీటిని తీసుకుంటూ 0.7 టీఎంసీల సామర్థ్యమున్న పెంచికలపాడు చెరువును నింపాలని, దీనికోసం అవసరమైతే దాని సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. తదనంతరం దీనిపై సమీక్షించిన సీఎం రేలంపాడ్‌కు బదులుగా నేరుగా జూరాల నుంచే నీటిని తీసుకోవాలని, రిజర్వాయర్ సామ ర్థ్యాన్ని సైతం పెంచాలని, ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనలకు అనుగుణం గా సర్వే చేసిన అధికారులు జూరాల నుంచి 15 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. నీటి నిల్వకోసం 10 నుంచి 15 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదిస్తుండగా, దీనికోసం 3,500 ఎకరాల భూసేకరణ అవసరమని గుర్తించారు. 160 మీటర్ల మేర నీటిని లిఫ్ట్ చేయనున్నారు. దీనికోసం రూ.2,500 కోట్లు వ్యయం అవుతందని అంచనా వేశారు. దీనిపై సమ గ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. -
ఏకకాలంలో రెండు మోటార్ల వెట్‌రన్
ధర్మారం(ధర్మపురి): కాళేశ్వరం ప్రాజెక్టులో మరోకీలక ఘట్టం గురువారం ఆవిష్కృతమైంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం వద్ద ప్యాకేజీ–6లో భాగంగా నిర్మించిన సర్జిపూల్‌లోని రెండవ మోటార్ వెట్‌రన్ విజయవంతమైంది. 124.7 మెగావాట్ల విద్యుత్‌తో నడిచే రెండో మోటార్ సైతం 105 మీటర్ల లోతు నుంచి నీటిని తోడి మేడారం రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేసింది. వెట్‌రన్ విజయవంతం కావడంతో ఇంజనీరింగ్ అధికారుల్లో హర్షం వ్యక్తమైంది. రెండో మోటార్‌కు సంబంధించిన సాంకేతిక ప్రక్రియలన్నీ పూర్తికావడంతో అధికారులు గురువారం వెట్‌రన్‌కు ఏర్పాట్లు చేశారు. సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, పెద్దపల్లి కలెక్టర్ శ్రీ దేవసేన హాజరై మోటార్ వద్ద ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం ఇద్దరూ కలిసి మోటార్ స్విచ్ ఆన్‌చేసి వెట్‌రన్ ప్రారంభించారు. ఎలాంటి అంతరాయం లేకుండా నీటిని లిఫ్ట్ చేయడంతో.. ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందిని వారు అభినందించారు. మిగిలిన పనులు సైతం ఇదే ఉత్సాహంతో పూర్తిచేయాలని ప్రోత్సహించారు. బుధవారం మొదటి మోటార్ వెట్‌రన్ విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. 30 నిమిషాలు వెట్‌రన్ మధ్యాహ్నం 1:45 గంటలకు రెండో మోటార్‌ను స్మితాసబర్వాల్, శ్రీ దేవసేన ప్రారంభించారు. అనంతరం వారు జేసీ వనజాదేవి, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సిస్టర్న్‌ల వద్దకు వచ్చారు. తర్వాత 15 నిమిషాలకు ఇంజనీర్లు మొదటి మోటార్‌ను కూడా ఆన్ చేశారు. కొంత ఆలస్యంగా మొదటి సిస్టర్న్ నుంచి నీరు ఉబికి వచ్చింది. ఏకకాలంలో రెండు మోటార్ల వెట్‌రన్ విజయవంతమైంది. రెండు సిస్టర్న్‌ల ద్వారా వచ్చిన నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా సమీపంలోని మేడారం రిజర్వాయర్‌లోకి చేరింది. కాలువలో పారుతున్న గోదావరి నీటికి స్మితాసబర్వాల్, శ్రీ దేవసేన, వనజాదేవి, ఇంజనీరింగ్ అధికారులు పూజలు చేశారు. సుమారు 30 నిమిషాలు రెండు మోటార్లు వెట్‌రన్ కొనసాగించి తర్వాత ఆఫ్ చేశారు -
కృష్ణ రహస్యం!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికలు సమీపస్తున్న తరుణంలో గుట్టుచప్పుడు కాకుండా రూ. 240 కోట్లతో చేపట్టే డక్కిలి మండలం ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బుధవారం హడావుడిగా భూమిపూజ నిర్వహించారు. భూమి పూజకు సంబంధించి నాయకులకు సమాచారం ఇవ్వకుండానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల నుంచి ఆల్తూరుపాడులో రిజర్వాయర్ తీసుకొస్తామని చెబుతున్న ఎమ్మెల్యే ఇన్నాళ్లు మౌనంగా ఉండి.. ఇప్పుడీ హడావుడి వెనుక కృష్ణ రహస్యం ఉందనే ప్రచారం జరుగుతోంది. పనులు ఎవరికోకరికి అప్పగించి కమీషన్ జేబులో వేసుకోవడానికేనని ప్రచారం జరుగుతోంది. రూ. 240 కోట్లతో రిజర్వాయర్ పనులు చేపట్టాలని ఇటీవల సీఎం చంద్రబాబునాయుడుతో ఎమ్మెల్యే రామకృష్ణ చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆల్తూరుపాడు రిజర్వాయర్‌తో పాటు కండలేరు– పూండి కాలువ నుంచి రిజర్వాయర్‌కుఎత్తిపోతల పథకం ద్వారా నీటిని నిల్వ చేసే పనుల కోసం రూ.110 కోట్లతో మరో ప్యాకేజీ పనులను ప్రభుత్వ ఆమోదించినట్లు అధికారులు చెబుతున్నారు. సీఎం, మంత్రులు లేకుండానే భూమి పూజా? ఆల్తూరుపాడులో రూ.240 కోట్లతో పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రామకృష్ణ భూమి పూజను పూర్తి చేయడం ఏమిటీ అని టీడీపీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు సీఎంతో కానీ, జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఇన్చార్జి మంత్రి ఉన్నా..వారితో కాకుండా ఎమ్మెల్యే స్వయంగా శంకుస్థాపన చేయడంపై అధకార పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. రిజర్వాయర్ పనుల శంకుస్థాపన చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు వస్తారని ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉంది. అయితే హడావుడిగా సీఎం చంద్రబాబునాయుడు లేకుండానే బుధవారం ఎమ్మెల్యే రామకృష్ణ, ఆయన వియ్యంకుడు, పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ కుటుంబ సమేతంగా వచ్చి భూమి పూజ చేశారు. కోట్లాది రూపాయిల ప్రభుత్వ నిధులతో చేపట్టే రిజర్వాయర్ పనుల భూమి పూజా కార్యక్రమానికి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించలేదు. చేయని పనులు, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేశామని ప్రభుత్వం చెప్పి కోట్లు ఖర్చు పెట్టి మరీ పబ్లిసిటీ చేస్తున్న తరుణంలో ఎవరికీ చెప్పకుండా చేయడంపై చర్చగా మారింది. కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుగంగ అధికారులు, ఎమ్మెల్యే అనుచరులు సెల్ఫోన్లు సైతం ఎమ్మెల్యే కోటరీగా వ్యవహరించే పలువురు తీసుకోవడం గమనార్హం. ఒక దశలో ఇరిగేషన్ శాఖ అధికారులు తమ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్న లక్ష్యంతో ఫొటోలను పంపాలని భావించినా ఎమ్మెల్యే రామకృష్ణ వారి ఫోన్లు తీసుకోవడంతో సమాచారం ఇవ్వలేకపోయారు. కొంతమంది ఫొటోలు తీయాలని ప్రయత్నించినా ఎమ్మెల్యే రామకృష్ణ ససేమిరా అన్నట్లు తెలిసింది. -
కాంట్రాక్టర్లపై అమిత ప్రేమ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న దోపిడీని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) బహిర్గతం చేసింది. కాంట్రాక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద కేంద్రం మంజూరు చేసిన నాలుగు ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని రూ.1,051.57 కోట్లు మేరకు పెంచేసి, అనుచిత లబ్ధి చేకూర్చారని తీవ్రంగా ఆక్షేపించింది. ప్రాజెక్టులు పూర్తయినా ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల (పిల్ల కాలువ) పనులు చేయనందువల్ల రైతులకు ప్రయోజనం దక్కట్లేదని స్పష్టం చేసింది. భూసేకరణలో జాప్యం.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో నిర్లక్ష్యం.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లలో లోపాలు.. పనులలో అక్రమాలు వెరసి.. పూర్తి కావాల్సిన ప్రాజెక్టుల పనులు ముందుకు సాగట్లేదంటూ కడిగిపారేసింది. దేశంలో ఏఐబీపీ ప్రాజెక్టుల పనుల తీరుపై అధ్యయనం చేసిన కాగ్ పార్లమెంట్‌కు నివేదికిచ్చింది. ఏఐబీపీ ప్రాజెక్టుల పనులో ఎక్కడా లేని రీతిలో ఏపీలో భారీగా అక్రమాలు జరుతున్నాయని పేర్కొంది.అడ్డగోలుగా అంచనాల పెంపు..రాష్ట్రంలో తాడిపూడి ఎత్తిపోతల, గుండ్లకమ్మ, తారకరామ తీర్థసాగరం, భవనాసి మినీ రిజర్వాయర్లను సత్వరమే పూర్తి చేసేందుకు ఏఐబీపీ కింద కేంద్రం నిధులు ఇస్తోంది. ఈ పనుల్లో రాష్ట్రప్రభుత్వం అక్రమాలకు పాల్పడినట్టు కాగ్ నివేదిక స్పష్టం చేసింది.గుండ్లకమ్మ ప్రాజెక్టు 2008లోనే పూర్తయింది. మొత్తం 32,400 హెక్టార్లకుగాను 27,110 హెక్టార్ల ఆయకట్టుకు అప్పట్లోనే నీటిని విడుదల చేశారు. మిగిలిన 5,290 హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించాలంటే 21.06 ఎకరాల భూమిని సేకరించాలి. కానీ రాష్ట్రప్రభుత్వం 2014 నుంచి ఇప్పటిదాకా సేకరించలేదు. ఎకరానికి రూ.1,500 చొప్పున ఖర్చు చేస్తే మిగిలిన ఆయకట్టుకు నీళ్లందించవచ్చు. కానీ అంచనా వ్యయాన్ని రూ.165.22 కోట్ల నుంచి రూ.753.83 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్‌కు అనుచితంగా లబ్ధి చేకూర్చింది. ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే గ్రామాలవారికి పునరావాసం కల్పించడంలోనూ విఫలమైందని తేల్చింది. తాడిపూడి ఎత్తిపోతల పథకం 2008 నాటికే దాదాపుగా పూర్తయింది. 83,609 హెక్టార్లకుగాను 62,138 హెక్టార్ల ఆయకట్టుకు అప్పట్లో నీటిని అందించారు. మరో 21,471 హెక్టార్లకు నీటిని అందించాలి. కానీ 2014 నుంచి ఇప్పటివరకూ డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టనందువల్ల మిగతా ఆయకట్టుకు నీళ్లందించలేదు. అయితే అంచనాల్ని రూ.376.96 కోట్ల నుంచి రూ.568 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చినట్టు కాగ్ ఆక్షేపించింది. తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు కింద పదివేల హెక్టార్లకు నీటిని ఇవ్వాలి. ప్రాజెక్టుకు అవసరమైన 107.53 ఎకరాల భూమిని ఇప్పటిదాకా సేకరించలేదు. పనులు కాంట్రాకర్లకు అప్పగించాక డీపీఆర్‌లో భారీగా మార్పులుచేర్పులు చేశారు. దీంతో అంచనా వ్యయాన్ని రూ.220.11 కోట్ల నుంచి రూ.471.31 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్‌కు ప్రయోజనం కల్పించినట్టు కాగ్ వెల్లడించింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో భవనాసి చెరువును మినీ రిజర్వాయర్‌గా చేపట్టే పనులను రూ.27 కోట్లతో చేపట్టారు. మినీ రిజర్వాయర్‌గా మార్చే పనులకు భూసేకరణ చేయలేదు. అంచనా వ్యయాన్ని రూ.27 కోట్ల నుంచి రూ.47.72 కోట్లకు పెంచి కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చారని కాగ్ తేల్చింది. వెలిగల్లు రిజర్వాయర్ పూర్తి కాకుండానే... వెలిగల్లు రిజర్వాయర్‌ను పూర్తి కాకుండానే పూర్తయినట్లు ప్రకటించారు. కానీ రిజర్వాయర్ పనుల్లో పలు లోపాలు బయటపడ్డాయి. ప్రభుత్వం నిబంధనల మేరకు వ్యవహరించి ప్రాజెక్టు పూర్తయినట్టుగా ప్రకటించకుండా ఉండుంటే.. మరమ్మతులకయ్యే ఖర్చును కాంట్రాక్టరే భరించేవారు. కానీ సర్కారు తీరు వల్ల రూ.16 కోట్ల ప్రజాధనంతో రిజర్వాయర్‌కు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ఆ మేరకు కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చినట్టు కాగ్ తేల్చింది. -
రెండు రిజర్వాయర్లకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టు ల్లో భాగంగా చేపడుతున్న రెండు రిజర్వాయర్ల పనులను తాత్కాలికంగా పక్కనపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదులలో భాగం గా నిర్మిస్తున్న మల్కాపూర్, పాలమూరు–రంగారెడ్డిలో భాగంగా నిర్మిస్తున్న లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ పనులను ప్రస్తుతం చేపట్టరాదని నీటిపారుదల శాఖకు సంకేతాలు వచ్చినట్లుగా తెలిసింది. ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఇతర పనుల పూర్తికి నిధుల అవసరాలుండటం, అవి పూర్తయితే కానీ ఈ రిజర్వాయర్లతో ఉపయో గం లేకపోవడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అంతా సిద్ధం.. ఆలోపే నిశ్శబ్దం.. గోదావరి జలాలను వినియోగించుకునేందుకు చేపట్టిన దేవాదుల ప్రాజెక్టులో అదనపు నీటి నిల్వలు పెంచేందుకు కొత్త రిజర్వాయర్ నిర్మా ణం చేయాలని సీఎం కేసీఆర్ తొలినుంచీ చెబుతున్నారు. సీఎం సూచనలకు అనుగుణంగా 10.78 టీఎంసీల సామర్థ్యంతో, రూ.3,672 కోట్లతో వరంగల్ జిల్లా ఘనపూర్ మండలం లింగంపల్లి వద్ద దీన్ని నిర్మించాలని నీరుపారుదల శాఖ నిర్ణయించింది. గోదావరికి వరద ఉండే 3 నెలల కాలంలో ధర్మసాగర్ నుంచి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా దీన్ని డిజైన్ చేసింది. ఈ రిజర్వాయర్‌తో 4,060 ఎకరాల మేర ముంపు ఉంటుందని తేల్చింది. నీటిని ఎత్తిపోసేందుకు 72 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని, ఏటా రూ.67.55 కోట్ల వరకు విద్యుత్ ఖర్చు ఉంటుందని అంచనా వేసింది. రిజర్వాయర్‌ను రెండున్నరేళ్లలో పూర్తి చేసేలా ఇటీవలి రాష్ట్ర ఎన్నికలకు ముందు ఈ పనుల ను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులకు సిద్ధమైంది. దేవాదులలోని మూడో ఫేజ్‌లోని మూడో దశ పను ల్లో సొరంగం పనులు పూర్తి కాలేదు. ఇది పూర్తయితే కానీ 25 టీఎంసీల మేర నీటిని వినియోగించుకునే అవకాశం లేదు. ఇక్కడ 49 కి.మీ. సొరంగం పనుల్లో 7కి.మీలు పెండింగ్‌లో ఉంది. ఈ పనులను ప్రస్తుత ఏజెన్సీతో పూర్తి చేయ డం సాధ్యం కాకపోవడంతో మరో ఏజెన్సీతో పనులు చేయించాలని సీఎం ఆదేశిం చారు. ఈ పనుల పూర్తికే రెండేళ్లు పట్టనుంది. నిధుల అవసరాలు భారీగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుపై మరింత ఆర్థిక భారం వేయరాదన్న భావనలో ఉన్న ప్రభుత్వం, మల్కాపూర్ రిజర్వాయర్‌ను కొద్దికాలం పక్కనపెట్టాలని నిర్ణయించినట్లుగా నీటిపారుదల వర్గాలు చెప్పాయి. లక్ష్మీదేవునిపల్లిపై అదే మౌనం.. ఇక 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరు, పరిశ్రమలకు నీటివసతిని కల్పించే ఉద్దేశంతో రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు ప్రాజెక్టును చేపట్టగా ఇందులో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదే వునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులను 18 ప్యాకేజీలుగా విభజించి, మొత్తంగా రూ.30 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి రెండున్నరేళ్ల కిందటే పనులు ప్రారంభించారు. అయితే రెండున్నరేళ్లుగా ఉద్దండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి అనుసంధాన ప్రక్రియ, రిజర్వాయర్ నిర్మాణంపై స్పష్టత రాలే దు. 2.80 టీఎంసీల సామర్ధ్యంతో రూ.915 కోట్లతో దీని అం చనాలు సిద్ధం చేసినా టెండర్లు మాత్రం పిలవలేదు. అయితే ప్రస్తుతానికి పాలమూరు ప్రాజెక్టులో ఉద్దండాపూర్ వరకు పనులను వేగిరం చేయాలని సూచించిన ప్రభుత్వం, ఆ పనులు పూర్తయ్యాకే లక్ష్మీదేవునిపల్లిని చేపట్టాలనే సంకేతాలిచ్చింది. ఎగువ పనులు పూర్తవ్వాలంటే మరో రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. అవి పూర్తయితేకానీ లక్ష్మీదేవునిపల్లి చేపట్టే అవకాశం లేదు. -
పెన్నా అహోబిలం ప్రాజెక్టును అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగభద్ర నదీ జలాలను వినియోగించుకుంటూ అక్రమంగా పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపడుతోందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఫిర్యాదు చేశారు. ఏ అనుమతులు లేకుండా చేపడుతున్న ఈ నిర్మాణాన్ని అడ్డుకోవాలని విన్నవించారు. ఈ మేరకు మంగళవారం హరీశ్‌రావు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్, సుంకేశులకు మధ్య ప్రాంతంలో తుంగభద్ర నది నుంచి 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసి అనంతపురం జిల్లా కు నీరిచ్చేలా పెన్నా అహోబిలం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు. తుంగభద్ర పరీవాహకం నుంచి కృష్ణా ప్రధాన నదికి స్థిరమైన ప్రవాహాలు ఉంటాయని కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్–1 తేల్చి చెప్పిందని, రెండో ట్రిబ్యునల్ దీన్ని ధ్రువీకరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తుంగభద్ర నది నుంచి ఏపీ 40 టీఎంసీల మేర నీటిని తరలిస్తే, దిగువన తెలంగాణలోని కల్వకుర్తి, ఏఎమ్మార్ ఎస్ఎల్బీసీ, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింది నీటి అవసరాలకు తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యే ప్రమాదం ఉందని ప్రస్తావించారు. అదీగాక రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఎలాంటి కొత్త ప్రాజెక్టును చేపట్టినా, ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు, తెలంగాణ రాష్ట్రానికి పంపాలని పేర్కొన్నారు. బోర్డు పరిశీలించిన తర్వాత అపెక్స్ కౌన్సిల్‌కు నివేదించాలని ప్రస్తావించారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందిన తర్వాతనే ప్రాజెక్టు పనులను సాగించాలని వివరించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి డీపీఆర్‌ను పంపించే ఏర్పాటు చేయాలని కోరారు. -
కరువు నేలకు కల్పతరువు
సాక్షి, సిద్దిపేట : రాష్ట్రంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతాలు జనగామ, సిద్దిపేట జిల్లాలకు తపాస్‌పల్లి రిజర్వాయర్ కల్పతరువుగా మారింది. ఈ జిల్లాల్లోని బీడు భూములకు దేవాదుల ఎత్తిపోతల ద్వారా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం తపాస్‌పల్లి వద్ద రిజర్వాయర్‌లో నీటిని ఎత్తిపోసి సాగునీరు అందిస్తున్నారు. 54 చెరువులకు ఆధారం.. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి ఏటా సిద్దిపేట, జనగామ జిల్లాల్లోని కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, కొండపాక మండలాల్లోని సుమారు 54 చెరువులను నింపుతున్నారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 0.3 టీఎంసీ కాగా, మరో 1.2 టీఎంసీలను గోదావరి జలాలతో ఈ 5 మండలాల్లోని చెరువులకు తరలిస్తున్నారు. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లకు తాగునీటి కోసం కొమురవెల్లిలోని 13 చెరువులు, చేర్యాలలో 8, మద్దూరులో 1, కొండపాకలో 7 చెరువులు, బచ్చన్నపేటలోని 25 చెరువులు నింపారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మరిన్ని చెరువులను నింపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో... సముద్ర మట్టానికి 500 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేట ప్రాంతానికి గోదావరి జలాలు తరలించాలంటే ఎత్తిపోతలే మార్గం.. దీన్ని గుర్తించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2007లో తపాస్‌పల్లి ఎత్తిపోతల పనులకు శ్రీకారం చుట్టారు. 65 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దీని నిర్మాణం చేపట్టారు. వైఎస్సార్ హయాం తర్వాత పెద్దగా పనులు జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్, నీటి పారుదల మంత్రి హరీశ్‌రావుల సహకారంతో ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. దీంతో ఈ రిజర్వాయర్ కింద 82,500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. 25 శాతం పనులు పెండింగ్‌లోనే... 2007లో ప్రారంభించిన తపాస్‌పల్లి రిజర్వాయర్ నిర్మాణంలో ఇప్పటికీ 75 శాతం పనులే మాత్రమే పూర్తయ్యాయి. మరో 25 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కష్టాలు తీరాయి.. గోదావరి జలాలతో తపాస్‌పల్లి రిజర్వా యర్‌ను నింపి, తద్వార చెరువులు నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో కరువు ప్రాంతమైన సాగుకు అనుకూలమైంది. ఏటా చెరువులు నింపడంతో వ్యవసాయం చేయడానికి నీళ్ల కష్టం తొలగిపోయింది. ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు. – మెరుగు క్రిష్ణ , రైతు ఐనాపూరు కాల్వల నిర్మాణం పూర్తి చేయాలి రిజర్వాయర్ ఎడమ, కుడి కాల్వలు, ఉపకాల్వలను పూర్తిచేసి సాగునీరు అందించాలి. మెయిన్ కాల్వలు పూర్తయినా నిరుపయోగంగా ఉన్నాయి. వెంటనే కాల్వల నిర్మాణం పూర్తి చేసి పొలాలకు నీరందించాలి. – చెరుకు రమణారెడ్డి, ఐనాపూర్ -
ఎడతెరిపిలేని వర్షాలతో తెలంగాణ ఉక్కిరిబిక్కిరి
-
ప్రజల అంగీకారంతోనే నిర్మిస్తాం..
చిల్పూరు(స్టేషన్‌ఘన్‌పూర్): లింగంపల్లి గ్రామస్తుల అంగీకారంతోనే రిజర్వాయర్ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని లింగంపల్లిలో రూ.3,223 కోట్లతో 10.78 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మించేందుకు గ్రామస్తుల అభిప్రాయ సేకరణకు ఆదివారం గ్రామ సమీపంలోని సమ్మక్క – సారలమ్మ జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే రాజయ్య అధ్యక్షత వహించారు. ముందు గ్రామస్తులతో అభిప్రాయం కోసం మాట్లాడించగా కన్నీరు పెట్టుకుంటూ ఎట్టిపరిస్థితుల్లో రిజర్వాయర్ నిర్మాణానికి తమ భూములు ఇచ్చేది లేదని తెలిపారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రజలు అనుకున్న విధంగా పోలీసు బలగాలు, అధికారుల హెచ్చరికలతో సాఫీగా పనులు చేయవచ్చని, ఆ విధానం సీఎం కేసీఆర్‌కు నచ్చదని, అందుకే అభిప్రాయ సేకరణ సభ నిర్వహించినట్లు తెలిపారు. వాస్తవంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ రిజర్వాయర్లు ఉన్నాయని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో లేనందున సీఎం కేసీఆర్ ఇక్కడ కూడా సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థలసేకరణ చేయాలంటూ ఆదేశించారని అన్నారు. అందుకు గీసుకొండ, మైలారం, స్టేషన్‌ఘన్‌పూర్, గండిరామారం రిజర్వాయర్లను పరిశీలించగా మల్కాపూర్–లింగంపల్లి మధ్య ఎంపిక చేశామని తెలిపారు. ఇక్కడ 848 ఇళ్లు, 4,400 ఎకరాలు, తక్కువ ముంపుతో ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. 4,139 మంది ప్రజలు మాత్రమే ఇబ్బంది పడతారని, రానున్న రోజుల్లో వర్షాలు లేకున్నా తోటి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని భావిస్తున్నట్లు చెప్పారు. రిజర్వాయర్ నిర్మాణానికి గ్రామస్తులు సహకరించాలని కోరా రు. దేవాదుల సీఈ బంగారయ్య మాట్లాడుతూ 4,400 ఎకరాల్లో నిర్మించే లింగంపల్లి రిజర్వాయర్ పూర్తయ్యాక, ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద 78 మెగావాట్ల పంప్‌హౌజ్ నిర్మించి మూడు పైప్లైన్ల ద్వారా నీటిని నింపనున్నట్లు తెలిపారు. జనగామ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముంపు భూముల ప్రజలకు న్యాయం జరిగిన తర్వాతే పనులు మొదలవుతాయని, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ కోరినవిధంగా ప్రభుత్వం నుంచి పరిహారం అందించేందుకు కృషిచేస్తానని అన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు స్వామినాయక్, ఎంపీపీ జగన్మోహన్రెడ్డి, ఆర్డీఓ రమేశ్, తహసీల్దార్ గంగాభవాని, పోలేపల్లి రంజిత్‌రెడ్డి, బబ్బుల వంశి, తెల్లాకుల రామకృష్ణ, ఉద్దెమారి రాజ్‌కుమార్, వరప్రసాద్, గొడుగు రవి, జంగిటి ప్రభాకర్, ఇల్లందుల సుదర్శన్, పాగాల సంపత్‌రెడ్డి, జనగాం యాదగిరి పాల్గొన్నారు. -
బినామీల బాగోతం
సాక్షి, కథలాపూర్(వేములవాడ) : పరిహారం డబ్బుల కోసం ప్రభుత్వ భూముల్లోనే పాగా వేశారు. ఎక్కడైన ప్రాజెక్టు నిర్మిస్తుంటే ఆ ప్రాంతంలోని భూనిర్వాసితులకు పరిహారం దక్కడం న్యాయం. కానీ కథలాపూర్ మండలం కలిగోట శివారులోని సూ రమ్మ రిజర్వాయర్ పరిహారం కోసం స్థానికేతరు లు సైతం రెవెన్యూ రికార్డుల్లో పేర్లు చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. స్థానికేతరుల పేర్లు కనిపించడంపై కలిగోట గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్న స్థానికులకు మాత్రమే పరిహారం ఇవ్వాలని.. అక్రమార్కులను అడ్డుకోవాలని కోరుతున్నారు. ఇదీ రిజర్వాయర్ ప్రణాళిక కథలాపూర్ మండలం కలిగోట శివారులోని సూరమ్మ చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని 2006లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్లంపెల్లి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ రిజర్వాయర్‌ను నీటితో నింపి కథలాపూర్, మేడిపెల్లి మండలాలకు సాగు, తాగునీరందించడం లక్ష్యం. రిజర్వాయర్ నిర్మాణానికి అంబారిపేట పరిధిలోని 39.26 ఎకరాలు పట్టా భూమి, 114.33 ఎకరాలు ప్రభుత్వ భూమి అవసరం. కలిగోట పరిధిలో 117.11 ఎకరాలు పట్టాభూమి, 80.36 ఎకరాలు ప్రభుత్వ భూమి కోల్పోతున్నట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. పట్టాభూముల రైతులకు అప్పట్లోనే ప్రభుత్వం పరిహారం చెల్లించింది. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉండి ఏళ్లుగా సాగుచేసుకుంటున్న రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎకరానికి రూ.6.75లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించింది. బినామీల కన్ను కలిగోట పరిధిలోని ప్రభుత్వ భూముల్లో కబ్జా ఉన్నట్లుగా కలిగోట గ్రామస్తులు కాకుండా ఇతరులు ఏడుగురి పేర్లు చేర్చారు. వీరి పేరిట సుమారు 15 ఎకరాలు పహణీల్లో చేర్చారు. మండలంలోని ఓ నాయకుడి చొరవతోనే బినామీలు పేర్లు చేర్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పహణీల్లో పేర్లున్న బినామీల వద్ద భూమికి సంబంధించి ఆధారాలు లేకపోగా.. వారికి ఆ భూమి ఎక్కడ ఉందో గుర్తించలేని పరిస్థితి ఉందని కలిగోట గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎకరానికి రూ.6.75 లక్షలు పరిహారం వస్తుందని తెలిసి మండలంలోని సదరు నాయకుడు 15 ఎకరాల్లో బినామీల పేర్లు రాయించారని, కోటి రూపాయల పరిహారం కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. హక్కులున్న వారికే పరిహారం సూరమ్మ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇస్తాం. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉండి సాగుచేసుకుంటున్న రైతుల్లో భూమి హక్కులున్న వారికే పరిహారం అందజేస్తాం. బినామీలకు పరిహారం ఇవ్వబోం. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. – మధు, తహసీల్దార్, కథలాపూర్ -
యాసంగికి ‘అనంతగిరి’ నీళ్లు
ఇల్లంతకుంట (మానకొండూర్): వచ్చే యాసం గికి అనంతగిరి రిజర్వాయర్ నీళ్లు అందిస్తామని నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం– 10వ ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో 3.5 టీఎంసీల రిజర్వాయర్, ఆనకట్ట పనులతోపాటు, తిప్పాపూర్ వద్ద టన్నెల్ నిర్మాణం, సర్జుఫుల్‌లో విద్యుత్ మోటార్ల బిగింపు పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనంతగిరి రిజర్వాయర్ నుంచి పంట కాల్వల ద్వారా 30 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని చెప్పారు. రెండేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రికార్డుస్థాయిలో చేపట్టామని, పంప్‌హౌస్‌లు, బ్యారేజీల నిర్మాణం వేగవంతంగా సాగుతోందన్నారు. లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోబోతున్నామని మంత్రి చెప్పారు. మరో 25 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పూర్తి చేస్తే అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. అనంతగిరి రిజర్వాయర్‌లో భాగమైన నాన్ ఓవర్ ఫుల్ స్పిల్ వే 3 లక్షల పైచిలుకు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశామన్నారు. మరో 14 వేల క్యూబిక్ మీటర్ల పనులు వారంలోగా పూర్తవుతాయని చెప్పారు. 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ జాప్యంపై మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, 46 కిలోమీటర్ల దూరం నుంచి నిర్మిస్తున్న విద్యుత్ టవర్ల పనులను వర్షకాలం ప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాలని హరీశ్ సూచించారు. తిప్పాపూర్ సర్జుఫుల్‌లో నాలుగు మోటార్ల బిగింపు పనులు ఏకకాలంలో చేపట్టామని, సర్జుఫుల్‌లో గేట్ల నిర్మాణాలను మరో 45–50 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అనంతగిరి నిర్వాసితులు కోరుకున్న విధంగా ప్యాకేజీ వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. -
కల.. నెరవేరే వేళ..
పాలకుర్తి: సాగునీటి కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అన్నదాతల కల త్వరలో నెరవేరబోతోంది. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక చొరవతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను ముందుకు కదిలించారు. నిత్యం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తి చేయించేందుకు కృషి చేస్తుండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో విడతలో భాగంగా 2009 సంవత్సరంలో పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన పాలకుర్తి ప్రాజెక్టు పనులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో పడ్డాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేయించాలనే లక్ష్యంతో ముందుకుసాగారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, రాష్ట్ర భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల నిర్మాణానికి తగినన్ని నిధులు మంజూరు చేయాలని విజప్తి చేశారు. రిజర్వాయర్‌కు రూ. 11 కోట్లు మంజూరు.. పాలకుర్తి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 11 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సుమారు 700 ఎకరాల భూమిని సేకరించారు. గతంలో 250 ఎకరాలు ఉన్న పాలకుర్తి ఊరచెరువు కొత్తగా సేకరించిన 700 ఎకరాలతో 950 ఎకరాల విస్తీర్ణానికి చేరింది. కాగా, 2009లో శంకుస్థాపన జరిగిన పనులు ఎట్టకేలకు ఈనెల 15న ప్రారంభమయ్యాయి. 0.25 టీఎంసీ నీటి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు పనులను క్రాంతి కన్స్ట్రక్షన్స్ అధినేత సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్నారు. మూడు నెలల్లో రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేసి పాలకుర్తి మండలంలోని తీగారం, లక్ష్మీనారాయణపురం, విస్నూరు, వల్మిడి, ముత్తారం, మంచుప్పుల శిరసన్నగూడెం తదితర గ్రామాల్లోని 8 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. -
కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహం
-
ఎకరం కూడా మునగదు
సాక్షి, హైదరాబాద్: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా తలపెట్టిన ఉల్పర రిజర్వాయర్‌తో ఒక్క ఎకరం కూడా ముంపు ఉండ దని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తక్కువ ముంపుతో, రైతాంగానికి ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ జలసౌధలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఉల్పర రిజర్వాయర్ నిర్మా ణం వల్ల ముంపునకు గురవుతామనే భయాం దోళనలు అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఈ రిజర్వాయర్ విషయంలో జరుగుతున్న ఊహాగానాలను నమ్మవద్దన్నారు. 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ కడుతున్నారనే ప్రచారాన్ని మంత్రి ఖండించారు. 0.25 టీఎంసీల సామర్థ్యంతో ఉల్పర రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ రిజర్వాయర్ పరిధిలో దాసరాజుపల్లి ముంపునకు గురవుతుందనే ప్రచారం అబద్ధమన్నారు. ఈ గ్రామంలో ఒక్క ఇల్లు కూడా ముంపునకు గురికాదన్నారు. డిండి చీఫ్ ఇంజనీర్ సునీల్, రెవెన్యూ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనా వేస్తార న్నారు. ఉల్పర రిజర్వాయర్ కింద రెండు పం టలకు నీళ్లందుతాయని, మత్స్యకారులకు శాశ్వత ఉపాధి లభిస్తుందన్నారు. అమ్రాబాద్, పదర మండలాలకు సాగునీరు అందించాలని అచ్చంపేట శాసనసభ్యుడు బాలరాజు మంత్రిని కోరారు. కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి అచ్చంపేట నియోజకవర్గంలో 50 వేల ఎకరా లకు సాగునీరందిస్తున్నామని, లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని హరీశ్ తెలిపారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఎన్సి. మురళీధర్‌రావు, సీఈ ఎస్.సునీల్ పాల్గొన్నారు. -
వడివడిగా సాగుతున్న ప్రాజెక్టు పనులు
నాగర్‌కర్నూల్ : ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో సాగునీటి కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మొత్తం ఆరు రిజర్వాయర్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఇప్పటికే పనులు సైతం మొదలు పెట్టారు. కాగా నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో మూడు రిజర్వాయర్లను నిర్మించి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు 8లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టు పనులను చేపట్టారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద 8.51 టీఎంసీలు, ఏదుల (వనపర్తి జిల్లా) వద్ద 6.55 టీఎంసీలు, వట్టెం వద్ద 16.75 టీఎంసీలు, మహబూబ్‌నగర్ జిల్లా కరివెన వద్ద 17.34 టీఎంసీలతో రిజర్వాయర్ల నిర్మాణం చేపడతున్నారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో మొత్తం 10,406.83 ఎకరాలను సేకరించాల్సి వచ్చింది. అయితే ఇందులో ఇప్పటి వరకు 6967.23ఎకరాలు అంటే 69శాతం భూమిని రైతుల నుంచి సేకరించింది. పరిహారం విషయంలో గందగోళమే.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణకు సంబంధించి ఆది నుంచి గందరగోళమే నెలకొంది. గతంలో ఇక్కడ ఉన్న ఓ అధికారి పరిహారం విషయంలో రైతులను తప్పుదోవ పట్టించిన ఆరోపణలు ఉన్నాయి. రైతులకు సంబంధించి వారికి ఉన్న భూముల రకాలను బట్టి గతంలో ఎకరానికి రూ.5.50 లక్షలు, రూ.4.50 లక్షలు, రూ.3.50లక్షలు పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించారు. రైతుల నుంచి భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 123 జీఓతో పాటు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కొంతమంది రైతులు తమకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం అందించాలని కోర్టును ఆశ్రయించడంతో ఇటీవల ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులను ఒప్పించి భూములను సేకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఇప్పటివరకు రెండుమూడు చోట్ల తప్ప ఎక్కడా గ్రామసభలు నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం రైతుల నుంచి 120 యాక్ట్ ద్వారా భూములను సేకరిస్తున్నారు. ఈ యాక్ట్ ప్రకారం రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారు ఒప్పుకున్న రేటుకు మాత్రమే అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. 123జీఓ ద్వారా ఇప్పటి వరకు 5,369.27 ఎకరాలు సేకరిస్తే 120 యాక్ట్ ద్వారా 1,597.96 ఎకరాలు సేకరించారు. ఇంకా 3,439,6 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అయితే గ్రామసభలు నిర్వహించి రైతుల అంగీకారం మేరకు పరిహారం ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఉన్న కరివెన రిజర్వాయర్ పరిధిలో 3,210.26 ఎకరాల భూమి సేకరించాల్సిన ఉండగా.. దాదాపు పూర్తయింది. ఈ రిజర్వాయర్‌కు అనుసంధానంగా తీయాల్సిన కాల్వలకు సంబంధించిన భూమి నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో సేకరించాల్సి ఉంది. చట్టప్రకారమే భూసేకరణ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూసేకరణ చట్ట ప్రకారమే చేస్తున్నాం. కోర్టు ఆదేశాల మేరకు గ్రామ సభలు కూడా నిర్వహించి రైతుల అంగీకారం మేరకు పరిహారం నిర్ణయించి భూములను తీసుకుంటున్నాం. – శ్రీనివాసులు, ఆర్డీఓ వివిధ రిజర్వాయర్ల కింద సేకరించాల్సిన భూమి (ఎకరాల్లో)... నార్లాపూర్ రిజర్వాయర్ నీటి సామర్థ్యం ( టీఎంసీలు )- 8.51, సేకరించాల్సిన భూమి(ఎకరాల్లో)- 3,125.3, 120 యాక్ట్ ద్వారా సేకరించింది- 137.79, 123జీఓ ద్వారా సేకరించింది- 2,553.99, ఇంకా సేకరించాల్సింది- 433.52 ఏదుల రిజర్వాయర్ నీటి సామర్థ్యం ( టీఎంసీలు )- 6.55, సేకరించాల్సిన భూమి- 1,900.6, 120 యాక్ట్ ద్వారా సేకరించింది- 493.07, 123జీఓ ద్వారా సేకరించింది- 959.97, ఇంకా సేకరించాల్సింది- 447.56 వట్టెం రిజర్వాయర్ నీటి సామర్థ్యం ( టీఎంసీలు )- 16.75, సేకరించాల్సిన భూమి- 2,170.67, 120 యాక్ట్ ద్వారా సేకరించింది- 431.36, 123జీఓ ద్వారా సేకరించింది- 792.17, ఇంకా సేకరించాల్సింది- 947.14 -
పోలీస్ పహారాలో ‘శివన్నగూడ’
మర్రిగూడ (మునుగోడు) : డిండి ప్రాజెక్టు పరిధిలోని శివన్నగూడ రిజర్వాయర్ నిర్మాణ ప్రదేశం సోమవారం పోలీస్ పహారాతో నిండిపోయింది. ముంపుబాధితులు, పోలీసులకు జరిగిన ఘర్షణే ఇందుకు కారణం. రిజర్వాయర్ ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండా పనులు చేస్తుండడంతో తరచూ అడ్డుకుంటున్నారు. అదేవిధంగా కొద్దిరోజులుగా ధర్నాలు చేస్తున్నారు. శివన్నగూడ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న శశిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలు ఆదివారం పనులను అడ్డుకున్నారు. అక్కడే ఉన్న కాంట్రాక్టర్ సిబ్బంది..వారిద్దరిపై దాడి చేశారు. ఈ విషయం శివన్నగూడ, నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులకు తెలిసింది. ‘‘మాకు పరిహారం ఇవ్వరు. పనులు ఎలా చేస్తారంటూ రెండు గ్రామాల ప్రజలు సోమవారం పనుల అడ్డగింతకు బయలుదేరారు. వందమందికిపైగా కలిసి ఉదయం 10.30 గంటలకు రిజర్వాయర్ పనుల వద్దకు వెళ్లారు. అప్పటికే బందోబస్తు నిమిత్తం చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య మాటలు పెరిగాయి. పోలీసులు..రిజర్వాయర్ కాంట్రాక్ట్‌కు వత్తాసు పలుకుతూ పనులు చేయిస్తున్నారని ఆగ్రహించిన ముంపుబాధితులు అక్కడి క్యాంప్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో వారిపై పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. సంఘటనలో కొంతమంది మహిళలకు, రైతులకు దెబ్బలు తగిలాయి. సీఐ బాలగంగిరెడ్డి తమను అసభ్యపదజాలంతో దూషిస్తూ లాఠీలతో చితకబాదాడని పలువురు మహిళలు ఆరోపించారు. ముంపుబాధితులు ఎదురుదిరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ గలాటాలో సీఐ బాలగంగిరెడ్డి తలకు స్వల్పగాయమైంది. ఆయనకు వెంటనే చికిత్స అందించారు. 40శాతం దాటని పరిహారం దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో బీడు భూములకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డిండి ప్రాజెక్టును చేపట్టింది. ఇందులోభాగంగా ఐదు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. వీటిలో 10 టీఎం సీల నీటి సామర్థ్యంతో శివన్నగూడ రిజర్వాయర్‌ను నిర్మిస్తోంది. ఈ రిజర్వాయర్ కోసం 4,100 ఎకరాల భూమి ముంపునకు గురవుతున్నట్లు గుర్తించారు. వీటిలో 470 ఎకరాల ప్రభుత్వ భూమి పోను 3,630 ఎకరాలపైగా రైతులనుంచి సేకరించాల్సి ఉంది. రిజర్వాయర్ నిర్మాణ ద్వారా చెర్లగూడెం, వెంకపల్లి, వెంకపల్లితండా, నర్సిరెడ్డిగూడెం గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతాయి. ఇప్పటివరకు ప్రభుత్వం 1170 ఎకరాలకు 123 జీఓ ప్రకారం ఎకరాకు రూ.4,15,000 చొప్పున పరిహారం అందించింది. అదే విధంగా తాజాగా పెంచిన పరిహారంతో ఎకరాకు రూ.5,15,000 చొప్పున 450 ఎకరాలకు పరిహారం ఇచ్చారు. ఇచ్చే పరిహారం 40శాతం కూడ దాటలేదు. ఈ ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2015, జూన్12న శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి దాదాపుగా రెండేళ్లవుతున్నా పరిహారం మాత్రం రైతులకు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. ఇంకా 2,500 ఎకరాల పైగా పరిహారం ఇవ్వాల్సి ఉంది. 100 రోజుల దాటిన పోరాటం శివన్నగూడ రిజర్వాయర్ ముంపు భూములకు ప్రతి ఎకరాకు రూ.15లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ 21నుంచి బాధితులు నిరవధిక ధర్నా చేస్తున్నారు. వివిధ రూపాల్లో చేస్తున్న వారి నిరసన కార్యక్రమాలు వంద రోజులకుపైగా దాటాయి. -
శ్రీనివాసపురం రిజర్వాయర్‌కు గండి..
-
రిజర్వాయర్‌కు గండి.. ముంచెత్తిన నీళ్లు
సాక్షి, రాయచోటి: వైఎస్సార్ జిల్లా చిన్నమండెం మండలంలోని శ్రీనివాసపురం రిజర్వాయర్‌కు శనివారం అర్ధరాత్రి గండిపడింది. పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. విద్యుత్ స్థంభాలు నేల వాలాయి. ప్రాజెక్టులోని నీరు ఖాళీ అవుతోంది. ఆదివారం మధ్యాహ్నం వరకూ సహాయక చర్యలు చేపట్టేందుకు ఒక్క అధికారి కూడా సంఘటనా స్థలానికి రాకపోవడంతో రైతులు, స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రిజర్వాయర్ ఎగువ గేటు తెగిపోవడంతో భారీగా గండి ఏర్పడింది. పంట పొలాలను వరద నీరు ముంచెత్తడంతో అవి చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 50 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. విద్యుత్ స్థంభాలు సైతం నేలవాలాయి. రెండు నెలల క్రితం భారీ వర్షాలు రావడంతో ఓ మోస్తారు నీరు ప్రాజెక్టులో వచ్చి చేరింది. రిజర్వాయర్ కు గండి పడటంతో 10 చెరువులు, 15 కుంటలకు గండి పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చెరువుల సమీపాల్లో దాదాపు 1000 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం కూడా పొంచి ఉంది. రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయ అధికారులు ఇంతవరకూ ఆ ప్రక్కకు తొంగిచూడలేదని స్థానికులు వాపోతున్నారు. హత్యాయత్నంలో భాగంగానే... తనపై హత్యా ప్రయత్నంలో భాగంగానే ప్రాజెక్టుకు అధికార పార్టీ నాయకులు గండి కొట్టారని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ రామ లక్షుమమ్మ, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. తాము చేస్తున్న అభివృధ్ధిని చూసి ఓర్వలేక తమపై ఈవిధంగా హత్యాయత్నానికి ఒడిగట్టారని, ప్రాజెక్టుకు గండి పడటం వెనుకఅధికార పార్టీ నాయకుల కుట్ర ఉందని ఆరోపించారు. భారీ వర్షాలు పడినా ఎప్పుడు గండి పడలేదని, ప్రాజెక్టుకు వర్షాలులేని సమయంలో గండి పడటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోందని వారు పేర్కొన్నారు. -
మాటలే మిగిలాయి..
సాలూరురూరల్ (పాచిపెంట): సాగునీటి ప్రాజెక్ట్‌లకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తాం.. రైతు సంక్షేమమే తమ ధ్యేయమని గొప్పలు చెప్పుకునే టీడీపీ నాయకులు ఆచరణలో చేసి చూపించలేకపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హాయంలో నిర్మించిన ఎన్నో సాగునీటి ప్రాజెక్ట్‌లను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్న పట్టించుకున్న దాఖలాలు లేవు. మూడు కాలాల్లోనూ పంటలు పండాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అప్పట్లో జలయజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పాచిపెంట మండలంలో పెద్దగెడ్డ రిజర్వాయర్ నిర్మించి 2006లో ప్రారంభించారు. సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ రిజర్వాయర్ నిర్మించి కుడి కాలువ ద్వారా 8500 ఎకరాలకు, కర్రివలస ఆనకట్ట ద్వారా 3500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల పాచిపెంట, సాలూరు, రామభద్రాపురం మండలాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా కొన్నాళ్లుగా ప్రాజెక్ట్ నిర్వహణను పట్టించుకోకపోవడంతో సమస్యలు మొదలయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు వృథాగా పోతున్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖాలాలు లేవని వాపోతున్నారు. అందని మెయింటినెన్స్ బిల్లులు టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి పెద్దగెడ్డ ప్రాజెక్ట్ మెయింటినెన్స్ నిధులు మంజూరు కావడం లేదు. అయినప్పటికీ అటు అధికారులు గాని ఇటు పాలకులు గాని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ప్రాజెక్ట్ పరిధిలో లష్కర్ల కొరత ఉంది. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో 9 మంది లష్కర్లను నియమించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారితోనే కాలం నెట్టుకొస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతమున్న వారికంటే రెట్టింపు సంఖ్యలో లష్కర్లు ఉండాలి. కాని ఆ దిశగా ఎవ్వరూ ఆలోచించకపోవడంతో ఉన్నవారు ప్రాజెక్ట్ నిర్వహణను పక్కాగా చేపట్టలేకపోతున్నారు. షట్టర్లు పాడవుతున్నా మరమ్మతులు సకాలంలో చేయడం లేదు. ముఖ్యంగా పెద్దగెడ్డలో రెండు గేట్లు పాడవ్వడంతో మాన్యువల్ పద్ధతిలో పైకి లేపుతున్నారు. షట్టర్ అడుగున రబ్బర్ ఫిట్ చేయకపోవడంతో అడుగు నుంచి నీరు లీకవుతోంది. గురునాయుడుపేట ప్రాంత సమీపంలో ఉన్న 7ఎల్ లైన్ షట్టర్ పోయింది. ఇక్కడ కూడా నీరు వృథాగా పోతోంది. స్పందించాలి ప్రాజెక్ట్ అధికారులు, పాలకులు స్పందించి పెద్దగెడ్డ ప్రాజెక్ట్ నిర్వహణకు నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. గ్రామాలకు వస్తున్న ప్రతిసారీ రైతుల గురించే ఆలోచిస్తున్నామని చెబుతున్న నాయకులకు నీటి వృథా కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
కట్టి వదిలేశారంతే!
పెద్దపప్పూరు: మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో ఉన్న ముచ్చుకోట రిజర్వాయర్‌ను ప్రారంభించి దాదాపు 30 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు నీటి కేటాయింపులు లేవు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు దాని గురించే పట్టించుకోకపోవడంతో అది శిథిలావస్థకు చేరుకుంది. మండలంలోని ముచ్చుకోట రిజర్వాయర్‌ను అప్పట్లో దాదాపు రూ.కోటి వ్యయంతో నిర్మించారు. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దీనిని ప్రారంభించారు. దీనికోసం దాదాపు 300 ఎకరాలు సేకరించారు. నార్పల మండలం తుంపెర డెలివరీ పాయింట్ నుంచి సుబ్బరాయసాగర్‌కు, అక్కడి నుంచి ముచ్చుకోటకు నీరు వస్తుంది. ఇది నిండితే పెద్దపప్పూరులోని ముచ్చుకోట, వరదాయపల్లి, చిక్కేపల్లి, నామనాంకపల్లి, షేక్‌పల్లి గ్రామాలతోపాటు పుట్లూరు మండలంలోని పలు గ్రామాలకు భూగర్భజలాలు పెరిగి తాగునీరు, సాగునీరు అందుతుంది. కానీ నీరన్నదే లేక నిరుపయోగంగా మారడంతో రిజర్వాయర్ శిథిలావస్థకు చేరుకుంటోంది. ఇప్పటికే రాతిబండింగ్(రాతికట్టడం) కృంగిపోయింది. రిజర్వాయర్‌కు నీరు చేరే కాలువ కూడా దెబ్బతింది. ముళ్లపొదలతో నిండిపోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలానే వదిలేస్తే ఇది ఎందుకూ పనికి రాకుండా పోతుందని మండలంలోని ఆయా గ్రామాల రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు. శ్రీశైలం డ్యామ్‌కు నిండా నీరు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీరు విడుదల చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. నీరు విడుదల చేయాలి రిజర్వాయర్ నిర్మించినప్పటి నుంచి నీటి కేటాయింపులు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టిన నిర్మాణం ఎందుకూ ఉçపయోగపడకుండా పోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీరివ్వాలి. – మల్లికార్జున, ముచ్చుకోట -
భయపెట్టి భూములు సేకరిస్తారా?
టీజేఏసీ చైర్మన్ కోదండరాం సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులు కట్టడానికి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం కల్పించకుండా రైతులను భయపెట్టి భూములను సేకరిస్తారా అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ప్రశ్నించారు. టీజేఏసీ నేతల అక్రమ అరెస్టులను సోమవారం ఇక్కడ జరిగిన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ఖం డించింది. అనంతరం జేఏసీ నేతలు రఘు, పురుషోత్తం, రమేశ్ తదితరులతో కలసి కోదండరాం విలేకరులతో మాట్లాడారు. రిజర్వాయర్ కట్టాలనుకుంటే దాని నీటి నిల్వ సామర్థ్యం, ముంపు, సాగునీటి లభ్యత వంటి వివరాలను బయటకు చెప్పాలన్నారు. భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వకుండా, రైతులకు పరిహారం ఎంత ఇస్తున్నారో చెప్పకుండా, పునరావాసానికి ఎలాంటి చర్యలను తీసుకుంటున్నారో చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నారని విమర్శించారు. తుపాకులు ఉన్న పోలీసులను ముందుపెట్టి కొండపోచమ్మ రిజర్వాయర్ కోసం బహిలింపూర్ రైతుల భూములను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని కోదండరాం విమర్శించారు.ప్రాజెక్టు కోసం భూములను చట్ట ప్రకారం సేకరించకుండా కేవలం కొన్నట్టుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అప్రజాస్వామికం, చట్ట వ్యతిరేకం కాదా అని ప్రశ్నిం చారు. గ్రామంలో బహిరంగసభ పెట్టలేదని, ర్యాలీ నిర్వహించలేదని, రోడ్లపైకి వెళ్లలేదని, అయినా సెక్షన్ 30 అమలులో ఉందంటూ పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌కు దగ్గరలోనే ఉన్న బహిలింపూర్‌లో ఇలా జరుగుతున్నదని, ఇది దురదృష్టకరమని అన్నారు. చట్ట ప్రకారమే ఆదుకుంటామని, భయపడాల్సిన అవసరంలేదని గ్రామస్తులకు భరోసాను ఇచ్చినట్టు చెప్పారు. కోదండరాం అరెస్ట్.. విడుదల గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగు మండలం బహిలింపూర్‌లో సోమవారం ‘కొండపో చమ్మ సాగర్’ రిజర్వాయర్ ముంపు బాధి తులను కలిసేందుకు వెళ్లిన టీజేఏసీ చైర్మన్ కోదండరాం, హైకోర్టు న్యాయవాది రచనారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును అడ్డుకునేందుకు గ్రామస్తులు యత్నించడం తో ఉద్రిక్తతకు దారితీసింది. గజ్వేల్ నియో జకవర్గం మర్కూక్–పాములపర్తి గ్రామాల మధ్య ప్రభుత్వం ‘కొండపోచమ్మ సాగర్’ రిజర్వాయర్ కోసం భూసేకరణ జరుగు తోంది.ముంపునకు గురవుతున్న ములుగు మండలం బహిలింపూర్, మామిడ్యాల, తానేదార్పల్లిల్లో రైతుల నుంచి భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాగుతోంది. కోదండరాం, రచనారెడ్డి, జేఏసీ నాయకుడు పురు షోత్తం బహిలింపూర్ చేరుకుని భూసేకర ణ, నష్టపరిహారంపై ఆరా తీస్తుండగా... పోలీసులు వారిని అరెస్టు చేశారు. గజ్వేల్ బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో కొద్ది గంటలు ఉంచి అనంతరం విడుదల చేశారు. -
విహారయాత్రలో విషాదం
♦ జలాశయంలో ఈతకు దిగి కప్పరాడ వాసి గల్లంతు ♦ జాడ లేని శివరామకృష్ణ ♦ కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు వారంతా కుటుంబ సభ్యులతో సరదాగా విహారానికి బయలుదేరారు. మార్గమధ్యలో సెల్ఫీలు దిగుతూ ఎంతో ఉత్సాహంగా ప్రయాణం సాగించారు. ఇంతలోనే కళ్యాణపు లోవ వచ్చింది. ఎంతో ఉత్సాహంతో రిజర్వాయర్, చుట్టుపక్కల ప్రాంతాలు చూసి ముగ్ధులయ్యారు. సరదాగా ఈత కొట్టేందుకు రిజర్వాయర్‌లోకి దిగారు. అంతే వీరిలో ఓ వ్యక్తి గల్లంతు కావడంతో విషాదం అలుముకుంది. రావికమతం (చోడవరం): కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన బృందంలో ఓ వ్యక్తి కళ్యాణపులోవ జలాశయంలో గల్లంతు కావడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కంచరపాలెంలోని కప్పరాడ ప్రాంతానికి చెందిన బిక్కవోలు శివరామకృష్ణ (26) జలాశయంలో గల్లంతయ్యాడు. శివరామకృష్ణ ఆయన సోదరి బంధువులు అడ్డురోడ్డు నుంచి కొరిబిల్లి రాజు, కాండ్రేగుల దొరబాబు, పలివెల అభిజ్ఞ, వరలక్ష్మి, రామలక్ష్మిలతో కలిసి రావికమతం మండలం కళ్యాణపులోవ రిజర్వాయర్‌కు ఆదివారం విహార యాత్రకు బయలుదేరారు. వారం రోజులు క్రితం జోగుంపేటలోని అమ్మగారింటికి వెళ్లిన భార్య పార్వతిని రమ్మని శివరామకృష్ణ చెప్పాడు. మూడు ప్రాంతాల నుంచి వేర్వేరుగా వచ్చిన వీరు నర్సీపట్నంలో కలుసుకుని అక్కడ నుంచి కళ్యాణపులోవ రిజర్వాయర్ ప్రాంతానికి ఆటోలో పయనమయ్యారు. జలాశయం వద్ద పోతురాజుబాబు ఆలయాన్ని, రిజర్వాయర్ పరిసరాలను సందర్శించారు. అనంతరం శివరామకృష్ణ జలాశయంలో ఈతకని దిగాడు. అతనితో వచ్చిన వారు జలాశయంలో లోతు తక్కువగా ఉన్న ప్రాంతంలో స్నానాలు చేస్తున్నారు. ఇంతలోనే శివరామకృష్ణ జలాశయం క్లస్టర్ గేట్లు వద్ద గల ప్రాంతంలో ఉన్న నీటిలో స్నానం చేస్తానని భార్యకు, వెంట వచ్చిన వారికి చెప్పి అక్కడికి వెళ్లాడు. క్లస్టర్ గేట్లు వద్ద స్నానం చేయడం ప్రమాదమని, లోతు, నీటి మట్టం అధికంగా ఉంటుందని భార్య పార్వతి భర్తకు వివరించింది. అయితే తనకు ఈత వచ్చని, ఏమి కాదని చెప్పి క్లస్టర్ గేట్లుపై నుంచి నీటిలోకి దూకాడు. మొదటిసారి బయటకు వచ్చిన శివరామకృష్ణ రెండోసారి కుడా గేట్లపై నుంచి నీటిలోకి దూకాడు. అంతతోనే నీటిలో మునిగిపోతుండడంతో తన భర్తను రక్షించాలని భార్య పార్వతి, బంధువులు కేకలు వేశారు. దీంతో స్థానికులు వచ్చేలోగానే శివరామకృష్ణ నీటిలో మునిగిపోయాడు. వారు ఎంతగా జలాశయంలో వెదికినా శివరామకృష్ణ జాడ లభించలేదు. దీంతో భార్య పార్వతి, బంధువుల రోదన అందరినీ కంటతడి పెట్టించింది. శివరామకృష్ణ 2013లో జోగుంపేటకు చెందిన పార్వతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల బాబు చందు ఉన్నాడు. గల్లంతైన సమాచారాన్ని తెలుసుకున్న స్థానిక సర్పంచ్ వంజరి గంగరాజు, వీఆర్వో ఎ.ఎస్.నాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ సమాచారాన్ని కొత్తకోట పోలీసులకు తెలిపారు -
‘తమ్మిలేరు’ తగాదా
చింతలపూడి : తమ్మిలేరు రిజర్వాయర్‌లో కొన్నేళ్లుగా అనధికారికంగా రొయ్య ల సాగు చేస్తుండటం వివాదాలకు తావిస్తోంది. ప్రాజెక్టుపై రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరగడంతో దళారులు మత్స్యకారుల నోళ్లు మూ యిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మ త్స్యకారుల సంఘాల మధ్య వివా దం చోటు చేసుకుంటోంది. నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరు ప్రాజెక్టు, కృష్ణాజిల్లా మంకొల్లు వద్ద నిర్మించిన గోనెలవాగులో గతేడాది సెప్టెంబర్‌లో అనధికారికంగా రొయ్య పిల్లలను వేశా రు. ఇప్పుడు వాటిని పట్టి అమ్ముకునే విషయంలో మరోసారి వివాదం తలెత్తింది. ప్రాజెక్టులో రొయ్య పిల్లలను మేము వేశామంటే, మేము వేశామని రొయ్యలు మాకే అమ్మాలని రెండు జిల్లాలకు చెందిన వ్యాపారులు వివా దాన్ని రగిల్చారు. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రొయ్యల వేటను నిషేధిస్తూ కృష్ణాజిల్లా చాట్రాయి తహసీల్దార్ 144 సెక్షన్ విధించారు. దీంతో ప్రాజెక్టుపై ఆధారపడి బతుకుతున్న సుమారు 400 మత్స్యకార కుటుంబా లు ఆందోళన చెందుతున్నాయి. దళారుల కన్ను మత్స్యశాఖ ఏటా తమ్మిలేరులో చేప పిల్లలను వేసి, అవి పెరిగాక వాటిని మత్స్యకారులు పట్టుకుని అమ్ముకునేలా ఏర్పాట్లు చేసింది. అయితే రొయ్య ల సాగు ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుండటంతో రెండు జిల్లాలకు చెందిన దళారుల కన్ను ప్రాజెక్టుపై పడింది. రాజకీయ పలుకుబడితో జలాశయంలో రొయ్యలు పెంచుతూ కోట్లు గడిస్తున్నారు. ఇందుకోసం మ త్స్యకార సంఘాలతో ముందుగానే ఒప్పందం చేసుకుని పట్టిన రొయ్యలను తమకే విక్రయించాలని నిబంధన విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పట్టిన రొయ్యలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి కృష్ణా జిల్లాకు చెందిన వ్యాపారి ప్రయత్నించగా మత్స్యకారులు గిట్టదని చెప్పడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో స్థానిక మత్స్యకారులు విషయాన్ని మంత్రి పీతల సుజాత దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి ఆదేశాలతో జిల్లాకు చెందిన మత్స్యశాఖ డీడీ ఎం.యాకూబ్‌పాష, తహసీల్దార్ టి.మైఖేల్‌రాజ్ గ త శనివారం ప్రాజెక్టును పరిశీలించా రు. మత్స్యకార సంఘాలతో సంప్రదిం పులు జరిపారు. త్వరలోనే రెండు జి ల్లాల అధికారులు, మత్స్యకార సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని అప్పటి వరకు రొయ్యల వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు. రొయ్యల సాగు నిషేధం తమ్మిలేరు ప్రాజెక్టులో రొయ్యల సాగు నిషేధం. అయినా దళారులు ఏటా రొయ్య పిల్లలను జలాశయంలో వేసి పెంచడం, పట్టుకుని అమ్మడం చేస్తున్నారు. ఇదంతా ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం తమ్మిలేరు ప్రాజెక్టుపై రూ.10 కోట్లతో తాగునీటి పథకం నిర్మిస్తోంది. దీని ద్వారా చింతలపూడి, ప్రగడవరం పంచాయతీలకు తాగునీరు అందించనున్నారు. ప్రాజెక్టులో రొయ్యల సాగు చేపడితే నీరు కలుషితమై తాగడానికి పనికిరావని, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ అమరేశ్వరరావును వివరణ కోరగా తమ్మిలేరులో రొయ్యల సాగు చేస్తున్న వారికి నోటీసులు ఇస్తున్నామని, విషయాన్ని కలెక్టర్ భాస్కర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఎర్రకాలువలో మరో కేజ్‌కల్చర్
జంగారెడ్డిగూడెం రూరల్ : జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుగా పేరున్న జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలో మరో కేజ్‌కల్చర్ నిర్మాణాన్ని చేపట్టారు. వేగవరంలో నెల రోజుల కిందట రూ.80 లక్షలతో ప్రారంభించిన కేజ్ కల్చర్ నిర్మాణం పూర్తికావచి్చంది. కేకేఆర్ జలాశయంపై చక్రదేవరపల్లి, వేగవరం, జంగారెడ్డిగూడెం, బొర్రపాలెం, సింగరాయపాలెం, ఎ.పోలవరం గ్రామాలకు మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. చక్రదేవరపల్లి సొసైటీపై ఆధారపడిన మత్స్యకారుల కోసం గతేడాది మార్చిలో రూ.80 లక్షలతో కేజ్ కల్చర్ (చేపల పెంపకం) నిర్మాణాన్ని చేపట్టారు. వేగవరం మత్స్యకార సంఘానికి కూడా మరో కేజ్‌కల్చర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దాని నిర్మాణం పూర్తికావచి్చంది. ఇంకా వలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మరో వారం రోజుల్లో ఈ కల్చర్‌ను ప్రారంభించి చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేజ్ కల్చర్‌లో లక్షా 50 వేల చేప పిల్లలు విడిచిపెట్టనున్నామని తెలిపారు. 8 టన్నుల దిగుబడి 2016 మార్చిలో కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం వద్ద ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్‌లో ఇప్పటివరకు రెండుసార్లు చేపలను పట్టారు. 8 టన్నుల వరకు చేపలు వచ్చాయని, వీటికి రూ.3 లక్షలు ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. తమిళనాడుకు చెందిన వ్యాపారులు వచ్చి కేజ్ కల్చర్‌లో పెరిగిన చేపలను కొనుగోలు చేస్తున్నారు. కేజ్‌కల్చర్ నిర్వహణకు కేటాయించాలి్సన ఖర్చు పోగా వచ్చిన ఆదాయంలో మత్స్యకార సంఘాలకు కేటాయించాల్సి ఉంది. అయితే 30 టన్నుల చేపల వరకు పట్టిన అనంతరం మొత్తం ఆదాయంలో మత్స్యకార సంఘాల అభివృద్ధికి కేటాయిస్తామని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. కేజ్ కల్చర్‌లో వేసిన చేప పిల్లలు పెరగాలంటే 10 నుంచి 12 నెలల సమయం పడుతుంది. అయితే ఈ చేప కేజీ పరిమాణం పెరగాల్సి ఉందని ఒక్కో చేప కేజీ వస్తే మంచి దిగుబడితో పాటు ఆదాయం వస్తుందని మొదట్లో అధికారులు చెప్పుకొచ్చారు. కానీ ఈ కేజ్ కల్చర్‌లో రెండు పర్యాయాలు పట్టిన చేపల్లో 400 నుంచి 600 గ్రాముల వరకు మాత్రమే చేపలు పెరిగాయి. ఇక్కడ తిపాఫియా అనే జాతికి చెందిన చేపలను పెంచుతున్నారు. నేడు మరోసారి పట్టుబడి ఈ నెల 18న కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం వద్ద చక్రదేవరపల్లి మత్స్యకార సంఘాల వారి కోసం నిర్మించిన కేజ్ కల్చర్‌లో చేపలు పట్టనున్నామని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. ఈసారైనా పట్టే చేపల్లో కేజీ సైజ్ చేపలు పడతాయా లేక గతంలో మాదిరిగా 500 నుంచి 600 గ్రాముల చేపల పడతాయా అని అటు అ«ధికారులు, ఇటు మత్స్యకారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. -
అవుకులో స్టూడెంట్ నెంబర్-1
అవుకు : స్థానిక రిజర్వాయర్ కట్టపై సోమవారం సినిమా షూటింగ్ జరిగింది. శ్రీలక్ష్మీనరసింహ బ్యానర్‌పై స్టూడెంట్ నెంబర్-1 సినిమాను చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు రవికిరణ్ తెలిపారు. హీరో, హీరోయిన్లుగా కృష్ణచైతన్య, కల్కిమిశ్రా నటిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు నిర్మాత కేఎల్ఎన్ ప్రసాద్ తెలిపారు. ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ కొత్త కావడంతో చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. -
శిథిలావస్థలో రిజర్వాయర్
► పగుళ్లు తేలి పెచ్చులూడుతున్న వైనం ► పట్టించుకోని అధికారులు నిర్మల్ టౌన్: పట్టణ ప్రజలకు తాగునీటిని అందిస్తున్న రిజర్వాయర్‌కు పగుళ్లు తేలి శిథిలావస్థకు చేరింది. రిజర్వాయర్ పెచ్చులూడడంతో ఇనుపచువ్వలు బయటకు కనిపిస్తూ ప్రమాదకరంగా మారింది. దీంతో ఎప్పుడు కూలి పోతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పరిస్థితి చేయి దాటక ముందే అధికారులు మేల్కొని ముందు జాగ్రత్తగా నూతన రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. కాలపరిమితి ముగిసినా పట్టణంలోని ఇందిరానగర్ గాంధీపార్కులో ఉన్న రిజర్వాయర్‌ను నిర్మించి నాలుగు దశాబ్దాలకు పైనే అవుతోంది. రిజర్వాయర్ వినియోగ కాలపరిమితి కూడా పూర్తయింది. దీంతో రిజర్వాయర్ కాస్తా శిథిలావస్థకు చేరింది. కానీ దాని స్థానంలో నూతన రిజర్వాయర్‌ను నిర్మించాల్సిఉన్నా ఆ దిశగా అధికారులు కనీస చర్యలను చేపట్టడంలేదు. గతంలో ఈ రిజర్వాయర్ నుంచి సగం పట్టణానికి నీరు సరఫరా అయ్యేది. కాలక్రమేణ పట్టణ విస్తీర్ణం పెరగడంతో పాటు పలు కాలనీల్లో రిజర్వాయర్లను నిర్మించడంతో ప్రస్తుతం పదుల సంఖ్యలోని వార్డులకు దీని నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. జనాభా అధికంగా నివాసం ఉంటున్న ఇందిరానగర్, బాగులవాడ, కస్బా, నగరేశ్వరవాడ, వాల్మీకినగర్, తదితర వార్డులకు నీరు సరఫరా జరుగుతోంది. దీంతో పాటు తాగునీరు సరఫరా కానీ ప్రాంతాలకు, శుభకార్యాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాలకు చెందినవారు, హోటల్ నిర్వాహకులు ఇక్కడ ఏర్పాటు చేసిన 24 గంటలు నీటిని అందించే నల్లా నుంచి తాగునీటిని తీసుకెళ్తుంటారు. అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై తాగునీటికోసం ఆధారపడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అయితే నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన రిజర్వాయర్ శిథిలావస్థకు చేరినప్పటికీ ఇంకా వినియోగిస్తూనే ఉన్నారు. నూతన రిజర్వాయర్‌ను నిర్మిస్తే మేలు 40 ఏళ్లక్రితం నిర్మించిన రిజర్వాయర్ స్థానంలో కొత్త దానిని నిర్మిస్తేనే ప్రయోజనం ఉంటుంది. గతంలో నూతన రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రతిపాదనలను సిద్దం చేస్తున్నామని మున్సిపల్ అధికారులు ప్రకటించినప్పటికీ ఇంతవరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. నిధులు మంజూరై, స్థల పరిశీలన పూర్తయి, రిజర్వాయర్ పూర్తి కావాలంటే కనీసం ఏడాదిన్నరకాలం పట్టే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు, పాలకులు ముందస్తుగా రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెడితే బాగుటుందని ప్రజలు పేర్కొంటున్నారు. నూతన రిజర్వాయర్ నిర్మించాలి రిజర్వాయర్‌ను నిర్మించి అనేక సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. అధికారులు స్పందించి కొత్తగా రిజర్వాయర్‌ను నిర్మించాలి. వెంటనే పనులు చేపడితే ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు కలుగవు. – రాజు, నిర్మల్ పెచ్చులు ఊడుతున్నాయి రిజర్వాయర్ పెచ్చులు ఊడుతున్నాయి. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న రిజర్వాయర్‌ను వినియోగించడం సరికాదు. ప్రమాదం జరుగకముందే అధికారులు, పాలకులు స్పందించాలి. – గణేశ్, నిర్మల్ -
విషాదాన్ని నింపిన రిజర్వాయర్ ఘటన
-
ముంచేస్తున్నారు
స్రాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికారుల అనాలోచిత పనుల వల్ల పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు మరోసారి నిలువునా మునిగిపోయే పరిస్థితి తలెత్తుతోంది. జల్లేరు ముంపు ప్రాంతంలో పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించడం విమర్శలకు దారి తీస్తోంది. జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచనుండటంతో.. నిర్వాసితులకు కేటాయించిన భూములన్నీ భవిష్యత్‌లో ముంపునకు గురికావడం ఖాయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం, పి.నారాయణపురం గ్రామాల్లో పోలవరం నిర్వాసితులకు పునరావాసం పేరిట భూములు కేటాయిస్తున్నారు. ఇవి జల్లేరు ముంపు ప్రాంతంలో ఉన్నాయి. జల్లేరు రిజర్వాయర్ ప్రస్తుత సామర్థ్యం 8 టీఎంసీలు కాగా.. 20 టీఎంసీలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, పోలవరం నిర్వాసితులకు జల్లేరు రిజర్వాయర్ వద్ద ప్రస్తుతం కేటాయించిన ప్రాంతం కూడా ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. రాచన్నగూడెం, పి.నారాయణపురం గ్రామాల్లో నిర్వాసితులకు కేటాయిస్తున్న భూములు, ఇళ్ల స్థలాలు 8 టీఎంసీల రిజర్వాయర్ (డీపీఆర్) ప్రకారం ముంపు ప్రాంతం నిర్వాసితుల పునరావాస కాలనీకి కూత వేటు దూరంలోనే ఉంది. పి.నారాయణపురంలో టేకూరు గ్రామానికి చెందిన పోలవరం నిర్వాసితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు, భూమికి భూమి కింద కేటాయించిన స్థలం 8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్ ముంపు ప్రాంతంలోనే అర కిలోమీటర్ దూరంలో భూమిని కేటాయించారు. ఇప్పుడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8 నుంచి 20 టీఎంసీలకు పెంచారు. రిజర్వాయర్‌కు కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉన్న తాము ముంపునకు గురవుతామని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. వీరికి కేటాయించిన భూములు, ఇళ్లస్థలాలు పెంచిన రిజర్వాయర్ సామర్థ్యం ప్రకారం మళ్లీ ముంపులోకి వెళ్లడం ఖాయం. అదేవిధంగా రాచన్నగూడెంలో కేటాయిస్తున్న పునరావాస కాలనీలో ఇచ్చిన భూమికి భూమి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉంది. మరోసారి నిర్వాసితులు కావాల్సిందేనా! జల్లేరు రిజర్వాయర్ ముంపు ప్రాంతంలో భూములు కేటాయించడంతో తాము ఎన్నిసార్లు నిర్వాసితులు కావాలంటూ పోలవరం పునరావాసులు ప్రశ్నిస్తున్నారు. జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు నిర్ణయం గ్రామాలను కబళించే పరిస్థితి ఉండటంతో గిరిజనులకు కంటిమీద కునుకు పడటం లేదు. జీలుగుమిల్లి మండలంలోని తాటిరామన్న గూడెం, జిల్లెళ్ల గూడెం, పాకల గూడెం, బొత్తప్పగూడెం, పి.నారాయణపురం, బుట్టాయగూడెం మండలం బెడదనూరు నీటిలో మునిగిపోనున్నాయి. 8 టీఎంసీల సామర్థ్యం ప్రకారం ముంపు గ్రామాలు 7 ఉండగా, సుమారు 5 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోతారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచితే ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. జల్లేరు రిజర్వాయర్ తమ హక్కులను కబళిస్తోందని స్ధానిక గిరిజనులు అంటున్నారు. ఇక్కడ 1/70 యాక్ట్ ఉల్లంఘన జరుగుతుందనేది గిరిజనుల వాదన. 2013 భూసేకరణ చట్ట ప్రకారం సెక్షన్–41 సబ్ క్లాజ్–3 ప్రకారం తప్పనిసరిగా గిరిజన గ్రామాల్లో పీసా గ్రామసభలు (గిరిజన కమిటీ) నిర్వహించి ప్రతిపాదనలకు ఆమోదం పొందాలి. జీవో ఎంఎస్ 262 ప్రకారం బాధితులను ముందుగా గుర్తించాలి. అయితే ముంపు గ్రామాల నిర్వాసితులను గుర్తించకుండానే అవార్డు విచారణలు ముగించేశారు. ఇది సుప్రీం కోర్టు తీర్పులకు వ్యతిరేకమని గిరిజనులు ఆరోపిస్తున్నారు. జల్లేరు రిజర్వాయర్ నిమిత్తం పర్యావరణ మండలి ఇచ్చిన అనుమతులను ప్రజల ముందు పెట్టాలనేది స్థానికుల డిమాండ్. ఎక్కడా ఈ పని చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో అనేక ఎల్టీఆర్ కేసులు పెండింగ్‌లో ఉన్నా రిజర్వాయర్ విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లడాన్ని గిరిజనులు తప్పు పడుతున్నారు. రిజర్వాయర్ నిర్మాణాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. తమకు న్యాయం చేసిన తర్వాతే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లాలనేది గిరిజనుల వాదన. -
తొలి అడుగు
డిండి ప్రాజెక్టు పనులు ప్రారంభం రూ.6500 కోట్ల నిధులు విడుదల దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు, సాగులోకి రానున్న 3.50 లక్షల బీడు భూములు మర్రిగూడ : జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో తొలి అడుగు పడింది. ఇందులో భాగంగా జిల్లాలో డిండి ఏత్తిపోతల పథకమును చేపట్టింది. ఈ రిజర్వాయర్ ఏర్పాటు కోసం గత ఏడాది జూను 12న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేసిన 18 నెలల తర్వాత ప్రభుతవం పనులు ప్రారంభించింది.దీని కింద జిల్లాలో 5 రిజర్వాయర్ల ఏర్పాటు చేసి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గంలోని బీడు భూములకు సాగు, తాగు నీరు అందించనున్నారు. 3.50 లక్షల ఎకరాల భూమికి సాగునీరు డిండి ఏత్తి పోతల పథకములో భాగంగా జిల్లాలోని 5 రిజర్వాయర్లు రూ.6500 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గాను తెలంగాణ నీటి పారుదల శాఖ నుంచి నిధులను కేటాయించారు. శ్రీశైలం ప్రాజెక్టులోని బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ పద్ధతి ద్వారా రోజు 2 టీఎంసీల నీటిని సేకరిస్తారు. ఆ నీటిని నార్లపూర్ రిజర్వాయర్ నుంచి లీఫ్ట్ పద్ధతిలో 1.5 టీఎంసీలు, రంగారెడ్డి–పాలమూరు ఏత్తి పోతల పథకానికి మిగిలినా 0.5 టీఎంసీల నీరు డిండి ప్రాజెక్టుకు ఇలా 30 రోజుల్లో 15 టీఎంసీలను నిల్వ చేస్తారు. అనంతరం డిండి నుంచి కాల్వల ద్వార 5 రిజర్వాయర్లకు నీటిని పంపించి 3.50 లక్షల ఎకరాల బీడు భూములకు సాగు నీరు అందిస్తారు. ఇప్పటికే డిండి ప్రాజెక్టు ద్వార 12 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. ఈ పథకం ద్వార మరో 18 వేల ఎకరాల భూములకు సాగు నీరు అందుతుంది.ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏడాదిలో ఇక్కడి రైతులు రెండు పంటలను సాగు చేయవచ్చు. రెండు రిజర్వాయర్ల పనులు ప్రారంభం. ఈ పథకంలో భాగంగా చేపట్టిన ఐదు రిజర్వాయర్లలో ఇప్పటికే రెండు రిజ్వరాయర్ పనులను ప్రారంభించారు. ఇప్పటికే డిండి మండలంలోని సింగరాజుపల్లి రిజర్వాయర్ ఏర్పాటు కోసం భూమి చదును చేసి సీఓటీ పనులు సాగుతున్నాయి. తాజాగా ఈనెల 18న శివన్నగూడ రిజర్వాయర్ ఏర్పాటు కోసం భువనగిరి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ బూర న ర్సయ్యగౌడ్, మునుగో డు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.మిగిలిన మూడు రిజ ర్వాయర్ పనులను ప్రారంభిచేందుకు నీటి పారుదల శాఖ అధికారులు భూ సేకరణ చేస్తున్నారు. ఐదు రిజర్వాయర్లు ఇవే.. డిండి ప్రాజెక్టుకు 7.875 కిలో మీటర్ల దూరంలో సింగరాజుపల్లి రిజర్వాయర్‌ను 702 ఎకరాల భూ విస్తీరణంలో 0.81 టీఎంసీల నీటి నిల్వ సామార్థ్యంతో చేపడుతున్నారు. దీని ద్వారా 13000 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. డిండి ప్రాజెక్టుకు 32 కిలో మీటర్ల దూరంలో గోట్టిముక్కల రిజర్వాయర్‌ను చేపట్టనున్నారు. దీనిని 1907 ఎకరాల భూ విస్తీరణంలో 1.84 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపడుతున్నారు. దీని కింద 2800 ఎకరాల బీడు భూములకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టుకు 40 కిలొ మీటర్ల దూరంలో చింతపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టనున్నారు. 1538 ఎకరాల భూమిలో 0.91 టీఎంసీల నీటి నిల్వ సామ్యార్థంతో చేపడుతున్నారు. దీని కట్ట పొడువు 4.600 కిలో మీటర్లు కాగా 15000 వేల ఎకరాల భూములు సస్యశ్యామలం కానున్నాయి. ప్రాజెక్టుకు 51 కిలో మీటర్ల దూరంలో చేపట్టే క్రిష్టరాయినీపల్లి రిజర్వాయర్ ద్వారా 1903 ఎకరాల భూమికి సాగు నీరు అందుతుంది. ఈ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 5.69 టీఎంసీలు. దీని ద్వారా లక్ష ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. డిండి ప్రాజెక్టుకు 59 కిలొ మీటర్ల దూరంలో శివన్నగూడ రిజర్వాయర్‌ను 11.96 టీఎంసీల నీటి నిల్వ సామార్థ్యంతో నిర్మించనున్నారు. దీని కింద 1.55,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుంది. -
నెలాఖరులోగా నింపుతాం
- ఆర్డబూఎస్ఈ హరిబాబు - ఖాజీపురం రిజర్వాయర్ పరిశీలన చిప్పగిరి(ఆలూరు): అడుగంటిపోయిన రిజర్వాయర్లను నెలాఖరులోగా నీటితో నింపి పల్లెవాసులకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరిబాబు తెలిపారు. అధికారులు, గ్రామ సర్పంచులతో కలిసి ఆదివారం ఆయన రిజర్వాయర్‌ను పరిశీలించారు. నీరు అడుగంటడంతో దాని పరిధిలోని గ్రామాలవారు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు స్పందించిన ఎస్ఈ పరిశీలనకు వచ్చారు. ప్రస్తుతం ఉన్న నీటిని ఖాజీపురం, గుమ్మనూరు, కొట్టాల, ఏరూరు, బంటనహాల్ గ్రామాల ప్రజలు తాగేందుకు ఉపయోగించుకోవాలని ఎస్ఈ సూచించారు. ప్రస్తుతం చిప్పగిరి వద్ద నిర్మిస్తున్న ఎస్ఎస్ ట్యాంకుకునీటిని పంపింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిసెంబర్ ఆఖరులోగా ప్రస్తుతం ఎస్ఎస్ ట్యాంకును నింపేందుకు రెండు మోటార్లు, 45 మీటర్ల పైపులైన్ పనులను చేపడతామన్నారు. తదనంతరం చిప్పగిరి, కుందనగుర్తి, దౌల్తాపురం, మద్దికెర, అగ్రహారం గ్రామాలకు ఈ ఎస్ఎస్ ట్యాంకుకు పంపింగ్ చేసిన నీటిని సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాక ప్రస్తుతం ఎస్ఎస్ ట్యాంకులోకి నీటిని నిల్వ చేసేందుకు చిప్పగిరి గ్రామ సర్పంచు సురేష్‌రెడ్డి దాదాపు రూ.3.50 లక్షలు ఖర్చు పెట్టారన్నారు. ఆయన వెంట ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రామస్వామి, డీఈ మొహిద్దీన్, ఏఈ సురేంద్రప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచులు సురేష్‌రెడ్డి, సుధాకర్, కొండాదేవికాశేఖర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఆపండి
హైకోర్టులో పిటిషన్.. సాక్షి, హైదరాబాద్: కొత్త భూసేకరణ చట్టం కింద మొత్తం భూసేకరణ పూర్తయ్యే వరకు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(పీఆర్ఎల్ఎస్) కింద ఎలాంటి పనులను కొనసా గించకుండా మెగా ఇంజనీరింగ్, స్వప్న ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని, ఆ రెండు కంపెనీలను ఆదేశించింది. నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఆర్ఎల్ఎస్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఎదుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం మహబూబ్‌నగర్ జిల్లా, నాగర్‌కర్నూల్ డివిజన్, కోడేరు మండల పరిధిలోని సర్వే నంబర్లు 93,94,95ల్లోని భూములను మెగా ఇంజనీరింగ్, స్వప్న ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌లు ఆక్రమించు కున్నా యని, ఆ భూములను తక్షణమే ఖాళీ చేసి, వాటిని వాటి యజమానులకు అప్పగించేలా కూడా ఆ రెండు కంపెనీలను ఆదేశించాలని కోరుతూ కె.కృష్ణారెడ్డి, కె.రామచంద్రారెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. -
చెప్పకుండా నీటిని వదిలి విపత్తంటారా?
అధికారుల వల్లే రైతులకు నష్టం జరిగిందన్న హైకోర్టు సాక్షి,హైదరాబాద్: జవహర్ ఎత్తిపోతల ప్రాజెక్టు (నెట్టెంపాడు) ప్యాకేజీ 98 కింద చేపట్టిన గూడెం దొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నీటిని వదలడంపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతులకు జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించి సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. దేవుడి వల్లో, వరదల వల్లో, అధిక వర్షాల వల్లో నష్టం జరగ లేదని, కేవలం నీటిపాదరులశాఖ అధికారుల వల్లే జరిగిందని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారానికి సంబంధించి తదుపరి విచారణ నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేనిపక్షంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది. తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వారుుదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గూడెందొడ్డి రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయడం వల్ల తమ పంటలు మునిగిపోయాయని, అరుునప్పటికీ తమకు ప్రభుత్వం పరిహారం చెల్లించడం లేదంటూ జోగుళాంబ గద్వాల్ జిల్లా దరూర్ మండలం దోర్నాలకు చెందిన శంకరమ్మ మరో 50 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ విచారించారు. నీటిని వదలడం వల్ల 60 ఎకరాల్లోని పంట మునిగిపోరుుందని, విపత్తు నిర్వహణ కింద దాదాపు రూ.2 లక్షల వరకు పరిహారంగా నిర్ణరుుంచారని ప్రభుత్వ న్యాయవాది శ్రీదేవి కోర్టుకు నివేదించారు. జిల్లా కలెక్టర్ పంపిన సమాచారాన్ని న్యాయమూర్తి ముందుం చారు. న్యాయమూర్తి దానిని పరిశీలించి కలెక్టర్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశా రు. కలెక్టర్ ఇచ్చిన సమాచారాన్ని రికార్డులోకి తీసుకోలేమని తేల్చి చెప్పారు. -
డీపీఆర్ లేకుండా శంకుస్థాపనా?: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని చర్లగూడెం రిజర్వాయర్‌కు సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) లేకుండానే సీఎం శంకుస్థాపన చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని సీపీఎం పేర్కొంది. హైదరాబాద్‌కు నీరందించేందుకు 11 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సీఎంకు రాసిన లేఖలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ముంపు తగ్గించేలా డిజైన్ చేస్తే బావుంటుందని రైతులు కోరుతున్నారన్నారు. -
25న గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు
కలెక్టర్ కోన శశిధర్ పెనుకొండ రూరల్ : హంద్రీ–నీవా వ్యవస్థలోని గొల్లపల్లి రిజర్వాయర్‌కు ఈ నెల 25న నీళ్లు వదులుతున్నట్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. సోమవారం ఆయన మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 275 కి.మీ వరకు హంద్రీ–నీవా పనులను పరిశీలించామన్నారు. 15 రోజుల లోపు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని, నీరు ఎలా వదులుతారని కలెక్టరును విలేకరులు ప్రశ్నించగా.. పనులు పూరయ్యే దాకా రిజర్వాయర్‌లో భూమట్టానికి మాత్రమే నీటిని వదులుతామని చెప్పారు. దీనివల్ల చుట్టుపక్కల భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. కలెక్టర్ వెంట జలవనరులశాఖ సీఈ జలంధర్, ఎస్ఈ సుధాకర్‌బాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశులు తదితరులు ఉన్నారు. కాగా.. జలవనరులశాఖ అధికారులపై ఎస్ఈ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని, ఒళ్లు దగ్గర పెట్టుకుని విధులు నిర్వర్తించాలని సూచించారు. లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు. -
అవుకు రిజర్వాయర్‌లో గుర్తుతెలియని వ్యక్తి శవం
అవుకు: స్థానిక రిజర్వాయర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఎస్ఆర్బీసీ కాలువ ద్వారా కొట్టుకు వచ్చి చిన్న చెరువు తూమ్వద్ద పడినట్లు తెలుస్తోంది. మూడు రోజల క్రితమే మరణించి ఉంటాడని, మృతునికి దాదాపు 35 సంవత్సరాల వయస్సు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహానికి రిజర్వాయర్ వద్ద పోస్టుమార్టం అనంతరం అంతక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీనువాసులు, పురుషోత్తం తెలిపారు. -
నిండిన వైరా రిజర్వాయర్
వైరా : వైరా రిజర్వాయర్ నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు వచ్చి చేరటం, ఇటీవల సాగర్ నుంచి సుమారు 1000 క్యుసెక్కుల నీటిని విడుదల చేయటంతో రిజర్వాయర్ నీటి మట్టం పెరిగింది. పూర్తి స్థాయి నీటిమట్టం 18.4 అడుగులు కాగా అది మించి పోయింది. దీంతో రిజర్వాయర్ కింద ఉన్న ఓ అలుగు ద్వారా నీరు బయటకు వెళుతోది. ఉదయం నుంచి ఓ అలుగు ద్వారా నీరు బయటకు వస్తుండటంతో విషయం తెలుసుకున్న సందర్శకులు రిజర్వాయర్ వద్దకు చేరుకుంటున్నారు. -
తాటిపూడి రిజర్వాయర్‌లో శవం
గంట్యాడలోని తాటిపూడి రిజర్వాయర్‌లో గురువారం శవం కనిపించింది. చేపలు పడుతున్న మత్స్యకారులకు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. శవాన్ని వెలికితీయడానికి వర్షం అడ్డంకిగా మారింది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
వీబీఆర్‌కు జలకళ
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ జలకళతో కళకళలాడుతోంది. నాలుగేళ్ల తరువాత మొదటిసారిగా వీబీఆర్‌లో 14 టీఎంసీల నీరు వచ్చి చేరింది. కృష్ణా జలాలు భానకచెర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి వీబీఆర్‌కు వెయ్యి క్యూసెక్కులు, గాలేరు నుంచి 1719 క్యూసెక్కలు బుధవారం వచ్చి చేరినట్లు తెలుగు గంగ జేఈ విజయ్‌కుమార్ తెలిపారు. వీబీఆర్‌లో 263.260 మీటర్ల వద్ద 863.712 అడుగుల నీటిమట్టంతో 14.550 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఆయన వివరించారు. వీబీఆర్ నుంచి చైన్నై కాల్వకు 350 క్యూసెక్కులు, వన్‌ఆర్ తూమ్ నుంచి 20, వన్ఎల్ తూమ్ నుంచి 15 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉన్నట్లు జేఈ తెలిపారు. వీబీఆర్ పూర్తి సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.550 టీఎంసీల నీరు చేరడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
గోరుకల్లు కట్ట పరిశీలన
– లీకేజీలను పరిశీలించిన ఎక్స్‌ఫర్ట్ కమిటీ సభ్యులు – రిజర్వాయర్‌ను సందర్శించిన ఎక్స్పర్ట్ కమిటీ – సాయంత్రం వరకు పరిశీలన – నిర్మాణలోపాలపై ఆరా పాణ్యం: గోరుకల్లు రిజర్వాయర్ కట్టకు లీకేజీలు ఏర్పడి నీరు బయటకు పారుతుండడంతో శనివారం ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు వచ్చి పరిశీలించారు. ప్రస్తుతం జలాశయంలో 1.94 టీఎంసీల నీరు నిల్వ ఉండగా కట్టకు నాలుగు చోట్ల నీటి ఊటలు బయటకు వస్తున్నాయి. అవుటర్ రెగ్యులేటర్ వద్ద రాతి కట్ట నుంచి రెండించుల నీరు లీకవుతోంది. సమీపంలోనే రెండు ఆయిల్ ఇంజిన్ల మేర నీరు బయటకు పోతోంది. దీన్ని దష్టిలో ఉంచుకుని విశ్రాంత ఇంజినీర్లు సుబ్బారావు, రైతు సత్యనారాయణ, సీఈ సీడీఓ గిరిధర్‌రెడ్డి, సీఈ నారాయణరెడ్డి, ఈఈ సుబ్బారాయుడుతో కూడిన ఎక్స్పర్ట్ కమిటీ శనివారం జలాశయాన్ని సందర్శించింది. లీకేజీ నీటిని బయటకు పంపేందుకు ప్రత్యేకంగా కాల్వ తీయించారు. కాంక్రీట్ పనులు, గుర్రాల వాగు వద్ద కట్టకు నీరు లీక్ అవుతున్నట్లు గుర్తించారు. రెండు పాయింట్ల వద్ద కట్టపై టెస్టింగ్ కోసం ప్రత్యేకంగా డ్రిల్లింగ్ చేయించారు. కట్ట కింది భాగంలో మట్టి బురదగా ఉండడంతో డ్రిల్లింగ్కు ఆటంకం ఏర్పడింది. అలాగే అవుట్ రెగ్యూలేటర్ వద్ద కట్ట నుంచి రాళ్లను తొలగించి పరిశీలించారు. హెలిప్యాడ్ పాయిండ్ వద్ద ప్రత్యేకంగా ప్రొక్లెయిన్‌తో గుంత తవ్వించగా మూడు అడుగుల లోతులోనే నీరు పడడంతో కమిటీ సభ్యులు ఆలోచనలో పడ్డారు. జలాశయానికి పూనాది వేసిన ఇంజినీర్లను రప్పించే చర్యలు చేపట్టారు. నిర్మాణంలో లోటుపాట్లపై కంపెనీ ప్రతినిధులను ఆరా తీస్తున్నారు. విషయాన్ని తేల్చేందుకు రెండు, మూడు రోజుల సమయం పడుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. పంపింగ్ నిలిపివేత.. ప్రస్తుతం 14.5 మీటర్ల వద్ద జలాశయంలో 1.94 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 234.4 అడుగుల మేర నీరు వచ్చినట్లు చెబుతున్నారు. కట్టకు సంబంధించి నేల నుంచి దిగువకు 180అడుగుల లోతులో పునాదులు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కట్టకు ఏర్పడిన లీకేజీలను దష్టిలో ఉంచుకుని జలాశయంలోకి పంపింగ్ ప్రక్రియను నిలిపివేశారు. ఎస్సాఆర్బీసీ ప్రధాన కాల్వ నుంచి నీటిని దిగువకు వదుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 నుంచి 7 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితి దష్ట్యా అందుకు సాధ్యం కాదని అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి కట్ట పరిస్థితిని పరిశీలించారు. -
శాశ్వత జలాశయంగా మూసీ
కేతేపల్లి : కృష్ణా, గోదావరి జలాలను మూసీ రిజర్వాయర్‌లోకి తీసుకువచ్చి శాశ్వత జలాశయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మూసీ ప్రాజెక్టు కుడి కాల్వల ఆయకట్టు పరిధిలోని గ్రామాలలో చెరువులు, కుంటలను మూసీ నీటితో నింపేందుకు ఆదివారం ఆయన కాల్వలకు నీటిని విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే రైతులనుద్దేశించి మాట్లాడుతూ ఆయకట్టు గ్రామాల్లో నెలకొన్న తాగు, సాగునీటి ఎద్దడిని తీర్చేందుకే గ్రామాల చెరువులు, కుంటలు నింపాలని నిర్ణయించామని తెలిపారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఎలాంటి ముంపు లేకుండా మూసీ రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం పెంచడంతో పాటు, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. మూసీ ప్రధాన, డిస్టిబ్యూటరీ కాల్వలు, తూముల మరమ్మతులకు సర్వే చేయించి రు.56 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. కాల్వలో దట్టంగా పెరిగి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న కంపచెట్లను ఈజీఎస్‌లో తొలగించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కేతేపల్లి ఎంపీపీ గుత్త మంజుల, మూసీ డీఈ నవికాంత్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు కాల్సాని లింగయ్య, కె.వెంకటరమణ, బి.యాదగిరి, ఎంపీటీసీ ఆర్.యాదగిరి, కుడి కాల్వ ఏఈ ఎన్.రమేష్, ఎడమ కాల్వ ఏఈ, జేఈ మమత, స్వప్న, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పూజర్ల శంభయ్య, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
తాండవలో పెరుగుతున్న నీటి మట్టం
మంగళవారం సాయంత్రానికి 363 అడుగులకు చేరిక నీటి విడుదలపై త్వరలో తాండవ డిస్ట్రిబ్యూటరీ కమిటీ సమావేశం స్పష్టం చేసిన డీఈ రాజేంద్రకుమార్ నాతవరం : వరుసగా కురుస్తున్న వర్షాలతో తాండవ రిజర్వాయర్‌లో క్రమేపీ నీటి మట్టం పెరుగుతోందని డీఈ రాజేంద్రకుమార్ అన్నారు. తాండవ రిజర్వాయరు నీటి మట్టాన్ని ఆయన పరిశీలించారు. రిజర్వాయర్ గట్టుపై సైడ్ వాల్స్ పనుల్ని పరిశీలించి నాణ్యతతో చేయాలన్నారు. నిబంధనలు ఉల్లఘించి నాణ్యత లేని సామగ్రి వాడితే చర్యలు తప్పవన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఏకైక మేజర్ ప్రాజక్ట్ తాండవ రిజర్వాయర్‌లో గత నెలలో నీటి మట్టం దయనీయంగా ఉండేదని, సాగుకు నీరందిస్తామె లేదోనన్న బెంగ ఉండేదన్నారు. వారం వ్యవధిలో రిజర్వాయర్‌లో ఎనిమిది అడుగుల నీరు పెరిగిందన్నారు. మంగళవారం సాయంత్రానికి 363 అడుగులుందని, ఇన్‌ఫ్లో నీరు అధికంగా వస్తుందన్నారు. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నెల రెండో వారంలో తాండవ డిస్ట్రిబ్యూటర్ కమిటి సమావేశం నిర్వహించి నీటి విడుదల ఎప్పుడనేది అయకట్టుదారులకు తెలియుజేస్తామన్నారు. తాండవ అయకట్టు పరి«ధిలో ఉన్న రైతులంతా ఖరీఫ్ సాగుకు వరినారులు సిద్ధం చేసుకోవచ్చనన్నారు. ఇంతవరకు తాండవ నీటి విడుదలపై అయోమయంలో ఉన్నామని, వాతావరణ పరిస్దితులు అనుకూలించడంతో నీటి మట్టం పెరుగుతోందని, ఈ సీజన్‌కు నీరు ఇవ్వవచ్చనే ధీమాకు వచ్చామన్నారు. నీరు విడుదల చేసే సమయానికి రిజర్వాయర్ గట్టుపై సైడ్‌వాల్స్‌తో పాటు విద్యుత్ పనులు కూడా పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించామన్నారు. -
రిజర్వాయర్‌లో కానిస్టేబుల్ మృతదేహం
వరంగల్: వరంగల్ జిల్లా ధర్మాసాగర్ జలాశయంలో ఆదివారం గల్లంతైన కానిస్టేబుల్ పొలిమారి సృజన్(25)మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. ఆదివారం మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన సృజన్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. -
‘బస్వాపురం’ సామర్థ్యాన్ని తగ్గించాలి : జూలకంటి
భువనగిరి : బస్వాపురం రిజర్వాయర్ సామర్థ్యాన్ని 11.38 టీఎంసీలను తగ్గించి, గ్రామాలు మునిగిపోకుండా నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని, రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలని కోరుతూ రైతులు, నాయకులు చేపట్టిన రిలే నిరాహర దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్మించతలపెట్టిన బస్వాపురం రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న రైతులకు, భూమికి భూమి ఇవ్వాలని, ఇళ్లు కోల్పోతున్న వారికి ఇళ్లు ఇవ్వాలన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా 123 జీఓను భూసేకరణకు ఉపయోగించడం వల్ల రైతులు రోడ్డున పడుతున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, సీపీఎం డివిజన్ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, వేముల మహేందర్, మాటూరు బాలరాజు, దాసరి పాండు, కన్వీనర్ దయ్యాల నర్సింహ, రాజయ్య, సురేందర్, అంజయ్య, రాజరాం, వెంకటేశ్, రమేష్, రామ్‌జీ, లక్పతి, సత్యనారాయణ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
ప్రజా అనుమతితోనే మల్లన్నసాగర్
⇒‘సాక్షి’ ఇంటర్వ్యూలో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ⇒దేశంలో అతితక్కువ ముంపుతో నిర్మితమయ్యే ప్రాజెక్టు ఇదే ⇒నిర్వాసితులకు మెరుగైన పరిహారం.. రైతులకు నష్టం చేయబోం ⇒అడ్రస్ గల్లంతవుతుందనే భయంతోనే విపక్షాల ఆందోళన ⇒సీపీఎం, బయటి శక్తుల వల్లే హింసాత్మక ఘటనలని ఆరోపణ హైదరాబాద్: రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచి రెండు పంటలకు నీరందించేందుకే ప్రభుత్వం ‘ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్’ను చేపట్టిందని.. అందులో భాగంగానే మల్లన్నసాగర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. మల్లన్నసాగర్‌ను దేశంలోనే అతి తక్కువ ముంపుతో నిర్మితమయ్యే ప్రాజెక్టుగా పేర్కొన్న మంత్రి... ముంపు ప్రజల అనుమానాలను నివృత్తి చేసి, వారి అనుమతితోనే ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. ఈ రిజర్వాయర్ విషయంలో విపక్షాలు, ప్రజా సంఘాలు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వివాదం నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రశ్న: ప్రాణహిత-చేవెళ్ల రీ ఇంజనీరింగ్‌తో సమస్య మొదలైనట్లుంది? హరీశ్‌రావు: గోదావరిలో తెలంగాణ వాటా 954 టీంఎసీలు.. కానీ ఏనాడూ ఈ వాటాను వాడుకోలేకపోయింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు పోగా.. మిగతా 110 టీఎంసీలతో 16 లక్షల ఎకరాలకు నీరివ్వడం సాధ్యం కాదు. అందువల్లే వీలైనన్ని ఎక్కువ నీళ్లను వినియోగించుకునేలా రీ ఇంజనీరింగ్ చేపట్టాం. 50 టీఎంసీల రిజర్వాయర్ అవసరమా అనే ప్రశ్నకు మీ సమాధానం? లక్షలాది ఎకరాలకు నీరు ఇవ్వాలంటే భారీ రిజర్వాయర్లు కట్టాలి. 45 టీఎంసీల పులిచింతల ప్రాజెక్టు కోసం 28 గ్రామాలు, ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకు 19 గ్రామాలు, మిడ్‌మానేరులో 25 టీఎంసీలకు 18 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మల్లన్నసాగర్లో 50 టీఎంసీలకు 8 గ్రామాలు మాత్రమే ముంపునకు గురవుతున్నాయనే విషయాన్ని గమనించాలి. ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి కదా! ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి. ప్రజల్లో అపోహలు కల్పించి, సమస్యలు సృష్టించి ప్రాజెక్టుల వేగాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే ఆరు గ్రామాలతో చర్చలు పూర్తయ్యాయి. మూడు గ్రామాలు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. నిర్వాసితులను ఒప్పించి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందే తప్ప బలవంతం చేయడం లేదు. ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలపై..? సంక్షేమ కార్యక్రమాలు చేపడితే దుబారా అంటారు, ప్రాజెక్టులు చేపడితే అవినీతి అంటారు. భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని ఢిల్లీలో ఒత్తిడి చేస్తున్న టీడీపీ... ఇక్కడ అమలు చేయాలంటూ ధర్నాలు చేస్తోంది. ఆ పార్టీకి ఓ నాయకుడు, ఓ వైఖరీ లేదు. ఇదే టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో మూడు పంటలు పండే భూములను లాక్కుంటున్నది. రాజధానికి 54 వేల ఎకరాలు తీసుకోవడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా..? మల్లన్నసాగర్‌ను వ్యతిరేకించడం టీడీపీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. పోలీసుల లాఠీచార్జీ, హింసాత్మక ఘటనలపై మీ వివరణ? సీపీఎం, బయటి నుంచి వచ్చిన శక్తులు రైతుల ఆందోళనను హింసాత్మకంగా మార్చాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అయితే సంయమనం పాటించి అమాయక రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా.. విద్రోహ శక్తులను గుర్తించి కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించాం. ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. మల్లన్నసాగర్‌పై అంత పట్టుదల ఎందుకు? ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల నుంచి 1,300 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు తెలంగాణకు హక్కు ఉన్నా.. అప్పటి ప్రభుత్వాలు ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదు. మేం అంతర్రాష్ట్ర వివాదాలు, నీటి లభ్యత, నీటి కేటాయింపులను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌ను చేపట్టాం. మల్లన్నసాగర్ ద్వారా మెదక్ జిల్లాలో 9 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లా ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో 2.30 లక్షల ఎకరాలకు, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణ ద్వారా 2.50లక్షల ఎకరాలకు నీరందిస్తాం. తక్కువ ముంపుతో పెద్ద రిజర్వాయర్ నిర్మించే అవకాశం మల్లన్నసాగర్ వద్దే ఉంది. పరిహారంపై వస్తున్న విమర్శలకు మీ స్పందన? మల్లన్నసాగర్ విషయంలో బాధితులకు మెరుగైన నష్టపరిహారం అందిస్తాం. రాళ్లు, రప్పలున్నా ఎకరాకు రూ.ఆరు లక్షలతోపాటు బోరు, బావి, చెట్లకు కూడా డబ్బులు ఇస్తామని చెప్తున్నాం. భూసేకరణ చట్టం-2013 కంటే జీవో 123 ఏవిధంగా మెరుగైందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు నష్టం జరగకుండా చూస్తాం. డబుల్‌బెడ్ రూం ఇళ్లు, ఇంగ్లిషు మీడియంలో రెసిడెన్షియల్ విద్య, కులవృత్తుల వారికి 80శాతం సబ్సిడీతో పథకాలు, చేపలు పట్టే అధికారం తదిత ర ప్రయోజనాలు చేకూరుస్తాం. అన్ని వసతులతో పునరావాస గ్రామాలు నిర్మిస్తాం. -
తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి గోదావరి నీరు
చేర్యాల : తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి గోదావరి నీళ్ల పంపింగ్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తపాస్‌పల్లి రిజర్వాయర్ అధికారులు మాట్లాడుతూ తపాస్‌పల్లి రిజర్వాయర్ 0.3 టీఎంసీ (300 ఎంసీఎస్‌టీ ) నీటి సామర్థ్యం ఉందని తెలిపారు. గోదావరి నీటిని ధర్మసాగర్ నుంచి గండిరామారం మీదుగా బొమ్మకూర్‌కు, అక్కడి నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్ చేస్తున్నట్లు చెప్పారు. తపాస్పల్లిలో ప్రస్తుతం నీళ్లు తక్కువగా ఉన్నందున గోదావరి నీళ్లతో పంపింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. -
నాగార్జునసాగర్‌లో బోటు మునక..భక్తుల గల్లంతు
-
మల్లన్నసాగర్, డిండి ప్రాజెక్టులపై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: కాళేశ్వరం, మల్లన్నసాగర్, డిండి ప్రాజెక్టుల పై సీఎం కేసీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు హారీశ్ రావు, జగదీశ్ రెడ్డితో పాటూ పలువురు అధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సమాంతరంగా ఎల్లంపల్లి ద్వారా నీటిని మళ్లించేందుకు కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్ సూచించారు. మల్లన్న సాగర్ నుంచి బస్వాపూర్ వరకు నిర్మించే రిజర్వాయర్ల ద్వారా గొలుసుకట్టు చెరువులకు నీటిని తరలించాన్నారు. ప్రతి చెరువు కలకలలాడేలా గ్రామాలకు నీటి తరలింపు ప్రక్రియ ఉండాలని కేసీఆర్ తెలిపారు. మల్లన్న సాగర్ ద్వారా ఉత్తర, దక్షిణ తెలంగాణకు అవసరాన్ని బట్టి నీటి పంపిణీ చేయాలన్నారు. రెండేళ్లలోపే మల్లన్న సాగర్‌కు నీరు తరలించేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. డిండి ప్రాజెక్టు డిజైన్లను కేసీఆర్ పరిశీలించారు. డిండి ద్వారా నల్లగొండలోని కరువు ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండ,చౌటుప్పల్, చిట్యాల ప్రాంతాలకు సాగునీరు అందించాని కేసీఆర్ తెలిపారు. మంపు తక్కువగా ఉండేలా నిర్మాణం చేపట్టాలని సమవేశంలో నిర్ణయించారు. -
‘పాలమూరు’లో కొత్త రిజర్వాయర్
నిర్ణయించిన ప్రభుత్వం.. రూ. 2,600 కోట్ల అంచనా సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకింద ఇప్పటికే నిర్ణయించిన ఆరు రిజర్వాయర్లకు తోడు మరో రిజర్వాయర్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలో సుమారు 1.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంతో ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ల మధ్య అంతారం వద్ద 16 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్ నిర్మించేలా తాజాగా ప్రణాళికలు తయారు చేసింది. కొత్త రిజర్వాయర్ నిర్మాణంపై ఓ వైపు కసరత్తు పూర్తి చేస్తూనే కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్, ఇతర కాల్వల పనుల అంచనాలను సిద్ధం చేసే పనిలో పడింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మొత్తంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్లతో పాటు కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్లను ప్రతిపాదించారు. ఇందులో ఇప్పటికే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా అన్ని రిజర్వాయర్ల సర్వే, అంచనాలు పూర్తి చేసి రూ.30 వేల కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ప్రస్తుతం మూడు, నాలుగు ప్యాకేజీలు మినహా అన్ని చోట్లా పనులు ఆరంభమయ్యాయి. ఉద్దండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవుని పల్లి సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉండటంతోపాటు, ఇందులో 35 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్‌తో పాటు మరో 5 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. దాంతో ఇది చాలా వ్యయప్రయాసలతో కూడిన పనిగా గుర్తిం చారు. కెనాల్, టన్నెల్ పరిధిలోని భూములన్నీ రంగారెడ్డి జిల్లాలో అత్యంత ఖరీదైనవి కావడంతో దీనికి ప్రత్యామ్నాయాలను వెతికిన నీటి పారుదల శాఖ, అంతారం వద్ద మరో రిజర్వాయర్ నిర్మాణం అం శాన్ని తెరపైకి తెచ్చింది. ఉద్దండాపూర్ నుంచి 100 మీటర్ల లిఫ్టుతో అంతారానికి నీటిని తరలించడం అత్యంత సులభమని అధికారులు తేల్చారు. ఇక్కడ 16 టీఎంసీల నీటిని నిల్వ చేసే అనువైన ప్రదేశం ఉందని గుర్తించి సర్వే పనులు పూర్తి చేశారు. అం తారం రిజర్వాయర్‌ను చేపడితే పరిగి, తాండూర్లలోని మొత్తం ఆయకట్టు, వికారాబాద్‌లోని కొంత ఆయకట్టుకు నీటిని అందించడం సులువవుతుందని పేర్కొంటున్నారు. దీనికోసం రూ. 2,600 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి రాష్ట్ర హై పవర్ కమిటీ ఆమోదం తెలిపిందని నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
పోదాం.. లక్నవరం
హన్మకొండ : పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న లక్నవరం జలాశయంలో నూతనంగా నిర్మించిన అద్దాల మేడలు, ఉడెన్ కాటేజీలు రేపటి నుంచి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. శనివారం ఉదయం రాష్ట్ర గిరిజన, పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీర చందూలాల్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దల పద్మ హజరుకానున్నారు. లక్నవరం జలాశయంలో నిర్మించిన వేలాడే వంతెన, కాకరబోడు దీవిలో నిర్మించిన కాటేజీలకు పర్యాటకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వీటికి అదనంగా లక్నవరం జలాశయంలో ఉన్న మరో దీవిలో కొత్తగా నాలుగు కాటేజీలను నిర్మించారు. అద్దాల మేడలు ఎత్తై కొండల మీద ఆకుపచ్చ రంగు చిక్కగా పరుచుకున్న దట్టమైన అడవిలో పదివేల ఎకరాల్లో విస్తరించిన చెరువు మధ్యలో వెలసిన దీవుల్లో అద్దాల మేడలను నిర్మించారు. దాదాపు రూ.40 లక్షల వ్యయంతో ఈ అద్దాల మేడలను నిర్మించారు. వీటిని సాంకేతిక పరిభాషలో ‘ఆన్ డై లైన్’ కాటేజీలు అంటారు. ఫ్రాన్స్ నుంచి తెప్పించిన మెటీరియల్‌తో ఈ కాటేజీలు నిర్మించారు. తుప్పు, ఫంగస్ లాంటివి ఈ కాటేజీలకు పట్టవు. దాదాపు ఇరవై ఏళ్ల వరకు కాటేజీలు మెరుపును కోల్పోవు. ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ రెండు కాటేజీల్లో 90 శాతం అద్దాలతోనే గోడలు నిర్మించారు. దీంతో గదిలో నుంచే ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. అద్దాల గదులతో పాటు గతంలో నిర్మించిన రెండు ఉడెన్ కాటేజీలను రేపు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కాకరబోడులో ఉన్న రెస్టారెంట్లో ఎనిమిది గదులు ఉన్నాయి. కొత్తగా నాలుగు గదులు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో లక్నవరం హరిత హోటర్ సామర్థ్యం 12 గదులకు చేరుకుంది. ఆన్లైన్ ద్వారా ఈ గదులను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీవిలో బస చేసే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సోలార్ విద్యుత్ దీపాలతో పాటు జనరేటర్లు అందుబాటులో ఉంచారు. వేయి లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రం ఉంది. దీనితో పాటు పదివేల లీటర్ల సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. ఇక్కడ బస చేసే వారి కోసం మినీ రెస్టారెంటును నిర్మించారు. ఈ నాలుగు గదుల్లో వెస్ట్రన్ పద్ధతిలో టాయిలెట్లు నిర్మించారు. ఈ దీవిలో దాదాపు ఆరువేల చదరపు అడుగులు లాండ్ స్కేపింగ్‌ను అభివృద్ధి చేశారు. ఈ దీవికి చేరుకోవాలంటే 160 మీటర్ల పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి మీదుగా ప్రయాణించి కాకరబోడు దీవికి చేరుకోవాలి. అక్కడి నుంచి బోటులో రెండో దీవికి చేరుకోవచ్చు. స్పీడ్‌బోటు కూడా అందుబాటులో ఉంటుంది. -
గండిపేట గుండెకోత
అడుగంటుతున్న జలాశయం పెద్ద సంఖ్యలో చేపల మృత్యువాత మహా నగర దాహార్తిని తీర్చే జలాశయాలే దాహంతో అలమటిస్తున్నాయి. భానుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్నాయి. తమనే నమ్ముకున్న జీవరాశులకు సైతం భరోసా ఇవ్వలేకపోతున్నాయి. సువిశాల విస్తీర్ణంలోని గండిపేట జలాశయం తనపై ఆధారపడిన చేపలను నిర్జీవంగా ఒడ్డున పడేసిన ‘చిత్రం’.. చూసిన వారి గుండెలు తరుక్కుపోతున్నాయి. సిటీబ్యూరో:మహా నగరంలో ఎండల తీవ్రతకు జలాశయాలు అడుగంటుతున్నాయి. పశుపక్ష్యాదులు ప్రాణాలు కోల్పోతున్నాయి. జనం అల్లాడుతున్నారు. మండుటెండలతో చారిత్రక ఉస్మాన్ సాగర్ (గండిపేట) నీళ్లు లేక చిన్నబోయి కనిపిస్తోంది. ఈ జలాశయ గరిష్ట మట్టం 1790 అడుగులు. ప్రస్తుతం 1750 అడుగులకు పడిపోయింది. నీటి మట్టం తగ్గడంతో ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేపలు వేసవి తాపాన్ని తాళలేక మృత్యువాత పడుతున్నాయి. ఈ దృశ్యం చూసిన వారిని కలచివేస్తోంది. జలాశయం దుస్థితికి కారణాలివే... ఎగువ ప్రాంతాల్లో ఉన్న సుమారు 84 గ్రామాల నుంచి జంట జలాశయాలకు వరద నీటిని చేర్చే కాల్వలు (ఇన్‌ఫ్లో చానల్స్) కబ్జాకు గురవడం, ఇటుక బట్టీలు, ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం, ఫాంహౌస్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారాయి. ఉస్మాన్ సాగర్ పరిరక్షణకు పర్యావరణ ఇంజినీరింగ్ సంస్థ ‘నీరి’ నిపుణులు 2011లో సమగ్ర అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వా నివేదిక సమర్పించారు. కానీ ఆ సంస్థ సిఫారసులకు ఐదేళ్లుగా మోక్షం లభించలేదు. సమీప గ్రామాల నుంచి మురుగు నీరు జంట జలాశయాల్లో కలుస్తుండడంతో చారిత్రక సాగరాలు కలుషితమవుతున్నాయి. జలాశయం ఎగువ ప్రాంతాల్లో ఉన్న 45 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి నిత్యం మురుగునీరు సాగరాల్లోకిచేరుతోంది. కళాశాలల యాజమాన్యాలు సొంతంగా చిన్నపాటి మురుగు శుద్ధి కేంద్రాల (మినీ ఎస్టీపీలు)ను నిర్మిం చుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పరిష్కారాలు... సుమారు పదివేల కి.మీ. సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ జలాశయాల సరిహద్దులు, జీఓ. నెం 111 ప్రకారం ఎగువ ప్రాంతాల్లో మరో పది కి.మీ. వరకు సరిహద్దుల ను పక్కాగా గుర్తించేందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) సాయం తీసుకోవాల్సి ఉంది.జీఐఎస్, శాటిలైట్ చిత్రాలు, టోటల్ స్టేషన్ వంటి ఆధునిక సాంకేతికత ఆధారంగా ఎన్జీఆర్ఐ సంస్థ సరిహద్దులను గుర్తించిన తరువాత జలాశయాల సరిహద్దులను గుర్తిస్తూ డిజిటల్ మ్యాపులు సిద్ధం చేయాలి.ఎగువ ప్రాంతాల్లో కబ్జాల నిరోధం, ఇసుక ఫిల్టర్లను నిర్వహిస్తున్న అసాంఘిక శక్తుల ఆట కట్టించాలి.కృష్ణా నాలుగో దశ ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్ జిల్లా లక్ష్మీదేవి పేట నుంచి కృష్ణా జలాలను నగరానికి తరలించి ఈ జలాశయాల్లో నింపేందుకు ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని నీటి పారుదల రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ వేసవిలో జంట జలాశయాల్లో భారీగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని సూచిస్తున్నారు. జంతు, చెట్ల అవశేషాలు, గుర్రపుడెక్క తొలగింపు, అడుగున పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించాలని సూచిస్తున్నారు.నీటి రంగు మారకుండా జలాశయంలో ఏరియేషన్(ఆక్సిజన్ స్థాయి పెంపునకు) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. జలాశయంలోకి వర్షపు నీటిని చేర్చే ఇన్‌ఫ్లో చానల్స్‌ను ఈ వేసవిలోనే యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.ఎగువ ప్రాంతాల్లో అక్రమంగా వెలసిన ఫాంహౌస్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, రియల్ వెంచర్లను తొలగించాలి. ఈ జలాశయాలు పూర్వపు స్థాయిలో నిండుకుండల్లా జలకళను సంతరించుకుంటే నగరానికి రోజువారీగా 40 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని పొందే అవకాశం ఉంటుందని, దాదాపు పాతనగరం దాహార్తి సమూలంగా దూరమవుతుందని నిపుణులు తెలిపారు. -
విప్పర్ల చెరువును ఆధునీకరించండి..
► అప్పుడే నరసరావుపేట తాగు నీటి సమస్య పరిష్కారం ► స్టోరేజ్ ట్యాంక్‌లను పరిశీలించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి నరసరావుపేట వెస్ట్ : నరసరావుపేట పట్టణ ప్రజలకు భవిష్యత్‌లో తాగునీటి అవస్థలు తీరాలంటే రొంపిచర్ల మండలంలోని విప్పర్ల గ్రామంలో ఉన్న 200 ఎకరాల చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. పట్టణ ప్రజల తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేశారు. పట్టణానికి తాగునీటిని అందించే రావిపాడు శాంతినగర్ రిజర్వాయర్, నకరికల్లులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను ఆదివారం ఆయన ప్రజారోగ్య శాఖ ఈఈ నాగమల్లేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. విప్పర్ల చెరువుకు సాగర్ మైనర్ కాలువ ద్వారా సరాసరి నీరు తరలుతున్నందున కొద్ది సమయంలోనె చెరువు నిండుతుందన్నారు. కేవలం రూ.30 లక్షల వ్యయంతో ఈ చెరువును రిజర్వాయర్‌గా మార్చవచ్చని చెప్పారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుతో పాటు విప్పర్ల చెరువు నీరు కూడా ఉంటే తాగునీటి అవస్థలకు పుల్‌స్టాప్ పెట్టవచ్చన్నారు. పది రోజులుగా సాగర్ కాలువల ద్వారా వస్తున్న నీరు ప్రస్తుతం నకరికల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో 15 శాతం మాత్రమే చేరిందని చెప్పారు. రోజు విడిచి రోజు ఇస్తే రెండు లేదా మూడు నెలలకు మాత్రమే సరిపోయే అవకాశం ఉందని తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో వర్షాలు పడితే కాలువలకు నీరు వదిలే అవకాశం ఉంటుందని ఎన్ఎస్పీ ఎస్ఈ తెలిపారన్నారు. అధికారుల విఫలం.. రిజర్వాయర్లను నింపటంలో కూడా అధికారుల వద్ద సరైన ప్రణాళిక లేక విఫలమయ్యారని ఆయన తెలిపారు. రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చుచేసి 20 మోటార్లను వినియోగించి రిజర్వాయర్లు నింపే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. గుంటూరు కార్పొరేషన్ మాదిరిగానే రూ.15 లక్షలతో 500 హార్స్ పవర్ ఇంజిన్‌ను కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలని సూచించారు. అప్పుడే తక్కువ సమయంలోనే ట్యాంకును 50 శాతం వరకు నింపవచ్చన్నారు. అలాగే, కాలువ తూములను 2 నుంచి నాలుగైదు మీటర్లకు పెంచాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, జిల్లా కార్యదర్శులు షేక్ ఖాదర్‌బాషా, కందుల ఎజ్రా, కౌన్సిలర్లు ఉన్నారు. -
బ్రహ్మయ్యా.. చూడవయ్యా..!
♦ అడుగంటిన బ్రహ్మంసాగర్ ♦ అయినా వదలని ఆర్టీపీపీ అధికారులు ♦ రిజర్వాయర్‌లో కాలువ తవ్వి తూములోకి నీటిని మళ్లించే యత్నం ♦ అదే జరిగితే స్థానికులకు గుక్కెడు తాగునీటి కీ గగనం బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఈ రిజర్వాయర్ నుంచి బ్రహ్మంగారిమఠం మండలంలోని దాదాపు 70 గ్రామాలతోపాటు బద్వేలు మున్సిపాలిటీకి తాగునీరు, 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉంది. 17.5 టీఎంసీల నీరు నిల్వ ఉంచే అవకాశం ఉన్న ఈ రిజర్వాయర్‌లో 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేరరెడ్డి రికార్డు స్థాయిలో 14 టీఎంసీల నీటిని నిల్వ ఉంచగలిగారు. అప్పటి నుంచి నేటి వరకు బ్రహ్మంసాగర్‌కు నీటి మళ్లింపులో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం చేశారు. ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. బద్వేలు పట్టణానికి తాగునీరు అందించేందుకు సమీపంలో పంప్ హౌస్ నిర్మించినా నీరు అందించే స్థితిలో లేకపోవడంతో మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీపీపీకి ఆగని సరఫరా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పాదన కోసం నీరు, బొగ్గు ఎంతో అవసరం. ఆర్టీపీపీలో గతంలో బొగ్గు అధింగా వాడేవారు. మైలవరం జలాశయం నుంచి నీరు వాడుతూ మధ్యలో ఆ జలాశయం ఎండిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించారు. ఇందులో భాగంగా బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి 72 కిలోమీటర్ల పొడవున రూ.70 కోట్లతో పైపులైన్ ఏర్పాటు చేసి నాలుగేళ్లుగా నీటిని మళ్లిస్తున్నారు. ప్రతి రోజు 25-40 క్యూసెక్కుల నీటిని ఆర్టీపీపీకి తరలిస్తున్నారు. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ కుడి కాలువలోకి నీటిని మళ్లించడానికి తూము సమీపంలో కాలువ తవ్వేందుకు రూ.8 లక్షలతో టెండర్లు పిలిచారు. ఎడమ కాలువ తూము ఎండిపోయి ఇప్పటికే నెలలు గడుస్తోంది. కుడికాలువ తూము ద్వారా ప్రస్తుతం ఆర్టీపీపీకి నీరు అందిస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో ఈ తూము ద్వారా కూడా నీరు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడటంతో ఇందులోకి నీటిని మళ్లించడానికి ఆర్టీపీపీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇదే జరిగితే స్థానికులకు గుక్కెడు తాగునీరు కూడా దొరకదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో బ్రహ్మంసాగర్‌లో మిగిలిన అరకొర నీటిని ఆర్టీపీపీకి తరలించకుండా చూడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. -
మా శవాలపై రిజర్వాయర్ కట్టుకోండి
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు తొగుట: ‘మా శవాలపై రిజర్వాయర్ కట్టుకోండ్రి’ అంటూ ఓ బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. కొమురవెల్లి మల్లన్న రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి గురువారం తుక్కాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ముంపు బాధితులకు ఎకరానికి ప్రభుత్వం రూ.4.70 లక్షలు చెల్లిస్తుందని ఆర్డీఓ ప్రకటించడంతో రైతులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అధికారులు, పాలకులు తమను పట్టించుకోవడంలేదని నిరాశ చెందిన ఓ దళిత రైతు నర్సింహులు అధికారుల ముందే పురుగుల మందు తాగాడు. సహచర రైతులు ఎంత వారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. జీఓ నం. 214కు బదులు జీఓ నం.123తో ముంపు బాధితులను నిలువునా ముంచుతారా? అంటూ వారు ఆర్డీఓను నిలదీశారు. ఎకరానికి రూ.10 లక్షలు చెల్లించేలా జీఓను సవరించాలని డిమాండ్ చేశారు. భూములను కోల్పోతున్న రైతులకు సాగు భూములే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ముంపునకు గురైన భూ బాధితులకు ఒకే చోట గ్రామాన్ని నిర్మించి ఇవ్వాలని గ్రామస్తులు తీర్మానం చేసి ఆర్డీఓ ముత్యంరెడ్డికి అందించారు. రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించాలి: ఆర్డీఓ రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న రిజర్వాయర్ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి కోరారు. ప్రభుత్వం మెరుగైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. -
డేంజర్లో ‘సింగూరు’ డ్యామేజీ!
♦ రిజర్వాయర్ ఎండిపోవడంతో పగుళ్లు ♦ యుద్ధప్రాతిపదికన డ్యామ్ పటిష్టతను ♦ నిర్ధారించాలంటూ గేట్‌కు లేఖ ♦ మార్చిలో సింగూరు రానున్న నిపుణులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సింగూరు డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉంది. రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడంతో డ్యాంకు పగుళ్లు ఏర్పడి, నైబారే ప్రమాదం ఉందని సాగునీటి శాఖ అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం కేవలం 0.07 టీఎంసీల నీళ్లు మాత్రమే సింగూరులో ఉన్నాయి. డ్యాం పునాదుల వరకు నీళ్లు ఎండిపోయి సిమెంట్స్ బెడ్స్ బయటికి తేలాయి. పునాదుల వద్ద నీళ్లు లేకపోవడంతో మట్టి ఎండిపోయి క్రమంగా అది రాలిపోవడంతో రంధ్రాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. నీటి ప్రవాహం వచ్చినప్పుడు ఈ రంధ్రాల గుంగా నీళ్లు బయటికి కారిపోయి.. క్రమంగా పెద్ద పగుళ్లుగా మారి డ్యాం ఉనికిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోనళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన డ్యాం మరమ్మతు పనులను చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులు గేట్‌కు లేఖ రాశారు. 1977-78లో సింగూరు రిజర్వాయర్ రూపుదిద్దుకుంది. 30 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ఇప్పటి వరకు ఎండిపోలేదు. కనిష్ట నీటి మట్టం 10 టీఎంసీలు (డెడ్ స్టోరేజ్). గత ఏడాది ఫిబ్రవరి 19న డ్యాంలో 9 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి చుక్క నీరు కూడా చేరలేదు. ఉన్న నీటినే తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలోనే నీ టి నిల్వలు 0.09 టీఎంసీలకు చేరటం తో ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నీటి సరఫరాను నిలిపివేశారు. కేవలం మెదక్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకే నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయింది. గుంతల్లో మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఏళ్ల తరబడి నీటి అలల తాకిడికి ప్రాజెక్టు పునాదుల వద్ద చిన్న చిన్న రంధ్రాలు పడతాయి. అయితే ఈ రంధ్రాల్లో వెంటనే ఒండ్రు మట్టి చేరిపోతుంది కాబట్టి డ్యాంకు ఎటాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అధికారులు డ్యాం పునాదుల వద్ద నిరంత రం నీళ్లు ఉండేటట్లు జాగ్రత్త పడతారు. ప్రస్తుతం నీళ్లు లేకపోవడంతో మట్టి ఎండిపోయింది. ఈ నేపధ్యంలో రంధ్రాల్లోని మట్టి రాలిపోతున్నట్లు, అక్కడక్కడ సిమెంటు గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. పటిష్టతపై లేఖ రాశాం.. ఇరిగేషన్ డిప్యూటీ ఇఇ జగన్నాథం: ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 0.07 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. నీళ్లు లేకపోవడం వల్ల ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయిన నేపథ్యంలో ప్రాజెక్టు పటిష్టతను పరిశీలించాలని కోరుతూ గేట్ డివిజన్ జనరల్ సూపరింటెండెంట్ గోవింద్‌కు లేఖ రాశాం. మార్చి తర్వాత హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా యంత్రాలను తెప్పించి, వాటి సహాయంతో ప్రాజెక్టు గేట్లు ఇతర నిర్మాణాల పటిష్టతను పశీలించి నివేదిక రూపొందిస్తారు. అవసరం అనుకుంటే గేట్లు, డ్యాంకు మరమ్మతు చేస్తారు. -
గోదావరి.. గట్టెక్కాలి
♦ గట్టులింగంపల్లిలో భారీ రిజర్వాయర్! ♦ ఖేడ్‌కు వరప్రదాయిని.. ♦ కార్యరూపం దిశగా అడుగులు ♦ 77 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ♦ కేసీఆర్ హామీపై కోటి ఆశలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నారాయణఖేడ్ ఉప సంగ్రామం ముగిసింది. ఎమ్మెల్యేగా అధికార పార్టీకి చెందిన వ్యక్తే విజయం సాధించారు. ఇప్పుడిక నాటి ఎన్నికల ప్రచారసభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘హామీ’యే సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ‘గోదావరి జలాలు తెచ్చి ‘ఖేడ్’ ప్రజల కాళ్లు కడుగుతా.. తాగు, సాగునీటి సమస్య లేకుండా చేస్తా’ అని కేసీఆర్ చేసిన ప్రకటనపై ఆసక్తి నెలకొంది. ఖేడ్ నియోజకవర్గాన్ని ఏళ్లకేళ్లుగా దుర్భిక్షం పట్టిపీడిస్తోంది. సీఎం ప్రకటనతోనైనా తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయని ఇక్కడి ప్రజలు ఆశ పెట్టుకున్నారు. నీళ్ల కోసం ఇక్కడి జనం బాధలు అన్నీ ఇన్నీకావు.. చిన్నారులు సైతం బడి మానేసి నీటి బాట పడుతున్నారు. పొద్దంతా పడిగాపులు కాసినా మూడు బిందెలు కూడా దొరకని దుస్థితి. ఇలాంటి ఖేడ్ నియోజకవర్గానికి అపర సంజీవినిగా మారబోతున్నది ‘గట్టులింగంపల్లి’.. గట్టులింగంపల్లి పెద్ద రిజర్వాయర్‌గా రూపుదిద్దుకోబోతోంది. నారాయణఖేడ్‌కు వర ప్రదాయినిగా మారబోతోంది. అంతా అనుకున్నట్టుగా సాగితే మంజీర నదిపై నిజాం రాజులు కట్టిన ఘణపురం ఆనకట్ట కంటేగట్టు లింగంపల్లి రిజర్వాయర్ పెద్దదిగా అవతరించనున్నది. మనూరు, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట మండలాల్లో దాదాపు 77 వేల ఎకరాలను సాగు నీరు అందించే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనికి కేంద్ర పాలక సంస్థ ‘వ్యాస్కోప్’ డిజైన్ రూపొందించే పనిలో పడింది. ఇదే ప్రణాళిక.... సింగూరు ప్రాజెక్టు బ్యాక్ జలాలు మనూరు మండలానికి తాకుతాయి. ఈ జలాలు సముద్ర మాట్టానికి 517 నుంచి 520 మీటర్ల ఎత్తులో ఉంటాయి. మంజీరకు కేవలం 1.5 కిలో మీటర్ల దూరంలోనే గట్టు లింగంపల్లి ఉంది. నాలుగు దిక్కులా కొండలు కలిగి సహజ సిద్ధంగా ఏర్పడిన రిజర్వాయర్. తూర్పునకు బుడ్డగట్టు, మడగట్టు, పడమరకు రానాపురం గట్టు ,దక్షిణం వైపునకు దూద్గొండ, ఉత్తరం దిక్కున ఊరగట్టులున్నాయి. ఈ కొండల నడుమ విశాలమైన లోతట్టు ప్రాంతం ఉంది. లింగంపల్లి ఊరు వైపున్న బుడ్డగట్టు, మడగట్టు నుంచి ఊరగట్టు వరకు ఆనకట్ట నిర్మించి, లోతట్టు ప్రాంతాన్ని రిజర్వాయర్‌గా చేసే విధంగా రూపకల్పన చేస్తున్నారు. దీనికి దక్షిణం వైపు అంటే దూద్గొండ వెనుక మంజీరా నది ప్రవహిస్తుంది. దూద్గట్ట్టును తవ్వి కాల్వ చేస్తే సింగూరు జలాలు పల్లానికి చేరి రిజర్వాయర్ నిండే విధంగా డిజైనింగ్ రూపొందించారు. ఈ రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం 0.5 టీఎంసీ నుంచి ఒక టీఎంసీ వరకు ఉంటుందని అంచనా.. గట్టు లింగంపల్లి రిజర్వాయర్‌ను మనూరు, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట మండలాలలోని చెరువులకు కాల్వల ద్వారా అనుసంధానం చేస్తారు. వీలును బట్టి మధ్య మధ్యలో చెక్ డ్యాంల నిర్మాణం చేసి వాటి సాధ్యమైనంత ఎక్కువ విస్తీర్ణంలో సాగుకు నీళ్లు అందిస్తారు. నారాయణఖేడ్ మండలంలో రుద్రార్, లింగాపూర్, మద్వార్,హన్మంతరావు పేటమత్తడి, నిజాంపేటలోని మదిరాల చెరువు నిండిన తరువాత మిగులు జలాలు నిజాంసాగర్‌లో కలుస్తాయి. మనూరు మండలం కారముంగి వద్ద ఒక ఎత్తిపోతల ప్రాజెక్టు ఏర్పాటు చేసి దాదాపు 12 గ్రామాలకు సాగు నీరు అందిస్తారు. మరో వైపు ప్రాణహిత చేవెళ్ల నుంచి పెద్దశంకరంపేట మండలంలో దాదాపు 17 వేల ఎకరాలకు సాగు నీరు అందించే విధంగా ప్రణాళిక చేసిన విషయం తెలిసిందే. రైతు రాజే.. ప్రస్తుతం నారాయణఖేడ్ నియోజకవర్గంలో 55 వేల హెక్టార్లలో సాగు భూమి ఉంది. చెరువులు, కుంటలు, వాగులు ద్వారా కేవలం 16 వేల ఎకరాలు మాత్రమే సాగు నీరు అందుతుంది. మనూరు మండలంలో రాతినేలలు, గులక రాళ్లు భూములు, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట మండలాల్లో ఎర్ర నేలలు, నల్లమట్టి నేలలు ఉన్నాయి. నీళ్లుంటే ఈ భూముల్లో వాణిజ్య పంటల నాణ్యమైన విత్తనాలు పండుతాయి. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, పసుపు,అల్లం పంటలు విస్తారంగా పండేందుకు అవకాశం ఉన్న భూములు. ఇప్పటికీ ఇక్కడి రైతులు ఉల్లి, వెల్లుల్లి, శనగ, చెరకు పంటలు పండిస్తున్నారు. కానీ సాగు నీరు లేక 20, 30 ఎకరాలు ఉన్న రైతులు కూడా వలస కూలీలుగానే కాలం గడుపుతున్నారు. పట్టణాలకు వలసపోయి పిల్లలను చదివించుకుంటున్నారు. గట్టు లింగంపల్లి రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతంలో బంగారమే పండుతుంది. గట్టులింగంపల్లికి బీజంపడింది ఇలా.. కొద్ది రోజుల క్రితం మంత్రి హరీశ్‌రావు మనూరు మండలానికి వచ్చినప్పుడు స్థానిక విలేకరులతో ముచ్చటించారు. ఆ సందర్భంలోనే ఈ ప్రాంతానికి ఒక జల ప్రాజెక్టు కావాలని విలేకరులు మంత్రి దృష్టికి తెచ్చారు. ‘మీ ఆశ.. ఆశయం గొప్పది.. కానీ రాళ్లు తేలిన మనూరు మండలానికి ప్రాజెక్టు సాధ్యమయ్యే పనేనా’ అంటూ మంత్రి ఆలోచనలో పడ్డారు. సరిగ్గా అప్పుడే ‘సాక్షి’ మనూరు విలేకరి.. గట్టులింగంపల్లి ‘గుట్టు’ చెప్పారు. అంతే మంత్రి మోములో ఆనందం.. ‘మీరు చెప్పేది నిజమైతే తపస్సు చేసైనా ముఖ్యమంత్రిని ఒప్పిస్తా’ అని మాటిచ్చారు. వెంటనే సెల్ఫోన్లోనే నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ఏకం చేశారు. ‘చలో పోదం పదా.. గట్టు లింగంపల్లికి’అంటూ పయనమయ్యారు. ఇది గత సెప్టెంబ ర్లో జరిగిన సంఘటన. ఆ వెంటనే ఆయన సీఎం చేత ఏకంగా ప్రకటన చేయించారు. ఇప్పడది కార్యరూపం దాల్చబోతున్నది. గట్టు లింగంపల్లి ఒక పరిష్కారం గట్టు లింగంపల్లి సహజసిద్ధంగా ఏర్పడిన రిజర్వాయర్. 60 ఏళ్ల నుంచి పాలిస్తున్న నాయకులు దీని గురించి ఎందుకు ఆలోచన చేయలేదో నాకు అర్థం కావటం లేదు. నారాయణఖేడ్ ప్రాంతానికి అత్యవసరంగా సాగు, తాగు నీళ్లు అవసరం. దీనికి గట్టు లింగంపల్లి రిజర్వాయర్ ఒక పరిష్కారం చూపెడుతుంది. దీని డిజైనింగ్ ప్రస్తుతం ‘వ్యాస్కోప్’ రూపొందిస్తోంది. మనూరు, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట మండలాలకు కనీసం 77 వేల ఎకరాల్లో సాగు నీరు అందిస్తుందని అంచనా వేస్తున్నాం. నిజానికి ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణం సాగులోకి తెచ్చే ప్రయత్నం. ఈ రిజర్వాయర్ ద్వారా గొలుసుకట్టు చెరువును నింపుకుంటూ వెళ్తే సాధ్యమైనన్ని ఎక్కువ గ్రామాలకు నీళ్లు అందుతాయి. ఈ రిజర్వాయర్ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. - భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెరువు నీళ్లు అడిగితే తలలు పగులగొట్టిండ్రు గట్టు లింగంపల్లి చెరువు కట్ట వేస్తేనే ఓటేస్తం అని చెప్పినందుకు జనాన్ని తీసుకొచ్చి ఊరుమీదపడి తలలు పగలగొట్టిండ్రు. పోలీసులకు చెప్పి కేసులు పెట్టిండ్రు. మక్కెలు ఇరుగ తన్నిచ్చిండ్రు. ఇక అప్పటి నుంచి చెరువు మాటే ఎత్తలే. -గొట్టం రాములు పగిడిపల్లి కరువు తీరుద్ది రెండు దినాలు పోతే జీవాలకు కూడా నీళ్లు దొరకవు. దెబ్బలకు బయపడి సెరువు అడుగుడు సార్ధారిచ్చుకున్నాం.. హరీశ్ వచ్చి తలాబ్ కట్టిత్తం అన్నడు. ఊరగట్టు నుంచి బుడ్డ గట్టు దాక కట్టిస్తా అంటుండు...సూడాలే ఎట్టయిద్దో.. తలాబ్ కడితే కరువు దీరుద్ది. - నర్సుగొండ, పగిడిపల్లి -
రిజర్వాయర్‌లో పడి విద్యార్థి మృతి
-
అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు
నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి రిజర్వాయర్ లో శవమై తేలిన ఘటన అనంతపురం జిల్లా లో జరిగింది. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మండలం కాపర్లపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. కాగా.. శనివారం రోజు జీడిపల్లి రిజర్వాయర్ లో మృతి చెంది కనిపించాడు. మృతుడిని గ్రామానికి చెందిన ఎర్రస్వామి(45)గా గుర్తించారు. మృతుడిని గుర్తు తెలియని దుండగులు హతమార్చి.. గోనెసంచిలో పెట్టి జీడిపల్లి రిజర్వాయర్ లో పడేశారు. నీటిలో గోనె సంచి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. మృతుడి హత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
ఏడుకొండలపై నీటికి కోటా
తిరుమల గోవిందుని సన్నిధిలో తాగడానికి గుక్కెడు నీళ్లు కరువైపోయాయి. కొండమీద తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తాగునీటి జలాశయాలు ఎండిపోయాయి. ఉన్న నీటితో రెండు బ్రహ్మోత్సవాలు నెట్టుకొచ్చిన టీటీడీకి భవిష్యత్‌పై నీటి కష్టం ఎదురవుతోంది. కొండమీద పెరిగిన నీటి పొదుపు చర్యలు తీవ్ర నీటి ఎద్దడి కారణంగా తిరుమల కొండ మీద టీటీడీ నీటి పొదుపు చర్యలు చేపట్టింది.ఆలయం, అన్నప్రసాద కేంద్రం మినహాయించి మిగిలిన చోట్ల సుమారు 40 శాతం కోత విధించారు. 30 మఠాలు, 20 దాకా పెద్ద హోటళ్లు, మరో 50 హోటళ్లకు సరఫరాలోనూ పొదుపు చర్యల్ని తీవ్రం చేశారు. దీంతో తిరుపతి నుంచి ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్‌లో కూడా పది రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. కాటేజీల్లోని నీటి కొళాయిల సరఫరాలోనూ కోత విధించారు. ఆరుబయట కొన్ని తాగునీటి కొళాయిల్ని మూసివేశారు. ఆరుబయట రోడ్లకు ఇరువైపులా ఉండే మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో కొన్ని మూసివేశారు. నీరు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. అడుగంటి ప్రధాన జలాశయాలు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతోపాటు ఆలయ అవసరాల కోసం 32 లక్షల గ్యాలన్లు నీరు అవసరం. ఏటా కొండమీద శేషాచలం అడవుల్లో 1,369 మి.మీ.వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈ యేడు అందులో సగం కూడా పడలేదు. దీంతో తాగునీరు సరఫరా చేసే గోగర్భం ( 2,840 లక్షల గ్యాలన్ల సామర్థ్యం), ఆకాశ గంగ (670 లక్షల గ్యాలన్లు), పాపవినాశనం (5,240 లక్షల గ్యాలన్లు), కుమారధార(3,224 లక్షల గ్యాలన్లు), పసుపుధార (886.70 లక్షల గ్యాలన్ల) ఎండిపోయాయి. ఈ ప్రాజెక్టుల్లో అడుగంటిన బురద నీరు కనిపిస్తోంది. గంగ, బోర్ల నీటితో నెట్టుకొస్తున్న టీటీడీ తిరుమల అవసరాల కోసం రోజూ 7 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పెర్ డే) తెలుగుగంగ నీటిని సరఫరా చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం రోజూ 10 ఎంఎల్డీ (22.5 లక్షల గ్యాలన్లు) తెలుగుగంగ నీటిని సరఫరా చేయాల్సి ఉన్నా అది అమలు కావటం లేదు. దీనిపై ప్రభుత్వంతో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు చర్చలు జరుపుతూ తెలుగుగంగ కోటాను పెంచే చర్యలు చేపట్టారు. దీంతోపాటు కల్యాణిడ్యామ్లో వేసిన బోర్ల ద్వారా మరికొంత నీటిని సేకరిస్తున్నారు. గతంలో ఇక్కడ వేసిన 25 బోర్లలో 13 ఎండిపోయాయి. వర్షంపై టీటీడీ గంపెడాశ నైరుతి రుతుపవనాలు మొహం చాటేయగా, ఈశాన్య రుతుపవనాలపై టీటీడీ గంపెడాశతో ఉంది. ఈనెల 11వ తేది నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసంలో తిరుమలలో వర్షం కురిసే అవకాశం ఉందని టీటీడీ వాటర్‌వర్క్స్ ఇంజనీరు నర సింహమూర్తి తెలిపారు. ఆ మేరకు వర్షాలు పడకుంటే తిరుమల భక్తులకు తాగునీటి కష్టాలు మరింతగా పెరిగే ప్రమాదముంది. -
మైలవరం జలాశయం నుంచి నీళ్లు విడుదల
వైఎస్సార్ జిల్లా మైలవరం జలాశయం నుంచి ఉత్తర కాలువకు ఆదివారం నీళ్లు వదిలారు. ఉత్తర కాలువ కింద వేసిన పంటలు ఎండిపోతుండడంతో ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ అధికారులు నీటిని వదిలారు. రోజుకు 150 క్యూసెక్కుల చొప్పున 13 రోజులపాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
848 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం
ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి నీటి మట్టం 848.20 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి జలాశయానికి 4,479 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. డ్యాం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతికి 1,690 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 76.1448 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
రిజర్వాయర్‌లో పడి ఇద్దరు విద్యార్థుల మృతి
చేర్యాల(వరంగల్): రిజర్వాయర్‌ను చూడటానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ జిల్లా చేర్యాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎల్లాయపల్లికి సమీపంలోని విజయలక్ష్మి మెమోరియల్ పాఠశాల పీఈటీ 19 మంది విద్యార్థులను తిగుళ్లనర్సాపూర్లో జరుగుతున్న పాఠశాలల క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకెళ్లారు. అనంతరం వారంతా కలసి సమీపంలోని వరంగల్ జిల్లా టపాస్‌పల్లి జలాశయం వద్దకు వెళ్లారు. మొత్తం అయిదుగురు విద్యార్థులు నీళ్లలోకి దిగగా అదుపుతప్పి మునిగిపోయారు. వారిలో రంగస్వామి అనే విద్యార్థికి ఈదటం వచ్చు. అతడు ఇద్దరు విద్యార్థులను ఒడ్డుకు లాగగా ప్రవీణ్, నత్తలి అనే వారు మాత్రం మునిగిపోయారు. సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో ఒకరి మృతదేహాన్ని గత ఈతగాళ్లు వెలికి తీశారు. పవీణ్ స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా నేరడుగొండ కాగా, నత్తలిది రంగారెడ్డి జిల్లా కత్బుల్లాపూర్ గ్రామం. -
'ఇంటికో ఉద్యోగం ఇస్తే భూములు ఇస్తాం'
గోపాలపేట (మహబూబ్‌నగర్) : ఇంటికో ఉద్యోగం, ఎకరానికి రూ.15 లక్షలు ఇస్తేనే భూ సేకరణకు సహకరిస్తామని పాలమూరు ప్రాంత రైతులు అంటున్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా గోపాల పేట మండలంలో రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. ఇంటికో ఉద్యోగం, ఎకరానికి రూ. 15 లక్షలు, ఇల్లు కోల్పోతున్న వారికి కొత్త గృహం మంజూరు చేస్తేనే భూములు ఇస్తామని రైతులు పేర్కొన్నారు. -
అయ్యో ‘శ్రీరామా..’!
►ఎడారిని తలపిస్తున్న ఎస్సారెస్పీ ► 8.26 టీఎంసీలకు పడిపోయిన నిల్వ ►ఇంత దారుణ పరిస్థితులు ఎన్నడూ లేవంటున్న అధికారులు ►వర్షాల్లేక ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్‌కు చేరని నీరు ►ఉత్తర తెలంగాణ జిల్లాలపై తీవ్ర ప్రభావం ► ప్రశ్నార్థకంగా 17.85 లక్షల ఎకరాల ఆయకట్టు ► తాగునీటి పథకాలపైనా ప్రభావం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎండిపోతోంది! నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు నల్లగొండకు సైతం సాగునీరు అందించే ప్రాజెక్ట్ వెలవెలబోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్ట్ నీటి నిల్వ 8.26 టీంఎసీలకు పడిపోయింది. ఎంతటి వర్షాభావ పరిస్థితులు తలెత్తినా.. ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ ఇంతలా తగ్గిపోయిన దాఖలాల్లేవు. ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ సహా 11 ప్రాజెక్టులు వరద నీటికి అడ్డంకిగా మారాయి. ఎస్సారెస్పీపై ఆరు జిల్లాల్లో 17,85,605 ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉండగా, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో రక్షిత మంచినీటి పథకాలకు ఈ ప్రాజెక్ట్ నీరే ఆధారం. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్ట్ ఎడారిని తలపిస్తోంది. ప్రశ్నార్థకంలో ఆయకట్టు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరితే తెలంగాణలో 18.82 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలమవుతుంది. ప్రాజెక్ట్‌లో నీరు లేక పోతే ఆ భూములు బీళ్లుగా మారే ప్రమాదం ఉంది. నిజామాబాద్ జిల్లాలో 1,60,578 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 1,45,387, వరంగల్‌లో 4,71,478, కరీంనగర్లో 6,72,900, ఖమ్మంలో 1,28,914, నల్లగొండలో 2,87,508 ఎకరాలకు ఎస్సారెస్పీ ద్వారా నీరందుతోంది. అలాగే నిజామాబాద్‌లో 19 ఎత్తిపోతల పథకాలకు, ఆదిలాబాద్ జిల్లాలో 19 ముంపు గ్రామాల ఎత్తిపోతలకు నీరు ఉపయోగపడుతోంది. ఈ సంవత్సరం ఆయకట్టు పడావు పడనుండగా.. ఎత్తిపోతలు ఉత్తిపోతలుగానే మారే ప్రమాదం నెలకొంది. పడిపోతున్న నిల్వ సామర్థ్యం ప్రాజెక్టులో పూడిక ఎక్కువగా పేరుకు పోయిందని సర్వేలు చెబుతున్నా.. ఇంతవరకు ఎవరూ పట్టించుకోవడం లేదు. 1978లో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాగానే సర్వే చేపట్టగా.. 112 టీఎంసీల నీటి సామర్థ్యం ఉందని తెలిపారు. 1994లో చేపట్టిన సర్వేలో నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయినట్లు తేలింది. 2006లో సర్వే చేపట్టగా.. నీటి సామర్థ్యం 78 టీఎంసీలకు పడిపోయినట్లు వెల్లడైంది. అయితే ప్రాజెక్ట్ అధికారులు ఈ సర్వేను కొట్టి పారేశారు. 2013, 2014లో ఏపీఈఆర్‌ఎల్ సర్వే చేపట్టినా నివేదిక ఇంకా గుట్టుగానే ఉంది. ఈ నివేదిక వెల్లడైతే శ్రీరాంసాగర్‌లో ప్రాజెక్ట్ వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం, నీటి నిల్వల వివరాలు బట్టబయలు కానున్నాయి. తాగునీరూ కష్టమే.. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 (90 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1,053.60 (8.26 టీఎంసీల) అడుగులే ఉంది. ఇటీవల రెండు రోజులు భారీగా వర్షాలు కురిసినా వరద నీరు 10-15 వేల క్యూసెక్కులను మించి రాలేదు. భవిష్యత్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని కూడా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కింద ఆరు జిల్లాల్లో స్థిరీకరించిన 17.85 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ప్రాజెక్ట్‌లో 5 టీఎంసీలు డెడ్‌స్టోరేజీకే సరిపోతోంది. ఎండ వల్ల ఆవిరి, లీకేజీలు కలుపుకుంటే ఏడాదికి 5 టీఎంసీలు పోతుంది. ప్రస్తుతం 8.26 టీఎంసీలే ఉండటంతో ఆ నీటితో ఆయకట్టుకు నీరందించడం కుదరదు. కనీసం తాగునీటి అవసరాలు కూడా గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై ఆధారిత ప్రాజెక్ట్‌లు, ఆయకట్టు వివరాలు.. పథకం ఎకరాల్లో శ్రీరాంసాగర్ ఒకటో దశ 9,68,640 శ్రీరాంసాగర్ రెండో దశ 4,40,000 ఇందిరమ్మ వరద కాలువ 2,20,000 సదర్మట్ ఆనకట్ట 12,000 కడెం ప్రాజెక్ట్ 68,000 అలీసాగర్ ఎత్తిపోతలు ---- గుత్ప ఎత్తిపోతలు ---- హన్మంతరెడ్డి పథకం 11,600 నిజామాబాద్‌లోని 14 ఎత్తిపోతలు 34,948 ఆదిలాబాద్‌లోని 19 ఎత్తిపోతలు 30,417 మొత్తం 17,85,605 ఎస్సారెస్పీ నీటి నిల్వ సంవత్సరాల వారీగా.. (ప్రస్తుత సమయూనికి) సంవత్సరం నిల్వ(టీఎంసీల్లో) 2010 71.65 2011 57.72 2012 12.72 2103 90 2014 23.5 2015 8.26 -
పనులు అడ్డుకుంటే నిర్వాసితులకే నష్టం
ఎల్.ఎన్.పేట: వంశధార రిజర్వాయర్ పనులను పోలీసు బందోబస్తు మధ్య కొనసాగిస్తాం, పనులు అడ్డుకోవాలని చూస్తే నిర్వాసితులకే నష్టం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్నారు. మండలంలోని శ్యామలాపురం వద్ద జరుగుతున్న వంశధార రిజర్వాయర్ పునరావాస కాలనీ నిర్మాణం పనులను ఆయన బుధవారం పరిశీలించారు. రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలని నిర్వాసితులు ఆందోళన చేయడంలో తప్పులేదన్నారు. అయితే, ప్రభుత్వ పరంగా రావాల్సిన నష్టపరిహారం అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. శ్యామలాపురం పునరావాస కాలనీలో తాగునీటి, విద్యుత్ సౌకర్యాల కల్పనకు కృషిచేస్తామన్నారు. కాలనీలో ప్లాట్లు లోతట్టుగా ఉన్నాయని, ఎత్తు చేసేందుకు మట్టితరలిస్తామన్నారు. కాలనీకి దిగువున ఉన్న భద్రకాళి సాగరం చెరువుకు సీసీ రక్షణ గోడ నిర్మాణం కంటే మట్టితో గట్టువేసుకుని గట్టుని పార్కులా మొక్కలతో తయారు చేయాలన్నారు. మూడు నెలల్లో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామన్నారు. కాలనీకి ఆనుకుని ఏబీ రోడ్డువైపున ఉన్న భూముల సేకరించవద్దని అక్కడి రైతులు జేసీకి విన్నవించారు. తమ భూములన్నీ వంశధార కుడి ప్రధాన కాలువకు, ప్రస్తుతం నిర్మిస్తున్న పునరావాస కాలనీకి, ైెహ లెవల్ కాలువ కోసం సేకరించారని, ఉన్న కొద్దిపాటి భూములే మాకు ఆధారమంటూ రైతులు బి.వెంకటేష్, సింహాచలం, చంద్రరావు తదితరులు గోడు వినిపించారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించండి... ఆమదాలవలస: హిరమండలం మండలం తులగాం నిర్వాసితులు 73 కుటుంబాలకు మండలంలోని జొన్నవలస సమీపంలో ఇళ్లపట్టాలు అందించారు. రోడ్డు నిర్మించకపోవడంతో ఇక్కడ ఒక్క ఇల్లుకూడా నిర్మించలేదు. ఈ స్థలానికి వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని, నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని జేసీ వివేక్‌యాదవ్ స్థానిక అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూమిని ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడంతో వెంటనే పనులు ప్రారంభించాలని తహశీల్దారు కె.శ్రీరాములకు సూచించారు. కాలనీలో ఇళ్ల నిర్మాణం మ్యాప్‌ను పరి శీలించారు. పనులు వేగవంతం చేయాలి కొత్తూరు: కర్లెమ్మ పంచాయతీ పరిధి మహసింగిగూడ సమీపంలో నిర్మిస్తున్న పునరావస కాలనీ పనులను వేగవంతం చేయాలని జేసీ వివేక్‌యాదవ్ స్థానిక అధికారులను ఆదేశించారు. పునరావాస కాలనీలో నిర్మించిన పాఠశాల, పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్రం, పాలకేంద్రంతో పాటు పలు నిర్మాణాలను పరిశీలించారు. కాలనీలో ఇంత వరకు ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలను సేకరించి నిర్వాసితులకు పట్టాలు అందజేయాలని తహశీల్దార్ దదిరావు చంద్రశేఖర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు సాల్మన్‌రాజ్, దయానిధి, వంశధార ఈఈ ఎం.ఎ.సీతారాం నాయుడు, డీఈ కె.బ్రహ్మానందం, ఎల్.ఎన్.పేటతహశీల్దారు ఎన్.ఎం.ఎన్.వి.రమణమూర్తి, ఏఈఈ పి.రంజిత్ జేఈలు ఎం.కపిల్, ఎస్.హరీష్, మహేష్, ఆర్ఐలు ఎ.జగదీష్‌బాబు, కూర్మారావు, రామచంద్రరావు, వీర్వో కృష్ణచంద్రపట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆల్మట్టికి భారీగా వరద నీరు...
జూరాల : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌కు శనివారం భారీస్థాయిలో వరదనీరు చేరింది. ఒక్కరోజే లక్ష క్యూసెక్కులకు పైగా నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 1,705 అడుగులుండగా శనివారంనాటికి 1,682.6 అడుగులకు చేరింది. మరో 18 అడుగులకు నీటి నిల్వ చేరితే ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న నారాయణపూర్‌కు.. అక్కడి నుంచి మన రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు కృష్ణానది వరద వచ్చే అవకాశం ఉంది. మరో పదిరోజుల్లోపే కృష్ణానది వరద జూరాలకు చేరే అవకాశం ఉండడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకెత్తాయి. ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌కు భారీస్థాయిలో ఇన్‌ఫ్లో వస్తుండటంతోప్రాజెక్టు నుంచి మొదటిసారిగా 4,167 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్‌కు 786 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.30 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 80 క్యూసెక్కు వస్తుండగా తాగునీటి అవసరాల కొరకు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 100 క్యూసెక్కును దిగువకు విడుదల చేస్తున్నారు. -
ఈ ఏడాదిలోనే గండికోటకు నీరు
సీఎం చంద్రబాబు వెల్లడి కోవెలకుంట్ల/అవుకు: కర్నూలు జిల్లా శ్రీశైలం నుంచి వైఎస్సార్ జిల్లా గండికోట వరకు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తిచేసి ఈ ఏడాదిలోనే గండికోట రిజర్వాయర్‌కు నీరందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. జలదీక్షలో భాగంగా బుధవారం రాత్రి కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్వద్ద సీఎం.. ప్రాజెక్టు నిద్ర చేశారు. గురువారం ఉదయం రిజర్వాయర్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. గండికోట నుంచి సర్వరాయసాగర్, చిత్రావతి రిజర్వాయర్.. పులివెందుల వరకు నీటిని తీసుకెళతామన్నారు. శ్రీశైలం జలాశయంలోని నీటిని విద్యుదుత్పత్తికి వాడుకునేందుకు తెలంగాణకి హక్కుందని, అయితే ఆ విద్యుత్‌ను ఏపీ నుంచి ఇచ్చి ఆ నీటిని రాయలసీమకు మళ్లిస్తామని వెల్లడించారు. 3 నుంచి డ్వాక్రా రుణమాఫీ ఒంగోలు, సాక్షి ప్రతినిధి: వచ్చేనెల 3 నుంచి 7 వరకు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయనున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ మేరకు దోర్నాలలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. దీనికిముందు వెలిగొండ టన్నెల్‌ను ఆయన సందర్శించారు. రూ.వెయ్యి కోట్లు కేటాయించండి: సీఎంకి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి ప్రకాశం జిల్లాలో కరువును శాశ్వతంగా నివారించే వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు కేటాయించాలని మార్కాపురం, యర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజులు సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు. సీఎంను కలసి వినతి పత్రం ఇచ్చారు. సీఎం సభలో ఎమ్మార్పీఎస్ నిరసన ఎస్సీ వర్గీకరణను తక్షణమే చేపట్టాలంటూ.. ఎమ్మార్పీఎస్ నాయకులు.. దోర్నాల బహిరంగసభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో కొంతసేపు అలజడి రేగింది. సీఎం మాట్లాడుతూ.. ఇలాంటి సభల్లో ఎవరో ఒకరు గలాభా చేయడం సాధారణమేనన్నారు. ఆగస్టు నెలాఖరుకు నీళ్లు వెళ్లాల్సిందే ఏలూరు: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసి ఆగస్టు నెలాఖరు నాటికి గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో అధికారులతో సమీక్ష జరిపారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
చిన్నమండెం (వైఎస్ఆర్ జిల్లా): వైఎస్ఆర్ జిల్లా చిన్నమండెం మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీలో నిర్మాణ పనులు జరుపుకుంటున్న శ్రీనివాసపురం(మండిపల్లి నాగిరెడ్డి) జలాశయంలో మునిగి ఓ బాలిక మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరాంనగర్ కాలనీ నుంచి జీవనోపాధి కోసం తిరుపతికి వెళ్లిన ఇడగొట్టు ఆంజనేయులు, మల్లారిల కుమార్తె సుజాత(12), కుమారుడు శ్రీనివాసులు(9)లు వారం రోజుల క్రితం వేసవి సెలవులకు సొంత ఊరు శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న నాన్నమ్మ వీరనాగమ్మ దగ్గరకు వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం వీరనాగమ్మ బేల్దారి పనులకు రాయచోటికి వెళ్లగా, మరో నలుగురు స్నేహితులు శంకర్, మీనా, మల్లిక, శ్రీనులతో కలిసి సుజాత శ్రీనివాసపురం రిజర్వాయర్‌లోకి ఈతకు వెల్లింది. అయితే ఈతకు వెళ్లిన ఐదుగురికి కూడా ఈత రాకపోవడంతో అక్కడ జరిగిన ప్రమాదంతో సుజాత నీటిలో మునిగిపోయింది, దీంతో మిగిలిన వారు గట్టుపైకి వచ్చి అరుపులుపెట్టారు. అది గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని మునిగిపోయిన సుజాతను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే సుజాత మృతిచెందినట్లు వారు గుర్తించారు. విషయం తెలుసుకున్న నాన్నమ్మ వీరనాగమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరైంది. సుజాత మృతదేహాన్ని స్థానికుల సహాయంతో స్వగ్రామం శ్రీరాంనగర్ కాలనీకి తీసుకొచ్చారు. తిరుపతిలో ఉన్న సుజాత తల్లిదండ్రులకు విషయం తెలిపారు. చిన్నారి బాలిక అనుకోని విధంగా మృతి చెందటంతో కాలనీ వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. విఆర్ఓ శ్రీనునాయక్ అక్కడికి చేరుకుని సుజాత మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే పేద కుటుంబం కావడంతో సుజాతను తిరుపతిలోని ఎంఆర్ పల్లి జడ్పీ హైస్కూల్లో చేర్చినట్లు సమీప బంధువులు తెలిపారు. సుజాత 7వ తరగతి పూర్తి చేసుకుని, వచ్చే విద్యా సంవత్సరంలో 8వ తరగతిలో చేరాల్సి ఉంది. -
ఈసారీ నిరాశే!
- హడావిడిగా ముఖ్యమంత్రి పర్యటన - పెంటావాలెంట్ టీకా ప్రారంభించిన సీఎం - కేవీ పల్లెలో అడవిపల్లె రిజర్వాయర్ సందర్శన - 25 నిమిషాల్లోనే ముగిసిన పర్యటన - హంద్రీ-నీవా కాలువ పనులపై ఏరియల్ సర్వే - రైతులు, కార్మికులకు ఒరిగిందేమీ లేదు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముఖ్యమంత్రి గురువారం జిల్లాలో బిజీబిజీగా గడిపారు. జిల్లాలో నెలకొన్న కరువు, తాగు, సాగునీటి సమస్యలపై పరిష్కార మార్గం చూపుతారని భా వించిన ప్రజలకు ఈసారి నిరాశే ఎదురైంది. ఇక్కడ నెలకొన్న పరిస్థితులపై ముందే అవగాహనతో వచ్చిన ఆయన ఎక్కడా తొందర పాటుతో హామీలు గుప్పించకపోవడం గమనార్హం. సీఎం పర్యటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతు, కార్మిక, పేద వర్గాల ఆశలపై మరోసారి ఆయన నీళ్లు చల్లారు. పర్యటన ఆసాంతం మొక్కుబడిగానే సాగింది. ఎక్కడికక్కడ సమస్యలపై విన్నవించాలని జనం పెద్ద సంఖ్యలో వేచి ఉన్నప్పటికీ అవకాశం మాత్రం లభించలేదు. తొలుత సీఎం విశాఖపట్నం నుంచి ప్రత్యే క విమానంలో వచ్చిన 11.30 గంటల ప్రాంతంలో పద్మావతి మహిళా యూనివర్సిటీకి చేరుకున్నారు. అక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో నీటి సమస్యపైన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిలదీశారు. అనంతరం యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకున్న సీఎం పెంటావాలెంట్ టీకాను లాంఛనంగా ప్రారంభిం చారు. ఇద్దరు చిన్నారులకు ఆయన టీకాలు మంత్రితో వేయించారు. శిశు, గర్భిణుల మరణాలను తగ్గిం చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైద్యం కోసం అవసరమైన అన్ని వసతులను సమకూరుస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి నుంచి యాదిమరి మండలంలోని అమరరాజా కర్మాగారానికి చేరుకున్నారు. అక్కడ గ్రోత్ కారిడార్ పైలాన్‌ను ఆవిష్కరించారు. తాగు, సాగు నీటి పరిష్కారానికి హంద్రీ-నీవా ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. అది తప్ప జిల్లాలో కరువు రైతులను ఆదుకోవడం, తాగునీటి సమస్య పరిష్కార మార్గాలను మాత్రం చూపలేదు. మొక్కుబడిగా ప్రతిసారీ చెప్పే మాటలనే ఈ మారు చెప్పి తంతు ముగించారు. మధ్యాహ్నం 2.30కి యాదమరి మండలం నుంచి కేవీపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్‌ను సం దర్శించారు. అక్కడ ప్రాజెక్ట్‌కు సంబంధించి నీటి నిల్వ పెంచే విషయమై అటవీ, నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. అయితే సీఎం రైతులతో ముఖాము ఖి సమావేశం జరుపుతారని అధికారులు హెలిప్యాడ్ వద్ద చర్చా వేదికను ఏర్పాటు చేశారు. సమయం లేదంటూ 25 నిమిషాల్లోనే సమావేశాన్ని ముగించి కురబలకోట మండలం అంగళ్లుకు ప్రయాణమయ్యారు. రైతులను అక్కడికే రావాలని సూచించారు. దీంతో రైతుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. కురబలకోట మండలం అంగళ్లులో ఏర్పాటుచేసిన రైతు సదస్సులో ప్రసంగించారు. మరోసారి పట్టిసీమ జపాన్ని జపించారు. ఇక్కడ రైతులతో సమావేశాన్ని జరుపుతామని చెప్పినప్పటికీ మొక్కుబడిగా ఏదో నలుగురు రైతులతో మాట్లాడి పంపించేవారు. అన్నదాతల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించింది ఏమీ లేదు. హంద్రీ-నీవా కాలువ పనులకు సంబంధించి ఏరియల్ సర్వే చేయడంతోపాటు పనుల పురోభివృద్ధిపై అధికారులతో చర్చించారు. మొత్తం మీద జిల్లాలో సీఎం పర్యటన అధికారుల హడావిడిగా సాగడం తప్ప, ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు. -
తోటపల్లి రిజర్వాయర్ టెండర్ రద్దు
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం, తోటపల్లి గ్రామం వద్ద నిర్మించదలచిన ఓగులాపూర్ రిజర్వాయర్ పనుల టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రిజర్వాయర్‌కు అనుబంధంగా ఉన్న మోహిడి మేడువాగు, ఎల్లమ్మ వాగు పనులను సైతం నిలిపివేయాలని నిర్ణయించి గురువారం నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. అంచనా వ్యయానికి 18 శాతం తక్కువకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేసేందుకు నిరాకరించడంతో ఏడేళ్లుగా పని ముందుకు కదల్లేదు. టెండర్‌ను రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వరద కాల్వ చీఫ్ ఇంజనీర్ ప్రభుత్వానికి విన్నవించగా, ప్రభుత్వం సమ్మతించింది. -
అనుమతివ్వండి... ప్రాజెక్ట్ కట్టుకుంటాం
బెంగళూరు : కావేరినది కర్ణాటక భూ భాగంలోని మేకెదాటు వద్ద జలాశయం నిర్మించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీని అఖిల పక్షం కోరింది. ఢిల్లీలో గురువారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో అన్ని పార్టీ నాయకులు మోదీని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ఆరోపిస్తున్నట్లు మేకెదాటు వద్ద నిర్మించే జలాశయం వల్ల అందుబాటులోకి వచ్చే నీటిని వ్యవసాయ పనులకు వినియోగించబోమన్నారు. ప్రస్తుతం కేఆర్ఎస్, కబినీ జలాశయాల నుంచి బెంగళూరు నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నామన్నారు. పెరుగుతున్న అవసరాలతో ఈ రెండు జలాశయాల నుంచి వచ్చే నీరు సరిపోవడం లేదన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్‌లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. అందువల్లే మేకెదాటు వద్ద నూతన జలాశయాన్ని నిర్మించాలని భావిస్తున్నామని వివరించారు. అందువల్ల జలాశయ నిర్మాణానికి అవసరమైన అనుమతులను తొందరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రధానిని కలిసిన వారిలో సీఎం సిద్ధరామయ్యతో పాటు కేంద్ర మంత్రులు అనంతకుమార్, డీ.వీ సదానందగౌడ తదితులు ఉన్నారు. -
రాచకట్ట.. కటకట
- పనుల్లో తీవ్ర జాప్యం లక్ష్యానికి దూరంగా - జలాశయం మిషన్ కాకతీయకు - ఎంపిక కాని వైనం - ప్రాధాన్యతను మరిచిన అధికారులు - కాలువల మరమ్మతుకు - కానరాని మోక్షం వినియోగించని నిధులు రూ.15 లక్షలకుపైగా వెనక్కి సీఎం నియోజకవర్గంలోనే ఇంతటి అలక్ష్యం వెల్లువెత్తుతున్న నిరసనలు రాచకట్ట... ఇది గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రధాన రిజర్వాయర్. ప్రవాహానికి నోచుకోకుండానే శిథిలం. జలాశయ ప్రధాన కాలువలు, పిల్ల కాలువల నిర్మాణానికి కానరాని మోక్షం... మరికొన్ని అభివృద్ధి పనుల్లోనూ ఏళ్ల తరబడి జాప్యం... దశాబ్ద కాలంగా ఎదురుచూపుల్లో అన్నదాతలు... కనీసం మిషన్ కాకతీయకూ ఎంపిక కాని వైనం... సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే ఇంతటి నిర్లక్ష్యం... రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నా అధికారుల్లో చలనం శూన్యం. - గజ్వేల్ సాగునీటి కొరతతో తల్లడిల్లుతున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన రాచకట్ట రిజర్వాయర్‌పై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గానికి ప్రధాన ఆధారభూతమైన కుడ్లేరు వాగుపై జగదేవ్‌పూర్ మండలం రాయవరం-తీగుల్ గ్రామాల మధ్య రాచకట్ట జలాశయాన్ని నిర్మించారు. వందలాది ఎకరాలకు ప్రత్యక్షంగా సాగు నీరు అందించడంతోపాటు జగదేవ్‌పూర్, గజ్వేల్, కొండపాక మండలాల్లో వేలాది ఎకరాల్లో భూగర్భ జలాల పెంపు లక్షయంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. నాబార్డు ద్వారా రూ.394.40 లక్షలతో 2003-04 సంవత్సరంలో పనులు చేపట్టి 2005 ఆగస్టు 19న పూర్తి చేశారు. రిజర్వాయర్ కుడి కాలువ కింద 700 ఎకరాలు, ఎడమ కాలువ కింద 860 ఎకరాల భూములకు ఆరుతడి పంటలకు సాగు నీరందించాలని లక్ష ్యంగా పెట్టుకున్నారు. కుడి కాలువ ద్వారా రాయవరం, కొడకండ్ల, తిప్పారం, ఎడమ కాలువ ద్వారా హవాయిగూడా, దాత్తర్‌పల్లి, రిమ్మనగూడ, బూర్గుపల్లి గ్రామాలకు ప్రయోజనం కలిగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్టు మీదుగా వెళ్లే కుడి, ఎడమ కాలువల నిర్మాణ పనులు 80 శాతం పూర్తయినా మిగతా 20 శాతం పనుల్లో జాప్యం నెలకొంది. కుడి కాలువ పనులు గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద, ఎడమ కాలువ పనులు రిమ్మనగూడలోని బూర్గుపల్లి రోడ్డువైపు నిలిచిపోయాయి. ఈ కాలువల నిర్మాణం పూర్తయితేనే 1,560 ఎకరాల భూమికి సాగు నీరందే అవకాశముంది. అయితే ఆ పనులు పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క ప్రవాహానికి నోచుకోకుండానే కాలువలు శిథిలమయ్యాయి. నిధులు వెనక్కి... రాచకట్ట రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల నుంచి రైతుల పొలాలకు నీళ్లు మళ్లించేందుకు వీలుగా పిల్ల కాలువలు నిర్మించాలని నాలుగేళ్ల క్రితం భావించారు. ఇందుకుగాను మూడున్నరేళ్ల క్రితం ఉపాధిహామీ ద్వారా రూ.15 లక్షలకుపైగా నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో కూలీలచే పిల్ల కాలువలు నిర్మించాల్సి ఉంది. పనులు చేపట్టడానికి కూలీలు ముందుకు రావడం లేదనే సాకుతో అధికారులు పెండింగ్‌లో పెట్టారు. దీనివల్ల నిధులు వెనక్కి వెళ్లాయి. ఈ క్రమంలో ఏడాది క్రితం రాచకట్ట కాలువల మరమ్మతుకు కలెక్టర్ నిధుల నుంచి మరో రూ.9 లక్షలకుపైగా నిధులు మంజూరయ్యాయి. అయినా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఫలితంగా బీడువారిన పొలాలకు నీరందడం కలగానే మిగిలింది. ‘మిషన్ కాకతీయ’లో తీసుకుంటే ప్రయోజనమే... దశాబ్దం క్రితం నిర్మించిన రాచకట్ట కుడి, ఎడమ కాలువలు ప్రస్తుతం పూర్తిగా శిథిలమయ్యాయి. పూర్తయిన పనులు వదిలి మిగతా పనులు చేపడితే కొద్ది కాలానికే దెబ్బతిని తిరిగి మొదటికొచ్చే ప్రమాదం ఉంది. కాలువలను కాంక్రీట్ దిమ్మెలతో నిర్మిస్తే తప్ప రైతులకు ఉపయోగపడే పరిస్థితి లేదు. ఇందుకోసం వ్యయం అంచనాలను పెంచాల్సి ఉంటుంది. అదే విధంగా రిజర్వాయర్ కట్టను బలోపేతం చేయాల్సి ఉంది. దీంతో రాచకట్ట పూర్తిస్థాయిలో నిండితే రాంనగర్-తీగుల్ గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్డి ఎత్తు తక్కువగా ఉండటంతో రోజుల తరబడి ఈ రెండు గ్రామాల రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లడానికి మార్గం మూసుకుపోతుంది. అందువల్ల ఈ వంతెన ఎత్తు కూడా పెంచాల్సి ఉంది. మరోవైపు కొడకండ్ల వద్ద కాలువల నిర్మాణం కోసం సేకరించిన భూమికి నష్ట పరిహారం ఇవ్వడంలో, పనుల కొనసాగింపులో ఏళ్ల తరబడి జాప్యం నెలకొంది. ఈ పనులను సైతం వెంటనే పూర్తి చేయాల్సి ఉంది. సీఎం చెప్పినా... తన సొంత నియోజకవర్గంలో ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని, ఇందుకోసం ఎన్ని నిధులైనా విడుదల చేస్తానని సీఎం కేసీఆర్ గతేడాది నవంబర్ 30న ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. కానీ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా ‘రాచకట్ట’పై నిర్లక్ష్యం ప్రదర్శించడంతో రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై గజ్వేల్ ఇరిగేషన్ డిప్యూటీ ఈఈలు లక్ష్మీకాంత్, శ్రీనివాసరావులను వివరణ కోరగా... నిజమే ‘మిషన్ కాకతీయ’లో రాచకట్టను చేర్చలేదు. మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
కీలక అడుగు..
దేవరకొండ : నక్కలగండి (డిండి) ఎత్తిపోతల పథకానికి కీలక అడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.6500కోట్లతో తెలంగాణ ప్రభుత్వం సోమవారం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇక..టెండర్లు పిలిచి పనులు చేపట్టడమే తరువాయి. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలోని మిడ్‌డిండి ప్రాజెక్టు వద్ద రిజర్వాయర్ నుంచి నీటిని జిల్లాలోని డిండి ప్రాజెక్టుకు లిఫ్ట్ ద్వారా ఎత్తిపోస్తారు. ఈ మేరకు డిండి ప్రాజెక్టు ఎత్తును మూడు అడుగుల మేర పెంచనున్నారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తం నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టు సాగులోకి వస్తుంది. నల్లగొండ జిల్లాలోని డిండి, చందంపేట, దేవరకొండ, మునుగోడు, రామన్నపేట తదతర మండలాల పరిధిలోని 90వేల ఎకరాలకు సాగునీరందుతుంది. అదే విధంగా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు కృష్ణా జలాలు అందనున్నాయి. పరిపాలన ఆమోదంపట్ల ఎమ్మెల్యే హర్షం నక్కలగండి ఎత్తిపోతల పథకానికి రూ.6500 కోట్లతోతెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతినివ్వడం పట్ల సీపీఐ శాసనసభాపక్షనేత, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ హర్షం ప్రకటించారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ జిల్లా ప్రజల ఆకాంక్షను, ఇక్కడి ప్రజల డిమాండ్లను గౌరవించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, భారీసాగునీటిపారుదలశాఖామంత్రి హరీష్‌రావులు నక్కలగండి ఎత్తిపోతల పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. గతంలో సీపీఐ పోరాటాల ఫలితంగా ప్రజల ఆకాంక్షల ఫలితంగానే నక్కలగండి ఎత్తిపోతల పథకం సాధ్యమైందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చినందున వెంటనే టెండర్లు పిలిచి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆయన కోరారు. -
కేసీకి 2,534 క్యూసెక్కుల నీరు విడుదల
కర్నూలు(అర్బన్) : కర్నూలు-కడప (కేసీ) కాలువ ఆయకట్టుకు శుక్రవారం ఉదయం నుంచి 2,534 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సుంకేసుల జలాశయంలో ఈ నెల 12వ తేదీ నాటికి 1.06 టీఎంసీలకు నీటి మట్టం చేరుకోవడంతో ఆ రోజు నుంచి కేసీ ఆయకట్టుకు నీటి విడుదల ఆగిపోయింది. అయితే తుంగభద్ర డ్యామ్ నుంచి ఈ నెల 9వ తేదీ నుంచి సుంకేసులకు రోజూ 1600 క్యూసెక్కుల నీటిని నీటి పారుదల శాఖ ఎస్ఈ ఆర్ నాగేశ్వరరావు కేసీకి విడుదల చేశారు. కాగా కేసీ ఆయకట్టు కింద వేసిన పంటలను కాపాడేందుకు నీటిని వెంటనే విడుదల చేయాలని ఈ నెల 13న నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య రైతులతో కలిసి ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన విషయం విదితమే. -
‘పాలమూరు’ అంచనాలు పైపైకి
ప్రాజెక్టు తొలిదశ పూర్తికే రూ.15 వేల కోట్ల వ్యయం! అలుగు పునాదిని పెంచాలని, ప్రధాన కాల్వలకు లైనింగ్ చేయాలని సూచించిన సీడీవో ఈ మార్పులతో మరో రూ.500 కోట్ల మేర పెరగనున్న అంచనాలు సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజె క్టు అంచనా వ్యయం మరింత పెరగనుంది. ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేసేందుకే దాదాపు రూ.15 వేల కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్టు అలుగు పునాది (ఫౌండేషన్ లెవల్)ని మరింత కిందకు తీసుకెళ్లాలని, ప్రధాన కాల్వలకు లైనింగ్ చేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ) సూచించిన నేపథ్యంలో వ్యయం పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా మూడు జిల్లాల పరిధిలోని సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం గత జూలై నెలలోనే ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారీకోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీకి రూ.5.73 కోట్లను విడుదల చేసింది. ఈ కాలేజీ తొలిదశ సర్వేను డిసెంబర్లోనే పూర్తి చేసింది. పైప్‌లైన్, ఓపెన్ చానల్, టన్నెల్ అలైన్మెంట్, రిజర్వాయర్ల గుర్తింపు, పంపింగ్ స్టేషన్లు, ముంపు గ్రామాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసింది. దీని ప్రకారం జూరాల నుంచి వరద ఉండే 25 రోజుల్లో 70 టీఎంసీల నీటి తరలింపునకు 5 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, 25 కిలోమీటర్ల మేర టన్నెల్‌ను నిర్మించాలని సూచించింది. ఈ నీటిని 70 టీఎంసీల సామర్థ్యం ఉండే మొదటి రిజర్వాయర్ కోయిల కొండలోకి 170 మీటర్ల ఎత్తునుంచి ఎత్తిపోయాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ ఏర్పాటు చేసే పంపిం గ్ స్టేషన్ వద్ద 160మెగావాట్ల సామర్థ్యం కలిగిన 14 పంపులను ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టు తొలిదశ నిర్మాణ పనులకు సుమారు రూ. 14,950 కోట్ల మేర అవసరం ఉంటుందని అంచనా వేసింది. దీనిపై డిసెంబర్ రెండో వారంలోనే పరిశీలన చేసిన ఆర్థిక శాఖ రూ.14,400 కోట్లకు డీపీఆర్‌ను ఆమోదించి తదుపరి పరిశీలన కోసం సీడీఓకు పంపింది. అన్ని అంశాలను పరిశీలించిన సీడీఓ, ప్రాజెక్టు వద్ద రాళ్లు, మట్టి సామర్థ్యాన్ని బట్టి అలుగు పునాదిని మరింత కిందకు తీసుకెళ్లాలని సూచించింది. దీని కోసం అదనంగా మరో రూ. 60 నుంచి రూ.80 కోట్ల మేర ఖర్చు పెరుగుతుందని అంచనా వే సింది. ప్రధాన కాల్వలకు కాంక్రీట్ లైనింగ్ చేయాలని దీనికి మరో రూ.200 నుంచి రూ.300ల కోట్ల మేర వ్యయం పెరుగుతుందని సీడీఓ పేర్కొన్నట్లుగా తెలిసింది. ఇక వీటితోపాటే రిజర్వాయర్ల వద్ద ఏర్పాటు చేసే పంప్‌హౌస్‌ల నిర్మాణంలోనూ కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లుగా సమాచారం. వీటన్నింటినీ కలుపుకొని అదనంగా రూ.500 కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ అంచనా వస్తోంది. కాగా మరో మూడు, నాలుగు రోజుల్లోనే సీడీఓ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుందని తెలిసింది. అనంతరం ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు, శంకుస్థాపన తదితరాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. -
రిజర్వాయర్, గొట్టపు మార్గం పనుల్లో జాప్యం
‘నిధులు పుష్కలంగా ఉన్నాయి. 2014 మార్చిలోపు నల్లగొండ జిల్లా కోదండపూర్ నుంచి మూడో దశ కృష్ణా జలాలను మహానగరానికి తరలిస్తాం’. 2013 మార్చిలో సాహెబ్‌నగర్ వద్ద పనుల శంకుస్థాపనలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పిన మాట.. ‘మూడో దశ కృష్ణాజలాల పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకముందే డిసెంబర్‌లోపే మహానగరానికి కృష్ణా జలాల్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం’. గత నెల 20న గునుగల్ రిజర్వాయర్ సందర్శనలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు అన్న మాట. ‘కోదండపూర్ నుంచి మహానగరం వరకు అక్కడక్కడా కొన్ని చిన్న చిన్న పనులు, రిజర్వాయర్లలో కూడా పనులు మిగిలున్నాయి. డిసెంబర్‌లోపు నగరానికి కృష్ణా జలాలను తరలించకున్నా.. వచ్చే ఏడాది మార్చిలోపు తప్పనిసరిగా నీటిని తరలిస్తాం’. పనుల పర్యవేక్షణ ఉన్నతాధికారి అంటున్న మాట. ఆ అధికారి అన్న మాటలను బట్టి చూస్తే మూడో దశ కృష్ణా జలాలు డిసెంబరులో మహానగరానికి చేరడం కష్టమేననిపిస్తోంది. మూడో దశ కృష్ణా జలాలను గొట్టపు మార్గం ద్వారా మహానగరానికి అందించడానికి రూ. 1,670 కోట్ల అంచనా వ్యయంతో నగర సమీపంలోని సాహెబ్‌నగర్ వద్ద 2013 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నల్లగొండ జిల్లా కోదండపూర్ నుంచి నగర సమీపంలోని బీఎన్ రెడ్డి (సాహెబ్‌నగర్) నగర్ వరకు 115 కిలోమీటర్ల మేర గోతులు తీసి గొట్టపు మార్గంలో పైపులు బిగించి మహానగరానికి 5.5 టీఎంసీల కృష్ణా జలాలను అందించడమే మూడో దశ లక్ష్యం. రూ.1,670 కోట్లలో గొట్టపు మార్గం పనుల పూర్తికి రూ.943.44 కోట్లు, కోదండపూర్ వద్ద రూ.149 కోట్ల వ్యయంతో నిర్మించే 90 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ధి చేసే ప్లాంట్, రూ. 24 కోట్లతో నర్సర్లపల్లి, గోడుకొండ్ల, గునుగల్ కేంద్రాల వద్ద 99 ఎంఎల్ సామర్థ్యం కలిగిన నీటి జలాశయాలు, రూ.140 కోట్ల వ్యయంతో నీటి శుద్ధి కేంద్రాలు, పంపింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ వ్యవస్థ కోసం అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2013లో ప్రారంభించిన పనులు 2014 మార్చిలోపే పూర్తయి మూడో దశ 5.5 టీఎంసీల కృష్ణా జలాలు మహానగరానికి చేరాల్సి ఉంది. కానీ అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడం, ప్రభుత్వం నుంచి రూ.వందల కోట్ల నిధులు సకాలంలో అందకపోవడం వల్లే పనులు నత్తనడకన సాగుతున్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. మంత్రి పద్మారావు అన్నట్లు గడువు ఇంకా 50 రోజులు ఉంది. ఇప్పటికైనా నిధులు తక్షణమే విడుదల చేస్తే పనులు చకచకా పూర్తి చేయడం సాధ్యమేనని వారు అంటున్నారు. ప్రస్తుతం పనులు పరిస్థితి చూస్తే వచ్చే ఏడాది మార్చి లోపు కూడా పూర్తి స్థాయిలో మహానగరానికి మూడో దశ కృష్ణా జలాలు అందేలా కనిపించడం లేదు. ఇదే విషయమై మూడో దశ పనుల పర్యవేక్షణ చేసే ఓ ఉన్నతాధికారిని సంప్రదించగా డిసెంబర్లో పనులు పూర్తిచేసి కృష్ణాజలాలు నగరానికి అందించేలా చూస్తున్నాం. కానీ వచ్చే ఏడాది మార్చి లోపు మాత్రం కచ్చితంగా సరఫరా చేస్తామనే నమ్మకం తమకు ఉందన్నారు. ఆశలన్నీ మూడో దశపైనే.. ఇబ్రహీంపట్నం డివిజన్ ప్రజలు మూడో దశ కృష్ణాజలాల సరఫరాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ కొన్నేళ్లుగా సాధారణ వర్షపాతం కూడా నమోదు కావడంలేదు. భూగర్భ జలాల నీటి మట్టం 500 అడుగులకు పడిపోయింది. డివిజన్లోని ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, హయత్‌నగర్ మండలాల్లో చాలా గ్రామాల్లో ఇప్పటికే బోరుబావులు పూర్తిగా ఎండిపోయాయి. హయత్‌నగర్ మండలం మినహా మిగతా మూడు మండలాల్లోని 100కుపైగా గ్రామాల్లో ఫ్లోరైడ్ శాతం అత్యధికంగా ఉంది. ఏడేళ్లుగా మూడు మండలాల్లోని 135 గ్రామాలకుపైగా కృష్ణాజలాలు సరఫరా చేస్తున్న ప్రత్యేక సంపులు, ట్యాంకులు లేకపోవడంతో ఫ్లోరైడ్ నీరే దిక్కవుతోంది. డివిజన్లో నిత్యం కోటీ 50 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తే కొంతవరకైనా నీటి ఎద్దడి తప్పుతుంది. గునుగల్ రిజర్వాయర్ నుంచి డివిజన్లోని పలు మండలాలకు నిత్యం 60 నుంచి 70 లక్షల లీటర్ల నీటిని మాత్రమే మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు సరఫరా చేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు యాచారం, ఇబ్రహీంపట్నం, లోయపల్లి, కందుకూరులకు నాలుగు లైన్ల ద్వారా నాలుగు రోజులకోసారి కృష్ణాజలాలను సరఫరా చేస్తున్నారు. మూడో దశ పనులు పూర్తయితేనే ఇబ్రహీంపట్నం ప్రజలకు సరిపడా కృష్ణాజలాలు సరఫరా చేస్తామని గత నెల గునుగల్‌కు వచ్చిన మంత్రి పద్మారావు, మెట్రో వాటర్‌వర్క్స్ అధికారులు హామీ ఇవ్వడంతో ప్రజల్లో ఆశలు రేకెత్తాయి. కరువు పరిస్థితులతో ఇప్పటికే డివిజన్లో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. మార్చిలోపు నీరు అందితేనే ప్రజల నీటి కష్టాలు తీరుతాయని డివిజన్ ఆర్డబ్ల్యూఎస్ డీఈ విజయలక్ష్మి పేర్కొన్నారు. -
హలో.. సీఎం కేసీఆర్‌ను మాట్లాడుతున్న...
* ‘సాక్షి’ఇన్‌బాక్స్ లేఖకు స్పందించిన ముఖ్యమంత్రి * హుజూరాబాద్వాసికి ఫోన్ * మోడల్ చెరువు నిర్మాణంపై హామీ * అధికారుల ఉరుకులు పరుగులు హుజూరాబాద్: ‘‘హలో నేను ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాట్లాడుతున్న... ప్రతాప శాయిరెడ్డి గారూ బాగున్నారా... మీ హుజూరాబాద్‌కు సంబంధించిన మోడల్ చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని ‘సాక్షి’ పత్రికకు రాసిన లేఖను చూశాను. ఈ చెరువు కోసం రూ.60 కోట్లు మొన్ననే కేటాయించినం. ఇంకా పనులు మొదలు పెట్టలే. కచ్చితంగా పనులు ప్రారంభించి, అతి త్వరలోనే దీని ఓపెనింగ్‌కు నేనే వస్తా. గా ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుస్తా.. ’’ అంటూ సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం హుజూరాబాద్‌లోని ప్రతాపవాడకు చెందిన రిటైర్డ్ టీచర్ ప్రతాప శాయిరెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు ద్వారా ప్రతాప శాయిరెడ్డి ఫోన్ నంబర్ తెలుసుకున్న సీఎం ఆయనతో మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖమంత్రి ఈటెల రాజేందర్, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సీఎంవో కార్యాలయం నుంచి అధికారులు, స్థానిక అధికారులు సైతం శాయిరెడ్డితో మాట్లాడటం విశేషం. హుజూరాబాద్ పట్టణ శివారులో ఉన్న మోడల్ చెరువును రిజర్వాయర్‌గా మార్చాలనే డిమాండ్ దశాబ్ద కాలంగా వస్తోంది. దీనిని రిజర్వాయర్‌గా మార్చితే పట్టణ ప్రజలకు తాగునీటితోపాటు చుట్టుపక్కల వ్యవసాయభూమికి సాగునీటి సమస్య తీరుతుంది. గత ప్రభుత్వాలు దీనిని పట్టించుకోలేదని, ఇప్పుడైనా పట్టించుకోవాలని రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రతాప శాయిరెడ్డి(82) పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. నగర పంచాయతీ, తహశీల్దార్, మంత్రి, ముఖ్యమంత్రిలకు కూడా లేఖలు రాశారు. స్పందన లేకపోవడంతో ‘సాక్షి’ దినపత్రికకు కూడా ఒక లేఖ రాశారు. ఇది ఆదివారం నాటి ఎడిటోరియల్ పేజీలోని ‘ఇన్‌బాక్స్’లో ప్రచురితమైంది. దీనిని చూసిన సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ప్రతాప శాయిరెడ్డికి ఫోన్ చేశారు. అంతేకాకుండా, మోడల్ చెరువు గురించి సీఎం, మంత్రి ఈటెల రాజేందర్ కార్యాలయాల నుంచి అధికారులకు కూడా సమాచారం వచ్చింది. ఈ క్రమంలో హుజూరాబాద్ తహశీల్దార్ బండి నాగేశ్వర్రావు ప్రతాప శాయిరెడ్డితో మోడల్ చెరువు గురించి చర్చించారు. నగరపంచాయతీ చైర్మన్ వడ్లూరి బ్రహ్మచారి, వైస్ చైర్మన్ తాళ్లపల్లి రజిత, కౌన్సిలర్ చింత శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు తాళ్లపల్లి రమేశ్‌గౌడ్, నాయకులు కొలిపాక శ్రీనివాస్, ఆకుల సదానందం కలిసి మోడల్ చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ చెరువు విస్తీర్ణం 111.24 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు.Follow @sakshinews -
అందాల తాండవం
పిక్నిక్ స్పాట్‌గా అలరిస్తున్న రిజర్వాయర్ కార్తీక మాసంలో రెండు జిల్లాల నుంచి సందర్శకుల తాకిడి నాతవరం: రెండు కొండల మధ్య చూడ చక్కని విధంగా సర్వాంగసుందరంగా నిర్మించిన తాండవ రిజర్వాయర్ పిక్నిక్ స్పాట్‌గా ఆకర్షిస్తోంది. పచ్చని రెండు కొండల నడుమ గట్టు లోపల భాగాన నిండుకుండలా దర్శనమిచ్చే రిజర్వాయర్‌లో గాలులకు కెరటాలతో ఎగిసిపడే నీరు.. రిజర్వాయర్ దిగువన రెండు కాలువల ద్వారా గలగలలాడుతూ పంట పొలాలకు ప్రవహించే నీరు.. చుట్టూ కిలకిలమంటూ పక్షులు కోలాహలం.. మనసును ఉత్తేజపరిచే తాండవ డ్యామ్‌పై వీచే చక్కటి గాలి పర్యాటకులను ఎంతగానో అకట్టుకుంటాయి. రిజర్వాయర్ గట్టుపై నుంచి చూస్తే ఓపక్క కునుచూపు మేర తాండవ రిజర్వాయర్‌లో నీటిమట్టం, మరో పక్క ఆహ్లాదాన్ని నింపే పచ్చటి పంట పొలాలు, రిజర్వాయర్‌లో బోటు షికారు మరిచిపోలేని అనుభూతిని పర్యాటకులకు కలిగిస్తుంది. ఏటా కార్తీక మాసం ప్రారంభం నుంచి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల నలు మూలలు నుంచి పర్యాటకులు తాండవ రిజర్వాయర్‌ను సందర్శిస్తుంటారు. తాండవ డ్యామ్ దిగువన పురాతన శ్రీనల్లకొండమ్మ తల్లి ఆమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత తాండవ అందాలను తిలకించి డ్యామ్ నుంచి సూమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పిల్‌వే గేట్లను సందర్శిస్తారు. రిజర్వాయర్ నిర్మాణ సమయంలో తాండవనీరు ప్రమాదస్థాయికి వచ్చిన పుడు దాని నివారణకు రెండు కొండలను చీల్చి నీరు నదిలోకి పోయేందుకు పొర్లుకట్ట నిర్మించారు. అప్పట్లో రిజర్వాయర్ నిర్మాణం కంటే స్పిల్‌వే గేట్ల నిర్మాణానికి అధికంగా ఖర్చయినట్లు అధికారులు చెబుతున్నారు. అది చూడటానికి పర్యాటకులు ఉత్సాహం కనబరుస్తారు. పర్యాటకులు తాండవలో తిరి గేందుకు 1989లో ఇంజిన్ బోట్లు కూడా మం జూరు చేశారు. క్రమేపీ పర్యవేక్షణ లోపం కారణంగా అవి ప్రసుత్తం అందుబాటులో లేవు. పర్యాటకుల కోరిక మేరకు స్థానికంగా ఉన్న మత్స్యకారులు కిరాయికి తాండవలో బోటు పై తిప్పతుంటారు. కార్తీక మాసంలో రెండు జిల్లాల నుంచి విద్యార్థులు పిక్నిక్ పేరుతో బస్సుపై వస్తుంటారు. అమ్మవారి గుడి ప్రాంగణంలో ఉసిరి చెట్టుతో పాటు చల్లని నీడ నిచ్చే చెట్లు ఉండటంతో కార్తీక సమారాధన పేరుతో వన భోజనాలు చేస్తారు. కార్తీక మాసం నెలలో ప్రతి ఆదివారం ఈ ప్రాంతమంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులతో కిక్కిరిసి పోయి ఉంటుంది. తాండవ వెళ్లటానికి బస్సు సౌకార్యం ప్రతి రోజు న ర్సీపట్నం నుంచి ఉదయం 6, 7, 9,12 గంటలకు, మధ్యాహ్నం 3, 6, 9.30 గంటలకు డిపో నుంచి ఆర్టీసీ బస్సులు ఉన్నా యి. తాండవ జంక్షన్ నుంచి నిత్యం ఆటోలు, ఇతర ప్రయివేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. నర్సీపట్నం నుంచి తాండవకు 27 కిలో మీటర్ల దూరం ఉంది. -
ముంపు ముప్పు!
పాలమూరు ఎత్తిపోతల పథకం.. జిల్లా ప్రజలను ఆశల పల్లకీ ఎక్కించిన బృహత్తర కార్యక్రమం. తడారిన నేలపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుందని, పచ్చదనం పరుచుకుంటుందని అంతా ఆశపడినా.. అది కొందరికి శాపంగా మారబోతోంది. ఈ పథకం కార్యరూపంలోకి వస్తున్న కొద్దీ భయాందోళనలూ పెరుగుతున్నాయి. ఎన్నో గ్రామాలను, అనేక ఎకరాల వ్యవసాయ పొలాలను ఈ ఎత్తిపోతల మింగేయనుందనే వాస్తవాన్ని రైతులు, ఆయా గ్రామాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జరిగే మేలు ఎన్నటికో గానీ.. ఇప్పుడు జరిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలా అనే ఆలోచనలో పడ్డారు. మూడు జిల్లాలకు తాగునీరు, పది లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో మొదలయ్యే ఈ పథకానికి సంబంధించి ఏర్పాటు చేయనున్న రిజర్వాయర్లకు స్థల పరిశీలనను అధికారులు ఇటీవలే పూర్తి చేశారు. పనులు వేగం పుంజుకుంటుంటే.. ఉన్న కాస్త భూమి చేజారుతుందేమోనని రైతులు మదనపడుతున్నారు. గండేడ్: పాలమూరు ఎత్తిపోతల ద్వారా ప్రజలకు తాగు, సాగునీరు పుష్కలంగా అందుతుంది.. దీంతో అభివృద్ధి సాధించవచ్చని కలలుగన్న ప్రజలు నేడు దానివల్ల ఎన్నో గ్రామాలు, వ్యవసాయ పొలాలు ముంపునకు గురవుతున్నాయనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మేలు ఎప్పుడు జరుగుతుందో కానీ రిజర్వాయరు ఏర్పాటుతో నష్టం మాత్రం ఖాయంగా కనిపిస్తుండడంతో ఆయా గ్రామాల్లోని ప్రజల గుండెల్లో ప్రస్తుతం గుబులు పుడుతోంది. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మూడు జిల్లాలకు తాగునీరు, 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా రిజర్వాయర్ల ఏర్పాటుకు కావాల్సిన స్థల పరిశీలనకు ఇప్పటికే ప్రాథమికస్థాయి సర్వేను ప్రభుత్వం పూర్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు లేని జిల్లాకు ఎత్తిపోతల ద్వారా తాగునీరు అందించాలన్న విషయాన్ని మరింత శ్రద్ధతో వేగంగా పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించిన సర్వేపనులు పూర్తయి ప్రభుత్వానికి నివేదిక కూడా అందించారు. గండేడ్ మండలంలో 8 గ్రామాలు, 12వేల ఎకరాలకుపైగా వ్యవసాయపొలాలు ముంపునకు గురవుతున్నాయని నివేదికలో తేల్చారు. ఇక రిజర్వాయర్ల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఇక్కడి ప్రాంత ప్రజల, రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. వందల ఏళ్ల నుంచి నివసిస్తున్న గ్రామాలు, ఏళ్ళ తరబడి సాగు చేసుకుంటున్న పొలాలు, రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటలు నీట మునుగుతాయనే వార్తలు వినగానే ఆయా గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానివల్ల గ్రామాలు ముంపునకు గురి కాకుండా ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. గండేడ్‌లో ముంపునకు గురయ్యే గ్రామాలు.. పాలమూరు ఎత్తిపోతల మొదటి రిజర్వాయరు 70టీఎంసీలతో కోయిల్‌కొండ మండలంలో ఏర్పాటు చేయగా రెండో రిజర్వాయరును 45టీఎంసీలతో గండేడ్ మండలం పెదవార్వాల్ సమీపంలో, మూడో రిజర్వాయర్‌ను లక్ష్మీదేవిపల్లి దగ్గర ఏర్పాటు చేసేం దుకు ఇటీవల ఇంజనీర్లు సర్వే చేశారు. పెద్దవార్వల్ సమీపంలో రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే అధిక గ్రామా లు ముంపునకు గురవుతున్నాయి. మండల పరిధిలోని పెద్దవార్వాల్, రుసుంపల్లి, గాధిర్యాల్ శివారులు, సాలార్‌నగర్, సాల్వీడ్, ఘణాపూర్తండ, చెల్లాపూర్తండా, మరిన్ని తండాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నదని తేల్చారు. ఐతే గండేడ్ మండలంలోని మహమ్మదాబాద్ మల్కచెర్వు దగ్గర రిజర్వాయర్ ఏర్పాటుచేస్తే గ్రామాలు ముంపునకు గురికాకుండా కేవలం అటవీ ప్రాంతం మాత్రమే ఎక్కువగా ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నది. దీన్ని అధికారులు పరిశీలనలోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
భారీగా రొయ్యలు, చేపలు లభ్యం
భారీగా రొయ్యలు, చేపలు లభ్యం ఇతర ప్రాంతాలకు జోరుగా రవాణా నాతవరం: తాండవ రిజర్వాయరులో చేపలు, రొయ్యల లభ్యత ఆశాజనకంగా ఉంది. ఇక్కడి చేపలు, రొయ్యలకు గిరాకీ ఉండడంతో మత్స్యకారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది అనుకూల వాతావరణంతో తాండవలో రెండు నెలలుగా చేపలు వేట జోరుగా సాగుతోంది. గత ఏడాది తుపాన్ల సమయంలో రిజర్వాయరులోకి అధికంగా నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం బాగుంది. ఇది చేపలు ఏపుగా పెరగటానికి దోహదపడింది. ప్రస్తుతం అడపాదడపా వర్షలు కురవడంతో అయకట్టు భూములకు నీరు విడుదల చేస్తున్నా రిజర్వాయరులో నీటిమట్టం తగ్గలేదు. నెల రోజులుగా జలాశయంలోకి ఇన్‌ఫ్లో వస్తుండడంతో ఆ ఎర్ర నీటికి రిజర్వాయరు అడుగు భాగాన ఉన్న చేపలు బయటకు వస్తున్నాయి. ఫలితంగా వేటాడుతున్న మత్స్యకారులకు చేపలు ఆశించినంతంగా దొరుకుతున్నాయి. రోజూ తాండవలో 150 పైగా బోట్ల ద్వారా చేపల వేట జరుగుతోంది. ఇక్కడ చేపలకు రంగు రుచి బాగుండడం, ధర కూడా ఇతర మార్కెట్ల కంటే తక్కువగా ఉండడం వల్ల కొనుగోలుదార్లు పోటీపడుతుంటారు. ఇక్కడ దొరికే టైగర్ రొయ్యలు రుచిగా ఉండడంతో గిరాకీ ఉంటుంది. ఇక్కడ నుంచి రోజూ పెద్ద సంఖ్యలో వాహనాల్లో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు రవాణా చేస్తున్నారు. కొందరు బడా వ్యాపారులు ఇక్కడ మత్యకారులకు ముందుగా పెట్టుబడి పెట్టి వారి ద్వారా వేటాడించి చేపలు రొయ్యలు కొనుగోలు చేసి దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అధిక ధరలకు విక్రయిస్తారు. ఈ ఏడాది తాండవ రిజర్వాయరులో పెద్ద చేపలు కూడా బాగా లభిస్తున్నాయి. ఈ రిజర్వాయరులో చేపలు, రొయ్యలు ఊహించని విధంగా లభ్యం కావడం, ధర కూడా బాగుండడంతో మత్స్యకారులు ఆనంద పరవశులవుతున్నారు. -
4.16 లక్షల ఎకరాల్లో తొలిపంటకు నీళ్లు
సాక్షి, నెల్లూరు : సోమశిల జలాశయంలో క్రమేణా నీటిమట్టం పెరుగుతుండటంతో సాగుపై రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 4,16,640 ఎకరాల్లో తొలిపంట సాగుకు నీటి సరఫరాకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. జలాశయంలోని నీటి ప్రవాహాన్ని బట్టి మొత్తం ఆయకట్టుకు నీళ్లు ఇవ్వనున్నట్టు తెలిసింది. నీటి విడుదలపై 26న కలెక్టర్ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగే జిల్లా సాగునీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. బుధవారం నాటికి సోమశిల జలాశయంలో నీటిమట్టం 35 టీఎంసీలకు చేరింది. మరో రెండు రోజుల్లో 38 టీఎంసీలకు చేరే అవకాశముంది. అక్టోబర్‌లో మరో 12 టీఎంసీలు, నాట్లు వేసే సమయమైన నవంబర్‌లో 6 టీఎంసీలు, డిసెంబర్లో మరో 6 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అధికారుల అంచనా. మొత్తంగా సోమశిల జలాశయంలోకి 62 టీఎంసీల నీరు చేరనుంది. 7.5 టీఎంసీల డెడ్ స్టోరేజీ, 1.5 టీఎంసీల ఆవిరినష్టం, 3 టీఎంసీలు తాగునీటి అవసరాలకు కలిపి మొత్తం 12 టీఎంసీలు పోను 50 టీఎంసీలు మిగులుతాయి. ఈ నీటిని సాగునీటి అవసరాలకు విడుదల చేయనున్నారు. పెన్నాడెల్టా పరిధిలోని మొత్తం ఆయకట్టు 4,16,640 ఎకరాలకు నీరు సరిపడనుండటంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశముంది. పెన్నా డెల్టాకింద 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువకింద 33 వేల ఎకరాలు, కావలి కాలువ కింద 72 వేల ఎకరాలు, నార్త్‌ఫీడర్ కింద 31 వేల ఎకరాలు, సౌత్‌ఫీడర్ పరిధిలో మరో 29 ఎకరాలు కలిపి అధికారికంగా మొత్తం 4 లక్షల 16 వేల 640 ఎకరాలకు, అనధికారికంగా 6 లక్షల ఎకరాల వరకూ సాగునీరు అందనుంది. నీటివిడుదల ఎప్పుడు అనేది ఐఏబీ సమావేశంలో నిర్ణయించనున్నారు. అక్టోబర్ 20 తరువాత నీరు విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాలువలు మరమ్మతులకు నోచుకునేనా.. ఇప్పటికే రెండు సీజన్లుగా పెన్నాడెల్టా పరిధిలోని సాగునీటి కాలువల్లో సిల్ట్, పూడిక తీయకపోవడంతో కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు చేరే పరిస్థితి కానరావడంలేదు. గత ఖరీఫ్‌లో సిల్ట్ తొలగింపునకు అధికారులు ప్రతిపాదనలు పంపినా ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిధులు మంజూరు చేయలేదు. ఈ దఫా అయినా సిల్ట్ తొలగించకపోతే ఆయకట్టుకు నీరు సక్రమంగా చేరదు. ఈ క్రమంలో కాలువల్లో పూడికతీత కోసం రూ.4.8 కోట్లతో 212 పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిని ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. త్వరలోనే అనుమతులొస్తాయని అధికారులు చెబుతున్నారు. పనులు పూర్తయ్యేందుకు 20 రోజులకు పైగానే పట్టే అవకాశముంది. ఈ నెలాఖరుకు పనులు మంజూరైనా అక్టోబర్ 20 నాటికి సిల్ట్ తొలగింపు పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో ఆ తర్వాతే నీరు విడుదల చేస్తారని రైతులు భావిస్తున్నారు. -
రేపు సగం సిటీకి నల్లా బంద్
సాక్షి,సిటీబ్యూరో: కృష్ణా పైప్‌లైన్‌కు భారీ లీకేజి ఏర్పడిన కారణంగా ఈనెల 24న(బుధవారం)నగరంలో సగం ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు జలమండలి ప్రకటించింది. కృష్ణా ఫేజ్-2పరిధిలోని 1600 డయా వ్యాసార్థంగల భారీ రింగ్‌మెయిన్-1 పైప్‌లైన్ కు చాంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్ వద్ద సోమవారం భారీ లీకేజి ఏర్పడింది. మరమ్మతులు చేసేందుకు 16 గంటల సమయం పడుతుందని జలమండలి అధికారులు చెబుతున్నారు. దీంతో ఈనెల 24న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు ప్రాంతాలకు సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేస్తామంటున్నారు. నగరంలోని సగం ప్రాంతాలకు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. సాహెబ్‌నగర్ రిజర్వాయర్ నుంచి మైలార్దేవ్ పల్లి వరకు ఉన్న ఈ ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్(పీఎస్సీ)భారీ మంచినీటి పైప్‌లైన్‌కు తరచూ లీకేజీలు ఏర్పడడం, ఆయా ప్రాంతాలు జలమయం కావడం పరిపాటిగా మారింది. భారీ వాహనాలు పైప్‌లైన్ మీదుగా వెళితే చాలు పైప్‌లైన్‌కు చిల్లులు పడుతున్నాయి. పైప్‌లైన్ నిర్మాణం సమయంలో మైల్డ్‌స్టీల్‌తో తయారు చేసిన పైప్‌లైన్ వేయకపోవడం కారణంగానే ఈ పైప్‌లైన్‌కు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ పైప్‌లైన్ మార్చని పక్షంలో నిత్యం ఇలాంటి లీకేజీలు తప్పవని హెచ్చరిస్తున్నారు. నీటిసరఫరా ఉండని ప్రాంతాలు.. కిషన్‌భాగ్, చార్మినార్, బాలాపూర్ రిజర్వాయర్ పరిధి,గోషామహల్, జహానుమా, మైసారం, సంతోష్‌నగర్(పార్ట్), ప్రశాసన్‌నగర్ రిజర్వాయర్, ఎస్ఆర్ నగర్, బోరబండ, ఎస్పీఆర్హిల్స్, ఎర్రగడ్డ, సోమాజిగూడా, ఎల్లారెడ్డిగూడా, లింగంపల్లి రిజర్వాయర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, హైదర్గూడా తదితర ప్రాంతాల్లో బుధవారం నీటి సరఫరా నిలిపివేస్తున్నామని జలమండలి అధికారులు ప్రకటించారు. -
నేడు వరద కాల్వకు నీటివిడుదల
పెద్దవూర : ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) లో లెవల్ వరద కాల్వకు బుధవారం ఉదయం 10.30 గంటలకు నీటిని విడుదల చేయనున్నారు. నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 580 అడుగులకు చేరడంతో నీటిని విడుదల చేయాలని నిర్ణయిం చినట్టు డీఈ కిషోర్ మంగళవారం తెలిపారు. అయితే ప్రధాన కాల్వతోపాటు డిస్ట్రిబ్యూటరీలు, పిల్లల కాల్వలు అస్తవ్యస్తంగా ఉండడం నీరు సాఫీగా వెళ్తుందా..లేదా అన్నది అనుమానంగా ఉంది. సాగర్ జలాశయ నీటిమట్టం 575 అడుగులకు చేరినప్పుడు గ్రావిటీ ద్వారా వరదకాలువకు విడుదల చేయడానికి సాధ్యమవుతుంది. సోమవారం సాయంత్రానికే జలాశయ నీటిమట్టం 575 అడుగుల స్థాయికి చేరడం.. పై నుంచి ఇన్‌ఫ్లో భారీగా వస్తుండడంతో నీటి విడుదలకు సిద్ధమయ్యారు. కాగా, గత ఏడాది ఆగస్టు 6వ తేదీనే వరద కాలువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం గేట్లకు, చైన్లకు గ్రీజింగ్ చేశారు. కొద్దిగా ఎత్తులేపి ట్రయల్ చేసి సిద్ధంగా ఉంచారు. 80వేల ఎకరాలకు సాగునీరు నాన్‌ఆయకట్టు ప్రాంతానికి నీరందించే ఈ ప్రాజెక్టును తక్కువ ఖర్చుతో రైతులకు ఎక్కువ ప్రయోజనం అందించే విధంగా రూపొందించారు. ఏఎమ్మార్పీ లోలెవల్ వరదకాల్వ కింద నాగార్జునసాగర్, నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాల్లోని ఏడు మండలాలకు పెద్దవూర, అనుముల, కనగల్, నిడమనూరు, వేములపల్లి, తిప్పర్తి, నకిరేకల్ మండలాలలో 80వేల ఎకరాలకు సాగునీరు అందేలా డిజైన్ చేశారు. అదే విధంగా 200 చెరువులకు నీటిని నింపటంతోపాటు 250 గ్రామాలకు తాగునీరు అందించనుంది. అసంపూర్తిగా పనులు.. 85 కిలోమీటర్లు గల ఈ కాల్వను రెండు ప్యాకేజీలుగా విభజించి 63 కిలోమీటర్లు మొదటి ప్యాకేజీగానూ, మిగతాది రెండవ ప్యాకేజీగానూ విభజించి పనులు చేపట్టారు. ప్రధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వలు 80శాతం కూడా పూర్తికాలేదు. రెండేళ్లుగా పనులు నిలిచిపోయాయి. ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు. ఆ తర్వాత వాటిని పునఃప్రారంభించడం మరిచిపోయారు. కాలువలకు నీటిని విడుదల చేసినా రైతుల పొలాలకు నీరు వెళ్లే పరిస్థితి లేదు. ప్రధాన కాల్వకు సమీపంలో ఉన్న రైతులు మాత్రమే చైనా పంపులను ఏర్పాటు చేసుకుని పారించుకోవాల్సిన పరిస్థితి ఉంది. చివరి దశలో పంప్‌హౌస్ పనులు.. సాగర్ జలాశయంలో 575 అడుగులకు పైగా నీరు ఉన్నప్పుడే వరద కాల్వకు నీటి విడుదల సాధ్యమవుతుంది. దీనికంటే తక్కువగా ఉన్నప్పుడు నీటి విడుదల సాధ్యం కాదు. జలాశయంలో 515 అడుగుల డెడ్ స్టోరేజీకి చేరినప్పుడు సైతం ఆయా మండలాలకు సాగు, తాగునీటిని అందించేందుకు రూ.108 కోట్లతో పంప్‌హౌస్ పనులు చేపట్టారు. ఈ పనులు సైతం ఈ యేడాది చివరి నాటికి పూర్తి కానున్నాయి. గ్రావిటీ ద్వారా నీటి విడుదలకు కావాల్సిన పరిమాణంలో నీటిమట్టం ఉండటంతో వరద కాలువ ప్రధాన ముఖద్వారం వద్ద క్రస్ట్ గేటును నీళ్లు తాకాయి. దీంతో క్రస్ట్‌గేట్లను లేపితే గ్రావిటీ ద్వారా నీరు అప్రోచ్ కెనాల్‌కు వెళ్తుంది. -
డుడుమకు తాకిడి
ముంచంగిపుట్టు: అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ (డైవర్షన్) డ్యాం ప్రమాద స్థాయికి చేరడంతో బలిమెల రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ డ్యాం పూర్తి సామర్థ్యం 2590 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 2589.30 అడుగుల నీటి నిల్వ ఉంది. వరద నీరు అధికంగా చేరుతుండడంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు సాయంత్రం నుంచి 8వ నంబర్ గేట్‌ను అరఅడుగు ఎత్తి 630 క్యూసెక్కుల నీటిని బలిమెల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. రాత్రికి మరో 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జోలాపుట్టు ప్రధాన రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 2750కి గాను 2735.50 అడుగుల నీటిమట్టం నమోదైంది. -
సాగర్ రెండోజోన్‌కు సాగునీరు విడుదల
కూసుమంచి : పాలేరు రిజర్వాయర్ నుంచి జిల్లాలోని సాగర్ రెండో జోన్‌కు శనివారం నీటిని విడుదల చేశారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి నీటిని కాల్వలకు వదిలారు. అంతకు ముందు వారు కృష్ణమ్మకు పూజలు చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ పొంగులేటి మాట్లాడుతూ జిల్లాలో సాగర్ మొదటి జోన్‌కే ప్రభుత్వం తొలుత నీటిని విడుదల చేసిందని, రెండో జోన్ పరిధిలోని రైతుల సమస్యలు కూడా దృష్టిలో ఉంచుకుని రెండోజోన్‌కు కూడా నీటిని వదలాలని రాష్ర్ట భారీ నీటిపారుదల మంత్రి హరీష్‌రావును కోరగా ఆయన అంగీకరించారని తెలిపారు. ఇందుకు కలక్టర్ చేత ప్రతిపాదన కూడా పంపించిన ట్లు తెలిపారు. ఈక్రమంలో సాగర్‌డ్యామ్‌కు ఎగువ నుంచి నీరు రావడంకూడా కలసిరావడంతో రెండోజోన్‌కు ప్రభుత్వం నీటిని త్వరిత గతిన విడుదల చేసిందన్నారు. ప్రతి రైతుకు నీరు ముఖ్యమని, పొదుపుగా వాడుకోవాలని సూచిం చారు. కాల్వ పరిధిలోని మొదటి రైతులు సహకరించి చివరి రైతులకు నీరు చేరేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లాలోని ఆయకట్టులో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రలో మూడో జోన్లో జిల్లాకు చెందిన 17 వేల ఎకరాల ఆయకట్టు ఉందని , దాన్ని రెండో జోన్లో చేర్చాలని నీటి పారుదల శాఖ మంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. రైతులకు ఎరువులు కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నీరు ఎంతో విలువైందని, దానిని ప్రతి రైతు పొదుపుగా వాడుకునేలా అధికారులు శ్రద్ధ వహించాలని కోరారు. రైతులకు ప్రభుత్వం రుణాలు మాఫీ చేయాలని, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పాలేరు ఇన్చార్జ్ సాధు రమేష్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు వడ్త్యి రాంచంద్రునాయక్, ఎన్నెస్పీ ఎస్ఈ అప్పలనాయుడు, ఈఈలు సుమతీదేవి, కృష్ణకుమార్, డీఈఈలు అక్బర్‌పాషా, యాదగిరిరెడ్డి, జేఈఈలు రంజిత్ కుమార్, శ్రీనివాస్, ట్రాన్స్‌కో, జెన్కో డీఈఈలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, పాలేరు, నాయకన్‌గూడెం సర్పంచ్‌లు మాదవీరెడ్డి, దేవర అమల, మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, ఎంపీటీసీ సభ్యులు బారి శ్రీనివాస్, అలింగ గోవిందరెడ్డి, కోఆఫ్షన్ అహ్మద్అలీ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బజ్జూరి వెంకటరె డ్డి, నాయకులు సత్యనారాయణరెడ్డి, మంగిరెడ్డి, బయ్య లింగ య్య, వైవీడీరెడ్డి, కాంగ్రెస్ నాయకులు మట్టె గురవయ్య, బిక్షంనాయక్, బాలకృష్ఫారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ముత్తయ్య, టీఆర్ఎస్ నాయకులు షేక్ రంజాన్ పాలొన్నారు. -
వరద ముంపులో బుచ్చెంపాలెం
దేవరాపల్లి: మండలంలోని వాలాబు రిజర్వాయరు నుంచి పోటెత్తిన వరదనీరు శనివారం బుచ్చెంపాలెం గ్రామాన్ని ముంచెత్తింది. వర్షా లకు రిజర్వాయరులో నీటి మట్టం పెరిగిపోవడంతో గ్రామంలో జనం ఎటూ వెళ్లలేని పరిస్థితి చోటుచేసుకుంది. ఏ క్షణాన వరదనీరు తమ గ్రామాన్ని ముంచెత్తుతుందోనన్న భయంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాయం కోసం ఎదురు చూపుఇక్కడ 18 కుటుంబాలవారు నిత్యావసరాలు, వైద్య సాయం కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామంలో జ్వరాలతోపాటు కునెపు నర్సమ్మ(60) శుక్రవారం రాత్రి వంటచేస్తుండగా అగ్నిప్రమాదానికి గురైంది. వైద్యసిబ్బంది పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారులు చర్యలు శూన్యం ముంపునకు గురవుతున్న ఈ గ్రామానికి వెళ్లేం దుకు దేవరాపల్లి ఎస్ఐ ఇ. లక్ష్మణరావు శుక్రవారం ప్రయత్నించారు. సెల్‌ఫోన్ సాయంతో వారి క్షేమసమాచారాన్ని తెసుకొని వారిని ముం పునుంచి బయటపడాలని కోరారు. ఈ పరిస్థితుల్లో ఒకే నాటుపడవ ఉందని, మీరు రావద్దని, మేము రాలేమని ఆ గ్రామస్థులు చెప్పడంతో ఆయన ప్రయత్నాన్ని విరమించుకున్నారని గ్రామస్తులు విలేకరులకు చెప్పారు. -
ఆశలు ఆవిరి
ఆరురోజులైనా అందని కల్యాణపులోవ నీరు కాలువల్లో తుప్పలు, ఎగువ ప్రాంత రైతుల ఆటంకాలే కారణం శివారు భూముల్లో ఎండుతున్న నారు మడులు ఆందోళన చెందుతున్న రైతులు రావికమతం : అసలే వర్షాధారం... రిజర్వాయర్ ఉందనుకుంటే ఆదుకునే పరిస్థితి లేకపోవడం రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. జూలైలో కురిసిన అరకొర వర్షాలకు రైతులు నారుమడులు సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత వర్షాలు ఎత్తేయడంతో ప్రస్తు తం నారు ఎండిపోతోంది. ఈ పరిస్థితుల్లో రిజర్వాయర్ నీరు విడిచిపెట్టడంతో రైతులు కొంత ఆనందించినా ఆరు రోజులైనా తమ భూములకు నీరు చేరక పోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కళ్యాణపులోవ నీరు విడుదలైనా శనివారం నాటికి కూడా ఆయకట్టుకు చేరలేదు. గంపవానిపాలెం, జెడ్.కొత్తపట్నం గ్రామాలకే అంతంతమేర నీ రందింది. ఓవైపు నారుమడులు ఎండిపోతున్న పరిస్థితుల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ నీరు 5న విడుదల చేసిన విషయం తెలిసిందే. నీరు విడుదల చేసిన ఆరు గంటల వ్యవధిలో శివారు భూములకు చేరాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు సిమెంటు లైనింగ్ పనులు చేపట్టిన కాలువల్లో బలంగా తుప్పలు పెరిగి ఉండడం, ఎగువ ప్రాంత రైతులు కాలువకు అడ్డంగా గట్లువేసి నిలిపివేస్తుండడమే కారణమని దిగువ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. రిజర్వాయర్ ప్రధాన తూము ద్వారా 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎండ ధాటిగా ఉండడంతో వచ్చిన నీరు వచ్చినట్లే పొలాల్లో ఇంకిపోతోంది. దీంతో నీరు కట్టుకున్న రైతులే మళ్లీమళ్లీ కడుతుండడంతో కిందికి నీరు రావడం లేదు. పైగా కాలువలో అధికారికంగా వేసిన తూములకు అదనంగా పలు చోట్ల రైతులు అనధికారికంగా వేసిన తూముల ద్వారా నీటిచౌర్యానికి పాల్పడుతుండడం సమస్యకు కొంత కారణం. నీరు శివారు భూములకు సరిగా చేరడం లేదు.అధికారులు తక్షణం స్పందించి కాలువ ఆసాంతం పర్యవేక్షించి తమకు న్యాయం చేయాలని దొండపూడి, కొత్తకోట, మర్రివలస, వమ్మవరం రైతులు కోరుతున్నారు. రెండు రోజుల్లోనే చేరేది గత ఏడాది నీరు విడుదల చేసిన రెండు రోజులకే మా భూములకు చేరింది. ఈ ఏడాది ఆరు రోజులైనా నీ టి చుక్క జాడలేదు. నారు మడులు ఎండిపోతున్నా యి. అధికారులు స్పందించి నీరందేలా చేయాలి. - గుమ్ముడు దొరబాబు, రైతు, కొత్తకోట -
ఆర్డినెన్స్‌పై ఆగ్రహం
ప్రభుత్వ కార్యాలయాలకు తాళం 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చిన అఖిలపక్షం కుక్కునూరు : పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్ వల్ల ఖమ్మం జిల్లాలో మునిగిపోయే మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతం అవుతోంది. అఖిలపక్ష నాయకుల పిలుపు మేరకు గురువారం ముంపుమండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు తాళంవేసి నిరసన తెలిపారు. తహసిల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీ వో రామచంద్రరావుతోపాటు రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు, సిబ్బందిని కార్యాలయం నుంచి బయటకు పంపించారు. బ్యాంకులు, అటవీశాఖ, రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేసి ధర్నా చేశారు. ‘ఆంధ్ర అధికారులూ దయచేసి తెలంగాణకు రావొద్దు’ అంటూ నినాదాలు చేశారు. సీపీఐ(ఎంఎల్)పాల్వంచ డివిజన్ కమిటీ సభ్యుడు ఎస్కే గౌస్ మాట్లాడుతూ తెలంగాణలోని ముంపుమండలాలను కేంద్రప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో ఆంధ్రాలో కలపడం అన్యాయమన్నారు. ఏడు మండలాలలోని ఏ ఒక్కరైనా విలీనానికి అంగీకరిస్తే అప్పుడు ఆంధ్రాలో కలపడానికి ఎవరూ అభ్యంతరం చెప్పమన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యుడు పగిళ్ల అల్లేశ్, సీపీఐ(ఎంఎల్)మండల కార్యదర్శి బాసినేని సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు చేకూరి రమణరాజు, సీపీఎం మండల నాయకులు యర్రంశెట్టి నాగేంద్రరావు పాల్గొన్నారు. -
కారుచీకట్లో ‘కాంతి’రేఖలు
సీలేరు బేస్‌లో 745 మెగావాట్ల విద్యుదుత్పత్తి రిజర్వాయర్‌లో పుష్కలంగా నీరు వెలుగులు నింపుతున్న విద్యుత్ కేంద్రాలు సీలేరు: విద్యుత్ కొరతతో ఇక్కట్లు పడుతున్న రాష్ట్రంలో సీలేరు, డొంకరాయి, మోతుగూడెం (పొల్లూరు) విద్యుత్ కేంద్రాలు రాష్ట్రానికి నిరంతరం వెలుగులు ప్రసాదిస్తున్నాయి. గత 24 రోజులుగా పవర్ కెనాల్ మరమ్మతుల పేరిట పూర్తి స్థాయిలో నిలిచిపోయిన విద్యుదుత్పత్తి రెండు రోజులుగా తిరిగి ప్రారంభమైంది. అన్ని జల విద్యుత్ కేంద్రాల్లో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుదుత్పత్తి చేస్తూ 745 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉక్కపోతతో విద్యుత్ సరఫరా లేక ప్రజలు అల్లాడుతున్న తరుణంలో భారీస్థాయిలో ఇంత విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ రాష్ట్రానికి సరఫరా చేస్తుండడంతో ప్రస్తుతం ఈ జలవిద్యుత్ కేంద్రాలు కీలకమయ్యాయి. ఇక్కడ విద్యుదుత్పత్తి కోసం విడుదల చేసిన నీరు అనంతరం గోదావరి డెల్టాకు వెళ్లడంతో అక్కడ ఖరీఫ్ పంటకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సీలేరు జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్ల ద్వారా 260 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, డొంకరాయిలో ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్లు, మోతుగూడెం (పొల్లూరు)లో నాలుగు యూనిట్ల ద్వారా 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అంతే కాకుండా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిర్మాణం చేపట్టిన మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో కూడా ప్రస్తుతం 6 యూనిట్లు పని చేస్తూ ఏపీకి 50 శాతం విద్యుత్ ఉత్పత్తి అందిస్తుంది. కాగా జోలాపుట్టు, బలిమెల, సీలేరు, డొంకరాయి రిజర్వాయర్లలో ప్రస్తుతం నీరు పుష్కలంగానే ఉంది. -
నక్కలగండి..!నత్తేనయం..!!
దేవరకొండ : నక్కలగండి బండ్ (రిజర్వాయర్) పనుల ప్రక్రియ నత్తకంటే నెమ్మదిగా సాగుతోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఐదు నెలల కాలంగా ఏ ఫైలు గానీ, ఏ పని గానీ ఇంచు కూడా ముందుకు జరగలేదు. ఈ విషయం అందరికీ తెలిసినా పట్టించుకునే నాథుడు లేడు. ఎన్నికలకు ముందు రేపటినుంచే పనులు చేస్తామన్నట్లు హడావిడి చేసిన అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఇప్పుడు రైతుల గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రిజర్వాయర్‌కు సేకరించిన భూమిలో నష్టపరిహారం చెల్లించకపోవడం..మరోవైపు పనులు ముం దు కు సాగకపోవడంతో అటు ముంపు బాధితులు, ఇటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోనైనా సమస్యను పరిష్కరిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదీ.. అసలు కథ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు 2009వరకు పూర్తి కావాల్సి ఉండగా మూడేళ్లు పొడిగించి2012వరకు పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత మరో రెండేళ్ల జాప్యానికి చేరి 2014లో పూర్తిచేస్తామన్నారు. సొరం గం 49 కిలోమీటర్ల మేర పూర్తి కావాల్సి ఉండగా టన్నెల్-1, టన్నెల్-2 కలిసి ఇప్పటివరకు 25కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తయింది. బడ్జెట్ కేటాయింపులో ప్రాజెక్టులపై గత ఏడాది తక్కు వ మొత్తంలో కేటాయించడంతో అతిపెద్ద ప్రాజె క్టు అయినా ఎస్ఎల్బీసీ పనుల్లో కూడా జాప్యం జరిగింది. దీనిలో అంతర్భాగమైన నక్కలగండి రిజర్వాయర్ కట్ట (బండ్) పనుల విషయానికి వస్తే మొత్తం 3700ఎకరాల భూసేకరణ చేయగా, అందులో బండ్ నిర్మాణానికి 85 ఎకరాలు అవసరమని గుర్తించి ఆ భూముల రైతులకు పరిహారం కూడా చెల్లించారు. వీటితోపాటు 3700ఎకరాల్లో కేవలం సుమారు 300 ఎకరాలకు మాత్రమే రైతులకు నష్టపరిహారం చెల్లించగా, ఇంకా 3400 ఎకరాల మేర నష్టపరిహారం చెల్లించాల్సిఉంది. అయితే రిజర్వాయర్ కట్ట నిర్మాణ పనులకు 2007లో రూ.220 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను పిలవగా లెస్‌లో జీవీవీ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. రూ.200 కోట్లతో పనులు చేపడితే నష్టం వచ్చే అవకాశముందని భావించి టెండర్ కాస్ట్ పెంచాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ససేమిరా అనడంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ ప్రక్రియ పెండింగ్‌లో పడిపోగా, పనుల్లో జాప్యం జరిగే అవకాశమున్నందున తాజాగా టెండర్లు పిలువచ్చని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం రిజర్వాయర్ కట్ట పనులకు రూ.435 కోట్ల అంచనా వ్యయంతో సంబంధిత అధికారులు ఆన్లైన్ టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్తరాష్ట్రంలోనైనా ఆశలు నెరవేరేనా.. అయితే ఇక్కడిరైతుల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు. తమ ఆవేదనను తెలంగాణ ప్రభుత్వమైనా అర్థం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ప్రాజెక్టు పనులు, సొరంగం పనులు ఏళ్ల తరబడి సాగడం వల్ల చుట్టు పక్కల భూముల్లో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనైనా నష్టపరిహారం పూర్తిగా చెల్లించి పనులు పూర్తవుతాయన్న ఆశతో ఉన్నారు. -
భూఅంతర్భాగంలో అతిపెద్ద జలాశయం!
వాషింగ్టన్:ఈ భూమండలంపైనే అతిపెద్ద జలాశయం.. ఇంతకుముందు ఎన్నడూ కనీవినీ ఎరుగనంతటి భారీ వైశాల్యంలో..! అంతటి జలనిధి ఎక్కడుందనుకుంటున్నారా? భూమి లోపల..ఏకంగా 640 కిలోమీటర్ల లోతున! అయితే ఇక్కడి నీరు మనం చూసే నీటి రూపంలో లేదు. ద్రవ, ఘన, వాయు రూపంలో కాకుండా నాలుగో స్థితిలో ఉందట. ఉత్తర అమెరికా ఖండం కింద ఈ భారీ జలాశయాన్ని కనుగొన్నట్టు నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూమెక్సికోకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఇది అంతర్భాగంలో భూఫలకల మధ్య ‘శిలాద్రవం’ (మాగ్మా) రూపంలో ఉన్నట్టు వారు తెలిపారు. భూఫలకల కదలికల కారణంగా భూమిపై ఉన్న నీరు పలు మార్పులకు గురవుతూ కిందకు చేరి ఇలా శిలల మధ్య నిక్షిప్తమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ జలాశయం కనుగొనడం ద్వారా భూమి, నీటి పుట్టుకకు సంబంధించిన అనేక కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉందని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త జాకబ్సన్ పేర్కొన్నారు. -
సూపర్ పవర్
తెలంగాణలో విస్తరించనున్న కేటీపీపీ వెలుగులు మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కసరత్తు 1,900 మెగావాట్లకు చేరుకోనున్న ప్లాంట్ సామర్థ్యం ఇదివరకే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన జెన్కో.. సమకూరిన నిధులు ప్రత్యేక దృష్టి సారించిన టీఆర్ఎస్ సర్కారు విద్యుత్ కొరత అధిగమించే దిశగా అడుగులు గణపురం, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ వెలుగులు విస్తరించనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రానున్న రోజుల్లో విద్యుత్ కొరతను అధిగమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లను పూర్తి చేయడం... లోటును పూడ్చుకునేందుకు మరిన్ని విద్యుత్ ప్లాంట్లను నిర్మించే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఇదివరకే శ్రీకారం చుట్టగా... అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే... మొత్తం 1900 మెగావాట్లతో కేటీపీపీ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రంగా అవతరించనుంది. ఏడాదిలో 1800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా.. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి ప్రభుత్వానికి విద్యుత్ సమస్య సవాల్‌గా మారనుంది. తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ కొరత తీరాలంటే... ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న దాని కంటే మరో 2,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం. ఈ మేరకు పరిస్థితి చక్కబడాలంటే రెండు, మూడేళ్లపాటు లభ్యత ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయూల్సిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్లాంట్లపై టీఆర్ఎస్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో రెండో దశలో భాగంగా చేపట్టిన 600 మెగావాట్ల... సింగరేణి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 1200 మెగావాట్లు విద్యుత్ ప్లాంట్లపై నజర్ వేసింది. పనులను వేగవంతం చేసి... సంవత్సరం కాలంలో 18 వందల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా... గురువారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో జెన్కో ఉన్నతస్థాయి అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన పనులను వేగిరం చేయడంతోపాటు కేటీపీపీలో మరో 800 మెగావాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేయూలని ఆదేశించారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి జెన్కో, ప్రభుత్వం ఇదివరకే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు సర్వే కూడా చేయించిన విషయం తెలిసిందే. యాష్ ఫాండ్, కోల్ డంప్‌యార్డ్, రిజర్వాయర్ ఏర్పాటు కోసం దుబ్బపల్లి కొంపల్లి, మోరంచవాగు పరిసర ప్రాంతాలు అనువైనవిగా అధికారులు అప్పుడు గుర్తించారు. అవసరమైతే మరింత భూమిని ఇచ్చేందుకు ఆ ప్రాంత గ్రామాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చెల్పూరు శివారు దుబ్బపల్లిని మరో చోటుకు తరలించే క్రమంలో గ్రామం పరిసరాల్లోనే సర్వే చేసిన 400 ఎకరాలు... మోరంచ, కొత్తపల్లి, కొంపెల్లి ప్రాంతాల్లో మరో 400 ఎకరాల భూములు అనుకూలంగా ఉన్నాయి. ఈ 800 ఎకరాలను భూములను జెన్కో సేకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన నిధులు సైతం సమకూరాయి. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.4 వేల కోట్ల రూపాయలను సేకరించింది. నిధులు సమకూరడంతో ప్లాంట్ నిర్మాణానికి మార్గం సుగమం కాగా... రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో ప్లాంట్ నిర్మాణంలో జాప్యం జరిగింది. అయితే నూతన రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకు సరిపోను విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడం... రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశముండడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ మేరకు కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే భూపాలపల్లి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు సిరికొండ మధుసూదనాచారి పదిరోజుల క్రితం స్వయంగా కేటీపీపీకి వచ్చి అధికారులతో మాట్లాడారు. ప్లాంట్ విస్తరణకు ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలను వాకబు చేశారు. 600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ పరిస్థితి... మంజూరైన 800 మెగావాట్ల మూడో దశ యూనిట్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులపై అధికారులతో చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక రూపంలో అందజేశారు. ఈ 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం జరిగితే... 1900 మెగావాట్లతో సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రంగా కేటీపీపీ అవతరించనుంది. -
ముంచుకొస్తున్న నీటి ఎద్దడి
జలాశయాల్లో తగ్గుతున్న మట్టాలు ఖరీఫ్ రైతుకు తప్పని ఇబ్బందులు! నీటిఎద్దడి ముంచుకొస్తోంది. ఒకవైపు ఎండలు మండిపోతుండ డం, మరోవైపు జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం సాధారణం కన్నా తక్కువ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఈసారి జిల్లాలో ఖరీఫ్ రైతుకు కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జునసాగర్‌లో కూడా నీళ్లు అడుగంటడంతో వర్షాలు పడి జలాశయాలు నిండితేగానీ నీరు దిగువకు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. సాక్షి, విజయవాడ : డెల్టాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఖరీఫ్‌కు 160 నుంచి 180 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ప్రస్తుతం సాగర్‌లో నీటి నిల్వ 144.74 టీఎంసీలే ఉండటం గమనార్హం. 590 అడుగుల నీటిమట్టం ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 517.5 అడుగుల మట్టం ఉంది. నాగార్జునసాగర్ డెడ్‌స్టోరేజి 496 అడుగులు అయినా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 510 అడుగుల వరకు నీటిమట్టం ఉంచాలంటూ జీవో జారీ చేయడంతో ఇబ్బందులు తలెత్తనున్నాయి. 510 అడుగుల వరకు నీరు ఇవ్వడానికి 14 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. శ్రీశైలంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 815.9 అడుగులు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆలమట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం డ్యామ్‌ల నుంచి సాగునీటి కోసం నీరు విడుదల చేసే అవకాశం లేదు. నాగార్జునసాగర్‌లోనే సాగునీటి అవసరాల కోసం 14 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ‘నైరుతీ’.. సకాలంలో వస్తేనే.. నైరుతీ రుతుపవనాలు సకాలంలో వచ్చి కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్షాలు బాగా పడి ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండితేగానీ కిందికి నీరు వచ్చే అవకాశం కనపడడం లేదు. 2004 తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఖరీఫ్‌కు జూన్ రెండు, మూడు వారాల్లో నీటిని విడుదల చేసేవారు. అంతకు వారం ముందు తాగునీటికి, వరి నారుమళ్ల కోసం నాలుగు టీఎంసీల నీటిని వదిలేవారు. డెల్టాకు నీటి విడుదలపై రాష్ట్రస్థాయి కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే రాష్ట్రం విడిపోయిన తరుణంలో కృష్ణా నీటి యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలి. దీని ఏర్పాటుకు మరో ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఉన్న రాష్ట్రస్థాయి కమిటీలో రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లను సభ్యులుగా వేశారు. ఈ కమిటీ నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కావడంతో నీటి విడుదలలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం సాగర్‌లో ఉన్న నీరు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, నల్గొండ జిల్లాల తాగునీటి అవసరాలకు సరిపోతాయి. జూన్ రెండో వారంలో నారుమళ్ల కోసం కూడా నీరు విడుదల చేయవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఇంకా సమయం ఉండడంతో ఈలోపు వరుణుడు కరుణిస్తే ఈ ప్రాంతానికి తాగు, సాగునీటి ఎద్దడి తప్పుతుందని, లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. -
వైఎస్ఆర్సీపీ నేత హత్య
రేణిగుంట, న్యూస్‌లైన్: మండలంలోని ఎస్‌యూపురానికి (శ్రీనివాస ఉదాసనపురం) చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు, మల్లిమడుగు రిజర్వాయర్ ఆయకట్టు సంఘం డెరైక్టర్ రఘుపతి(51) బుధవారం రాత్రి 7.15 గంటలకు రేణిగుంటలో హత్యకు గురయ్యారు. స్థానికుల కథనం మేరకు.. రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్ వద్ద రఘుపతి బస్సు కోసం వేచి ఉండగా దిగువ మల్లవరానికి చెందిన సుబ్రమణ్యం ఆచారి(42) అక్కడికి చేరుకున్నాడు. ఒక్కసారిగా పిడిబాకుతో రఘుపతిని పొడిచాడు. అనంతరం పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన రఘుపతిని అక్కడే ఉన్న బంధువు లు రేణిగుంటలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఆక్సిజన్ అందించేలోపే ఆయన మృతి చెందా రు. పదిహేనేళ్లుగా ఇద్దరి మధ్య ఉన్న కక్షల కారణంగానే హత్య చేశానని సుబ్రమణ్యం ఆచారి తెలిపాడు. అయితే సుబ్రమణ్యం ఆచారి ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్నాడని పోలీసులకు రఘుపతి సమాచారం ఇచ్చారనే కారణంగా ఈ హత్య జరిగినట్లు స్థానికుల కథనం. సీఐ రమణకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తిరుమలరెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ అత్తూరు హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు జువ్వల దయాకర్‌రెడ్డి, రామ్మోహన్, పట్టణ కన్వీనర్ నగరం భాస్కర్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ఉగ్రరూపం
సాక్షి, విశాఖపట్నం: భారీ వర్షాలకు జిల్లాలోని నదులు ఉప్పొంగుతున్నాయి. చెరువులు, కాలువలకు గండ్లు పడి పొలాలు, ఊళ్లను ముంచెత్తుతున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు తెగిపడటంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు కన్నీటిపాలవుతున్నారు. వరాహ నది కూడా అదే దారిన భయపెడుతోంది. చిన్న, మధ్య, పెద్ద తరహా జల ప్రాజెక్టులకు సంబంధించి 76 చోట్ల గండ్లు పడ్డాయి. జలాశయాలు ప్రమాదస్థాయికి చేరాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో వచ్చి పడడంతో శనివారం ఒక్క రోజే తాండవ రిజర్వాయర్‌లో ఏడు అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో అధికారులు రాత్రి ఏడు గంటల సమయంలో రెండు స్పిల్‌వే గేట్ల ద్వారా రెండు వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. జిల్లాలోని నాతవరం, పాయకరావుపేటలతోపాటు తూర్పుగోదావరి జిల్లా తుని, కోటనందూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలవారిని అధికారులు అప్రమత్తం చేశారు. అలాగే చోడవరం, మాడుగుల ప్రాంతంలోని కల్యాణపులోవ రిజర్వాయర్ మినహా రైవాడ, కోనాం, పెద్దేరు రిజర్వాయర్లు నిండు కుండల్లా ఉండటంతో గేట్లు ద్వారా అదనపునీటిని దిగువ నదుల్లోకి వదిలేస్తున్నారు.ఎగువ ప్రాంతంనుంచి వేలాది క్యూసెక్కుల ఇన్‌ఫ్లో జలాశయాల్లోకి చేరడంతో అన్నీ నిండుకులా ఉన్నాయి. రైవాడ సాధారణ నీటిమట్టం 114మీటర్లు. ప్రస్తుతం 113.75మీటర్లకు చేరింది. దీంతో ఈ జలాశయం నుంచి 4500క్యూసెక్యుల నీటిని విడిచిపెట్టడంతో శారదానది ఉగ్రరూపం దాల్చింది. తీరప్రాంత గ్రామాల్లోకి ఉప్పొంగుతోంది. కోనాం సాధారణ నీటిమట్టం 101మీటర్లు. ప్రస్తుతం 100.25మీటర్లకు చేరింది. దీని నుంచి 900క్యూసెక్యుల నీటిని బొడ్డేరు నదిలోకి వదులుతున్నారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని రిజర్వాయర్లదీ ఇదే పరిస్థితి. జోలాపుట్టులోకి భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మాచ్‌ఖండ్ లోకి ఉపనదుల ద్వారా వరద నీరు చేరుతోంది. డుడుమలోనూ నీరు ప్రమాదస్థాయిలోనే ఉంది. బలిమెల రిజర్వాయర్‌లో గరిష్ట నీటిమట్టం 1516 అడుగులు. ప్రస్తుతం 1515కి చేరుకుంది. సీలేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం నిలకడగా ఉంది. -
‘ఫైలిన్’ ముప్పు: డేంజర్లో రిజర్వాయర్లు!
సీలేరు, న్యూస్‌లైన్ : సరిహద్దులో ఉన్న రిజర్వాయర్లకు ముప్పు ముంచుకొస్తోంది. తుపాను ప్రభావం జోలాపుట్టు, డుడుమ, బలిమెల, సీలేరు, డొంకరాయి వంటి రిజర్వాయర్లపై పూర్తిగా పడనుంది. విద్యుత్ ఉత్పత్తి జరగక ఇప్పటికే ప్రమాద స్థాయిలో ఉన్న జలాశయాలకు ఫైలిన్ తుపాను మరింత నష్టాన్ని చేకూర్చనుంది. సమ్మెతో విజయవాడ, నాగర్జునసాగర్, శ్రీశైలం విద్యుత్కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో సీలేరు, డొంకరాయి, మోతుగూడెం కేంద్రాల్లో నాలుగు రోజులుగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే ఆయా రిజర్వాయర్లలో ప్రమాద స్థాయిలో మూడు,నాలుగు అడుగుల తేడాతో పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశా అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో గురువారం జోలాపుట్లో రెండు గేట్లు ఎత్తివేసి సీలేరు జలశయానికి నీటిని విడుదల చేశారు. ఈ తుపాను ప్రభావంతో ఇవి మరింత నిండి కొట్టుకుపోయే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దిగువన ఉన్న జలవిద్యుత్కేంద్రాలు సమ్మెలో ఉండడంతో బలిమెల నుంచి తీసుకోవాల్సిన నీటిని నిలిపేశారు. బలిమెల గరిష్ట నీటిమట్టం1514 అడుగులకు ఇప్పుడు 1510 అడుగులకు చేరింది. జోలాపుట్టులో 2750కి 2747.8 అడుగుల నీటి మట్టం ఉంది. ఒడిశా నుంచి నీరు తీసుకోనప్పటికీ సీలేరులో 1360 అడుగులకు గురువారం సాయంత్రానికి 1347.8 అడుగుల నిల్వ ఉంది. ప్రస్తుతం ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి జరగకపోయినా దిగువున ఉన్న డొంకరాయి జలాశయం మరింత ప్రమాదంలో ఉంది. సాధారణ వర్షాలకే ఈ జలాశయం ఉప నదుల ద్వారా తరచూ ప్రమాద స్థాయికి చేరుకుంటుంది. దీని గరిష్ట నీటిమట్టం 1037 అడుగులకు 1035.2 అడుగులకు చేరింది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తి చేయకుంటే రిజర్వాయర్లకు ముప్పు వాటిల్లి గేట్లు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉగ్ర ‘తాండవ'౦ నాతవరం, న్యూస్‌లైన్ : భారీ వర్షాలకు తాండవనది ఉప్పొంగడంతో తాండవ ఏటి అవతల గల 14 పంచాయతీలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కొండగెడ్డలు, వాగులు పొంగడంతో వాహనాలతో పాటు నిత్యావసర సరుకులు తరలించే అవకాశం లేకుండా పోయింది. చమ్మచింత, గుమ్మిడిగొండ, చిక్కుడుపాలెం వద్ద బోట్ల సాయంతో కూడా నది దాటడానికి అవకాశం లేకుండా పోయింది. గురువారం మధ్యాహ్నం కొందరు బోట్లపై నదిని దాటేందుకు సాహసించినా మధ్యలో బోటు బోల్తాపడడంతో స్థానికుల సహాయంతో అతికష్టంపై ఒడ్డుకు చేరుకున్నారు. తాండవ రిజర్వాయర్‌లో గురువారం సాయంత్రానికి రెండు అడుగుల నీటిమట్టం పెరిగింది. ఇన్‌ఫ్లో రిజర్వాయర్‌లోకి ఇంకా వచ్చి చేరుతోంది. మరోవైపు కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం తహశీల్దారు వి.వి.రమణ, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు తాండవ రిజర్వాయర్‌ను సందర్శించి లోతట్టు ప్రాంతంలో వున్న జాలరిపేటవాసులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఉధృతి తగ్గని కోనాం చీడికాడ, న్యూస్‌లైన్ : మండలంలోని కోనాం జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయిలో కొనసాగుతోంది. భారీగా నీరు చేరడంతో ఈ రిజర్వాయరు నీటిమట్టం 100 మీటర్లకు చేరుకోవడంతో బుధవారం రాత్రింతా 300 క్యూసెక్కుల నీటిని బొడ్డేరులోకి విడుదల చేశారు. గురువారం కోనాంలో సంత కారణంగా జలాశయం ఆవల గ్రామాల గిరిజనులు జలాశయం గేట్లు దిగువ కాజ్వే దాటి వస్తుంటారు. దీన్ని దృష్ఠిలో ఉంచుకొని ఇరిగేషన్ అధికారులు నీటి విడుదలను భారీగా తగ్గించారు. కానీ ఇన్‌ఫ్లో తగ్గకపోవడంతో జలాశయం నీటి మట్టం 100మీటర్లు దాటి పోయింది. దీంతో గురువారం రాత్రికి మరోసారి నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ ఏఈ చంద్రశేఖర్ చెప్పారు. మునిగిన వరి పంట మాడుగుల, న్యూస్‌లైన్ : భారీ వర్షా ్డలకు పల్లపు ప్రాంతా ల్లో ఉన్న ఘాట్‌రోడ్డు, జె.డి.పేట, ఒమ్మలి, ఎం.కోడూ రు గ్రామాల్లో సుమా రు వంద ఎకరాల్లో వరిపంట నీట ముని గిందని రైతులు తెలిపారు. ఈ ఏడా ది ఖరీఫ్ వరినాట్లు ఆలస్యంగా వేశారు. దీంతో వరిచేలన్నీ పొట్ట దశకు చేరుకున్నాయి. ఇంతలో అధిక వర్షాలకు బుధవారం నుంచి వరిచేలన్నీ నీట మునిగాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
వద్దన్నా విద్యుదుత్పత్తి!
సీలేరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రసిద్ధ జల విద్యుత్ కేంద్రంగా పేరుపడ్డ సీలేరులో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది. అవసరం లేకపోయినా తప్పనిసరిగా విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సిన విచిత్ర అవస్థ ఎదురవుతోంది. విద్యుత్తు అత్యవసరమైన వేసవిలో సీలేరులో ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేక రాష్ట్రం వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అవసరం లేకపోయినా, విద్యుదుత్పత్తిని పర్యవేక్షించే లోడ్ డిస్పాచ్ విభాగం కోరకపోయినాఉత్పత్తి చేయా ల్సి వస్తోంది. విద్యుత్తు తీసుకోవాలని హైదరాబాద్‌లోని అధి కారులను బతిమాలి మరీ ఉత్పత్తి చేయాల్సి వస్తోంది. సీలేరు రిజర్వాయర్‌లో భారీ పరిమాణంలో నిల్వ ఉన్న నీటిని కాపాడుకోలేని దుస్థితి కారణంగానే ఈ పరిస్థితి ఎదురవుతోంది. గేట్లతో ఇక్కట్లు ః సీలేరు జల విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి, వాడుకునేందుకు వీలుగా 1360 అడుగుల నీటి సామర్ధ్యం గల రిజర్వాయర్ మధ్యలో మినీ రెగ్యులేటర్ డ్యాం ఉంది. దీనికి ఉన్న ఎనిమిది గేట్లు కొన్నేళ్లుగా అవసరమైన సమయాల్లో మొరాయిస్తున్నాయి. హైద రాబాద్లోని లోడ్ డిస్పాచ్ సెంటర్ అధికారులు విద్యుత్తు అవసరమైన సమయాల్లో ఫోన్ ద్వారా తెలియజేస్తే, సీలేరులో అధికారులు ఈ మినీ రెగ్యులేటర్ డ్యాం గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం పరిపాటి. అయితే ఈ గేట్లు అవసరమైన సమయంలో పైకీ కిందకు దిగకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీలేరు జల విద్యుత్ కేంద్రంలో ఇప్పుడు వి ద్యుదుత్పాదన అవసరం లేదు. దాంతో రిజర్వాయర్ సామర్ధ్యం 1360 అడుగులు కాగా, నీటిమట్టం 1352 అడుగులకు చేరింది. నీటి ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉండడంతో గేట్లు పక్కకు జరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గేట్లను పైకీకిందకీ కదల్చడం ద్వారా నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే గేట్ల వ్యవస్థలో ఉన్న రోలర్లు పని చేయకపోవడం వల్ల ఇవి తరచూ మొరాయిస్తున్నాయి. ఏడేళ్ల కిందట బాగా పనిచేస్తున్న రోలర్పరికరాలను మార్చి అధికారులు కొత్తవాటిని అమర్చిన నాటి నుంచి సమస్య మొదలైంది. నీటి ప్రవాహాన్ని నియంత్రించాల్సిన గేట్లు సక్రమంగా పనిచేయక ఇప్పుడు 1,3,4 గేట్ల నుంచి రిజర్వాయర్‌లోని నీరు బయటకు వచ్చేస్తోంది. దాంతో దిగువన నీటి మట్టం బాగా పెరిగిపోతోంది. ఇలా వృథాగా నీరు విడుదల చేయాల్సి వచ్చినప్పుడలా మరోదారి లేక హైదరాబాద్ లోని లోడ్ డిస్పాచ్ విభాగాన్ని బతిమాలి విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. గేట్లు పూర్తి స్థాయిలో పనిచేస్తే ఈ సమస్య ఎదురయ్యేది కాదని నిపుణులు అంటున్నారు. -
లాంచీలకు మావోయిస్టుల బ్రేక్
సీలేరు, న్యూస్‌లైన్: ఐదేళ్ల క్రితం పీడకల వంటి బలిమెల సంఘటనను ఎవరు మరిచిపోగలరు? నాటి సంఘటనతో ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ప్రస్ఫుటమైంది. ఆ పట్టు ఇప్పటికీ కొనసాగుతోందని నిరూపించే విధంగా, బలిమెల రిజర్వాయర్‌లో లాంచీల రాకపోకలను నిలిపేయాలని మావోయిస్టులు హెచ్చరించారు. దాంతో పది రోజులుగా ఆ రిజర్వాయర్‌లో లాంచీ ప్రయాణం ఆగిపోయింది. ఫలితంగా 120 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసర సరకులు అందక అక్కడి గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. మావోయిస్టుల హెచ్చరికలతో ఒడిశా ప్రభుత్వం లాంచీల ప్రయాణాన్ని నిలిపివేసింది. ఇంతవరకు రోజుకు ఐదు లాంచీలు తిరిగేవీ. వీటి ద్వారా చిత్రకొండ నుంచి చుట్టుపక్కల గ్రామాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసేవారు. గిరిజనులకు వైద్యసేవలు కూడా కల్పించేవారు. అయితే మావోయిస్టులు మాత్రం అక్కడి గిరిజనులకు ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా బీఎస్ఎఫ్ బలగాలను మోహరించి వారిని భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ లాంచీలను నిలిపేయమని అల్టిమేటం ఇచ్చారు. మావోయిస్టు కమాండర్ మాధవను బీఎస్ఎఫ్ బలగాలు హతమార్చడంతో వారు మరింత ఆగ్రహంతో వున్నారు. మారుమూల ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ బలగాల బేస్‌క్యాంపులు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సాయుధ బలగాలకు సరకులు అందకుండా లాంచీలను నిలిపేశారు. పది రోజులుగా లాంచీలు తిరగకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని, వాటిని పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. -
తపాస్‌పల్లి’కి గోదావరి జలాలు
చేర్యాల, న్యూస్‌లైన్: లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల సాయంతో చేర్యాల మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి ఆదివారం గోదావరి జలాలను పంప్ చేశారు. ఈ సందర్భంగా తపాస్‌పల్లి రిజర్వాయర్ వద్ద రాష్ట్ర ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరి జలాలతో చేర్యాల ప్రాంత రైతులకు న్యాయం చేశామన్నారు. చేర్యాల మండలంలోని సుమారు 67 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు సరఫరా చేస్తామన్నారు. ఈ ప్రాంత రైతులకు గోదావరి నీళ్లనందించేందుకు భగీరథ ప్రయత్నం చేశామన్నారు. కాకతీయుల కాలంలో కాల్వతో గోదావరి నీటిని అందించారని చెప్పుకోవడమే మనం చూశామని, ఇప్పుడు ఆ కలనేరవేరిందన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ బి.వెంకటేశ్వర్లు, ఈఈ కె.వీరయ్య, డీఈ శ్రీనివాస్‌రెడ్డి, సాయిలు, శారదతోపాటు గ్రామ సర్పంచ్ వీజేందర్, ఈగ యాదయ్య, మాజీ సర్పంచ్ నాగమల్ల భూలక్ష్మి, వివిధ పార్టీల నాయకులు మెరుగు శ్రీనివాస్, డీసీసీ ఉపాధ్యక్షులు ముస్త్యాల కిష్టయ్య, కొమ్ము రవి, నాగమల్ల బిక్షపతి, ఉడుముల భాస్కర్‌రెడ్డి, ఉట్లపల్లి శ్రీనివాస్, నాగమల్ల సత్యనారాయణ, ముస్త్యాల యాదగిరి గొల్లపల్లి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదుత్పత్తికి తగ్గిన డిమాండ్
సీలేరు, న్యూస్‌లైన్ : భద్రాచలం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు చింతూరు, కోనూరు వంటి ప్రాంతాల్లో ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. ఫలితంగా సీలేరు (గుంటవాడ) జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. ఇటీవల భారీ వర్షాలు కురిసినప్పుడు నిరంతరంగా 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టారు. అయితే గత 10 రోజులుగా ఈ కేంద్రంలో రోజుకు 60 మెగావాట్లకు మించడం లేదు. శనివారం 0.279 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి జరిగింది. ఈ రిజర్వాయర్‌లో నీరు ప్రస్తుతం 1350 అడుగులకు చేరింది. మరోవైపు పిల్లిగెడ్డ వాగు నుంచి వరదనీరు చేరుతోంది. డొంకరా యి జలవిద్యుత్ కేంద్రంలో ఉపనదుల ద్వారా ప్రస్తుతం 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం1037 అడుగులు కాగా 1035 అడుగుల వద్ద జెన్కో అధికారులు నీటిని నిల్వ చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వలసగెడ్డ, పాలగె డ్డ, మంగంపాడు ఉపనదుల ద్వారా వచ్చే నీటి తో ప్రస్తుతం అక్కడ విద్యుత్ ఉత్పత్తితో వుం ది. డొంక రాయి జలాశయంలో నీటిమట్టం ప్రమాద స్థాయిలో ఉండడం, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జోరందుకోవడంతో ఇక్కడ విద్యుత్ కేంద్రాలపై అంతగా అధికారులు ఆధారపడటం లేదు. గతవారం ఆ జలాశయం ప్రమాద స్థాయికి చేరడంతో 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో దిగువన ఉన్న ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుందన్న ఉద్దేశంతో ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఒకపక్క శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి జోరందుకోవడం, మరోపక్క భద్రాచలం, తూర్పుగోదావరి జలాశయాలు ప్రమాద స్థాయిలో ఉంటూ వెనక్కి వరద నీరు పోటెత్తుతోంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడం శ్రేయస్కారం కాదని ఉత్పత్తిని నిలిపివేశారు. డొంకరాయి పైనున్న వలసగెడ్డ, పాల గెడ్డ వాగుల నీటితోనే ప్రస్తుతం అక్కడ విద్యు త్ ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి ఎగువన ఉన్న బలిమెల జలాశయం 1500.4 అడుగుల నీటిమట్టం ఉండగా జోలాపుట్టు 2533.7 అడుగుల నీటిమట్టాలు నమోదైంది. -
రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు
సీలేరు, న్యూస్‌లైన్ : డొంకరాయి జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరడంతో శుక్రవారం రాత్రి మొదటి రెండు గేట్లు ఎత్తి ఎనిమిది గంటలపాటు 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు. శుక్రవారం సాయంత్రానికి 1036.5 అడుగులకు చేరడంతో నీటిని విడుదల చేశారు. శనివారం తెల్లవారుజామున మరో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశామని ఎస్ఈ ఈఎల్ రమేష్‌బాబు తెలిపారు. ఎప్పటికప్పుడు రిజర్వాయర్‌ను పర్యవేక్షిస్తున్నామని, శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ నీటిమట్టం 1035 అడుగులకు చేరడంతో గేట్లు నిలుపుదల చేశామన్నారు. 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రస్తుతం ఈ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ యూనిట్ ద్వారా విడుదలైన నీరు దిగువనున్న ఖమ్మం జిల్లా కొల్లూరు రిజర్వాయర్‌లోకి రోజుకు 2,400 క్యూసెక్కులు చేరుతోంది. మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రంలో రెండు యూనిట్లు మూలకు చేరడంతో మరో రెండు యూనిట్ల ద్వారా 220 మెగా వాట్లు నిరాటంకంగా విద్యుత్ తయారవుతోంది. అక్కడ విడుదలైన నీరు శబరి నదిలో కలుస్తోంది.