25న గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు
- కలెక్టర్ కోన శశిధర్
పెనుకొండ రూరల్ :
హంద్రీ–నీవా వ్యవస్థలోని గొల్లపల్లి రిజర్వాయర్‌కు ఈ నెల 25న నీళ్లు వదులుతున్నట్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. సోమవారం ఆయన మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 275 కి.మీ వరకు హంద్రీ–నీవా పనులను పరిశీలించామన్నారు. 15 రోజుల లోపు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని, నీరు ఎలా వదులుతారని కలెక్టరును విలేకరులు ప్రశ్నించగా.. పనులు పూరయ్యే దాకా రిజర్వాయర్‌లో భూమట్టానికి మాత్రమే నీటిని వదులుతామని చెప్పారు. దీనివల్ల చుట్టుపక్కల భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. కలెక్టర్ వెంట జలవనరులశాఖ సీఈ జలంధర్, ఎస్‌ఈ సుధాకర్‌బాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశులు తదితరులు ఉన్నారు. కాగా.. జలవనరులశాఖ అధికారులపై ఎస్‌ఈ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని, ఒళ్లు దగ్గర పెట్టుకుని విధులు నిర్వర్తించాలని సూచించారు. లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు.