వివాహితపై అత్యాచారం | man attacks woman in gollapalli | Sakshi
Sakshi News home page

వివాహితపై అత్యాచారం

Published Tue, Oct 25 2016 10:23 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

man attacks woman in gollapalli

గుమ్మఘట్ట : పొలానికి వెళుతున్న వివాహితపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి బంధువులు తెలిపిన మేరకు.. గొల్లపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి అన్నం క్యారీ కట్టుకుని పొలానికి బయల్దేరిన వివాహితను మార్గం మధ్యలో కంపచెట్ల వద్ద కాపుకాచిన తిప్పేస్వామి కుమారుడు రాయదుర్గం బోయ నగేష్‌ (35) అటకాయించాడు.

బలవంతంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించడంతో ఆమె కేకలు వేసింది. ఆ సమయంలో అటువైపు ఎవ్వరూ రాకపోవడంతో కామాంధుడు అత్యాచారం చేసి పారిపోయాడు. ప్రతిఘటన సమయంలో ఆమె ఒంటిపై పలుచోట్ల గాయాలయ్యాయి. అనంతరం బాధితురాలు ఇంటికెళ్లి కుటుంబ సభ్యులకు జరిగిన విషయం తెలిపి రోదించింది. అక్కడి నుంచి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ హైదర్‌వలి కేసు నమోదు చేసుకున్నారు.

ఇదిలా ఉండగా బోయ నగేష్‌ ఇదివరకు కూడా గ్రామంలో ఆరుబయట నిద్రించే మహిళల పట్ల చాలాసార్లు అసభ్యంగా ప్రవర్తించినట్లు స్థానికులు తెలిపారు. ఇటీవలే ఇతను తుపాకీ అక్రమంగా కలిగి ఉన్న కేసులో కూడా అరెస్టయ్యి.. బెయిలుపై బయటకు వచ్చాడని చెప్పారు. మహిళల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్న నగేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement