gollapalli
-
తాళికట్టే సమయంలో ట్విస్ట్ ఇచ్చిన పెళ్లి కూతురు
-
జగిత్యాల: కుక్క దాడిలో గాయపడ్డ బాలిక మృతి
సాక్షి, జగిత్యాల: కుక్క కాటు మరో బాలిక జీవితాన్ని బలిగొంది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె మృత్యువుతో పోరాడింది. రెండువారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ .. చివరకు కన్నుమూసింది. గొల్లపెల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో పదిహేను రోజుల కిందట ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఊర్లో దాదాపు పది మందిని గాయపర్చింది. అయితే సంగెపు సాహిత్య అనే 12 ఏళ్ల బాలిక మాత్రం కుక్క దాడిలో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆ చిన్నారి ఇవాళ(శనివారం) ఉదయం కన్నుమూసింది. తమ ముందు ఆడిపాడిన చిన్నారి ఇక లేదనే విషయం తెలిసి.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: గుండెలో రంధ్రం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి.. -
రైతు వినూత్న ఆలోచన.. ప్రయోగాత్మకంగా వెదురు సాగు
సాధారణంగా వెదురు అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరుగుతుంది. అక్కడి నుంచే మన అవసరాలకు సేకరిస్తుంటారు. కానీ దీన్ని కూడా పంటగా సాగు చేయొచ్చని ఓ రైతుకు ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టాడు. ఎలాంటి చీడపీడలూ, తెగుళ్ల బెడద ఉండదని వెదురు సాగుతో లాభాలు ఆర్జించవచ్చని ఆ రైతు చెబుతున్నాడు. గుమ్మఘట్ట (అనంతపురం జిల్లా): స్వల్ప పెట్టుబడితో దీర్ఘకాలిక పంటకు శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు గుమ్మఘట్ట మండలం గొల్లపల్లికి చెందిన రైతు పాటిల్ వంశీకృష్ణారెడ్డి. ఈయన ఎంబీఏ, ఎల్ఎల్బీ వరకు చదువుకున్నారు. బళ్లారిలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ అక్కడే నివాసముండేవారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు. తాత పాటిల్ గోవిందరెడ్డి స్ఫూర్తితో వ్యవసాయం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా డెన్మార్క్‌లోని మిత్రుడి సలహా, వ్యవసాయ, ఉద్యాన అధికారుల సూచనలతో ఇక్కడ తనకున్న పది ఎకరాల్లో ఎనిమిది నెలల క్రితం వెదురు పంట పెట్టారు. కర్ణాటకలోని హోసూరులో టిష్యూకల్చర్‌తో కూడిన బల్కోవా, న్యూటన్ రకాలకు చెందిన 10 వేల వెదురు పిలకలను రైతు వంశీకృష్ణారెడ్డి రూ.2లక్షలకు కొని, తీసుకొచ్చి పదెకరాల్లో నాటారు. మొక్కకు మొక్కకు మధ్య 10 అడుగుల దూరం పాటించారు. ఎకరా సాగుకు రూ.50 వేల వరకు వెచ్చించారు. అంతర పంటగా మునగ సాగు చేశారు. రెండో విడతలో మరో పది ఎకరాలలో టుల్డా రకం వెదురు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎంచుకున్న రకాన్ని బట్టి పంట కాలం ఆధారపడి ఉంటుంది. బల్కోవా రకం మూడున్నర సంవత్సరాల వ్యవధిలో కోతకు వస్తుంది. న్యూటన్ రకం నాలుగేళ్లలో కోతకు వస్తుంది. వెదురుకు వ్యాధులు గానీ, తెగుళ్లు గానీ రావు. క్రిమిసంహారక మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. మామిడి, సపోట, జామ, అరటి, దానిమ్మ పంటలు చేతికి వచ్చే వరకు నమ్మకం లేదు. కానీ వెదురు సాగులో ఆ దిగులు ఉండదు. దీర్ఘకాలిక పంటగా నమ్మకమైన లాభాలు వస్తాయి. మొక్కలు పెద్దవైన తరువాత అంతర పంటలుగా అల్లం, పసుపు పంటలను కూడా వేసుకోవచ్చు. విసనకర్రలు, బెంచీలు, కుర్చీలు, బుట్టలు, జల్లెడ, చాట, స్పూన్లు, పేపర్ తయారీ, అగరబత్తీల తయారీ, నిచ్చెన, ఇంటివాసాలు, గుడిసెలు తదితర ఎన్నో వాటికి వెదురును వినియోగిస్తారు. ఈ వెదురుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టన్ను ధర రూ.3వేల నుంచి రూ.4 వేల వరకు పలుకుతోంది. ఎకరాకు 40 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. తద్వారా సగటున లక్షా నలభై వేల వరకు ఆదాయం వస్తుంది. డెన్మార్క్‌లో ఉన్న మిత్రుడు సతీష్, నేను నేషనల్ బ్యాంబో మిషన్‌ను చూసి వెదురు పంట సాగు చేయాలని నిశ్చయించుకున్నాం. అక్కడ అతను.. ఇక్కడ నేను ఇదే పంట సాగు చేస్తున్నాం. పండ్లతోటలకు వ్యాధులు, తెగుళ్లు ఎక్కువ. పెట్టుబడి ఖర్చులూ అధికంగా ఉంటాయి. లాభాలు వస్తాయన్న గ్యారంటీ ఉండదు. వెదురు సాగులో మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. వెదురుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అంతర పంటగా మునగ సాగు చేశాను. – పాటిల్ వంశీకృష్ణారెడ్డి వెదురుతో రైతుకు ఆర్థిక పరిపుష్టి వెదురు సాగు విస్తీర్ణం పెంచుకుంటే అదనపు ఆదాయం లభిస్తుంది. జిల్లాలో ఒక రైతు మాత్రమే సాగు చేస్తున్నాడు. వెదురు పంటను సాగుచేయడం ద్వారా పరిశ్రమలకు ముడి సరుకు పెరుగుతుంది. కాలువ గట్ల పక్కన, ప్రభుత్వ భూములు, వృథా భూముల్లో వెదురును పెంచితే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉంది. వెదురుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ పంట సాగు చేస్తే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తి గల రైతులు సమీపంలోని హార్టికల్చర్ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. – పద్మలత, జిల్లా ఉద్యాన శాఖ అధికారి -
ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు..
సాక్షి, గొల్లపల్లి(నూజివీడు) కృష్ణా: పెళ్లిచేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు తనను గర్భవతిని చేసి, ఆ తర్వాత మోసం చేశాడని.. తనకు న్యాయం చేయాలంటూ ఓ యువతి తన ఏడునెలల కుమారుడితో మండలంలోని గొల్లపల్లి సచివాలయం వద్ద సోమవారం బైఠాయించింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా.. తనకేమీ న్యాయం చేయట్లేదని వాపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తూర్పు దిగవల్లికి చెందిన మిసమెట్ల వెంకటేశ్వరమ్మ(19)కు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో గ్రామంలోని ఆమె బంధువుల వద్ద ఉండి మూడేళ్ల క్రితం గొల్లపల్లిలోని ఆమె పెద్దమ్మ సాయల రాములమ్మ వద్దకు వచ్చి ఉంటోంది. కూలిపనులకు వెళ్తున్న సమయంలో గొల్లపల్లికి చెందిన తటకలూరి విష్ణుబాబు(20) అనే యువకుడు ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని ఆమె వెంట పడేవాడు. రోజూ వెంట పడటంతో వెంకటేశ్వరమ్మ సైతం అతనితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇరువురూ ఒక్కటయ్యారు. దీంతో వెంకటేశ్వరమ్మ గర్భవతి అయ్యింది. ఈ నేపథ్యంలో గతేడాది సర్పంచి ఎన్నికలకు ముందు స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు సైతం చేసింది. చదవండి: (ఒకరు బీటెక్.. మరొకరు బీఎస్సీ.. ఏ కష్టమొచ్చిందో.!) అయితే ఈ పంచాయతీ గ్రామంలోని పెద్దల వద్దకు వెళ్లగా, వారి ముందు పెళ్లి చేసుకుంటామని ఒప్పుకొని ఆ తరువాత యువకుడితో పాటు వారి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో పెద్దలు కూడా చేతులెత్తేశారు. ఆ తర్వాత యువతి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు తిరిగినా గ్రామంలో పెద్దలు గాని, పోలీసులు గాని పట్టించుకోకపోవడంతో చివరకు ఏమి చేయాలో తెలియక సచివాలయం వద్ద బైఠాయించింది. ఆమెకు మద్దతుగా సోషల్ వర్కర్ పంతం మార్తమ్మ, బీఎస్పీ నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు రంగు ధనలక్ష్మిలు, గ్రామంలోని పలువురు మహిళలు నిలిచారు. చదవండి: (తల్లి మందలించిందని పారిపోయిన యువతి.. చివరికి ఏమైందంటే..) -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కొత్త రహదారి.. రాబోయే రోజుల్లో నాలుగు వరుసలుగా..
శంషాబాద్ రూరల్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో కొత్త దారి ఏర్పాటు కానుంది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. ఫిబ్రవరి 5న రామానుజుల విగ్రహావిష్కరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడకు రానున్నారు. ఈ రోడ్డు మార్గంలోనే ఆయన ప్రయాణించేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఓ దారి, శ్రీశైలం రహదారి నుంచి తుక్కుగూడ సమీపంలోంచి మరో దారి ఇది వరకే ఉండగా.. ప్రస్తుతం గొల్లపల్లి మీదుగా పెద్దగోల్కొండలోని ఔటర్ రోటరీ జంక్షన్‌ను అనుసంధానం చేస్తూ కొత్తగా రహదారిని విస్తరిస్తున్నారు. విమానాశ్రయం రెండో దశ విస్తరణలో భాగంగా ఎయిర్‌పోర్టు ఆవరణలో కార్గో వాహనాల కోసం నాలుగు వరసల రహదారి ఏర్పాటు చేశారు. ఈ రహదారి ముఖ్యంగా కార్గో టెర్మినల్ నుంచి సరుకుల వాహనాల రాకపోకల కోసం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది వరకు ఉన్న ఎయిర్‌పోర్టు మార్గాలో విమాన ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే.. కొత్తగా ఏర్పాటు చేసిన మార్గంలో కార్గో వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు. కార్గో వాహనాలు ఔటర్ మీదుగా పెద్దగోల్కొండ రోటరీ జంక్షన్ నుంచి ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లేలా మార్గం ఏర్పాటు చేశారు. (చదవండి: ‘సహకార’ అప్పు.. దాడుల ముప్పు!) రూ.6 కోట్లతో విస్తరణ పనులు.. ఎయిర్‌పోర్టు లోపల నుంచి కార్గో వాహనాల కోసం గొల్లపల్లి శివారు వరకు 4 వరుసల రోడ్డు నిర్మాణం ఇది వరకే పూర్తి చేశారు. శంషాబాద్ నుంచి గొల్లపల్లి మీదుగా పెద్దగోల్కొండ ఔటర్ జంక్షన్ వరకు ఉన్న రహదారితో ఎయిర్‌పోర్టు రోడ్డును గొల్లపల్లి వద్ద అనుసంధానం చేస్తున్నారు. దీంతో గొల్లపల్లి నుంచి పెద్దగోల్కొండ జంక్షన్ వరకు ఉన్న దారిని సుమారు రూ.6 కోట్లతో విస్తరిస్తున్నారు. 7 మీటర్ల వెడల్పు ఉన్న ఈ దారిని ప్రస్తుతం 10 మీటర్లకు విస్తరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రధాని రోడ్డు మార్గం ఇలా.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనగరానికి రోడ్డు మార్గంలో చేరుకోవడానికి గొల్లపల్లి నుంచి ఔటర్ జంక్షన్ మీదుగా పీ– వన్ రోడ్డు మీదుగా చేరుకుంటారు. ప్రత్యామ్నాయ రోడ్డు మార్గంగా ఈ రహదారిని నిర్ణయించడంతో ఈ మార్గంలో మొక్కలు, అందమైన పూల మొక్కలను నాటుతున్నారు. పెద్దగోల్కొండ ఔటర్ జంక్షన్ వద్ద రంగులు వేసి అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ మార్గంలో వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. (చదవండి: జంక్షన్’లోనే లైఫ్ ‘టర్న్’) -
పీఎంఎల్‌యూ గొల్లపల్లి మండల వాలంటీర్‌గా మాటేటి స్వామి
సాక్షి, జగిత్యాల : ‘ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్’ కార్మిక సంఘ మండల వాలంటీర్‌గా మాటేటి స్వామి నియమితులయ్యారు. ఆయనను జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల వాలంటీర్‌గా నియమిస్తూ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల సోమవారం నియామకపత్రాన్ని విడుదల చేశారు. ‘‘ వలస కార్మికుల హక్కులు, సంక్షేమం పట్ల మీకు ఉన్న నిబద్దత, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్‌లో సభ్యుడిగా చేరి పనిచేయాలనే మీ ఆసక్తి, నాయకత్వ లక్షణాలను గుర్తించి మిమ్మల్ని జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల వాలంటీర్‌గా నియమిస్తున్నాను. ప్రజలు ఉద్యోగం, ఉపాధి కోసం.. బ్రతుకుదెరువు కోసం అంతర్గత వలసలు, అంతర్జాతీయ వలసలు వెళుతుంటారు. సురక్షితమైన, చట్టబద్దమైన వలసల కోసం ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్, ప్రభుత్వ సంస్థలు మీ ప్రాంతంలో నిర్వహించే అవగాహన, చైతన్య కార్యక్రమాలు విజయవంత చేయాలి. ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అనే కార్మిక సంఘం భారత కార్మిక సంఘాల చట్టం,1926 ప్రకారం రిజిస్టర్ చేయబడిన సంస్థ. మీరు నిబంధనల ప్రకారం, యూనియన్ కార్యవర్గ తీర్మానాల ప్రకారం, సూచనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగ నియామక పత్రం కాదు.. సేవా కార్యక్రమాలను నిర్వహించడం, పాల్గొనడం మాత్రమే’’ అని స్వదేశ్ పరికిపండ్ల పేర్కొన్నారు. -
లేడీ కిలాడి.!
సాక్షి, గొల్లపల్లి (సిరిసిల్ల): ఉన్న ఊరిలో ఉపాధి లేక గల్ఫ్ వెళ్లాలనుకున్న ఆ యువకుల ఆశలు అడియాశలయ్యాయి. ‘నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, దోహఖత్తర్ పంపిస్తా, మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తా’ అని నమ్మబలికింది ఓ మాయ లేడీ. తమ ఊరు అబ్బాయిని పెళ్లి చేసుకుంది కదా అని పది మందికిపైగా ఆ మాయలేడీని నమ్మి డబ్బు ముట్టజెప్పారు. ఈక్రమంలో ఆ లేడీ తన భర్తతో పాటు ఉడాయించింది. ఆరా తీసినా దొరక్కపోవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు. నమ్మితే ఇంత మోసం చేసిందని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లొత్తునూర్ గ్రామానికి చెందిన అప్పని దస్తగిరి కొంత కాలం క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పద్మ అనే యువతితో పరిచయమయింది. ఆమెది వైజాగ్ కాగా ప్రేమవివాహం చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరు కొద్ది రోజులు లొత్తునూర్‌లో గడిపారు. ఇక్కడ స్థానిక యువకులతో పరిచయం ఏర్పడింది. గల్ఫ్ వెళ్లేందుకు తనకు నమ్మకమైన ఏజెంట్ ఉన్నాడని తాను దోహఖత్తర్‌లో మంచి కంపెనీలో మంచి వేతనం వచ్చేల చూస్తాడని గల్ఫ్ వెళ్లేందుకు ఆసక్తి ఉన్న పలువురు యువకులతో పద్మ నమ్మబలికింది. ఈనేపథ్యంలో గ్రామానికి చెందిన దావన్‌పెల్లి పవన్, ఎండీ ఫరూక్(బీర్సాని), ఉప్పుల రమేశ్, రాచకొండ గంగాధర్, మైదర్ తిరుపతి, జక్కుల శ్రావణ్‌కుమార్, సింగం నరేశ్, బోడకొండ చిలుకయ్య, పాశిగామ నరేశ్, మంథని దేవేందర్‌తో పాటు పలువురి నుంచి దాదాపు రూ.8లక్షల వరకు వసూలు చేసింది. కొందరు రూ.80వేలు, మరికొందరు రూ. 30, 20వేలు ఇలా పదిమందికి పైగా ముట్టజెప్పారు. కొందరి వద్ద రూ.80 వేలు తీసుకున్నట్లు బాండ్ పేపర్‌ను 2018 అక్టోబర్ 2వ తేదీన రాసి ఇచ్చింది. 2018 అక్టోబర్ 12 గల్ఫ్ పంపిస్తానని, పంపించకపోతే 15వ తేదీన ఎవరి డబ్బులు వారికి ఇస్తానని నమ్మించి బాండ్ పేపర్ రాసి ఇచ్చింది. వారు నమ్మేలా డూప్లీకేట్ వీసా సైతం చూపించింది. మరుసటి రోజునుంచి కనిపించకుండా పోయింది. బాధితులు వైజాగ్‌లోని ఆమె ఇంటికి వెళ్లినా ఫలితం లేకుండాపోయింది. తామే కాకుండా వెల్గటూర్ మండలంలో కూడా బాధితులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. మోసం చేసిన పద్మపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని దావన్‌పల్లి పవన్ తండ్రి అంజయ్య, ఫరూక్, ఉప్పుల రమేశ్ తదితరులు కోరుతున్నారు. ఆమె కోసం ఎంత తిరిగినా ప్రయోజనం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు. -
కలిచివేసిన ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, గొల్లపల్లి: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. గొల్లపల్లి మండలం చిల్వకుడూరు గ్రామ శివారులోని వంతెన వద్ద బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదంలో గొల్లపల్లి మండలం చెందొలి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు చిప్ప రాములు, చిప్ప సందీప్, చిప్ప వినోద్‌లు మృతి చెందారు. మృతులు జగిత్యాల నుండి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే ముగ్గురూ ప్రాణాలు వదిలారు. బైకు పక్కనే మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడం అందరినీ కలచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలవడంతో చెందొలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఈ బడి.. చదువులమ్మ ఒడి
సాక్షి, హైదరాబాద్ : కేజీ టు పీజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలను తెరిచింది. రెసిడెన్షియల్ విధానంలో కొనసాగే ఈ పాఠశాలలు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ స్కూళ్లు మాత్రం రోజురోజుకూ తీసికట్టుగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ ప్రభుత్వ పాఠశాల మాత్రం గురుకులాలకు దీటుగా ఫలితాలు సాధించి స్ఫూర్తిగా నిలిచింది. ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో 92 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఆ పాఠశాలల ఉపాధ్యాయులు, స్థానికులు కలసి చేసిన వినూత్న ఆలోచనే ఈ విజయానికి కారణం. ఇంతకీ ఆ పాఠశాల ఏదో తెలుసా.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలలో ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ కంటే కాస్త ముందుగానే పాఠ్యాంశాల బోధన కొనసాగించడం, గురుకులాల తరహాలో రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తూ.. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, సాయంత్రం చిరుతిళ్లు పంపిణీ చేయడం గమనార్హం. ఇప్పుడీ పాఠశాల రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అల్పాహారం, చిరుతిళ్లు ఇవ్వడంతో.. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల్లో 85% మందికిపైగా పేదలే. ఉదయం బడికి వచ్చే సమయంలో ఎక్కువ మంది పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోకుండానే వస్తున్నట్టు పలు సంస్థల సర్వేల్లో తేలింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడుతున్నా విద్యార్థులు ఉదయం ఆహారం తీసుకోకపోవడంతో... బోధన, అభ్యసనపై పూర్తి దృష్టి పెట్టలేకపోతున్నారు. సాయంత్రం ఇళ్లకు తిరిగి వెళుతున్న పిల్లలు.. ఇంటి వద్ద అభ్యసనపై దృష్టి సారించడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన రాచర్ల గొల్లపల్లి పాఠశాల టీచర్లు.. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించడంతోపాటు ఉదయం అల్పాహారం, సాయంత్రం చిరుతిళ్లు అందజేయాలని నిర్ణయించారు. పలువురు దాతలు కూడా విరాళాలు ఇవ్వడంతో.. గతేడాది అర్ధ వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత తమ ప్రణాళికను అమల్లోకి తెచ్చారు. అయితే ఈ పాఠశాలలో 261 మంది విద్యార్థులు ఉన్నారు. అం దులో పదో తరగతిలో 60 మంది ఉన్నారు. పాఠశాలలోని విద్యార్థులందరికీ అల్పాహారం, చిరుతిళ్లు అందించడానికి డబ్బు సరిపోయే పరిస్థితి లేకపోవడంతో.. 60 మంది విద్యార్థులున్న పదో తరగతిని మాత్రం ఎంపిక చేసుకున్నారు. ప్రత్యేకంగా ప్రణాళికతో.. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ కంటే ముందుగా బోధన, అభ్యసన తరగతులు చేపట్టేందుకు ఉపాధ్యాయులు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించి.. పాఠ్యాంశాల పునశ్చరణ కొనసాగించారు. ఆ సమయంలో విద్యార్థులకు పాలు, ఉప్మా, గుగ్గిళ్లు అందజేశారు. వెనుకబడిన విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టి చదివించారు. ఈ ప్రణాళిక సత్ఫలితాలను ఇచ్చింది. ఏటా సగటున టెన్త్‌లో 70 శాతం ఉత్తీర్ణత నమోదు చేసిన ఈ పాఠశాల... 2017–18 విద్యా సంవత్సరంలో ఏకంగా 92 శాతం ఉత్తీర్ణత సాధించింది. అంతేకాదు పది మంది విద్యార్థులు ఏకంగా 9 పాయింట్లపైన గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) సాధించడం గమనార్హం. ఇదే తరహాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొత్తగా ఆలోచించాలి ‘‘కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పనిచేయాలంటే ప్రభుత్వ పాఠశాలలు కొత్త తరహాలో ఆలోచించాలి. పరిస్థితులను బట్టి ప్రణాళికను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ స్కూళ్లలో చదివే పిల్లలు ఆర్థికంగా మెరుగ్గా ఉంటారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారిలో పేదలే ఎక్కువ. వారికి పాఠశాలల్లో బోధనతో పాటు అభ్యసన కార్యక్రమాలు నిర్వహించాలి. అదే సమయంలో పౌష్టికాహారం కూడా అందించాలి. మేమం చేసింది అదే. ఈ ఏడాది ఈ కార్యచరణను మరింతగా విస్తరిస్తున్నాం..’’ – మీస రవి, సోషల్ టీచర్, రాచర్ల గొల్లపల్లి హైస్కూల్ -
బ్యాంక్‌లో రైతు ఆత్మహత్యాయత్నం
మరొకరికి జామీన్ ఉన్నందుకు డబ్బులివ్వని మేనేజర్ గొల్లపల్లి: డబ్బులివ్వకుండా బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడని జగిత్యాల జిల్లా గొల్లపల్లి ఆంధ్రా బ్యాంకులో గురువారం ఓ రైతు ఆత్మహత్యకు యత్నిం చాడు. గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లికి చెందిన ఓర్పుల రాయమల్లు గొల్లపల్లి ఆంధ్రాబ్యాంక్‌లో 2013లో ట్రాక్టర్ కోసం రుణం తీసుకున్నాడు. దీనికి వడ్లకొండ చంద్రయ్యను జమానత్‌గా పెట్టుకున్నాడు. కొంత కాలం తర్వాత రాయమల్లు బ్యాంకు అప్పు చెల్లించడం మానేశాడు. గత జనవరిలో జామీన్‌గా ఉన్న చంద్రయ్య ఖాతాలో పంట డబ్బులు రూ.1.80 లక్షలు జమయ్యాయి. ఈ డబ్బులు ఇచ్చేందుకు అధికారులు రాయమల్లు తీసుకున్న అప్పుకు లింక్ పెట్టారు. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. గురువారం బ్యాంకు వెళ్లినా అదే సమాధానం రావడంతో పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. గమనించిన ఖాతాదారులు అడ్డుకున్నారు. ఏఎస్సై మహిమూద్ అలీ బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడారు. చివరకు రూ. 50 వేలు ఖాతాలో ఉంచి మిగిలిన డబ్బులు ఇస్తామని మేనేజర్ హామీ ఇచ్చాడు. -
విద్యార్థులను చితకబాదిన టీచర్
గుంతకల్లు రూరల్ : గుంతకల్లు మండలం గొల్లలదొడ్డి గ్రామంలోని చైతన్య ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు కళ్యాణి విద్యార్థులను చితకబాదారు. ఈమె రెండు నుంచి ఆరో తరగతి వరకు గణితం సబ్జెక్టు బోధిస్తారు. రెండు రోజుల క్రితం ఒకే ప్రశ్నకు మూడుసార్లు జవాబు రాసుకురావాలంటూ ఆయా తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇచ్చారు. మరుసటి రోజు హోం వర్క్‌ను పరిశీలించారు. మూడుసార్లు జవాబు రాసినప్పటికీ ప్రశ్న ఒక్కసారే రాసి ఉండటంతో ఆగ్రహించారు. దాదాపు 20 మంది విద్యార్థులను బెత్తంతో చితకబాదారు. వారికి శరీరంపై ఎర్రటి బొబ్బలు ఏర్పడ్డాయి. ఇంటికొచ్చిన తర్వాత తల్లిదండ్రులకు విషయం తెలిసింది. కళ్యాణి నిర్వాకాన్ని ప్రశ్నించేందుకు పాఠశాలకు వెళ్లగా.. ఆమె సెలవుపై వెళ్లిపోయారు. బుధవారం ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్, మరికొంతమంది నాయకులతో కలిసి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని, ఉపాధ్యాయురాలి తీరుపై నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పాఠశాల నిర్వాహకులు సర్దిచెప్పడంతో వారు వెనుదిరిగారు. -
ఇండియన్ బ్యాంక్ ముందు డ్వాక్రా మహిళల ధర్నా
గొల్లపల్లి(నూజివీడురూరల్) : బ్యాంకర్ల వైఖరిని నిరసిస్తూ డ్వాక్రా మహిళలు గురువారం గొల్లపల్లిలోని ఇండియన్ బ్యాంక్ ముందు ధర్నాకు దిగారు. బ్యాంక్ గేట్లను మూసేసి సిబ్బందిని కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. గొల్లపల్లిలోని ఇండియన్ బ్యాంక్ పరిధిలో గొల్లపల్లి, మీర్జాపురం, మొర్సపూడి, పోలసానిపల్లి, కొత్తపల్లి గ్రామాలున్నాయి. ఏడాదిన్నర కిందట బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసిన విజయ్‌వర్దన్ డ్వాక్రా మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకోని 145 డ్వాక్రా గ్రూపుల వారు చెల్లించిన సొమ్మును సొంత ఖాతాకి జమచేసుకున్నారని ఆరోపించారు. రుణాలు మంజూరు చేయకుండానే ఇచ్చినట్లు చూపించి బలవంతంగా కట్టించారు. ఈ విషయాన్ని బ్యాంక్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా విచారించి రూ.కోటీ 74 లక్షలు స్వాహా అయినట్లు నిర్దారించారన్నారు. ప్రస్తుతం మేనేజర్ నాగిరెడ్డి సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ధర్నా విరమించేది లేదని మహిళలు భీష్మించుకున్నారు. సీపీఎం మండల కార్యదర్శి సీహెచ్ రామారావు డ్వాక్రా మహిళల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ శ్రీనివాసరావు గొల్లపల్లి విచ్చేసి ధర్నా చేస్తున్న వారితో చర్చలు జరిపారు. ఈనెల 20వ తేదీలోగా డ్వాక్రా మహిళల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి గ్రూపునకు నూతనంగా రుణాలు మంజూరు చేస్తామని తెలపడంతో శాంతించారు. అప్పటి వరకు చెట్ల నీడలో కూర్చున్న సిబ్బంది బ్యాంక్ లోపలికి వెళ్లారు. సీపీఎం నాయకులు ఎన్ నరసింహారావు, డి.రవి తదితరులు పాల్గొన్నారు. 08ఎన్జడ్డి202 : గొల్లపల్లిలో ఇండియన్ బ్యాంక్ ముందు ధర్నా చేస్తున్న మహిళలు -
వరకట్నానికి వివాహిత బలి
జగిత్యాల: వరకట్నానికి ఓ వివాహిత బలైంది. ఈ సంఘటన గొల్లపల్లి మండలకేంద్రంలోని గౌతమ్ విద్యా మందిరం సమీపంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న స్వప్న(25)కు ఏడున్నరేళ్ల క్రితం రాజు అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడున్నాడు. పెళ్లి జరిగిన నాటి నుంచి వరకట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారు. 15 రోజుల క్రితం కూడా ఈ విషయమై గొడవలు జరిగాయి. శుక్రవారం ఉదయం చూసే సరికి స్వప్న ఉరికి వేలాడుతూ కనిపించింది. భర్త, అత్తమామలు కలిసి ఉరివేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి తల్లి చుక్క లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహితపై అత్యాచారం
గుమ్మఘట్ట : పొలానికి వెళుతున్న వివాహితపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి బంధువులు తెలిపిన మేరకు.. గొల్లపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి అన్నం క్యారీ కట్టుకుని పొలానికి బయల్దేరిన వివాహితను మార్గం మధ్యలో కంపచెట్ల వద్ద కాపుకాచిన తిప్పేస్వామి కుమారుడు రాయదుర్గం బోయ నగేష్ (35) అటకాయించాడు. బలవంతంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించడంతో ఆమె కేకలు వేసింది. ఆ సమయంలో అటువైపు ఎవ్వరూ రాకపోవడంతో కామాంధుడు అత్యాచారం చేసి పారిపోయాడు. ప్రతిఘటన సమయంలో ఆమె ఒంటిపై పలుచోట్ల గాయాలయ్యాయి. అనంతరం బాధితురాలు ఇంటికెళ్లి కుటుంబ సభ్యులకు జరిగిన విషయం తెలిపి రోదించింది. అక్కడి నుంచి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ హైదర్‌వలి కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా బోయ నగేష్ ఇదివరకు కూడా గ్రామంలో ఆరుబయట నిద్రించే మహిళల పట్ల చాలాసార్లు అసభ్యంగా ప్రవర్తించినట్లు స్థానికులు తెలిపారు. ఇటీవలే ఇతను తుపాకీ అక్రమంగా కలిగి ఉన్న కేసులో కూడా అరెస్టయ్యి.. బెయిలుపై బయటకు వచ్చాడని చెప్పారు. మహిళల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్న నగేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. -
25న గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు
కలెక్టర్ కోన శశిధర్ పెనుకొండ రూరల్ : హంద్రీ–నీవా వ్యవస్థలోని గొల్లపల్లి రిజర్వాయర్‌కు ఈ నెల 25న నీళ్లు వదులుతున్నట్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. సోమవారం ఆయన మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 275 కి.మీ వరకు హంద్రీ–నీవా పనులను పరిశీలించామన్నారు. 15 రోజుల లోపు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని, నీరు ఎలా వదులుతారని కలెక్టరును విలేకరులు ప్రశ్నించగా.. పనులు పూరయ్యే దాకా రిజర్వాయర్‌లో భూమట్టానికి మాత్రమే నీటిని వదులుతామని చెప్పారు. దీనివల్ల చుట్టుపక్కల భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. కలెక్టర్ వెంట జలవనరులశాఖ సీఈ జలంధర్, ఎస్ఈ సుధాకర్‌బాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశులు తదితరులు ఉన్నారు. కాగా.. జలవనరులశాఖ అధికారులపై ఎస్ఈ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని, ఒళ్లు దగ్గర పెట్టుకుని విధులు నిర్వర్తించాలని సూచించారు. లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు. -
జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీలకు రాఘవేందర్
శంషాబాద్ రూరల్: సెప్టెంబరు 7న జంషెడ్‌పూర్‌లో జరుగనున్న ఆల్ ఇండియా సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు గొల్లపల్లికి చెందిన రాఘవేందర్‌గౌడ్ ఎంపికయ్యారు. తెలంగాణ స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో రాఘవేందర్ గోల్డ్‌మెడల్‌తో పాటు ‘స్ట్రాంగ్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్’లో విజేతగా నిలిచాడు. దీంతో అతడిని ఆల్ ఇండియా సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక చేశారు. 105 కేజీల విభాగంలో పాల్గొన్న రాఘవేందర్ తన కేరీరీలోనే మొదటిసారి 890 కేజీలు ఎత్తి అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. ఈ సందర్భంగా రాఘవేందర్ మాట్లాడుతూ తనను ప్రోత్సహిస్తున్న మైహోం ఎండీ.జగపతిరావుకు కృతజ్ఞతలు తెలిపారు. -
రూ. కోటిన్నర స్వాహా చేసిన బ్యాంక్ మేనేజర్
విజయవాడ : కృష్ణాజిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి లోని ఇండియన్ బ్యాంక్‌లో చోటు చేసుకున్న కుంభకోణం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రుణాల మంజూరు పేరుతో రూ. కోటిన్నర స్వాహా చేసినట్లు బ్యాంక్ ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో విచారణ ప్రారంభించారు. ఈ కుంభకోణంలో బ్యాంక్ మేనేజర్ విజయ్ వర్ధన్ కీలక సూత్రధారి అని ఇండియన్ బ్యాంక్ ఉన్నతాధికారులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని విధుల నుంచి తప్పిస్తు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
నడిరోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త
గొల్లపల్లి: అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడంతో పాటు.. భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరగడంతో చివరకు భార్యను నడిరోడ్డుపై కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం గోవింద్‌పల్లిలో బుధవారం జరిగింది. గొల్లపల్లి మండలం గోవింద్‌పల్లి గ్రామానికి చెందిన గుర్రం లక్ష్మి-శంకరయ్య దంపతుల పెద్ద కూతురు మమతను ధర్మపురి మండలం మద్దునూర్‌కు చెందిన సోమ మల్లేశంకు ఇచ్చి 2010లో వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.5.50 లక్షలకట్నం, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. మమత పెళ్లి జరిగిన కొద్ది రోజులకే చిన్న కూతరు రజితకు పెళ్లి చేశారు. మమత కన్నా రజితకు ఎక్కువ కట్నం ఇచ్చారని మమత భర్త మల్లేశం అదనపు కట్నం తీసుకురావాలని భార్యను రెండేళ్ల నుంచి వేధించడం మొదలు పెట్టాడు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఏడు నెలల క్రితం వచ్చిన మల్లేశం వరకట్న వేధింపులు మానుకోలేదు. రెండు రోజుల క్రితం ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో భర్తపై వరకట్నం కేసు పెట్టింది. ఈ క్రమంలో మమతపై ఆగ్రహం పెంచుకున్న మల్లేశం ఆమె కుట్టుమిషన్‌కు వెళ్లే సమయంలో హత్య చేయూలని పథకం వేసుకున్నాడు. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మమత గోవింద్‌పల్లి బస్టాండ్‌కు నడుచుకుంటూ వస్తుండగా నడిరోడ్డుపైనే పదునైన ఆయుధంతో మెడపై నాలుగుసార్లు నరికాడు. దీంతో మమత అక్కడిక్కడే మృతి చెందింది. -
స్పీకర్ గారు మీరెంత హ్యాండ్సమ్గా ఉంటారో..
-
రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి
అనంతపురం: అనంతపురం జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. రాప్తాడు మండలం గొల్లపల్లి వద్ద మారుతీ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మృతులు శ్రీహర్ష, కామేశ్వరరావు, సుమన్ గా పోలీసులు గుర్తించారు. శ్రీహర్ష కాకినాడ వాసి కాగా,మిగతా ఇద్దరు హైదరాబాద్ కు చెందినవారు. వీరంతా బెంగళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. -
వీఆర్ఏ పోస్టులకు అభ్యర్థుల కరువు
ఒక్క అభ్యర్థీ దరఖాస్తు చేసుకోలేదు. మాజీ సైనికుల కేటగిరిలో భర్తీ చేయాల్సిన 5 పోస్టులకూ అదే పరిస్థితి. బీసీ-సీ జనరల్ కేటగిరికి కేటాయించిన 3 పోస్టులు, బీసీ-ఏ, ఎస్టీ మహిళలకు కేటాయించిన ఒక్కో పోస్టుకూ దరఖాస్తులు అందలేదు. ఈ పోస్టుల భర్తీకి జిల్లా రెవెన్యూ యంత్రాంగం నివేదికను రూపొందించి సీసీఎల్ఏకు పంపాల్సి ఉంది. దరఖాస్తులందని గ్రామాలివే! అంధ మహిళల విభాగంలో...: బి.కొత్తకోట మండలం గొల్లపల్లె, బీఎన్.కండ్రిగ మండలం నెలవాయి, చంద్రగిరి మండలం కల్రోడ్పల్లె, చిన్నగొట్టిగల్లు మండలం ఎగువూరు, చిత్తూరు మండలంలోని మురకంబట్టు, చౌడేపల్లె మండలం పెద్దయల్లకుంట్ల, గంగాధరనెల్లూరు మండలం గొల్లపల్లె గ్రామాల నుంచి దరఖాస్తులు రాలేదు. కుప్పం మండలం కృష్ణదాసానపల్లె, నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లె, పాకాల మండలం గోర్పాడు, పెనుమూరు మండలం నంజర్లపల్లె, పూతలపట్టు మండలం పూతలపట్టు గ్రామం, రామచంద్రాపురం మండలం చిట్టత్తూరు కాలేపల్లె, శాంతిపురం మండలం మోరసానిపల్లె, సత్యవేడు మండలం కన్నావరం, వడమాలపేట మండలం శ్రీబొమ్మరాజుపురం, వాల్మీకిపురం మండలం టిసాకిరేవుపల్లె నుంచి దరఖాస్తులు అందలేదు. మాజీ సైనికుల విభాగంలో...: చంద్రగిరి మండలం నరసింగాపురం, గుర్రంకొండ మండలం సరిమడుగు, ములకలచెరువు మండలం నాయనిచెరువు, తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లె , వాల్మీకిపురం మండలం విఠలం గ్రామాల్లో మాజీ సైనికులు ఎవ్వరూ వీఆర్ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేదు. బీసీ-సీ కేటగిరిలో...: క్రిస్టియన్లుగా మారిన ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన వీఆర్ఏ పోస్టులకు సంబంధించి గుర్రంకొండ మండలం తరిగొండరాచపల్లె, ములకలచెరువు మండలం పెద్దపాళెం, తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లె నుంచి ఒక్కరూ దరఖాస్తు చేసుకోలేదు. వరదయ్యపాళెం మండలం మరదవాడ గ్రామాన్ని బీసీ-సీకి చెందిన మహిళకు కేటాయించారు. వి.కోట మండలం బోడిగుట్టపల్లెను ఎస్టీ మహిళకు కేటాయించగా ఆయా గ్రామాల నుంచి ఒక్క దరఖాస్తూ అందలేదు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవడం వల్లే! వీఆర్ఏ పోస్టుల భర్తీకి సంబంధించిన నిబంధనల వల్లే జిల్లాలో అభ్యర్థులు కరువయ్యారని పరిశీలకులు భావిస్తున్నారు. రోస్టర్ విధానం ప్రకారం ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంటోంది. వీఆర్వో పోస్టుల మాదిరిగానే వీఆర్ఏ పోస్టుల భర్తీకి జిల్లాను యూనిట్‌గా తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నిరుద్యోగులు అంటున్నారు. -
ఏసీబీ వలలో గొల్లపల్లి వీఆర్వో
గొల్లపల్లి, న్యూస్‌లైన్: అవినీతిపరుల భరతం పడతామంటూ ఓవైపు ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నా రెవెన్యూ శాఖలోని కొందరు ఉద్యోగులు మాత్రం మారడం లేదు. దాడులు చేస్తే చేసుకోండి.. మా కేంటి? అనుకుంటున్నారేమో.. తమ పనితీరు మార్చకోవడం లేదు. ప్రతి పనికీ వెలకట్టి లంచాల కోసం పీడిస్తుండడంతో విసిగివేసారిన బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఏసీబీ దాడుల్లో అవినీతిపరులు అడ్డం గా దొరికిపోతున్నారు. జిల్లాలో పలు సంఘటనలు మరవకు ముందే గొల్లపల్లి మండలంలో మరో వీఆర్వో ఏసీబీకి చిక్కాడు. కంప్యూటర్ పహణీ నకల్ కోసం రూ.7వేలు లంచం తీసుకుంటూ గొల్లపల్లి వీఆర్వో మేరుగు శంకరయ్య సోమవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లికి చెందిన అబ్దుల్ రషీద్ 2012లో తన భార్య పేరిట సర్వేనంబరు 545(అ)లో 242 చదరపు గజాల స్థలం కొన్నాడు. అప్పుడే జమాబంది కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి వీఆర్వో గంగాధర్ రూ.4వేలు తీసుకుని మ్యూటేషన్ ప్రొసీడింగ్ పత్రాలు ఇచ్చాడు. కానీ ఇది కంప్యూటర్లో నమోదు కాలేదు. సంబంధి త స్థలంలో ఇటీవల ఇల్లు నిర్మించుకున్న రషీద్ రుణం కోసం బ్యాంకులో సంప్రదించాడు. రుణ మంజూరుకు కంప్యూటర్ పహణీ కావాలని బ్యాంకు అధికారులు సూచించారు. దంతో తొ మ్మిది నెలల క్రితం కంప్యూటర్ పహణీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో వీఆర్వో గంగాధర్ గంగాధర మండలానికి బదిలీ అ య్యాడు. ఆయన స్థానంలో జూన్‌లో రామగుం డం మండల ఈసాలతక్కల్లపెల్లికి చెందిన మేరు గు శంకరయ్య విధుల్లో చేరాడు. ఆయన రషీద్‌ను రూ.11 వేలు డిమాండ్ చేయగా, రూ. 1500 ఇచ్చాడు. మిగిలిన మొత్తం కూడా చెల్లిస్తే నే పని పూర్తి చేస్తానని శంకరయ్య తేల్చిచెప్పా డు. విసిగివేసారిన రషీద్ ఇంకా రూ.7వేలు ఇ స్తానని శంకరయ్యతో ఫోన్లో మాట్లాడి వాయి స్ రికార్డు చేసుకున్నాడు. ఇటీవల కరీంనగర్లో ఏసీబీ అధికారులను కలిసి విషయం చెప్పాడు. వారి సూచనల మేరకు రషీద్ సోమవారం మధ్యాహ్నం శంకరయ్య గదికి వెళ్లి రూ.7వేలు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి శంకరయ్యను పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. గతంలో వీఆర్వోగా పనిచేసిన గంగాధర్ రూ.4వేలు తీసుకున్నాడని రషీద్ ఫిర్యాదు చేయగా, విచారించి తగు చ ర్యలు తీసుకోవాలని తహశీల్దార్ రవీందర్‌రాజు కు సూచించారు. ఆయన చర్యలు తీసకోకపోతే తామే చర్యలు తీసుకుంటామన్నారు. వీఆర్వో మేరుగు శంకరయ్య 2008లో రామగుండం మండంలోనే విధుల్లో చేరాడు. అప్పటినుంచే అతడు ప్రతి పనికీ లంచాలు గుంజుతాడనే ఆరోపణలున్నాయి. అయితే తాను రషీద్‌ను డబ్బు లు అడగలేదని, అతడే రూ.7వేలు తీసుకొచ్చి తన బేబులో పెట్టాడని ఏసీబీ ఎదుట శంకరయ్య బుకాయించడం కొసమెరుపు. ఏసీబీకి మరో ఫిర్యాదు వీఆర్వో శంకరయ్య తనను కూడా లంచం కోసం వేధిస్తున్నాడని బోనగిరి లింగమూర్తి అనే వ్యక్తి ఏసీబీ డీఎస్పీ ఫిర్యాదు చేశాడు. 2012లో ఆరెకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని జమాబందీ కోసం తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నాని, వీఆర్వో శంకరయ్య రూ.10వేలు అడిగితే.. రూ.7వేలు ఇచ్చానని, మరో రూ.15వేలు ఇస్తేనే పని చేస్తానని వేధిస్తున్నాడని వాపోయాడు.